“మాలపల్లి” నవలలోని ఒక సంభాషణ

నేను ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి “మాలపల్లి” చదువుతూ ఉంటే, ఒక సంభాషణ నన్ను బాగా ఆకర్షించింది. దాన్ని యధాతథంగా ఇక్కడ టైప్ చేస్తున్నాను:

జోతి: అమ్మా! రేపెక్కడికే అయ్యా, నీవు పోవడం
వెంకటదాసు: ఎక్కడకా? దేవుడి దగ్గరకు
జో: దేవుడు తన దగ్గరకి మిమ్ములని రానిస్తాడా?
మాలక్ష్మి: ఆ,ఆ. దేవుడు రానిస్తాడు.
జో: ఇక్కడి దేవుడి గుడిలోకి మనలను రానీయరేమి?
మా: రానీయకపోతే వాళ్ళే చెడ్డారులే! మీ అన్న మనకు దేవుడి గుడి కట్టిస్తున్నాడుగా
జో: మన గుడిలోకి వస్తాడా దేవుడు?
మా: ఆహా! ఎవరు కట్టించుకున్నా వస్తాడు. ఆయనకంటు లేదు.
రామదాసు:పెద్దదేవుడు మనలోనే ఉంటే ఈ రాతి దేవుళ్ళెందుకు? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా? అన్నారు.
వెం: నీదంతా అద్వయితం. అంతా నీవంత వాండ్లయితే దేవుడి గుళ్ళక్కరలేదు. మేమంతా ముక్కులు మూసుకుని కూర్చుంటామా ఏమి?

– ఈ ఒక్క సంభాషణలోనే నాకు “దేవుడు” గురించిన రకరకాల కోణాలను స్పృశించినట్లు అనిపించింది. జోతిది అమాయకత్వం, రామదాసుది “సత్యమే శివం” లో కమల హాసన్ పక్షం తరహాది. మాలక్ష్మిది దేవుడికి అందరూ సమానమే అన్న భావం, వెంకటదాసుది దేవుడికి, తనవారు దేవుణ్ణి చూడటం కోసం గుడి కట్టించాలన్న తాపత్రేయం. నాకెందుకో ఈ సంభాషణ చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా, చాలా చాలా ప్రభావితం చేసేదిగా అనిపిస్తోంది.

ఇదే మూసలో ఉన్న మరో డైలాగు : “పస్తులుంటే దేవుడు మీకు పుణ్యమిస్తాడట. ఆ దేవుడు దినపస్తులుండే మాకెందుకియ్యడో!”

Published in: on November 17, 2008 at 11:00 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/11/17/malapalli-excerpt/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. even i read this novel, this is the best part. thanks for reminding us this again.

 2. Beautiful.
  నవల మొత్తం చదివారా? ఈ నాల రాయడంలో ఉన్నవ ఉద్దేశం ఏమిటని మీరనుకుంటున్నారు?

 3. @కొత్తపాళీ : ఇంకా చదువుతున్నానండీ.

 4. అందుకే ఈ నవల ఎవర్ గ్రీన్…మంచి సంవాదాన్ని గుర్తుచేసారు. ఎప్పుడో చదివాను. ఇప్పుడు మళ్ళీ కొనిచదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు.

 5. baagundi , nijjam gaa

 6. Beautiful conversation…

 7. “పస్తులుంటే దేవుడు మీకు పుణ్యమిస్తాడట. ఆ దేవుడు దినపస్తులుండే మాకెందుకియ్యడో!”

  ప్రశ్న బాగుంది 🙂

 8. Unnava lakshmi narayana garu eppudu manato leru kani vaaru chesina ee ‘MALA PALLI’ ane sahasam vaarini cheritralo goppaga nilichipoyela chesindi anadamulo sandeham ledu

 9. చాలా బాగుంది..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: