నాలుగు చెవుల ధోరణి

పరిస్థితుల్ని బట్టి మాటలు మారుస్తూ ఉంటే ’రెండు నాల్కల’ ధోరణి అంటారు కదా, మరి పరిస్థితుల్ని బట్టి అవతలి మనిషి ఏం మాట్లాడినా మనకు రెండు మూడు అర్థాలు కనిపించే లక్షణాన్ని ఏమంటారా అని ఆలోచించాను. దీనికి ’మల్టిపుల్ హియరింగ్ డిజార్డర్’ అన్న సాంకేతిక నామం సరిగ్గా సరిపోతుందేమో అనిపించింది. అయితే, మామూలు మానవ భాషలో చెప్పుకోడానికి కూడా దీనికో పదం కావాలి కదా అని అనుకుంటూ ఉండగా, మనిషన్నాక రెండు చెవులు డీఫాల్ట్ గా ఉంటాయి కనుక (అవి పని చేస్తాయా? లేదా? అన్నది వేరే విషయం) దీన్ని ’నాలుగు చెవుల ధోరణి’ అందామని నిశ్చయించుకున్నాను.

మొన్నామధ్య లిమ్కా యాడ్ గురించి రాస్తూ ఈ బ్లాగులోనే ’క్షణాలే భారమై, ప్రాణాలే తోడుతుంటే’ గురించి రాసాను కదా. అప్పుడే అర్థమైంది, నాకీ నాలుగు చెవుల జబ్బేదో వచ్చింది అని. అక్కడ తెరపై వాళ్ళు ఆనందంగా ఆ పదాలు పాడుకుంటున్నారా, నేను మాత్రం ఎంత ప్రయత్నించినా ఆ పదాల్లోని విషాదాన్ని మాత్రమే చూస్తున్నాను. ఒక్కోసారి కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయని ప్రాక్టికల్ గా నిరూపితమైంది ఆ క్షణాలలో. ఆ బాధకి కూడా నాకు క్షణాలు భారమై ప్రాణాలు తోడటం అనుభవమైంది మళ్ళీ. రిసెషన్ గురించి ఆ మధ్య స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంటే, మాటల మధ్యలో ‘everything will pass’ అన్నది తను. తనేదో రిసెషన్ కూడా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అన్న ఆశావాదంతో అన్నదా, నాకు మాత్రం, ఏదీ శాశ్వతం కాదు అన్న అర్థం ధ్వనించింది దానిలో!! అఫ్కోర్స్, ఇంకో రెండు మూడు అర్థాలు ధ్వనించాయి కానీ, మరీ ఆరు-ఎనిమిది ఇలా చెవుల సంఖ్యలు పెంచుకుంటూ పోతే నా మొహమెలా ఉంటుందో ఊహించుకోడానికి భయంగా ఉంది. అందుకని అవన్నీ ఇప్పుడు చెప్పను.

ఈ నాలుగు చెవుల రోగానికి ముఖ్య లక్షణాలు ఏమిటో మీకు ఇప్పుడు కొంత అవగాహన కలిగే ఉంటుందనుకుంటున్నాను. అయినా మళ్ళీ మరోసారి నొక్కి వక్కాణిస్తున్నాను. ప్రధానంగా నాలుగు లక్షణాలు ఉంటాయి:
1. అవతలి వారు ఏదో కాజువల్ గా చెప్పిన మాటల్లోనే మీకు ఏదో బ్రహ్మాండమైన ఫిలాసఫీ కనబడేసేయడం
2. వాళ్ళు కామెడీకి అన్న మాటల్లో సీరియస్ నెస్సూ, వారు సీరియస్గా అన్న మాటల్లో ఏవో హాస్యస్ఫోరకమైన అర్థాలూ – ఇలా కనబడ్డం
3. అవతలి మనిషి ఏది అన్నా వ్యంగ్యమే అనిపించడం
4. మీరేం మాట్లాడినా కూడా మీకే దానిలో రెండు మూడు అర్థాలు కనిపించడం.
– ఈ నాలుగో స్థాయికి వచ్చేసారా, ఇక మీ సంగతి సం-గతే. ఏ గతో కూడా ప్రస్తుతానికి నాకు తెలీదు. ఉన్న నాలుగు చెవులూ ఎనిమిది చేసుకుని మరీ రిక్కించి వింటున్నాను చుట్టుపక్కల అష్టదిక్కుల్లోనూ-ఎవరి మాటల్లోనన్నా ఆ గతి గురించిన సంగతి దొర్లుతుందేమో నని. ఊహూ…ప్చ్! లాభం లేదు. పోనీ మీకేమన్నా తెలిస్తే మీరే చెబుదురూ! నా చెవులన్నింటికీ ఆ పనిభారం తగ్గించినవాళ్ళౌతారు.

అలాగే వైద్య చదువరులు (పోనీ చదువరి వైద్యులు) అంటే, వైద్య విద్యార్థులని కాదు, వైద్యుల్లో చదివే అలవాటున్న వారన్నమాట (మళ్ళీ విద్యార్థులతో ప్రయోగాలు చేయించుకోడమెందుకు లెండి!) ఈ వ్యాధికి చికిత్సేమిటో కూడా సెలవిచ్చి పుణ్యం కట్టుకోండి!

Advertisements
Published in: on January 12, 2009 at 11:18 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/01/12/4ears/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. 🙂

 2. చాలారోజుల తరవాత మంచి టపా రాసావు :))

 3. మీ పదకల్పన (coinage) బావుంది.

  ఇహపోతే ఈ ఆర్థిక సంక్షోభంతో మనం కనీసం ఒక దశాబ్దం పాటు సహజీవనం చెయ్యక తప్పదనుకుంటా. ఇది ఆర్థికంగా మొదలయింది. కానీ పెను-రాజకీయ పరిణామాలక్కూడా దారితీయబోతోందని నా ఊహ.

 4. తాడేపల్లిగారు మరీ సంవత్సరామా 😦

 5. ఇలాంటి బాధ నేను కూడా పడ్డాను. నాలుగవ స్టేజ్ లోకి వెళ్ళి వెనక్కి వచ్చాను. ఎక్కువగా ఆలొచిస్తే ఇంతే. ఒక విషయాన్ని పది రకాల కోణాల లోంచి చూడటం ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల కూడా అయ్యుండచ్చు. మనం ఎప్పుడూ positive outlook ని maintain చేస్తే వ్యంగ్య అర్ధాలు మనకు స్ఫురించవు.ఒక సమయం లో ఒకే పని చెయ్యాలి. ఒక సినిమా చూడాలి అంటే. సినిమా నే చూడాలి. అనవసర ఆలోచనలు వస్తే మన మెదడు కి మనమే చెప్పుకోవాలి నేను సినిమా ఆస్వాదించాలి విసిగించకు అని. పనులు అన్నీ ఒక Time Table ప్రకారం చేస్కోవాలి. Relax అయ్యే టైం లో హాయిగా త్యాగరాజ కృతులు, అన్నమయ్య కీర్తనలు వింటే అదో రకమైన మత్తు(మందు లాంటీ అలవాటూ చేస్కోలేము కదా మనం) ని కలిగించి fresh అవుతాం. [:)]

  అరుణ గోసుకొండ.

 6. […] పూర్తిగా మరో కథ. (సౌమ్య టపా “నాలుగు చెవుల ధోరణి” గుర్తొస్తే మరోలా అనుకోకండి. నేను […]

 7. భలే! నిడదవోలు మాలతిగారి కబుర్లు చదువుతూ ఇటొచ్చాను. నాకీ నాలుగు చెవుల ధోరణి అన్న పదప్రయోగం నచ్చింది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: