నిశ్యాలోచనాపథం-7

ఎప్పట్లాగే నేను చీకటి సామ్రాజ్యపు అధికారిణి లెవెల్లో నిశీథుల్లో నడుచుకుంటూ పోతున్నా. ఇప్పటికి చీకటి బాగా అలవటైపోయి వెలుగుకంటే అదే నచ్చుతోంది. సరే, వెళుతున్నానా, దార్లో ఎదురుగ్గా ఎవరో మొటర్ సైకిల్ పై వస్తున్నట్లు అనిపించింది. కానీ, పక్కన లగేజీ ఏదో వేళాడుతోంది. అది నా పక్కగా వెళుతున్నప్పుడు గమనించాను. అది బైక్ కాదు, దున్నపోతని. ఆ వేళాడేది గద. యముండ! ఆయన రెస్టు కోసం ఆ గదను తన వాహనానికి అలా వేళాడదీసాడని అర్థమైంది. (ఎలా? అనకండి. గుర్రాలకున్నట్లు దీనికీ ఓ జీను లాంటిదుంది అనుకోవచ్చుగా!)

ఇంతకీ అది నా పక్కనుండి వెళుతూ ఉండగా నాకు వెన్నులో వణుకు పుట్టింది. ఎంతైనా మనకేం ఆయనతో స్నేహం లేదు కదా. వెళుతూ ఉన్నదల్లా నా పక్కననుండి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తిరగడంతో కొంత కంగారు పుట్టింది. భయం భయంగా పైకి చూసాను. ఆయన యముండ అనుకుంటూ కిందకి దిగాడు. ఆజానుబాహుడే. పైగా ఆరడుగుల ఎత్తు కూడా ఉన్నాడు. నేను ఏమిటన్నట్లు చూస్తూ ఉంటే, “పద” అన్నాడు కొరడా ఝళిపిస్తూ. పై ప్రాణాలు పైనే ఎగరబోయి మళ్ళీ భయంతో లోన దాక్కున్నాయి. నేనేమీ మాట్లాడలేదు. ఆయనే మళ్ళీ – “పద! నీ సమయం ముగిసింది” అన్నాడు. నేను అప్పటికే కాస్త గుండె ధైర్యం తెచ్చేసుకున్నాను. “పదండి. నాకేమీ అభ్యంతరం లేదు. నిజానికి నాక్కూడా రావాలనే ఉంది. కానీ, రాలేకపోతున్నాను. బంధాలూ, బంధనాల్లో ఇరుక్కున్నా” అన్నాను.

అవాక్కయ్యాడాయన. “అయినా నువ్వు రావాల్సిందే. ఎలా పట్టుకెళ్ళేది?” అన్నాడు.
“మీరు తప్పదంటే నా అభిప్రాయం చెబుతా వినండి. నా చేత సూసైడ్లు గట్రా చేయించకండి. నాకు చెడ్డపేరు తరువాత. కావాలంటే ఏదన్నా ప్రమాదం జరిపించండి. కానీ, వేరే ఎవరికీ సమస్య రాకూడదు.” అన్నాను. ఇలా ఓ అరగంట సేపు వాదోపవాదాలు జరిగాయి. చివరికి ఆయన – “నా ఖర్మ కొద్దీ దొరికావు. నీ చావు నువ్వు చస్తూ ఎలాగో బ్రతుక్కో పో. నా దోవన నేను పోతున్నా” అన్నాడు. అయితే, నాలోని చిలిపి మనిషికి ఆ సరికి మహా ఓపిక వచ్చేసింది. “నేనొస్తా….నేనొస్తా..” అని సావిత్రి వెంటపడ్డట్లు వెంటపడ్డం మొదలుపెట్టాను. ఆయన నా గోల భరించలేక, ఆ దున్నపోతును కదిలించలేకా ఏడుపు మొహం పెట్టాడు. దానితో జాలేసి ఓ సలహా ఇచ్చాను. “నేడు పోయి, రేపు రమ్ము” అని.

ఇంతలోపు రెండు పనులు చేసుకోవాలన్నది నా ఆలోచన.
1. ఓ షేక్ మోసెస్ మూర్తి ని వెదుక్కోవడం (ఇతగాడెవరో తెలుసుకోవాలంటే జంధ్యాల మల్లెపందిరి సినిమా తెలిసుండాలి. తెలియకపోతే, మీకు అతన్ని గురించి తెలుసుకునే అర్హత లేదు! 😉 )
2. ప్రపంచానికో వీడ్కోలు సందేశాన్నివ్వడం.

– షె.మో.మూ దొరికాడో లేదో, నా వీడ్కోలు సందేశం సంగతులు త్వరలోనే సందేశం సిద్ధం చేస్కోగానే మీకు చెబుతాను. ఇతి వార్తాహా ఈ దినాహ.

Advertisements
Published in: on April 6, 2009 at 6:21 pm  Comments (11)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/04/06/nisyalochanapatham-7/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. I think, I remember that song in that movie, అన్నాడే, వస్తానన్నాడే” a nice one though 🙂

 2. LOL! 😉

 3. బావుందండోయ్. నాదో ఉచిత సలహా. కథో, నవలో ప్రయత్నించండి. 🙂

 4. Very well. Thanks for returning, and for the info. He’s that way? 😀

  Waiting for ur last message. 🙂

 5. Very well. Thanks for returning, and for the info. He’s that way? 😀

  Waiting for your last message. 🙂

 6. huh?

 7. అరుణ మాటే నాదీను. ఈనిశ్యాలోచనాపథంలో నీ ఆలోచనలన్నీ చెల్లాచెదురయిపోతున్నాయి, నీరచనా విధానం బాగున్నా. అన్నీ ఓకొలిక్కి తెచ్చి మంచి పెద్దకథగానో, మంచి చిన్న నవలగానో రాస్తే బాగుంటుంది.

 8. hahahaa…Nice one.

 9. మీరు ఇలా నిశీధిలో మేల్కొని కలలు కంటున్నారంటే మీరు saggittarius లేదా aquarius అయినా అయుండాలి.నాకు మాత్రం పడుకునేటపుడు గుర్తుకువస్తున్నారు.ఇక ఈ నిశ్యాలోచనాపధం ఆపుదురూ ! Bore కొడుతోంది.

 10. I dont know where to ask, so I am using this space. I realized that you are/were at IIIT, Language Processing group. I happen to read the tech report on text-inputting for telugu. I am working on a compiler/analyzer for telugu chandassu. I am wanting to discuss couple of issues and seeking some general advise. Can you please drop an email to me at

  somasd AT gmail DOT com,

  thanks,
  -soma s dhavala
  karvepaku.blogspot.com

 11. […] బట్టీ నేను ఇదే పనిలో ఉన్నా. పోయిన భాగంలో చెప్పిన చివరి రెండు విషయాల గురించిన పనుల్లో. […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: