ఉత్తర పురాణం

ఇదేదో పురాణమనుకునేరు… ఏమో, అలాంటి ఓ పురాణముందేమో, అది మరి నాకు తెలీదు కానీ, నేను చెప్పబోయేది మాత్రం ఉత్తరాల గురించి. ఓ పురాణమంత పెద్ద టపా అయ్యే అవకాశాలు లేకపోలేదు కనుక ఉత్తరపురాణమని నామకరణం చేసాను.

నిన్న రాత్రి ఇంట్లో ఏదో పత్రిక కనిపిస్తే కాసేపు తిరగేశాను. అందులో ఓ కథ ఉంది. రెండు ఉత్తరాలలో నడుస్తుంది కథ. మొదటి ఉత్తరం లో ఒకావిడ తన స్నేహితురాలి సెల్ ఫోనుకు డయల్ చేసీ చేసీ, అది స్విఛాఫ్ చేసి ఉండటం తో విసుగెత్తి చివరికి ఆమెకి ఇంటి అడ్రస్ కి ఉత్తరం రాస్తుంది. దానికి ఆ స్నేహితురాలు జవాబిస్తూ “చూసావా ఉత్తరం రాసావు… ఈ కాలం లో ఉత్తరానికి దిక్కులేకుండా అయిపోయింది. ఉత్తరం చదువుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది..” ఇలా రాస్తూ… ఉత్తరం రాయడంలోని ఫీల్ ను తలుచుకుంటూ ముగిస్తుంది. నిజానికి కథ రాసిన విధానం అదీ నాకు మరీ అంత ఆసక్తికరంగా అనిపించలేదు కానీ, విషయం మాత్రం చదివి 24 గంటలౌతున్నా కూడా నన్ను వదలట్లేదు.

వ్యక్తిగతంగా నేను కూడా ఫోన్ల కంటే ఆధునిక తరం ఉత్తరాలైన ఈ-మెయిళ్ళనే ఇష్టపడతాను చాలా సందర్భాల్లో. అయితే, అవతలి వారు సరిగా స్పందించకుంటే మా చెడ్డ చిరాకొచ్చేస్తుంది. దానికంటే ఫోనులే నయమని ఇక అప్పుడప్పుడూ పట్టు వదుల్తూ ఉంటాను. ఒకటి – ఎదుటపడి మాటలాడుకోవడం. ఇంకోటి – ఎదుటపడి చెప్పలేనివి ఎలాగో చెప్పుకోడం. రెండో దానికి ఫోనుకంటే నాకు మెయిలే సరి అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఛాట్ ని కూడా నేను మెయిళ్ళ కోవలోకే పంపుతాను – రాత (అదేలెండి..టైపింగ్) రెండింటికీ కావాలి కనుక. అఫ్కోర్సు, ఛాట్ల కంటే కూడా మెయిల్ ఓ లెవెల్ ఎత్తులోనే ఉంటుంది నాకు సంబంధించినంతవరకు.

ఈ మధ్య “I miss you” అని తెలుగు లో చెప్పాలంటే ఎలా చెప్పాలి అన్న చర్చ వచ్చింది ఓ స్నేహితురాలితో. అక్కడే ఓ అద్భుతమైన భావన గురించి తెలిసింది. అది – ” నేను-నువ్వు = నా కంటే తక్కువ” అని. ఇప్పుడు దాన్ని ఎందుకు చెబుతున్నా అంటే, ఎవరితోనన్నా ఆ విషయం చెప్పాలంటే, ఫోనులో అది చెబితే, “ఏమైంది నీకు?” తరహా ప్రశ్న లాంటి జవాబు రావడం ఖాయం గనుక. నిన్న రాత్రి Limca అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉండింది టీవీ లో. “క్షణాలె భారమై… ప్రాణాలె తోడుతుంటే…” అంటూ ఓ వాక్యం వచ్చింది ఆ పాటలో. ఆ పాటలో రొమాంటిక్ మూడ్ ఏ కావొచ్చు కానీ, నిజ జీవితంలో ఆ వాక్యం ఆ మూడ్ కే రావాలనిలేదు. అత్యంత బాధలో కూడా అలా అనిపించవచ్చు. అలాగని మనిషి ఎవరైనా అలాంటి వాక్యం నోటితో చెబితే మనకు నాటకీయంగా అనిపించదూ? అదే ఉత్తరం రాస్తూ అలా రాసారనుకోండి – we can feel the pain. Atleast, we can sympathize and understand, if not emphathize with them.

పాట పాడటం వేరు అనుకోండి … కానీ, రాతలో అలాంటి భావనలను చెప్పుకోగలగడం నిజానికి గొప్ప అనుభూతి. నాకు ఆ అనుభూతి ఫోనుల్లో మాట్లాడినప్పుడో, ఎదుటపడి మాట్లాడుకున్నప్పుడో కలగదని గట్టి నమ్మకం. మనమొక ఉత్తరం రాసి జవాబు కోసం చూసే ఎదురుచూపు ఉంటుంది చూసారూ… అది మాటలకందనిది. అనుభవిస్తే గానీ తెలియదు. జవాబు రావడం ఆలస్యమైతే అనుభవించే myriad emotions, జవాబు చూడగానే కళ్ళలో మెరిసే మెరుపు (ఉత్తరాన్ని, రాసిన మనిషిని బట్టి లెండి) – ఓహ్! ఏ ఫోన్ కాల్ ఇవ్వగలదు? కోరుకోగానే జవాబొచ్చేయగల ఏ ఛాటు బాక్స్ ఇవ్వగలదు?

ఇలా రాస్తూ ఊంటే నేను చాదస్తంగా, పాతకాలం మనిషిగా అనిపిస్తానేమో – బహుశా నేను పాతకాలం మనిషినేనేమో…నాది చాదస్తమేనేమో…. ఐనా సరే, అంత అందమైన అనుభవం కోసం నేనిలాగే ఉంటాను. ఆనందమైనా, బాధైనా, నవ్వైనా-ఏడుపైనా, వలపైనా-వగపైనా ఉత్తరాల తీరే వేరు 🙂 మీరేమంటారు?
(అసలుకైతే నేనేదో రాద్దామనుకుని అప్పుడెప్పుడో రాసి ఆపేసిన టపా ఇది. ఇలా ముగిస్తున్నాను ఈరోజు. ఆరోజు ఏ మూడ్ లో రాసానో మరి…)

Advertisements
Published in: on January 8, 2009 at 11:38 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/01/08/uttara-puranam/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. >>ఎవరితోనన్నా ఆ విషయం చెప్పాలంటే, ఫోనులో అది చెబితే, “ఏమైంది నీకు?” తరహా ప్రశ్న లాంటి జవాబు రావడం ఖాయం గనుక

  >>జవాబు రావడం ఆలస్యమైతే అనుభవించే myriad emotions, జవాబు చూడగానే కళ్ళలో మెరిసే మెరుపు (ఉత్తరాన్ని, రాసిన మనిషిని బట్టి లెండి) – ఓహ్! ఏ ఫోన్ కాల్ ఇవ్వగలదు

  యా.. కరెక్ట్ గా ఇందుకే, ఉత్తరాన్ని ఇష్టపడతాను నేను ఫోన్ కంటే.. ఫోన్ లో మాఠ్లాడేటప్పుడు చెప్పలేని వాటన్నింటినీ, మెయిల్(ఉత్తరం)లో చాలా చక్కగా చెప్పచ్చు..

 2. Hey Sowmya, sunnitamina topic ne teesukoni chala chakkaga explain chesaru, i just love the way u explained different situations. Good work!! Keep it up 🙂

 3. బాగా చెప్పారు..!
  ఏమైనా.. సన్నిహితుల దగ్గర నుంచి ఉత్తరాలందుకోవడంలో ఉన్న ఆనందమే వేరు 🙂

 4. “పాతకాలం మనిషిగా అనిపిస్తానేమో”…..అస్సలు అనిపించరు.ఎక్కడో చదివాను ఉత్తరాలు రెండు మనసుల మధ్య పూలవంతెనలట.

 5. Hi

  I am a silent reader of your Blog.

  I also read the telugu story and felt similar way like you.

  Good Blog. Keep it up

  Soumya K.

 6. “I miss you”
  దీనికి దరిదాపుల్లో వచ్చేది “నాకు నీ మీద బెంగగా ఉంది.”

 7. ౧ వ్రాతలలో ఐతే మనం ఆవలిమనిషిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మాటలలో ఆ సౌకర్యం లేదు… మనం రికార్డు చెయ్యం కాబట్టి.
  ౨ మీరు చెప్పినట్టు నిజమే, కొన్ని విషయాలు మాటాడడం కష్టం కానీ వాటిని వ్రాయడం తేలిక. అందుకే ఈ ఉత్తరాలు రూపం మారి ఈ-ఉత్తరాలు అయ్యాయి తప్పితే అవి ఆగిపోకుండా నడుస్తూనే ఉన్నాయి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: