నిశ్యాలోచనాపథం – 1

నేనో నిశ్యాలోచనాపథపాదచరిని. పదమసలుందా అని ఆలోచించడం మొదలైందా? వద్దు, వేస్ట్. నేనే చెప్పేస్తున్నా – సృష్టికర్త కోడ్ – వీబీసౌమ్య, అనగా ఇట్లు మీ భవదీయురాలినైన నేనే. ఇంతకీ పదానికర్థం అర్థమైపోలేదూ? చూస్తేనే అర్థమైపోవాలని అలా ఫ్రేం చేసానే! సరే, ఎందుకన్నా మంచిది, అర్థం నేనే చెబుతాను. మీకు తోచిన అర్థాన్ని దీనితో సరిచూసుకోండి. రెండింటికీ 75 శాతానికి మించిన పోలిక కనిపిస్తే ఈటపా చదవడంలో ముందుకు సాగండి. లేదంటే, ఈ ట్యాబో, విండోనో మూసేయడం మీకు బెటర్. నాకు కూడా అప్పుడు మీరు మూసేయడమే బెటర్ – ఎవరి ప్రాణాలు వారికి తియ్యన కదా! 😉

ఇంతకీ, రాత్రుళ్ళు నిద్రపట్టక ఆలోచనల దారుల్లో పాదచారియై తిరిగే ప్రాణి అని అర్థం. ఓస్! ఇంతేనా! ఇన్సోమ్నియాక్ అంటే పోదూ? అంటారా? మరదే! ఇన్సోమ్నియాక్ అంటే నిద్రరాని మనిషనీ, నిశాచరి అంటే రాత్రుళ్ళు తిరిగే మనిషనీ అర్థాలున్నాయా? నిశిన్సోమ్నియాకచరి అంటే మా సంకర్ భాషలో నిద్రపట్టక బలాదూర్లు తిరిగే ప్రాణి అని అర్థం. వర్ణసంకరాన్ని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న నేను దీని అర్థం కాస్త మార్చి ఈ “నిశ్యాలోచనాపథపాదచరి” అన్న పదం కనిపెట్టాను అనమాట. తెలుగు నిఘంటువులో “టట్టడాయ్!” అన్న పదం ఎలాగైతే ఉండదో, ఇదీ అలాగే ఉండదు. అయినా, మాయాబజార్లో పలికించినట్లు, ఎవరూ పుట్టించకుంటే మాటలెలా వస్తాయీ? అలాగే మన భవదీయురాలు ఇప్పుడు అంటున్నట్లు – మాటల్లేకుండా మనిషేం కావాలి?

ఇంతకీ ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా దేనికి అంటే, ఈపాటికి యువర్స్ ఫెయిత్ ఫుల్లీ కూడా నిశ్యాలోచనాపథపాదచరి అనబడు జీవకోటిలో ఓ జీవి అని మీరు గ్రహించే ఉంటారు కదా, అలాంటి నా నిశ్యాలోచనాస్రవంతి నుండి కొన్ని రేఖల్ని ఇక్కడి బీపీడీ (బ్లాగ్ పవర్డ్ డిస్ప్లే) ప్రొజెక్టర్ ద్వారా మీకు చూపి మీకు జ్ఞానోదయం చేద్దామని. ఈ దారుల్లో చెప్పులేసుకుతిరిగితే నేలలోని వేడో/చల్లదనమో హాయిగా అనుభవించలేమని చెప్పుల్లేకుండానే ’చరణదాసి’ నై తిరిగాను. అక్కడక్కడా వచ్చిన ఆలోచనలను మీకు అప్పుడప్పుడూ చెబుతూ ఉంటాను.

నాగ్గనక నిద్రబాగా పట్టేయడం మొదలైతే ఈ వ్యాసాలు ఆపేస్తాను లెండి. హలో! ఆగండి! అలా గుళ్ళూ,గోపురాలూ వెదక్కండి, నాకు నిద్రపట్టాలని పూజ చేయడానికి. మొదటి అసలు విషయం – ఎన్ని శాంతులు చేసినా నాకు అశాంతిగానే ఉంటుంది, నిద్ర పట్టదందుకే. రెండో అసలు విషయం – నిద్రపట్టడం మొదలవగానే “స్వప్నపథసంచారానుభూతి” అని కొత్త శీర్షిక మొదలుపెడతాను అప్పుడు!!

Advertisements
Published in: on January 22, 2009 at 1:09 pm  Comments (13)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/01/22/nisyalochanapatham-1/trackback/

RSS feed for comments on this post.

13 CommentsLeave a comment

 1. నిద్రాకాంతపదమంజీరరవళి స్నేహకరచాలనము చెసినన్,లేకున్నన్ మీ బ్లాగు లేఖా పదబంధముల గతి ప్రవాహముల్ ప్రవర్తిల్లు గాక

 2. సౌమ్య గారూ !మీరు నిఘంటువులో కూడా దొరకని కొత్త పదాల్ని కనిపెట్టి మరీ పద ప్రయోగం చేస్తుంటే భలే ముచ్చటగా ఉందండీ !keep it up………….

 3. మరియా నిశ్యాలోచన లేవియో కూడా చెప్పియున్న బాగుండెడిది

 4. నిశ్యాలోచనమైనా….స్వప్నాలోచన మైనా …ఆలకించడానికి మేం సిధ్ధం …..

 5. ఇందుకు సరైన అభివ్యక్తి = ‘నిశ్యాలోచమాన సంచారిణి’

 6. ఎన్ని శాంతులు చేసినా నాకు అశాంతిగానే ఉంటుంది… పోనీ .. జల కప్ప యాగం చేయించమంటారా?? నిద్ర పట్టకుండా ఉండేందుకు. బాగుంది టైటిల్. మీ బీపీడీ (బ్లాగ్ పవర్డ్ డిస్ప్లే) ప్రొజెక్టర్ ని త్వరగా మొదలెట్టండి మరి.

 7. అర్థం చేసుకునేలోపు ఆరు కామెంట్స్ పెట్టారు…
  మట్టిబుర్రకదండీ…..అర్థం అయ్యాక బాగుంది…

 8. నిశ్యాలొచనాపధపాదచరిణికింగలుగు స్వప్నావస్థానుపస్థితినిన్‌ గనుగొని
  నిద్రాహ్వానోపకణాన్వేషణాలోచనాన్వితుడనై స్వస్వప్నావర్జితుడనైతి తనసహపధపదచరుడనైతి

 9. మాటల మాతా, పద జననీ, నమో నమ
  psmlakshmi
  psmlakshmi.blogspot.com

 10. నిద్ర పట్టినా, పట్టక పోయినా బ్లాగడం ఆపనంటారు అంతేకదా..? దూసుకు పోండంతే… ఆలోచించకండి. 🙂

 11. […] సౌమ్య గారు  “నిశ్యాలోచనాపథం”   అంటూ ఓ పదం తయారు చేశారని చూశా గానీ – […]

 12. baavundandy…keep it up

 13. prati raata,mii chEtilO maMchi bomma avutunnadi.very nice


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: