ఇదీ అసలు కథ! – TV program

ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో ఛానెల్ స్విచింగ్ ఎక్సర్సైజ్ లో భాగంగా “వనిత” ఛానెల్ ని చేరాను. బ్లాక్ అండ్ వైట్ పాట వస్తూ ఉండటంతో ఆగాను. తీరా చూస్తే అది బెంగాలీ పాట! ఏదోలే, ఆకాలం బెంగాలి సినిమాలు మనం ఎప్పుడన్నా చూస్తామా ఏమిటీ? అన్న ఉద్దేశ్యంతో ఛానెల్ మార్చలేదు. పాట ఎక్కడో విన్నానే అనుకున్నా. ఒక లైను ముగుస్తూ ఉండగా అర్థమైంది – “నా హృదయంలో నిదురించే చెలీ” పాట అని. ఈ పాట వినని వారుంటే, వారి కోసం, ఇది ఆరాధన (1963) తెలుగు సినిమా లోనిది. ఓహ్! ఈ పాట కూడా మన సొంత ట్యూన్ కాదా! అన్న నిరాశ కలిగింది. మన నుండే వాళ్ళు కాపీ కొట్టి ఉండొచ్చు కదా, అన్న ఆలోచనన్నా నాకు రాకపోవడం నా దురదృష్టం. ఇదివరలో ఇలానే ఓసారి ఓ డిస్కషన్ బోర్డులో “మనసున మనసై” (డాక్టర్ చక్రవర్తి సినిమా పాట) బెంగాలీ మూలం వీడియో చూసి ఉండటం కూడా దీనికి దోహదం చేసి ఉండొచ్చు.

విషయానికొస్తే, ఆరాధన సినిమా సాగరిక అన్న బెంగాలీ సినిమాకి తెలుగు రీమేక్ అని అప్పుడే తెలిసింది నాకు. ఆ ప్రోగ్రాం పేరు – “ఇదీ అసలు కథ”. ఇలాంటి సినిమాలని కేస్ స్టడీలు గా తీసుకుని రెండు భాషల్లోనూ ఈ సినిమాను ఎలా తీసారు? అని విశ్లేషించే కార్యక్రమం. ప్రోగ్రాం చాలా బాగా నచ్చింది నాకు. రెండు సినిమాలనీ పోలుస్తూ చేసిన వ్యాఖ్యానం చాలా బాగుంది. తెలుగు వర్షన్ తెలుగు నేటివిటీకి, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికీ సరిపడేలాగ ఎలా మార్చారో, “గుడ్డివాడైన హీరో ని తెలుగు వారు ఆదరించరు” వంటి విమర్శల మధ్య ఈ సినిమా ఎలా పూర్తి చేసారో, ఇలాంటి విషయాలు చాలా ఆసక్తికరంగా చెప్పారు. చెప్పడమే కాక, రెండు భాషల దృశ్యాలూ వేసి చూపారు. బెంగాలీ కి కింద సబ్ టైటిల్స్ ఉంటే బాగుండేది కానీ, ఎటొచ్చీ మనకు దృశ్యం తెలుసు కనుక సారాంశం అర్థమైంది. ప్రతి పదార్థం తెలీకపోయినా.

అలా ఆ ప్రోగ్రాం లో తెలుసుకున్న విషయాల్లో నాకు బాగా గుర్తు ఉండిపోయిన విషయం: నిజానికి “నా హృదయంలో…” పాట బెంగాలీ మూలంలో టాగోర్ రాసిన “సాగరిక” అన్న కవిత అట. సినిమాలో హీరోయిన్ సాగరిక కనుక, ఆ పాట అక్కడ పెట్టారట. మన హీరోయిన్ పేరు అనురాధ. ఆ పేరుగల తెలుగు కవిత ఏదీ లేదు కదా! అందుకని, అదే ట్యూన్ కి శ్రీశ్రీ గారు ఈ పాట రాసారట. (ట్యూన్ మార్చుకుని కూడా ఉండొచ్చు అనుకోండి, అది వేరే విషయం). ఇలాగే చాలా విషయాలు చెప్పారు. రమణారెడ్డి పాత్ర, గిరిజ పాత్ర బెంగాలీలో ఎలా ఉన్నాయి, తెలుగు లో ఎలా మార్చారు, ఎందుకు మార్చారు వంటి విషయాలు సవివరంగా చెప్పారు. ఇవన్నీ వింటూ ఉంటే, ఒక భాష సినిమాని ఇంకో భాషలో తీయాలంటే ఎంత హోంవర్క్ ఉంటుందో కొంత అవగాహన కలిగింది. ప్రతి దృశ్యాన్ని తీయడానికీ ఎంత ఆలోచిస్తారో తెలిసింది. రీ-మేక్ అంటే చాలా తేలిక, డైరెక్టర్ కి పెద్ద పనేమీ ఉండదు అనిపించేది ఇదివరలో నాకు. ఈ ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ కే నాకు ఆ అభిప్రాయం లోని పొరపాటు తెలిసొచ్చింది.

ఇంతకీ, నేను ఏం చెప్పదలుచుకుని ఇదంతా రాసానంటే, ఈ ప్రోగ్రామేదో బాగుంది, మీరూ చూడండి అని. 8-9, ఆదివారాలు, వనితా టీవీలో. దీని తరువాతి ప్రోగ్రాం “మన్ చాహే గీత్” అట. ఒక సంగీత దర్శకుడినో, గాయనీ గాయకులనో తీసుకుని వారి పాటల గురించి వ్యాఖ్యానిస్తూ కొన్ని పాటలు వేసే కార్యక్రమం. ఈ ప్రోగ్రాములు చేసే వాళ్ళ దగ్గర బోలెడంత చరిత్ర ఉన్నట్లు ఉంది. వాటిని డాక్యుమెంట్ చేయడం ఎలా? అన్న విషయం కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. వాళ్ళు చేస్తూ ఉంటే, దాన్ని సామాన్య ప్రజానికం చూడొచ్చా? అన్నది నా అనుమానం.

Advertisements
Published in: on December 8, 2008 at 2:22 pm  Comments (19)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/12/08/idi-asalu-katha-tv-program/trackback/

RSS feed for comments on this post.

19 CommentsLeave a comment

 1. వనిత ఛానల్ హెడ్ అడివి శ్రీనివాస్ కు సినిమా పరిజ్ఞానం బాగానే ఉంది. మొత్తానికి ఈ కార్యక్రమం బాగుందన్నమాట! మంచిది.

 2. Good One !!..

 3. soumya, there are some more great programmes on vanitha tv.. raagamayi. aamani ..

 4. హమ్మ, ఈ మాత్రం బుర్ర ఉన్న కార్యక్రమాలు వస్తున్నాయంటే పరవాలేదన్న మాటే.
  తమాషాగా, నిన్ననే ఏదో జాజ్ పియానో సంగీతం వింటూంటే ఈ పాట (నా హృదయంలో )స్ఫురించింది. ఇప్పటికే ఉన్న ఏదో ట్యూనుకి అచ్చమైన కాపీ అని చెప్పలేను కానీ ఇది మాత్రం జాజ్ సంగీత ప్రేరణతో పుట్టిన బాణీ కచ్చితంగా. జాజ్ లో అతి మెల్లగా సాగే పాటల పద్ధతి ఒకటి ఉంది .. వీటిని బాలడ్స్ అంటారు. ఇవ్ సాధారణంగా ప్రేమ గీతాలు, విరహ గీతాలు అయి ఉంటాయి. This song has all the qualities of a ballad.

 5. Start quote:
  ఈ ప్రోగ్రాములు చేసే వాళ్ళ దగ్గర బోలెడంత చరిత్ర ఉన్నట్లు ఉంది. వాటిని డాక్యుమెంట్ చేయడం ఎలా? అన్న విషయం కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. వాళ్ళు చేస్తూ ఉంటే, దాన్ని సామాన్య ప్రజానికం చూడొచ్చా? అన్నది నా అనుమానం.
  End Quote.

  Could you please explain your last 4 sentences! I didn’t get you. At the risk of blowing my own trumpet, I have written extensively (and one major essay forthcoming)on this topic and have compiled a 4hr lec-dem programme talking about the influence of tunes from other languages on Telugu music and vice-versa. Also, in the past, such programmes were broadcast on TV and AIR.

  Regards,
  Sreenivas

 6. hmm interesting program. thanks for introducing.

 7. Madam,

  Your analysis is good and reflects my style.
  Please bless me after reading my blog
  http://www.elitesrinivas.blogspot.com.
  Thanking you,
  srinivas

 8. కొన్నాళ్ళ క్రితం మా టీవీలో కూడా ఇలాంటి ప్రోగ్రాం వచ్చింది.ఆణిముత్యాలు అనేదో వుండేది.ఆప్రొగ్రాం లో మనవాళ్ళు ఇన్స్పైర్ అయిన హిందీ పాటలు,సీన్ల ని చూపిస్తూ చేసే వ్యాఖ్యానం చాలా బాగుండేది.కొన్ని పాత తెలుగుపాటలు ఇంగ్లీషు నుండి స్పూర్తిపొందారని తెలిసి చాలా ఆశ్చర్యపోయా.చంద్రముఖి సినిమాని మూడు భాషల్లోనూ చూపిస్తూ పోలుస్తుంటే అలాంటి ప్రోగ్రాంస్ ఆశక్తిలేని మావారు కూడా కళ్ళొదిలేసి చూసారు.ఆ తరువాత నుండి ఎప్పుడూ మిస్ అవ్వకుండా చూసవాళ్ళం.శోభన,సౌందర్య కన్నా మన జ్యోతికే బాగా చేసింది :).

 9. @Paruchuri garu:
  నాకు తెలీదండీ అలాంటి మిగితా ప్రోగ్రాముల గురించి. అందుకని అలా రాసాను – వీళ్ళ దగ్గర చాలా సమాచారం ఉంది అని. అంతకంటే కారణమేమీ లేదు. తక్కిన కార్యక్రమాల గురించి తెలిస్తే కదా వాటి గురించి వివరాలు తెలిసేది! మరి…మీరే చెప్పండి ఇతర కార్యక్రమాలు ఏవేవో…. ఈసారి చూస్తాను. ఇంతకీ మీరు ఇవన్నీ ఎందులో రాస్తున్నారు? మాకు చదివే అవకాశం ఉందా?

 10. ముఖ్యంగా చెప్పుకోవలసింది వి.ఎ.కె. రంగారావుగారు సమర్పించిన రేడియో కార్యక్రమాలు. 1995 ప్రాంతంలో హైదరాబాదు స్టేషన్‌లో ఇచ్చిన గంట కార్యక్రమం, మరల 2003 ప్రాంతంలో వరసగా నాలుగు వారాల పాటు (4 గంటలు) “అవును నిజం” అనే శీర్షికతో అనుకరణలు/అనుసరణలు మీద. (ఇవన్నీ తెలిసినవాళ్ళు రికార్డు చేసి టేపులు పంపారు.)

  మాTV అన్న ఛానల్లో రాజా అన్నాయన (గతంలో వార్త, హాసం పత్రికల్లో “ఆపాత(ట)మధురం” అన్న శీర్షిక నడిపిన వ్యక్తి.) ఇదే అంశంపై కార్యక్రమాలు చేశారని తెలుసు. ఒక ప్రోగ్రాములో నేను పంపిన Carmen Miranda పాటలు, వాటి తెలుగు/తమిళ అనుకరణలు (భానుమతి “మంగళ” సినిమాలో (1951), జిక్కి “మంగళసూత్రం” (1946) అన్న సినిమాలో…) వినిపించారు. (నేను పంపింది మిరాండా పాటల వరకే. తెలుగు, తమిళం పాటలు మార్కెట్లో తేలిగ్గానే దొరుకుతాయి.)

  — శ్రీనివాస్

  P.S. నా రాతలు rec.music.indian.misc, soc.culture.indian.telugu (now defunct) అనే Usenet groups లోనూ, ghanTasala, oldtelugusongs, racchabanDa అనే mailing గ్రూపుల్లోను వుంటాయి.

 11. సౌమ్యగారు, చాలా వివరంగా వ్రాసారు. అంత గొప్ప పాట, కాపీ అనేసరికి ఎంత నిరాశ కలిగిందో చూసారా. ఇంకొక విధంగా ఆలోచిస్తే, అలా అని తెలిసినా ఆ పాట మాధుర్యం తగ్గిందంటారా?

 12. Hi soumya garu….mee blogs chala baguntayi…entha ante…vaatini choosi nenu inspire ayyi blogs rayatam start chesanu….eppudu ee doubt vachina mee blogs oosari malli tiragesta…anthe. so thanks for all.

 13. meeru naa blogs choosi emaina suggestions cheppandi. naa blog peru nenu saitam and my mail is pagidi_swaroop_1210@yahoo.com. pls….

 14. naa blog address swarooppagidi@blogger.com

 15. Madam,

  Your analysis is good and reflects my style.
  Please bless me after reading my blog
  http://www.rangulalokam.com.
  Thanking you,
  srinivas

 16. మేడం,
  మీ అనాలిసిస్ చాలా వరకూ నా శైలిని పోలివుంది.
  మీ బ్లాగు లాగా సక్సెస్ కావాలని ఆశీర్వదించండి.
  http://www.rangulalokam.com.

  srinivas

 17. చాలా బాగా రాసారు

 18. T.V.lo chetta serials chusi proddunna lechi yevari tea lo visham kalipeddama, leka yevari naina metla meedanumdi toseddama lamti aalochanalato burra vedekkutomdi. Ilamti manchi programes timings kaasta cheppi punyam kattukomdi.

 19. manchi programsni prashamsisthunnanduku thanks


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: