“ఏంటీ, బాగా నిద్రొస్తోందా?” నా అరవై ఆరో ఆవులింత (లెక్కెట్టింది నేను లెండి. ఎంత ఈగద్లోలే మనిషి కూడా పక్కనోళ్ళ ఆవులింతలు లెక్కపెట్టడు.) చూస్తూ నా స్నేహితురాలు అడిగింది.
“యా!” అన్నట్లు తల ఊపుతూ అరవై ఏడోసారి ఆవులించాను.
“ఏం? రాత్రి సరిగా పడుకోలేదా?”
వెంటనే నాకు భోరున ఏడవాలనిపించింది. మళ్ళీ జాలిని ఎవడు భరిస్తాడని తమాయించుకుని, ఓ శుష్క దరహాసం విసిరి – “ప్చ్!” అని శబ్దించాను (మరేమో, చండీదాస్ గారు స్నానించాను అంటే చదివారుగా, అలాగే ఇదీ చదవండి..అంతే!) అని ఊరుకున్నాను.
“ఏం ఎందుకు?”
ఎందుకంటే ఎలా చెప్పమంటారండీ? రాత్రంతా నేను శేషేంద్ర శర్మ గారు – “భూమధ్య రేఖ గుండా రంధ్రం చేస్తే ఎలా ఉంటుంది?” అని ఆలోచించినట్లు “మనింటి కప్పుకి సరిగ్గా మధ్యలో రంధ్రం చేస్కుని కనిపించే చుక్కని చూస్తూ నిద్రపోగల అవకాశం ఉందా?” అని ఆలోచిస్తూ ఉన్నా అని ఎలా చెప్పమంటారు?
దాన్దేముందీ..వచ్చేస్తుంది, కనిపించేస్తుంది అంటారా? అక్కడే ఉంది నా సమస్యల్లా మరి. మొదటగా మాపై మూడంతస్థులు ఉన్నాయి. అరే! అలా చూస్తారేమిటండీ మింగేసేలాగా? నేనేం విషయం చెప్పేయక దాటేశానా? కాస్త ఆలస్యంగా చెప్పాను. అంతేకదా! పోనీలే, ఆ పైవారిని కూడా బ్రతిమాలో, బామాలో, తిట్టో, కొట్టో, కాళ్ళు పట్టుకునో, కర్రుచ్చుకునో – ఏదో ఒకటి చేసి సరిగ్గా అదే చోట ప్రతి అంతస్థులోనూ రంధ్రం చేయించాం అనుకుందాం. ఇంతా అయాక అక్కడ సదరు చుక్కలాంటి రంధ్రంలోంచి ఆబగా చూస్తే అక్కడ నక్షత్రం కనిపించకుంటే? ఇంకో రంధ్రం చేయి అంటారా? బానే ఉంది వరస! మా ఇల్లేమన్నా జల్లెడనుకున్నారా ఏమిటీ??
ఇంతకీ అలా రంధ్రం చేసి నక్షత్రం కనిపించినా కూడా ఆ ఆనందం ఎక్కువసేపు నిలువదు. ఆపై అంతస్థుల వారు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారా? ఇక నాకు నక్షత్రం డిస్కో లైటే. అక్కడ్నుంచి ఏ ఫినాయిలో, యాసిడో వేసి వాళ్ళ ఇల్లు కడగడం మొదలెడితేనో? వామ్మో!! అటూ ఇటూ చూసుకున్నాను. అంతా చీకటి. రంధ్రం ఉందో లేదో కూడా తెలీనంత చీకటి. ఇంకా నయం! ఇదంతా ఊహే కదా! అనుకుని నిట్టూర్చాను.
ఇప్పుడీ రంధ్రానికి డ్రిల్లింగ్ మషీన్ ఎలాంటిది కావాలి? ఈ రంధ్రంలోంచి నక్షత్రం మనపై పడితేనో? అయినా నక్షత్రాలు మనకి కనిపించేంత చిన్నవా ఏమిటీ? అసలు గది మధ్యలో రంధ్రం పెడితే ఫ్యానెలాగూ?
– ఇలా ఆలోచిస్తూ ఉన్నానా? “సిగ్గులేదూ? ఎనిమిదౌతున్నా ఇంకా మంచంపైనే ఉన్నావు. వెధవ పగటికలలొకటి” – శ్రీముఖం.
పగలా? అదీ కలా? అదీ నాకా? ఇంకా నయ్యం!
అదండీ అసలు భాగోతం. ఇదంతా తనకి చెప్పలేక – “హా! రాత్రి ఫ్యాన్ మెల్లిగా తిరిగింది. నాకలా ఉంటే నిద్ర పట్టదు” అని చెప్పి మళ్ళీ ఆవులించాను.
నమ్మిందో లేదో కానీ, “ఓ! సరే! నాకు పనుంది, మళ్ళీ మాట్లాడతాను.” అని వెళ్ళిపోయింది నా స్నేహితురాలు!!
ఇటువంటి వాటికి టైటిల్స్ ఇస్తే ఇంకా బాగుంటుందేమో:)… in the sense, title itself would be interesting:d….
నిశ్యాలోచనాపదచారీ,
ఇంటి పైకప్పులో నక్షత్రాలు కనిపించాలంటే మూడు ఫ్లోర్లకి రంధ్రం పెట్టక్కర్లేదు!
ఇప్పుడు మంచి “Glow in the dark” స్టిక్కర్లు దొరుకుతాయి.
— తురగా
🙂 మీ రైటింగ్ స్టైల్ మాత్రం సూపర్ సౌమ్య గారు. ఎన్నోసార్లు అనుకున్నా ఇంత బాగా రాసే టాలెంట్ నాకు లేదే అని! భలే రాశారు ఈ పోస్ట్.
writing style gurinchi chepparu ganee choose chesukunna subject gurinchi evvaroo matladdam ledu 🙂
sowmya, ee madhya post chesina chala topics lo edo miss ayinattuga anipistondi naku.
kotta books emi chadavadam leda meeru ?
ఎంచుకున్న విషయం గొప్పగా ఉండకపోయినా చెప్పిన విధానం బాగుంది.
Like, thin line story and tight screenplay
నాకు ఎప్పుడో చదివిన ఒక కధ గుర్తుకొస్తోంది.
“ఇద్దరు అన్నదమ్ములు అడవికి వెళ్ళారట.
అన్న ఏమో భావుకత ఉన్న కవి. తమ్ముడేమో మామూలు రైతు
రాత్రికి గుడారం వేసుకుని పడుకున్నారు.
అర్ధ రాత్రి తమ్ముడు అన్నని నిద్రలేపాడట
అన్న లేస్తూనే పైన కనిపిస్తున్న తారల గురించి కవిత చెప్తూ తమ్ముడితో నీకేమనిపిస్తోంది అని అడిగాడట.
మన గుడారమెవరో ఎత్తుకుపోయారని అన్నాడట. ”
భావుకత మరీ ఎక్కువైనా ప్రమాదమే ఒక్కోసారి