జ్ఞాపకానికి సమాధి

నాకు గుర్తుంది నేను జ్ఞాపకానికి బ్లాగ్ముఖంగా సలాం కొట్టిన రోజు. చాలావరకు నేను అలా రోజూ సలాం కొడుతూనే ఉంటాను. కానీ, కొద్దిసేపటి క్రితం నా పుస్తకాలూ,కాగితాలూ ఉన్న అర సర్దుతూ ఉంటే, ఇలా సర్దిన ప్రతిసారీ సలాం చేసే నేనే జ్ఞాపకాన్ని సమాధి చేస్తున్నానా? అన్న సందేహం వచ్చింది. షరామామూలుగా దాని వెంటనే రకరకాల ఆలోచనలూ, మెట్ట వేదాంతమూ పొడుచుకొచ్చాయి. అర సర్దడానికి సమాధి చేయడం అన్న పోలిక అంత నప్పదేమో కానీ, నిజానికి నేను చేసిన పని నాకు హత్య చేస్తున్నట్లూ, ఆ తరువాత సమాధి కడుతున్నట్లు అనిపించింది – తప్పనిసరి హత్య. తప్పక చేసిన హత్య.

అలా సర్దుతూ ఉన్నానా-ఒక చోట ఓ కట్ట కాగితాలు కనిపించాయి. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏవో రాసుకున్నవి అవన్నీ. ఏదో చదివి, దాని ప్రభావంలో ఏదో కెలికినవి. ఓసారి చదివాను. నవ్వుకున్నాను. ఇలాగే ఇదివరలో చాలాసార్లు జరిగింది. అయితే, ఈసారి అక్కడితో ఆగలేదు. ఏళ్ళు గడిచేకొద్దీ అధిక జనాభాతో సతమతమౌతూ, నిండు గోదారిలా పొంగి పొర్లడానికి సిద్ధంగా ఉన్న ఆ అరను చూస్తే జాలేసింది. ఎప్పటిలాగే మరో కాగితమో, ఎవరో ఇచ్చిన పెన్నో, పెన్సిలో, ఏ వస్తువు తాలూకా బిల్లో ఏదేదో ఇంకేదో దానిలోపల కూరేయడానికి ఇంకా వీలుంది కానీ, ఓసారి అన్నీ సార్ట్ చేసుకుందాం, రేప్పొద్దున్న అందులోంచి ఏదన్నా కావాల్సి వస్తే దొరకాలి కదా మనకు, అనిపించింది. పని మొదలుపెట్టాను. ఇక కథ మొదలైంది.

ఇందులోని అతి పాత జ్ఞాపకం నేను ఓ పదేళ్ళ వయసులో ఉన్నప్పటిది అనుకుంటా. బర్త్ సర్టిఫికెట్ వంటివి ఉన్నాయి లెండి, అవి లెక్కపెట్టము. నేను సృష్టించిన జ్ఞాపకాలే ఇక్కడ సమాధులలెక్కలో. మిగితా డీఫాల్ట్ జ్ఞాపకాలన్నీ జనాభా లెక్కల్లో. ఒక్కోటీ తీయడం అరక్షణం వ్యవధిలో ఇప్పుడిది మనకవసరమా కాదా? అని ప్రశ్నించుకోడం, అవసరం లేదు అనుకోగానే నిర్ధాక్షిణ్యంగా చంపేయడం (ఈ భావనలో టాయ్‍స్టోరీ ప్రభావం ఉండి ఉండొచ్చు నాపై). అలా గొంతు నులుముతున్నప్పుడే ’ఎందుకిలా చేయడం’ అని ఆలోచనొస్తుంది. కానీ, మరీ తీవ్రంగా ఆలోచిస్తూ కాగితాన్ని మరీ నలిపేస్తానా, అది కాస్తా చచ్చే ఊరుకుంటుంది నేనెటూ తేల్చుకునేలోగా. ఇంకేం చేస్తాం, వదలాలనిపిస్తే ఓ అశ్రుతర్పణం, లేకుంటే ’ఆ నెక్స్ట్!’

అరవైఏళ్ళొచ్చాక స్కూల్లో చేసిన మ్యాప్ పాయింటింగ్ కాగితం ఎప్పుడో కాగితాల మధ్య కనిపిస్తే కలిగే ఆనందం – హౌ రొమాంటిక్! ఊహించుకోడానికి బానే ఉంది కానీ, ఇప్పుడు ఇరవైల్లో ఉన్నాను. ఆశావాదం ఎస్టిమేట్ గా ఎనభై ఏళ్ళు బ్రతుకుతాం అనుకుంటే, అప్పటికి డెబ్భై ఏళ్ళనాటి జ్ఞాపకాలు అప్పుడసలు ఏమన్నా మిగుల్తాయా? అప్పుడు ఈ మ్యాప్ పాయింటింగ్ పేపర్ చూస్తే మాత్రం ఏమన్నా అనిర్వచనీయ ఆనందం కలుగుతుందా నిజజీవితంలో? అంటే తెలీదు మరి. ఒకవేళ అదంతా గుర్తు వచ్చి “ఆహ్! అప్పట్లో జీవితమెంత బాగుండేది!” అన్న నిట్టూర్పు విడిచే పరిస్థితిలో నేనుంటే ఈ జ్ఞాపకమొచ్చి నా మనశ్శాంతి ని తినేసినట్లవదూ? పోనీ, అలాకాక నేను మహా ఆనందంగానే ఉన్నాననుకోండి, అప్పుడు ఈ జ్ఞాపకం నాలో అంత ఆనందం కలిగించేది కాకపోతే ఆ ఆనందం తగ్గదూ? (భూమేమీ బద్దలవదు అనుకోండి అంతమాత్రాన) అసలివన్నీ కాదు ఏదో జరిగి ఈ జ్ఞాపకాలు నేను చూసే అవకాశం వచ్చేలోపే నన్ను నేనే కోల్పోతే , ఈ జ్ఞాపకాల పరిస్థితేమిటి? వీటితో ముడిపడ్డ మిగితా జీవితాలపై దాని ప్రభావమేంటి?

ఇంతకీ ఏదో చెప్పాలనుకుని ఏదో చెబుతున్నా! ఇలా ఇలా పేర్చుకుంటూ పోతూ ఉంటే జ్ఞాపకాల్లోనే చిక్కుకుని వర్తమానాన్ని అనుభవించనేమో అన్న సందేహం ఒకవైపు, మళ్ళీ వర్తమానంలో మళ్ళీ రేపటికోసం జ్ఞాపకాలను తయారుచేసుకుంటాము కనుక వర్తమానమన్నదే ఉండకూడదన్న మొండితనం ఒకవైపూ – ఇన్ని ఆలోచనలతో సతమతమౌతూ కొన్ని జ్ఞాపకాలకు సమాధి కట్టాను. తరువాత నుండి ఒక రెండు మూడు రోజులు జ్ఞాపకం అన్నది సృష్టించుకునే అవకాశాలు వచ్చినా కూడా అవి stillborn గా “పోయాయి”. కట్ చేస్తే – అసలు కట్ చేసే అవకాశం ఎక్కడిదీ? నేనిలా సమాధి చేసేస్తూ స్మశానాలు కట్టేస్తూ ఉంటే! రియల్టర్లు నా మీద దాడి చేస్తారేమో – ఉన్న స్థలాలు మాకు వదలక స్మశానాలు కడతావా? అని.

Advertisements
Published in: on February 3, 2009 at 5:06 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/02/03/memory-grave/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. మీ అంత పొందికగా చెప్పలేను గానీ నాకూ ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి.పాతబడే కొద్దీ కొన్ని జ్ఞాపకాలకి విలువ పెరిగిపోతుంటుంది.అందుకే ఎప్పటికప్పుడు అర సర్దుతూ కొన్నింటిని పడేస్తుంటాను.అలాంటప్పుడు పెద్ద బాధ వుండదు 🙂

 2. >> తప్పనిసరి హత్య. తప్పక చేసిన హత్య!!

  Law నే ఇలాంటి వాటికి special considerations ఇస్తుంటే, can’t we be li’l nice to ourselves?! అవును తప్పకే చేస్తున్నాం, అంతకన్నా మనసు కష్టపెట్టుకుని చేస్తున్నాం.. పైగా స్వనిందలు కూడా ఎందుకు? Self-blame.. aah, how I suffer from it?!

  But one thing I’ve realized, you’ll learn to shun, shun the dearest, even if it hurts! Because, at times quite unknowingly, you’ll know how to prioritize.

 3. ఇంతకీ ఇది ఆశావాదమా?నిరాశావాదమా?తర్కమా?వేదాంతమా?అన్నీ కలసిన కలగా పులగమా?ఏదయినా చాలా బాగుంది మొత్తానికి.
  ఇంక పోతే రియల్టర్లు మీ మీద దాడి చేసే అవకాశం లేదు,ఎందుకంటే వాళ్ళే ఈ ఆర్ధికమాంద్యపు దెబ్బకి సమాధి అయిపోయి ఉన్నారు కాబట్టి..

 4. హ్మ్.. నాకు ఇలానే అనిపిస్తుంది చాలా సార్లు. చాలా సార్లు చూసి చూసి, దానికి మళ్ళీ కాస్త జాగా కల్పించేస్తాను. కొన్ని సార్లు చించి పారేస్తాను. అయితే కొన్నిటిని ఎప్పటికీ పదిలంగా దాచుకుంటాను. అవి ఎవరికీ అందవు. కానీ మీరన్నట్టు.. ఈ లోపు నన్ను నేను కోల్పోతే, నా గాధల్ని, నే చెప్పలేక పోయిన ఊసుల్ని, నా వారికి తెలియచేస్తాయి అవి.. 🙂

  Nice post 🙂

 5. Just passing by.Btw, your website have great content!

  _________________________________
  Making Money $150 An Hour


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: