నిశ్యాలోచనాపథం-3

“ఏదన్నా రాస్కోవాలంటే ఒంటరిగా ఉంటేనే వీలుగా అనిపిస్తుంది”
“నాకు రాయాలంటే చుట్టూ నిశబ్దం కావాలి”
– ఈ రెండు అభిప్రాయాలు విన్నాక “ఓహో!” అనుకుని గబ్బిలం, గుడ్లగూబ వాళ్ళ క్లబ్ లో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నాను. కొంచెం కొంచెంగా ఆవులింతలు మొదలయ్యాయి (పనిచేయాలంటే రావూ మరి??). ఓ పక్క నిద్రొస్తున్నందుకు సంతోషిస్తూ, మరోపక్క ఈ లెక్కన రాయడం గబ్బిలాలకే చెల్లన్నమాట అనుకుంటూ ఉండగా మానవ గబ్బిలాలన్నీ మానవహారమో, గబ్బిలహారమో, హార గబ్బిలమో తెలీదు కానీ, నెక్లెస్ రోడ్డు చుట్టూ నిలబెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.

ఇక నిద్రెక్కడిది లెండి. ఆలోచనలు తేనెటీగలై దాన్ని కుట్టి కుట్టి, అది కుయ్యో! మొర్రో! అంటూ పారిపోయేలా చేశాయి. ఇంతకీ ఈ మానవ గూబలన్నీ, అదే లెండి, ఏవో ఒకటి, ఎవరో ఒకరు-అలా హారంగా ఏర్పడితే ఏం చేస్తారు(యి)? హుం…మన రాత గబ్బిలాలేమో బహూశా చిరాకుపడి విసుక్కోవడం మొదలుపెడతాయి కాబోలు-ఇంత సంతలో నిశబ్దమెక్కడిది గనక! సేల్స్ గబ్బిలాలు వెంటనే “రేప్పొద్దున్న సెలవైనా పెడతాం కానీ, ఇంతమంది మళ్ళీ దొరకరు” అనుకుని “ఛాన్స్ మారరే!” అని అరుస్తూ డ్యూటీ ఎక్కేస్తారేమో. యూత్ గబ్బిలాలు – “ఈ హారాలేంటీ? దారాలేంటీ? కమాన్ మేన్! లెట్స్ స్విం!” అని సాగర్ లోకి దూకబోతూ ఉండగా, లోకల్ హైదరబాదీ గబ్బిలాలు “భాయియో ఔర్ బెహనో! ఏ హుస్సేన్ సాగర్ హై!” అని అరవగా “ఓ మాన్! wth!” అనుకుని మళ్ళీ పైకెత్తేసిన టీషర్టులు దింపేసుకుంటారేమో.

ఇంతలోపలే శాడిస్టు గూబలు – మనలా బాధపడే వాళ్ళున్నారని ఆనందించొచ్చు. వృద్ధ గబ్బిలాలైతే “ఈ వయసులోనే పాపం వీరికి ఈ నిద్రలేమి ఏమిటో!” అని జాలిపడొచ్చు. ఆడ గూబలు మళ్ళీ పొద్దున్నుంచి మొదలయ్యే ఇంటెడు చాకిరీ గురించీ, పిల్ల గూబలు రేపటి స్కూలు గురించీ – ఇలా ఎవడి గోల వాడిది. ఇలా అనుకుంటూ పరుపు మెత్తగా ఉందని అలా తడుముతూ ఉంటే, చేతికి సెల్లు తగిలింది. మధ్య బటన్ నొక్కితేనూ, చీకట్లోకి వెలుగొచ్చింది. టైము రెండున్నరగంటలటటటట. కెవ్! పొద్దున్న ఆరింటికే లేవాలి!

“ఏవుందిలేవోయ్! పెద్ద పడుకునే మనిషిలాగా లేవడం గురించి ఆలోచిస్తున్నావ్!” అంటారా? నిజమేననుకోండీ, కానీ లేవడమంటే ఆ లేవడం కాదు. ఈ ఆలోచనలన్నీ తెముల్చుకుని, సందేహాలు తీర్చుకుని, ఫ్రెష్ గా కొత్తరోజు, కొత్త జీవితం మొదలుపెట్టాలని. అందర్లాగే నేను కూడా ఆవులిస్తూనే “నిద్ర” లేస్తాను – కానీ, అన్ని ఆవులింతలూ ఒకలా ఉండవు, అన్ని కారణాలూ ఒకలా ఉండవు!!

Advertisements
Published in: on February 3, 2009 at 1:12 pm  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/02/03/nisyalochanapatham-3/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. 🙂

  2. Ento Okka mukka arthamu kaaledu naa matti burraku

  3. ఏం రాశారండీ??

    అదే… ఏం రాశారండీ!! అంటున్నా.. 😀


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: