పుస్తకం.నెట్ ?

సరే, ఎలాగో మొదలుపెట్టాను కదా, స్వామి కార్యం-స్వకార్యం రెండూ ఐనట్లు ఉంటుంది, చరిత్ర మొదలెడతాను.

2006 లో ఈ బ్లాగు మొదలుపెట్టినప్పుడు నాది పచ్చి స్వార్థం. ఈ పుస్తకాలు చదువుతున్నామా… కొన్నేళ్ళ తరువాత వాటి గురించి గుర్తు లేకుంటే ఎలా? అనుకున్నప్పుడు ఇలా బ్లాగులో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు చదూకోవచ్చు కదా అనుకుని మొదలుపెట్టాను. కాస్త పరికించి చూస్తే ఈ బ్లాగులో దాదాపుగా మొదటి ఆర్నెల్లు పుస్తక సమీక్షలు తప్ప కనబడవు. తరువాత్తరువాత అదీ ఇదీ, ఆఖరుకి నాకేది తోస్తే అదీ అన్ని రకాల టపాలు రాస్తూ వెళ్ళాననుకోండి, సో, పుస్తక పరిచయాల కోసం మొదలుపెట్టిన బ్లాగు మరేదో అయింది.

వర్తమానం@2008: ఆ మధ్య పూర్ణిమ బ్లాగులో పుస్తకాల కోసం నవతరంగం వంటి సైటు ఉంటే బాగుండు కదా అన్న కోరిక వ్యక్తం చేసింది. అప్పుడు మళ్ళీ నాలో పాత ఆశలు చిగురించాయి. సై అంటే సై అనుకుని, బస్తీ మే సవాల్ చేసేస్కున్నాం ఇద్దరం. అలా అలా తోటి బ్లాగర్లనీ మిత్రులనీ ఈ విషయం గురించి అడుగుతూ, ఆసక్తి ఉన్నవారిని కలిపేసుకుంటూ, ఆసక్తి ఉండీ కలవని వారిని బెదిరిస్తూ (ఒక్కోసారి ఆ బెదిరింపులు ఫలించాయి కూడా).. అలా అలా చివరికి సైటుకి ఓ రూపం ఇచ్చుకునే ప్రయత్నం లో ఉన్నాము.

ఈ సైటు ఎందుకు? అంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే – పుస్తకాల కోసం, పుస్తక ప్రియుల కోసం, తెలుగు వారికోసం. ఈ సైటులో మీరు ఏ భాష పుస్తకం గురించైనా రాయవచ్చు. కాకుంటే, మీ వ్యాసం తెలుగులో రాస్తే బాగుంటుంది…ఆంగ్లమైనా పర్వాలేదు. పూర్ణిమ బ్లాగులోనూ, పుస్తకం.నెట్ సైటు “మా గురించి” పేజీ లోనూ కావాల్సినంత రాసేసారు. మీకేమన్నా సందేహాలుంటే, పుస్తకం.నెట్ చూడండి, అక్కడే మీ సందేహాలను తెలుపండి.

తెరవెనుక ఈ సైటు ఆరోగ్యాన్ని సంరక్షించేది “పొద్దు”. తెరపై దీన్ని నడిపించేవారు మీరందరూనూ. బహుశా కొన్నాళ్ళు పడుతుందేమో సైటు కుదురుకునే సరికి. ఈ సైటు మనందరికోసం, మనందరం ఏర్పరుచుకున్నది. Lets all make it a success. 🙂 మీ సలహాలు, సూచనలు editor@pustakam.net కి పంపగలరు.

Published in: on January 1, 2009 at 8:25 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/01/01/pustakamnet/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. మంచి ఐడియా అండి.నవతరంగం సినిమా రివ్యువ్స్ కి కొత్త ఊపిరి నింపితే మీ పుస్తకం .నెట్ పుస్తక ప్రియులను ఒకచోట చేర్చి చేర్చవేదిక లాగ పనిచేయాలని ఆశిస్తూ …
  పుస్తకం.నెట్ కి ఈ టపా లో లంకె(hyperlink) ఇచ్చి ఉంటే బాగుండేది
  మిత్రులకోసం ఇక్కడ లింక్ ఇస్తున్నాను చూడండి

  http://pustakam.net/

  A book is the only place in which you can examine a fragile thought without breaking it, or explore an explosive idea without fear it will go off in your face. It is one of the few havens remaining where a man’s mind can get both provocation and privacy. ~Edward P. Morgan

 2. మంచి ప్రయత్నం సౌమ్య గారు… మీ అందరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 3. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.

 4. సౌమ్య గారు, అభినందనలు. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్స్ఫూర్తిగా కోరుతున్నాను.

 5. మంచి ప్రయత్నం.

 6. సౌమ్య గారూ..
  చాలా మంచి ప్రయత్నం. మీకు అభినందనలు. మీ ఈ ప్రయత్నం పుస్తక ప్రేమికులకు చక్కటి నెలవు కావాలని కోరుకుంటున్నాను.

 7. సౌమ్య గారూ!
  మంచి ప్రయత్నం. పుస్తకాలు చదవడం ఒక అభిరుచి అయితే, వాటిని ఇతరులతో పంచుకోవాలనుకోవడం మరో మంచి అభిరుచి. మీలో ఆ రెండూ ఉన్నాయి. నియమాలు కూడా చాలా సరళంగా ఉండటం వల్ల చర్చకు ఎక్కువగా అవకాశం ఉంటుందనుకుంటున్నాను.
  మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకొంటూ…
  మీ
  దార్ల
  http://vrdarla.blogspot.com

 8. మంచి ప్రయత్నం. వెరీ గుడ్.

 9. […] ను పరిచయం చేస్తూ ఓ టపా రాసాను ఇక్కడే. ఇప్పుడు, అప్పుడే సంవత్సరం నిండింది […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: