నిశ్యాలోచనాపథం-8

నెలైంది, ఇక వదిలేసింది, హమ్మయ్యా..అనుకుంటున్నారా? రాయననుకున్నారా? రాయలేననుకున్నారా? ఆయ్! వచ్చేసా..ఇదిగో వచ్చేశా 😉

నెలరోజుల బట్టీ నేను ఇదే పనిలో ఉన్నా. పోయిన భాగంలో చెప్పిన చివరి రెండు విషయాల గురించిన పనుల్లో. షేక్ మోజెస్ మూర్తి కోసం చెప్పులరిగేలా తిరిగాను. ఆఖరుకి ఈ హైదరాబాదు ఎండలకి చెప్పులు అరిగి, తరువాత కరిగి, నా కాళ్ళు కాలడం మొదలుపెట్టాయి. ఇంత సతాయిస్తున్న అతనిపై కోపం వచ్చి అతన్ని వెదకడం మానేశా. తరువాత నేనే ఆ అవతారం ఎత్తి కొన్నాళ్ళు ఆఫీసు తెరిచా. కానీ, గిట్టుబాటయ్యే క్లయంట్లెవరూ రాలేదు. దానితో బిచాణా ఎత్తేసి, ఓ అమావాస్య రాత్రి ఇక ప్రపంచానికిచ్చే అప్పగింతల గురించి ఆలోచించడం మొదలుపెట్టాను.

అవునింతకీ, నేనూ Tuesdays with morrie లాగా Live funeral లాంటిది పెట్టుకుందామా? అనిపించింది. కానీ, అప్పుడు బ్రతికుండగా ఏదో ప్రశాంతంగా బ్రతక్క ఎందుకు జనం మన గురించి మాట్లాడుకునే బండ బూతులన్నీ వినడం? అనిపించింది. సో, ఆ సందర్భంలో అప్పగింతలు ఇద్దాం అనుకున్న ఐడియా ఫ్లాప్. మరెలా? పోనీ, వాళ్ళేదో ఒకటి అనుకోని ఏడవనీ కానీ, మనం ఉన్నట్లుండి ప్రపంచం వదిలి వెళ్ళిపోతే, మనల్ని నమ్మినా నమ్మకపోయినా మనల్ని వారి జీవితాల్లో కలుపుకున్న వారి సంగతేంటి అనుకున్నా.

అక్కడే ఓ ఐడియా తట్టింది. నేను షే.మో.మూర్తి ని అయ్యి, నాక్కావాల్సిన వాళ్ళందరిని నా క్లయింట్లని ఊహించేసుకుని వాళ్ళని లేపేసి తర్వాత నేను కూడా వెళ్ళిపోవచ్చు అని. కానీ, మరి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ సంగతో? ఈ లెక్కన మరో మహాప్రళయం వస్తే కానీ నాకు న్యాయం జరిపించుకుని కూడా ఇతరులకి అన్యాయం చేయకుండా ఉండటం అన్న సందర్భం రాదు. కానీ, మరీ నా ఒక్కదానికోసం మహాప్రళయం దేనికి, పాపం దేవుడికెంత కష్టం? సన్యాసం లోని virtue ఇన్నాళ్ళకి అర్థమైంది. వాళ్ళైతే ఉండాలన్నా పోవాలన్న పరమ వీజీ. ఇంకోళ్ళని సతాయిస్తున్నామన్న భావన కలగడానికి స్కోపే ఉండదు.

పోనీ, “నేను” అన్న జ్ఙాపకాన్ని ప్రపంచంలో ఎవరి బుర్రలో ఉంటే వాళ్ళందరిలోంచీ తొలగించేశాం అనుకోండి, అప్పుడే సమస్యా ఉండదు. కానీ, అంత సాంకేతికత ఎక్కడేడ్చింది? సై-ఫై కథల్లోనే రాలేదింకా! సాంకేతికత గొప్పతనం తెలిసొచ్చింది. పోనీ, జానే భీదో యారో అనుకుని పారిపోడానికి ధైర్యం చాలలేదు. అప్పుడే ధైర్యం విలువ తెలిసొచ్చింది. ఓ పక్క పోయిన టపాకి జనాలు ఆన్లైన్, ఆఫ్లైన్ ఎన్ని వీలైతే అన్ని మార్గాల్లో వేసిన అక్షింతలు గుర్తొచ్చి ఈ టపా రాసేందుకే భయం వేసిందసలు. కానీ, అబ్బే! మనం మారం! సూర్య చంద్రులున్నంతకాలం (అంతెందుక్కానీ, ఈ బ్లాగున్నంతకాలం) మనం మనమే కదా!

“అమావాస్య రేయి అలా ఆగిపోయి. ఉషాకాంతినే నిషేధించునా” – దించదు కదా, అసలే మే నెల. ఎండ మొహాన కొడుతూ ఉంటే కళ్ళలో మంటలు కూడా తెలిసొస్తున్నాయి. అప్పూడే నిద్ర విలువేంటో తెలిసొచ్చింది.

Advertisements
Published in: on May 5, 2009 at 1:21 pm  Comments (4)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/05/05/nisyalochanapatham-8/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. నేను రాహుల్ ద్రావిడ్ బాటింగ్, ముఖ్యంగా టెస్టుల్లో పడి పడి చూడ్డానికి ఒక్కటే కారణం: There’s a “beauty” in leaving the balls too.

  ఈ నిశీ సీరీస్ లో నాకు తెల్సొచ్చింది అదే.. abstract గా project చేస్తూనే in depth feelings ని చెప్పటం. I see a beauty in these, as I see in Rahul’s left alone balls.

 2. నేను ఇది ప్రచురించగానే చూసినా ఏం రాయాలో తెలిసింది కాదు. ఏదో పట్టు దొరికీ దొరకనట్టు, మాటలు దొరక్క వూరుకున్నాను. అదేమిటో ఇప్పుడు పూర్ణిమగారి వ్యాఖ్య చూసేక బోధపడింది. ఆ బాల్సూ, బాటింగూ నాకు తెలీదు గానీ, నీ టపామీద వ్యాఖ్య మాత్రం మక్కికి మక్కీ పూర్ణిమగారి మాటే 🙂

 3. హిహిహి

  When will be the next installment?

 4. This was a recommended series. And the man is my immediate predecessor in this comment. His judgement is great. I want to express my accolades to your writing. Except for that THIRD installment, every piece is readable, and I enjoyed it.

  Also most of ur pieces are quite good, and as I’m on my vacation, I completely read ur blog. Quite amazing. 🙂

  Rahul’s batting? Ha ha ha. 😀

  You know something? We too don’t sleep at night at all some days, and go on for rides on the bikes. They made interesting stories too. 😉

  And that’s a fun indeed.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: