కొత్త భాష నేర్చుకోడం

గతవారంలో ఓ రోజు నేను అనుకోకుండా నాకు తెలిసిన ఒకరికి ఆంగ్లభాష నేర్పే ప్రయత్నంలో ఓ రెండు గంటలు పాలుపంచుకున్నాను. ఆ తరువాత ఇప్పటికీ కూడా నన్ను దాని తాలూకా ఆలోచనలు వదలడం లేదు. ఒకానొక మనిషి కొత్త భాషను, పెద్ద వయసొచ్చాక ఎలా నేర్చుకుంటాడు? అన్నది. నేను పైన చెప్పిన ఉదాహరణలో మనిషి ఆంగ్లభాషకి పూర్తిగా కొత్త, ఇరవైలలోని మనిషి అని మనవి చేసుకుంటున్నాను. ఈ విషయంలో నాకు కలిగిన ఆలోచనలను, అనుమానాలను మీముందుంచడమే  ఈ టపా ఉద్దేశ్యం. అంతే కాదు, మీ అభిప్రాయాలు తెలుసుకోడం కూడానూ.

మనవాళ్ళ ద్విభాషా సిద్ధాంతాన్ని కొంతమంది నానామాటలు అంటే అంటారు కానీ, నాకు ఈ అనుభవం తరువాత అదే నయమేమో అనిపిస్తోంది. తెలుగు-ఆంగ్లం రెండు భాషలతోనూ పరిచయం ఏర్పడుతుంది అప్పుడు చిన్నతనంలోనే. పెద్దయ్యాక ఆంగ్లం వంటి యూరోపియన్ భాషలు నేర్చుకోవడం చిన్నప్పుడు ఆంగ్లం తెలుసుకుని ఉంటే తేలికౌతుందేమో అనిపిస్తోంది. రెండు భాషల సిద్దాంతం వల్ల రెండూ రావని అనేవాళ్ళు ఉంటారు కానీ, నాకు ఆ వాదనపై నమ్మకం పెద్దగా లేదు. కేవలం క్లాసులో ఆ భాషా గంటలు విని వదిలేస్తే ఆ వాదన సబబే కానీ, ఆ భాషతో మనం ఆడుకునే కొద్దీ అది మనకు నేస్తమౌతుందని నా నమ్మకం. తరుచుగా చదవడం, రాయడం, మాట్లాడటం ద్వారా ఏ భాషనైనా వంటబట్టించుకోవచ్చు అని నా నమ్మకం. ఆ విధంగా నాకు ఏకకాలంలో తెలుగు-ఇంగ్లీషు వంటబట్టడం నేను అదృష్టంగానే భావిస్తున్నాను. బ్రతకడానికి కావలసినంత భాష రెండింటిలోనూ తెలుసనే అనుకుంటున్నాను. రెండు భాషల పాలసీ నాకు అయితే మేలే చేసింది. ఇప్పుడేదన్న కొత్త విదేశీభాష నేర్చుకోవాల్సి వచ్చినా, ఒకవేళ నాకు ఇంగ్లీషు రాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో అంతకంటే ఇప్పటి పరిస్థితి నయమనే అనుకుంటున్నాను.

మనం ఇంగ్లీషుని ఎలా నేర్చుకున్నాం? అన్న అనుమానం నన్ను తొలిచేస్తోంది. స్కూల్లో తెలుగు నేర్చుకుంటున్న సమయంలోనే ఇంగ్లీషు కూడా నేర్చుకున్నామా… తెలుగైనా ఇంట్లో మాట్లాడతాం కనుక వేగంగా వంటబట్టింది అనుకుందాం. ఇంగ్లీషుని మనకు ఏ పద్ధతుల ద్వారా నేర్పించారో నాకు గుర్తు రావడంలేదు. ఒక పూర్తి పరాయి భాషను నేర్చుకోడానికి బాల్యమే సరి అయిన వయసేమో అనిపిస్తోంది, మొన్నటి అనుభవం చూసాక. విశ్వనాథ గారు “వేయిపడగలు” నవలలో వయసొచ్చాక, ఒక భాష సవ్యంగా వచ్చాక ఏ భాషన్నా తేలిగ్గా వస్తుందని అన్నారు కానీ, ఇక్కడ ఉదాహరణ చూస్తూ ఉంటే అలా అనిపించట్లేదు నాకు. బహుశా, తెలుగు నేర్చుకున్నాక – హిందీయో, తమిళమో, బెంగాలీయో మరే ఇతర భారతీయ భాషో నేర్చుకోవడం సులభం కావొచ్చు. మన భాషల్లోని వ్యాకరణాలకీ, వాక్య నిర్మాణాలకీ ఉన్న పోలికల వల్ల. కానీ, ఆంగ్ల భాషను తీసుకుని చూస్తే, వాక్యాల నిర్మాణమే వేరుగా ఉంటుంది. పైగా, కొన్ని పదాలని రాసేదొకలాగా, పలికేదొకలాగా. తెలుగుకి ఆ సమస్య లేదు కదా. నాకు విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు గుర్తొస్తోంది. ఈ వారంలో దాన్ని ఎన్ని సార్లు తలుచుకున్నానో లెక్కలేదు.

Pages: 1 2

Published in: on November 25, 2008 at 3:13 pm  Comments (16)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/11/25/second-language-learning/trackback/

RSS feed for comments on this post.

16 CommentsLeave a comment

  1. భాష నేర్చుకునే మూలసిద్ధాంతం ఒకటే, వినడం-మాట్లాడటం-చదవటం-రాయటం. మాతృభాష ఇలాగే నేర్చుకుంటాం. కానీ ద్వితీయభాషగా ఆంగ్లం నేర్పేటప్పుడు చదవడం-రాయటంతో మొదలెట్టి ఆతరువాత వినడం ప్రాప్తిస్తే, మాట్లాడటం చాలా ఆలస్యంగా జరుగుతుంది.ఆంధ్రాలో చాలావరకూ ఇంగ్లీషుమీడియం స్కూళ్ళలో జరిగేదికూడా ఇదే తంతు. అందుకే మనకు ఆంగ్లభాష ఎంతపట్టుబడినా, కొంత తేడాగానే వంటబడుతుంది. కారణం సహజ ప్రక్రియలో భాషాగ్రహణ జరగదుకాబట్టి. కాకపోతే చిన్నప్పుడే ఇంట్లో ఆంగ్లభాషా వినికిడికలిగిన పిల్లలలో ఆంగ్లాజ్ఞానం కాస్త మెరుగ్గావుంటుంది.

  2. ఆంగ్లాజ్ఞానం కాదండీ బాబు ఆంగ్లజ్ఞానం అనేదే మీ భావన.

  3. FYI – for discussion / info
    (not mine,Fwd from friends)
    ——————————————
    ఇంగ్లీషు మీడియమా? తెలుగు మీడియమా?
    >ఉప్పరి సన్యాసం , ఉభయ బ్రష్టత్వం అంటే ఇదేగాబోలు.>
    ——————————————

    #పాత కథే !

    ఇంగ్లీషు మీడియమా? తెలుగు మీడియమా?

    ³విశ్వ బాషలందు ఇంగ్లీషు లెస్స అని మెకాలే కల్లో కనిపించి చెప్పాడో ఏమో,
    గణమైన ఆంధ్రప్రదేస్^ ప్రభుత్వం వారు ప్రాథమిక స్థాయి నుండి ప్రభుత్వ
    పతసలల్లో ఇంగ్లీషు మీడియమా ప్రవేశ పెట్టబోతున్నారు . దిన్ని వ్యతిరేకించిన
    వారిని బడుగు వర్గాలనూ అణగదొక్కడానికి చేస్తున్న కుట్రదారులుగా వర్ణిస్తూ ,
    మెకాలే ను ముక్తిదతగా స్తుతిస్తున్నారు కొందరు :

    Read this here:

    http://www.andhrajyothy.com/archives/archive-2008-6-27/editshow.asp?qry=/2008/jun/23vividha2

    మాకు ఒక భాష కావాలి : Wilson Sudhakar
    Andhra Jyothi Article

    ఇలాంటి పిచ్చి రాతలను ప్రచారం చేయడం నా ఉద్దేశం కాదుగాని , ఏమాటకామాటే
    చెప్పుకోవాలి , తాటాకులు తేరగా దొరికాయిగదా అని ఎడాపెడా బరికేస్తే ఎంత నష్టం
    జరగబోతోమ్దోనని బయం మాత్రం పట్టుకుంది . అయినా అది ఇంగ్లీషులో ఎందుకు
    అఘోరిమ్చలేదో జుట్టూడేలా బుర్ర గోక్కున్న అర్ధమయ్యి చావలేదు . క్రితం వారం ఆ
    కవిత చదివినప్పటినుండి ఎంత తన్నుకున్నా చిక్కువీడడం లేదు . ఇవాళ ప్రొద్దున్నే
    కాపీ తాగుతుండగా ఎదురుగ వున్న #American Educator# పత్రిక అట్టమీద టైటిల్ #Teaching English Language Learners# చూసి ఇదేవితని తిరగేసాను .

    చదువుతుంటే గత వారం చదివిన కవిత మళ్ళీ గుర్తొచ్చింది . మొత్తం క్షుణ్ణంగా
    చదివేసనని సెప్పనుగని , చదివినంతలో విషయం బోధపదిమ్డనే అనుకుంటాను .
    ఈ వ్యాసం మీరు ఇక్కడ చదవొచ్చు: #

    Click to access goldenberg.pdf

    గాలివాదాలు, సోల్లువాగుల్లు కట్టిపెట్టి , తల్లిడంద్రుల్నించి ఇంగ్లీషుతో
    పెరగనివాళ్ళు పూర్తిగా ఇంగ్లీషు మీడియం విద్యబోధనలోకి దూకితే , అటు చదువు
    బుర్రకెక్కదు , ఇటు భాషా రాదు అని పరిశోధనల్లో తెలిసిందహోయ్ ^ అన్నాడు
    పరిసోధన్లన్ని చదివిన వ్యాసకర్త . ఇది అమెరికాకు వలస వచ్చినవారి
    పిల్లల గురించి జరిపిన పరిసోదనే ఐన , ఇండియాలో , ముఖ్యమ్గా
    ఆంధ్రప్రదేస్ ^ లో విద్యావిధానంలో మార్పులు తెస్తున్న వారిచేత , ఇంగ్లీషు
    మీదియమ్ను ప్రభుత్వం పోషించ కూడదన్నవారిని వర్గ శత్రువులుగా
    పరిగానిమ్చేవారిచేత చదివించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . నిత్యజీవనంలో
    ఇంగ్లీషు ఉపయోగించే సమాజంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే , అక్కడ ఇంగ్లీషుమిదియాన్ని రుద్దడం ఒక తరాన్ని అజ్ఞానంతో చావండని శాసించడం . >ఉప్పరి సన్యాసం , ఉభయ బ్రష్టత్వం అంటే ఇదేగాబోలు.>

  4. @RK: భాష యొక్క ముఖ్యోద్దేశం భావప్రకటన,జ్ఞానసమపార్జన ఆ తరువాత జీవనోపాధి.ఈ మూడింటిలోనూ తెలుగుకన్నా ఆంగ్లం ఎక్కువగా ఉపయోగపడినవేళ “సహజంగా” ఆభాషవైపు ఆకర్షితులౌతారు.ఈ మార్పులో నైతికవిలువలు (తెలుగు భాషగొప్పతనం,మాతృభాష ప్రేమ)వెదకడంకన్నా,ప్రాపంచిక అవసరాలను గుర్తించడం అవసరం. లేదా తెలుగుభాషను (అవసరాలకు అనుగుణంగా)ఆధునికీకరించడం మనకర్తవ్యం.

  5. సౌమ్యగారూ, కూడలిలో చూచాయగా చూడగానే నాకూ మొదట విష్ణుశర్మ ఇంగ్లీషు చదువే గురుతొచ్చింది. మీరన్నట్టుగా మన భాషలతో మొదలుపెడితే ఇరవైలలో లేదా ఆ తరువాతనైనా బహుశా ఆంగ్లభాష నేర్చుకోవడం కష్టమవ్వచ్చు. కాని ఆంగ్లం మాతృభాష ఐనవారికి (తతిమ్మా ఐరోపా భాషలు నేర్చుకోవటం సులభమా కాదా అన్న సంగతి అలా ఉంచితే) వారికి భారతీయ భాషలు నేర్చుకోవడం కొంచెం సుళువే అనిపిస్తోంది. ఉదాహరణకి చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ గారినే తీసుకోవచ్చు. ఎందుకంటే విశ్వనాథవారు ఉటంకించినట్టుగా మన భాషలు నేర్చుకోవటానికి ఒక పద్ధతిలో ఉంటాయి కాబట్టి.

  6. నిజమేనండి. పూర్తి కొత్త భాషకి, కొంత కొత్త భాషకి, నేర్చుకోవడంలో వేరు వేరు పద్ధతులున్నాయి.

    మొదటినుండి (అనగా 4-5వ తరగతి అనుకోండి),తెలుగు,హిందీ మరియు ఆంగ్ల అక్షరాలతో ఒకేసమయంలో మమేకం అవడం వల్ల, తెలుగు – హిందీ అక్షరమాలకి చాలా సారుప్యత ఉండడం చేత ఇవి రెండు ఒక భాషగానూ, ఆంగ్లమును వేరోక పూర్తి కొత్త భాషగాను భావించేవాడిని. కాలక్రమంలో ఏకకాలంలో మూడు భాషలపై పట్టు (కేవలం, చదవడం-రాయడమే సుమా!)సాదించామని చెప్పవచ్చు. కాకపోతే విధ్యాబోధన పూర్తి తెలుగులో జరగడం మూలాన, అసలు సిసలు ఆంగ్లం నేర్చుకోవడం ప్రారంభించింది మాత్రం ఇంజనీరింగ్‍లోనే.. ఆఫీస్‍లో రెండు సంవత్సరాల అనుభవం గడించేనాటికి ఇదిగో ఇలా తెల్లదొరలతో మీటింగులలో పాల్గొనగలిగే పట్టు దొరికింది.

    ఇదంతా ఎందుకు చెప్పానంటే, తెలుగుని అనునిత్యం ఇంట్లో, బడిలో, బయట ఉపయోగించడం మూలంగా ప్రత్యేకించి నేర్చుకునేది ఏమి ఉండదు (సమాసాలు, సంధులు పక్కన పెడితే). దాదాపుగా హైదరాబాద్‍లో హింధీది కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ తెలుగు రాకపోయిన బతికెయ్యొచ్చుకానీ, హింధీ, ఉర్దూ రాకపోతే మాత్రం చాలా కష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే, మన ఉధ్యోగ భాద్యతల నిమిత్తం తప్పనిసరిగా మారిన ఈ కాలంలో, బాల్యంనుండి కాస్తో కూస్తో పరిచయం ఉండడం చేత ఏదో నెగ్గుకొస్తున్నాం కానీ, A ఫర్ APPLE, B ఫర్ BALL లని నేర్చుకొని, పదాల అమరిక, పదాల వినియోగం, సంధర్భానుసారం వాటిని వినియోగించడంలాంటి ఇత్యాది విషయాలు నేర్చుకోవడానికి ఇప్పుడు ఎంత సమయం పట్టిఉండేదో అలోచించండి.

    సరిగ్గా ఇలాంటి పరిస్థితే నాకు తమిళంతో తగలడింది. స్యతహాగా నాకు “బహుభాషాకోవిధుడు” అనిపించుకోవాలని కోరిక. అందుచేత పాతబస్తిలో ఇంజనీరింగ్ చేస్తున్నపుడు ఉర్ధూని, కర్ణాటక పర్యటనలో కన్నడని, 30 రోజుల్లో తమిళం పుస్తకాన్ని ఉపయోగించి (60 రోజుల్లో, మొదటి మూడు పేజీలని అవపోసన పట్టి)తమిళం ని చదవడం రాయడం నేర్చేసుకున్నాను. మరి మిగితా 80 పేజీల్లో ఉన్న తమిళ పదాలని , వ్యాఖ్యాలని, ఉత్తరాలని నేర్చుకోవడానికి నాకు ఇంకా ఎంత కాలం పడుతుందో మీరు ఊహించుకోవచ్చు. తమిళం చదివడం రాయడం ఇంత ఇదిగా వచ్చినా కూడా నాకు ఒక్కముక్క తమిళం మాట్లాడడం, వినడం రాదు. ఇప్పుడు నేను ఏ జర్మనీయో, ఫ్రెంచో నేర్చుకోవాలన్నా ఇదే పరిస్థితి.

    దీనిని బట్టి తెలిసింది ఏమంటే, ఒక భాషలో ప్రావీణ్యత సంపాదించాలంటే, మొదట ఉండాల్సింది ఆ భాషతో కొంతకాలం పరిచయం, తర్వాత ఉండాల్సింది ఆ భాషని నేర్చుకోవాలన్న ఇది, చివరగా సమయానుసారం దాన్ని వాడగలిగే అది.

    (క్లారిఫికేషన్ ఇచ్చానో, కన్ఫూజ్ చేసానో ఇప్పుడు నాకు తెలియడంలేదు)

  7. very Nice Sowmya.

  8. nanda gaaru… meeru cheppindi correct e nandi…

  9. Ever wondered how do the new born kids go about learning a language?

    To them, every word is a miracle… every opportunity to make a sound is a language exercise. They just *love the act of learning*, never afraid of making mistakes… experimenting.

    That, in my opinion, is how one should go about learning a language. You gotta love it. 🙂

  10. రాతలను ప్రచారం చేయడం నా ఉద్దేశం కాదుగాని , ఏమాటకామాటే
    చెప్పుకోవాలి , తాటాకులు తేరగా దొరికాయిగదా అని ఎడాపెడా బరికేస్తే ఎంత నష్టం
    జరగబోతోమ్దోనని బయం మాత్రం పట్టుకుంది . అయినా అది ఇంగ్లీషులో ఎందుకు
    అఘోరిమ్చలేదో జుట్టూడేలా బుర్ర గోక్కున్న అర్ధమయ్యి చావలేదు . క్రితం వారం ఆ
    కవిత చదివినప్పటినుండి ఎంత తన్నుకున్నా చిక్కువీడడం లేదు . ఇవాళ ప్రొద్దున్నే
    కాపీ తాగుతుండగా ఎదురుగ వున్న #American Educator# పత్రిక అట్టమీద టైటిల్ #Teaching English Language Learners# చూసి ఇదేవితని తిరగేసాను .

    చదువుతుంటే గత వారం చదివిన కవిత మళ్ళీ గుర్తొచ్చింది . మొత్తం క్షుణ్ణంగా
    చదివేసనని సెప్పనుగని , చదివినంతలో విషయం బోధపదిమ్డనే అనుకుంటాను .
    ఈ వ్యాసం మీరు ఇక్కడ చదవొచ్చు: #

    Dear Sowmya,

    Are u the one who commented about my poem ?

    Wilson Sudhakar Thullimalli

    • విల్సన్ సుధాకర్ గారికి:
      నాకు ఏ భాషలో రాయాలనిపిస్తే ఆ భాషలో రాస్తాను – మధ్య మీకొచ్చిన సమస్యేమిటో నాకర్థం కావడం లేదు. అవాల్టికి టపా తెలుగులో రాయాలనిపించి రాసానంతే.
      నాకింతకీ మీరు చెప్పిన – ఆ మీ కవితేమిటో, అసలు మీకు గుర్తుకొచ్చిన కవితేమిటో, మధ్యన Teaching English Language Learners ఏమిటో -అసలర్థం కాలేదు. మీ కవిత ఎక్కడిదో చెబితే – నే అసలు చదివానో లేదో తెలుస్తుంది. నాకైతే, మీ పేరుతో ఏమీ చదివిన గుర్తు లేదు.

      మరో గమనిక: నా బ్లాగులో కామెంట్ మాడరేషన్ ఉంది. మీరు ఇంతలో కంగారు పడి ఇదే కామెంట్ మరో చోట పెట్టేసినట్లున్నారు. 🙂

  11. @Wilson Sudhakar: I get it – after reading all previous comments on this post now. Its not me who wrote that comment.

  12. Sowmyaji,

    I happened to see a comment on my poem in your blog. Since I am not computer savvy,I did not understand who wrote the comment.I was just checking who wrote the comment and nothing else.It is common that sometimes our writings and poems may not be liked by all.
    However, my intention was to reply if anybody seeks explanation on my poem. That’s all.

    All the best for your new blog.We Telugu people living abroad always look for Telugu blogs.I look forward for good articles in your new blog.

    Thank you for your reply.

    Wilson Sudhakar

  13. Sudhakar garu: Yeah, I realized the confusion after posting my comment. Sorry for sounding rude in the previous comment. I was not able to figure out why that comment was written.

  14. Sowmyagaru,

    Partly it was my fault also.I just copied and pasted the matter from your blog.

    You are not rude at all.All the best.I look forward to seeing good articles in your new blog.

    Wilson Sudhakar
    Johannesbrug

  15. తెలుగు గురించి చాలా మంది ఆలోచిస్తున్నారని ఈ బ్లాగు చూసిన తర్వాతే నాకు తెలిసింది. ఏమైనా ఈ పరిణామం శుభప్రదమే. కానీ ఈ ఘోష ఇంగ్లీషు మీడియంలోచెబుతున్న గురువులకు వినపడుతుందా


Leave a reply to R k Cancel reply