ఎక్కడ్నుంచి ఎక్కడికి…

నిన్న ఓ స్నేహితురాలికి వీడ్కోలు ఇచ్చి పంపేశాక వద్దనుకున్నా ఆలోచనలెన్నో నన్ను చుట్టుముట్టాయి. “వీడుకోలే దేనికైనా..” అని మొదలై, “ఎవరూ నీ వారు కారు..” మార్కు వేదాంతానికి వచ్చి, చివరికి “ముసుగు వేయొద్దు మనసుమీద” అనుకుని వచ్చే ఉద్వేగాన్ని యధేచ్ఛగా తిరగనిచ్చాను. కట్ చేస్తే, ఇరవై నాలుగు గంటలు గడిచాక కూడా “Ah! parting!” భావన తాలూకా ఆలోచనా స్రవంతి నన్ను వదల్లేదని ఒకట్రెండు చిన్ని చిన్ని సింగిల్ ఫ్రేం ఘటనల తరువాత అర్థమైంది. ఆలోచిస్తూ ఉంటే “స్నేహానికన్న మిన్న లోకాన లేదురా” మార్కు ఉద్వేగాలను ఒక పక్కన పెడితే, అసలు స్నేహమంటే ఏమిటి? ఎలా పుడుతుంది? ఏ స్నేహం స్థిరమైన బంధమౌతుంది? ఏది నిలవదు? నిలవడం నిలవకపోవడం దేనిపై ఆధారపడి ఉంటుంది? – ఇలాంటివే ఎన్నెన్నో ప్రశ్నలు వచ్చాయి. అప్పటి నా ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చే ప్రయత్నం ఈ టపా.

– అని దాదాపు నెలక్రితం మొదలై బుట్టదాఖలైన టపా ఇది. డస్ట్ బిన్ అయితే శుభ్రం చేయకూడదా? అని “మెంటల్ కృష్ణ” మార్కు తెలివి తేటలతో ఆలోచించి మళ్ళీ దీనికి ఊపిరూదాలని నిశ్చయించాను. హుమ్… ఇప్పుడాలోచనలు అరక్షణానికో దారిలోకి తిరుగుతున్నాయి. స్నేహాలు ఎవరితోనన్నా కావొచ్చు, దేనితోనన్నా కావొచ్చు. స్నేహితుడనో, స్నేహితురాలనో ప్రత్యేకంగా ఎవరూ పుట్టరు-ఎవరైనా స్నేహపాత్రులు కావొచ్చు. ఓ పుస్తకమో, ఓ వస్తువో మనతో స్నేహాన్ని పంచుకోవచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుకనే ’స్నేహానికన్న మిన్న..’ అన్నది. కానీ, వెంటనే – ఎలాగో చివరికి విడిపోవడమే కదా, ఎందుకిక ఈ నెయ్యాలూ, వియ్యాలూ వగైరా బంధాలూ? అనిపిస్తుందొక్కోసారి. అలా అలా దొరికిన ప్రతి దారి వెంబడి ఆలోచనలని తీసుకు వెళుతూ వెళుతూ “పుట్టుకేమిటి? చావేమిటి? మధ్యలో ఈ జీవితమేమిటి?” అన్న ప్రశ్నల ద్వారా మానసిక వ్యభిచారానికి గురవబోతూ తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా సుమారుగా గాయపడి, కాస్త కాస్తగా కోలుకుంటూ ఉండగా మళ్ళీ స్నేహమన్న పదం ప్రత్యక్షం!

నాలో నేను, నాతో నేను సంఘర్షించుకుంటూ, దెబ్బల్ని చూసుకోడానికి అద్దం వైపు తిరిగాను. అద్దంలో తెల్ల వస్త్రాల్లో నా అంతరాత్మ కనిపించి – “జిందగీ ఎక్ సఫర్ హై సుహానా..” అని పాడటం మొదలుపెట్టింది. ఇదేదో భలే ఉందే అనుకుంటూ నేను కాస్త దగ్గరగా జరిగి అద్దాన్ని చూస్తూ ఉంటే ఇంతలో బైకుపై మరో ఆకారం (ఎవరిదో మరి?) కిశోర్ కుమార్ శబ్దాలు చేస్తూ “యహ కల్ క్యా హో కిస్నే జానా..” అని అరుస్తూ హారన్ మ్రోగించింది. అది వినగానే మన ఆకారం “హహహహ” అని ఒక మాదిరి నవ్వు నవ్వేసి నాకు టాటా చెప్తూ ఆ బైకు వెనక సీటులో కూర్చునేసింది. నా కళ్ళ ముందే ఇద్దరూ ముందుకెళ్ళిపోయారు(యి). (ఆకారాలు కదా, అందుకని వెళ్ళిపోయయి అనాలేమో అన్న సందేహం వచ్చింది లెండి!). సంభ్రమంగా నేను వెనక్కి తిరిగి చూస్తే ఏముందీ? కొత్తగా సున్నమేసిన నా గది గోడ! జీవితం కూడా రోజూ ఓ తెల్లకాగితమేమో!

(అదంతే లెండి, ఒక్కోసారి అదంతే. అదేమిటో మరి. ఎందుకలాగో మరి. మరి… అది…అదండీ మరి… ఏమిటోనండి….ఒక్కోసారి నాకు ఎందుకలా రాయాలనిపిస్తుందో అర్థంకాదు.. ఏమిటోమరి! నేనేమిటో! నా రాతేమిటో!)

Advertisements
Published in: on January 5, 2009 at 9:32 am  Comments (11)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/01/05/rambling1/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. 🙂
  One of the good posts from you

 2. మీరన్నా నయం.నేనొక్కప్పుడైతే సెలవలకని వెళ్లిన ఊళ్లో ఓ రాయిని వదిలి రాలేక అది నేను లేకుంటే ఏమైపోతుందో అన్నంతగా గిజగిజలాడిపోయాను. ఇప్పుడు కొంచెం రాటుదేలిపోయినా, ఒక్కోసారి ఆ’Parting’ దు:ఖాన్ని వర్ణించలేం…అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ బాధేమిటో!
  ఎప్పటిలానే ఇదీ బావుంది:-)

 3. ఏమిటోనండి మీరు ఇంత బాగా రాసేస్తుంటారండి మరి.

  అత్యుత్తమ టపా.

 4. eay sowmya

  neeko chinna mata

  naa peru “dooram”, naa mithrudi peru “daggara”.

  dooraninki daggarantey istham . daggariki dooram antey istam.

  “daggara” kosam “dooram” daggaravvalunkuntey , dooram daggiraga dooranikini dooranga vellalanukundi
  kani daggiraku dooram dooramnga poina marukshnam . daggira dooraniki daggairaga cherukovalanukunaa dooranganey undipoindi ..

  dooraniki daggiranety istham

 5. కొత్తగా సున్నమేసిన నా గది గోడ! ,,,,(సరదాకి) గోడకి కలర్ సున్నం వేయించండి.
  చాలా బాగుంది… ఏదో ఏదో రాసేసానని అన్నారు … ఏది రాసినా అందంగా రాయడం అందరికి చేతనవుతుందా?? చలం గారి ముజింగ్స్ కూడా ఇంతే కదా??

 6. సౌమ్యా చెపితే నమ్మరేమో నిన్న రాత్రంతా నాకివే ఆలోచనలు.పదిరోజుల సెలవుల్లో ఇల్లంతా హడావుడి.నిన్న అందరూ వెళ్ళిపోయాకా ఇంట్లోనూ,నాలోను ఏదో శూన్యత.సరిగ్గా మీరు చెప్పినట్టే అనిపించింది.విడిపోయేదానికి మధ్యలో ఎందుకింత ఆరాటం అని.ఈ ఆలోచనలు ఎక్కడికి దాకా వెళ్ళాయంటే… సృష్టి మొదలు దాకా.ప్రతీదాన్నీ శోధించి,సాధించి ఏమి ఒరగబెట్టుకున్నాము కొత్త సమస్యలు తప్ప.ఏమి అలా ఆదిమానవుల్లా బ్రతకడం లో తప్పేముంది.కరెంటు సృష్టించుకుని అది లేకుండా జీవించే స్తాయికి వచ్చి అది లేకపోతే ఏమి చెయ్యాలా అనే ఇంకో ఆలోచన చేసి…..ఇలా చివరికి ఏమి సాధిస్తాము?ఏమిటేమిటో అస్సలు పొంత కుదరని,పొందిక లేని ఆలోచనలు.చివరికి నిద్ర పోయే సమయానికి నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను.ఎలాగూ చచ్చిపోతాము కదా అని పుట్టడమో లేక బ్రతకడమో మానేయట్లేదు కదా అని :)నా బ్లాగులో ఇలాంటివి రాసుకోను కాబట్టి కరక్టు టైములో ఆలోచనలు పంచుకోడానికి నాకో బేస్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్.

 7. Hi Sowmya

  Very nice post.

 8. @kumar, ismail,trinath, krishna rao garu: Thanks.
  @radhika garu: “ఆరాటం అని.ఈ ఆలోచనలు ఎక్కడికి దాకా వెళ్ళాయంటే… సృష్టి మొదలు దాకా.ప్రతీదాన్నీ శోధించి,సాధించి ఏమి ఒరగబెట్టుకున్నాము కొత్త సమస్యలు తప్ప.ఏమి అలా ఆదిమానవుల్లా బ్రతకడం లో తప్పేముంది.”
  – నాకు కూడా ఇలా తరుచుగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ రిసర్చి అదీ ఇదీ అని కలలు. నాకు నేనే ఓ పారడాక్స్ లా అనిపిస్తాను ఆ క్షణాల్లో.
  @swamy: That was an interesting idea!

 9. “మానసిక వ్యభిచారం”.. ఈ పదం ఆలోచించే వాడారా?!

 10. హాయ్ సౌమ్య,
  మీ “ఎక్కడినుంచి ఎక్కడికి” బావుంది. కానీ “మానసిక వ్యభిచారం” అన్న పదం ఏ అర్ధం లొ వాడారో తెలియచేయగలరు. తరువాత అవే ఆలోచలను రాధిక గారితో సమర్ధించారు ( రాధిక గారికి మీ కామెంట్ లో )

  మీ నుంచి మరిన్ని మంచి టపాలను ఆశిస్తూ…

  .. వర్మ

 11. @Saraswathi kumar & Varma:

  ‘మానసిక వ్యభిచారం’ అన్న పదం నేను వాడిన అర్థం ఆలోచనలతో వ్యభిచారం అని. వచ్చే ఆలోచనలని వాటికి నేనిచ్చే విలువను బట్టి స్వీకరించడం-తృణీకరించడం…దీన్ని వర్ణించడానికి అది సరైన పదమే అనిపించింది.
  వర్మ గారికి: రాధిక గారి వ్యాఖ్యకు నా జవాబులో నేను చెప్పదలుచుకున్నది ఒక విధంగా చూస్తే ఈ పదానికి అతకొచ్చు – వ్యతిరేకమైనవన్నా కూడా రెండు రకాల ఆలోచనల్నీ నా మనసు స్వీకరించింది కనుక.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: