సువ్వీ సువ్వీ సువ్వీ!

ఎందుకో గానీ, ఇవాళ పొద్దున్న ఆఫీసు చేరే దారి పొడుగుతా ఇదే పాట … ఇందులోని వాక్యాలూ పదే పదే గుర్తొచ్చాయి. మధ్య మధ్య –“నువ్వక్కడుండీ నేనిక్కడుంటే…ప్రాణం విలవిలా…నువ్వెక్కడుంటే నేనక్కడుంటే..మౌనం గలగలా…” అని గోపీ గోపిక గోదావరి పాట గుర్తొచ్చింది కానీ, వెంటనే… “ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ” అన్న లైను క్షణానికోమాటు గుర్తొచ్చి మనసు పాడుచేస్తూ ఉండింది. “చి! పాడు పాట… ఇలా వెంటాడుతూ ఉందేంటి” అని విసుక్కున్నా కూడా, మళ్ళీ ఈ పాట వినడం మొదలుపెట్టాను. ఓ పక్క మనసు పిండేసింది కానీ, దీని గురించి రాయకుండా ఉండలేకపోతున్నా.

పాట యూట్యూబ్ వీడియో ఇక్కడ.

“గువ్వ మువ్వ సవ్వాడల్లె నవ్వాలమ్మ”
– అలా నవ్వడమెలాగో…నాకు తెలీలేదు కానీ, వాక్యం వినగానే పెదాలపై చిన్న చిర్నవ్వు. ఈ పార్టంతా ఇలా సాగిందా, ఇక అసలు కథ మొదలు…

“అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేసాడా”

– ఈ వాక్యం విన్నప్పుడు మాత్రం, చాలా చలనం కలిగింది నాలో. అందులోనూ…రెండోసారి జానకి గారు పాడుతున్నప్పుడు – “గుండేలేని మనిషల్లే…” అని ఓ క్షణం ఆగినప్పుడైతే… మరీనూ. ఆ వాక్యాల్లోనే బాధ తెలుస్తోంది. ఇక అలా సగం చెప్పి ఆగడంలో … ఆ బాధ intensity ఇంకా బాగా చెప్పినట్లు అనిపించింది. అలా అలా ఈ పాటలో నన్ను వెంటాడిన మూడు లైన్లలో ఇదొకటి. అంటే, అక్కడి సందర్భంలో అతనేదో ఆలోచించక అది అనేస్తే, ఆ మాట ఆమెనెంత లోతుగా తాకిందో, అక్కడ ఆ బాధ చాలా బాగా తెలుస్తుంది ఆ దృశ్యంలో.

“అగ్గిలోన దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడూ”

– “నెగ్గేవమ్మా ఒకనాడు..” అని జానకి గారు పలికిన తీరు ఆ పాత్ర అనుభవిస్తున్న బాధను ఎంత బాగా చెప్పిందో అనిపిస్తుంది నాకు. అంటే, రాధిక మొహంలోని దీనత్వం కూడాననుకోండి… “నింగీనేలా నీ తోడు”…. ఒంటరితనాన్ని ఎంత బాగా వర్ణించారో!

“చుట్టూ వున్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మా”
– ఒంటరితనాన్ని చూపుతూనే, ప్రపంచంలో ఏ ఒక్కరూ ఒంటరి కారు అని చెప్పడమేమిటో! అసలీ వాక్యం మొదటిసారి పలికినప్పుడేమో ఒంటరి తనం నీది…అని జాలి చూపుతున్నట్లూ, రెండోసారి పలికినప్పుడు ధైర్యం చెబుతున్నట్లూ అనిపించింది..ఎందుకోగానీ.
“ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ”
అబ్బా! ఆగక పొంగే కన్నీళ్ళే! – పాడిన పాత్ర మానసిక స్థితి వేరే రకానిదే కానీ, ఎంతైనా, అలా మొహం మీదే నీదో దురదృష్టపు బ్రతుకు… అంటూ ఉంటే, ఎలా ఉంటుందో వినడానికి నిజంగా కష్టాన్ని అనుభవించేవారికి!!

“పట్టిన గ్రహణం విడిచి
నీ బ్రతుకున పున్నమి పండే గడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు”

– లాస్ట్ కి మళ్ళీ ఓ ఓదార్పు! అతని లాంటి తెలిసీ తెలియని మనిషి మాట్లాడితే, ఇలాంటి వాక్యాల్లో ఎంత అమాయకత్వం కనిపిస్తుందో,
“వస్తుందా ఆ నాడు
చూస్తాడా ఆ పైవాడు”

– అని ఆమె నిరాశగా అన్నప్పుడు ఆమె నిస్సహాయతా, ఆమె పడుతున్న వేదనా అంత స్పష్టంగా తెలుస్తోంది…

అమ్మో! ఈ పాట నా గుండే పిండేస్తోంది ఇవాళ. అవే వాక్యాలు మళ్ళీ మళ్ళీ ఆ గొంతుకల్లో మ్రోగుతూనే ఉన్నాయి… నా చెవులకి ఎక్కడికెళ్ళినా వినిపిస్తూనే ఉన్నాయి…

పాట వివరాలు:
స్వాతి ముత్యం లో SPB, S.Janaki పాడిన పాట.
రచన: సినారె.
సంగీతం: ఇళయరాజా.

Advertisements
Published in: on June 8, 2009 at 10:35 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/06/08/suvvi-suvvi-suvvi/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. Nijaga sowmya……
  aslu sahithayam ela vasthundo.. aa patralaku rachayitha etuvati sambadham vundadu kani ala ela vasthundi.nakemo God’s Gift anipisthundi

 2. నాకు ఈ పాట ఎవరు రాసారో తెలీదు కానీ సి.నా.రె. అంటే నమ్మలేకపోయా.google searchలో తెలిసిందేమిటంటే ఇది ఆత్రేయ రచన.
  http://www.telugufm.com/modules/music/MovieDetail.aspx?MID=10422
  సి.నా.రె.పాటల్లో భావానికి తోడు పదవిన్యాసమెక్కువ.ఇదే సినిమాలో లాలి లాలి పాట లాగా.
  అవునూ ,ఈ సినిమా లిరిక్స్ గురించి ఏ సైట్ లో వెదికినా వేటూరి పేరు కనిపించదేం?ఆయన ఈ సినిమకి పనిచేయలేదా?ఎందుకనో?

 3. @vinod:
  Even I cant believe that its Sinare.
  I saw the thing here:
  http://animutyaalu.blogspot.com/2009_02_20_archive.html
  – Now that u said that, I am sure it cant be sinare 🙂

 4. >అగ్గిలోన దూకి నువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
  మొదటిది “నువ్వు” కాదనుకుంట. “పువ్వు”. “అగ్గిలోన దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు..”. ఇది నా all time favorite song. ఇళయరాజా, జానకి, బాలు – సూపర్ combo. 🙂 మీ టపా చదివాక, నాకు కూడా ఈ పాట మోగుతూనే ఉంది.. 🙂

 5. @Pradeep: Thanks. Corrected.

 6. సినారె అంటే నమ్మలేకపోతున్నా …నమ్మక తప్పటం లేదు కూడా 😛

 7. గోపి గోపిక గోదావరి పాటలు బాగున్నాయండి.ఈ మధ్య కొన్ని పాటలు విన్నాకా చక్రి గొంతు ని జీవితం లో వినకూడదనుకున్నా.వంశీ సినిమా కదా అని ధైర్యం చేసి విన్నాను.అసలు పాటలు వింటున్నంత సేపు ఎంత ప్లెసెంట్ గా అనిపించిందో.స్వాతి ముత్యం పాటల గురించి నన్ను కదపకండి.కరిగిపోతాను 🙂

 8. బాగుంది. చదువుతుంటే, నాకు ముత్యాలముగ్గులో పాటలూ, ఏరువాకా సాగారోరన్నా పాటా విన్ననాటి అనుభవం గుర్తొస్తోంది. 🙂

 9. really your words are soundful. when i am invooving in this lyrics, the lyrics of ”karigeloga ee kshanam gadipeyali jeevetham(arya 2)” touch in my memory.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: