కుంబ్లే కోసం

నేనంత అరవీరభయంకరమైన క్రికెట్ అభిమానిని కాను కానీ నాకు తోచినప్పుడు ఫాలో ఔతూ ఉంటాను. అలాగని బాల్ టు బాల్ చూస్తానని కాదు. చెప్పలేం 🙂 అయినప్పటికీ, నేను కుంబ్లే అభిమానిని అని గర్వంగా చెప్పుకుంటాను. (అభిమాని అన్నది లింగభేద రహితమైనదా ఇంతకీ? అభిమానురాలు అనో… అభిమానిని అనో అనాలా??) ఈ బ్లాగు లో కుంబ్లే గురించి ఇదివరలో రెండు సార్లు రాసాను. వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు, తొలి టెస్టు సెంచరీ చేసినప్పుడు. వెల్, చాలామంది చాలా చోట్ల, చాలాసార్లు ఇప్పటికే కుంబ్లే గురించి చాలా చెప్పేసి ఉంటారు. నాకు తెలిసిందీ తక్కువే, కుంబ్లే ని నేను తెలుసుకుందీ తక్కువే. అయినా కూడా, మరోసారి రాయకుండా ఉండలేకపోతున్నాను… కారణాలున్నా చెప్పను. 🙂

నిజానికి ఉన్నట్లుండి కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించడం నన్ను షాక్ కి గురి చేసింది అనే చెప్పాలి. మూడో టెస్టు కుంబ్లే ఆడతాడా? ఆడడా? అని ఆలోచిస్తూ ఉండగానే అది వచ్చేసింది, కుంబ్లే ఆడాడు. చివరి రోజు రాగానే, రిటైర్మెంట్ అన్నాడు, రిటైరైపోయాడు! అక్కడ్నుండి క్రిక్ఇన్ఫో లో వ్యాసాలు చదువుతూ, మధ్య మధ్యన రకరకాల భావోద్వేగాలను అనుభవిస్తూ ఆ రోజు గడిచింది. ఒక్కొక్కరి స్పందనా (అనుకూలతని బట్టి ప్లేటు ఫిరాయించే రకం మనుష్యుల స్పందన గురించి కాదు నేను మాట్లాడేది. నోరుంది కదా అని కనపడ్డ వారందర్నీ విమర్శించే వారి గురించి కూడా కాదు.) చదువుతూ ఉంటే కుంబ్లే కి అందరిలో ఎంత గౌరవముందో మరోసారి రుజువైంది.

కుంబ్లే అనగానే నాకు గుర్తొచ్చే మొదటి పదం “జెంటిల్ మేన్”. కుంబ్లే అనగానే నాకు వెంటనే గుర్తొచ్చే రూపం ప్రశాంతంగా నవ్వుతూ ఉండే ఆ మొహం. ఒకవైపు తలకి కట్టు కట్టుకుని వెస్టిండీస్ బ్యాటింగ్ పై దాడి చేస్తున్న దృశ్యం గుర్తొస్తూ ఉంటే, మరోవైపు ఇప్పుడు మొన్నటి రిటైర్‌మెంట్ నాటి వీడ్కోలు దృశ్యం గుర్తు వస్తోంది. శ్రీనాథ్-కుంబ్లే టైటాన్ కప్ (1996) లో ఓ మ్యాచ్ లో చివర్లో ఆడి గెలిపించిన దృశ్యం ఇంకా గుర్తు ఉంది నాకు. కుంబ్లే అంటే ఫిరోజ్ షా కోట్లా లో  పాక్ పై ఓ ఇన్నింగ్స్ లో తీసిన ప్రపంచ రికార్డు పది వికెట్లో, టెస్టుల్లో తీసుకున్న ఆరొందల వికెట్లో మాత్రమే కాదు కదా… కుంబ్లే అన్న వ్యక్తిలో జట్టుకోసం ఆడే మనిషి ఉన్నాడు. కష్టపడి పైకొచ్చి పద్దెనిమిదేళ్ళు భారత దేశానికి క్రికెట్ ఆడి, జట్టు మూల స్థంబాల్లో ఒకడిగా నిలిచిన యోధుడున్నాడు. తెలివైన బౌలర్ ఉన్నాడు. అవసరానికి ఆడగల బ్యాట్స్‌మన్ ఉన్నాడు. మంచి స్నేహితుడున్నాడు. మానవత్వం గల మనిషి ఉన్నాడు. కుటుంబం పరంగా తన బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించే బాధ్యతాయుతమైన వ్యక్తి ఉన్నాడు. ఈ పరంగా చూస్తే నాకు కుంబ్లే ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తోస్తాడు. వ్యక్తిగతంగా, సామాజికంగా, వృత్తి పరంగా (అంటే, ఇక్కడ క్రికెట్) – ఏ విధంగా చూసినా అతని బాధ్యతలు అతను సక్రమంగానే కాక, బాగా కూడా నిర్వర్తించాడు కదా మరి! ఇప్పుడు ఇక్కడ అన్న ప్రతిదానికి నేను ఉదాహరణ ఇచ్చే ఉద్దేశ్యం నాకు లేదు 😉 . నా కంటే బాగా రాసిన వారు, బాగా తెలిసిన వారు చాలా మందే ఉన్నారు.

ఇంత జరిగినా కూడా కుంబ్లే కి రావాల్సినంత పేరు రాలేదేమో అనిపిస్తుంది నాకు. విమర్శకులు, విమర్శకులనుకునేవాళ్ళూ – ఇద్దరూ కుంబ్లే ని అడుగడుగునా అడ్డగిస్తూనే ఉన్నా, నవ్వుతూనే వారిని ఎదుర్కున్నాడు, ప్రతీసారీ గెలిచాడు కూడా 🙂 కుంబ్లే ది ఒక స్పూర్తివంతమైన కెరీర్ అనిపిస్తుంది నాకైతే. అతన్నుంచి క్రికెట్ ఆడేవారేకాదు, మామూలు వారు కూడా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. He is role model for many. ఇక భారత జట్టులో కుంబ్లే ఉండడు అన్న విషయం కాస్త బాధ కలిగిస్తోంది కానీ, ఎప్పటికైనా జరిగేదే కదా అని సరిపెట్టుకోవాల్సిందే.  వేరే మార్గమేదన్నా ఉంటే కదా!! అతన్ని మార్కండేయుడిలాగా ఎప్పటికీ అదే వయసులో, అదే ఎనర్జీతో ఉండేలా అయితే చేయలేం కదా!

Cricinfo లో రాసినట్లు : “After all was said and done and the match called off, he came back out to be chaired around the ground, part of the way on the shoulders of the man who will succeed him as captain. For someone who scaled the greatest heights, it was one of the very few occasions during the 18 years when his feet actually left the ground.” – Indeed!! (source: here)

Published in: on November 4, 2008 at 2:45 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/11/04/for-kumble/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. మీరన్నట్టు కుంబ్లే ఒక పరిపూర్ణమైన వ్యక్తి.మైదానం లో ఎన్నో విజయాలను అందించిన అతను ఆదర్శ క్రికెటర్.అతణ్ణి స్పూర్తిగా తీసుకుని ఓ పది మంది కుంబ్లేలు తయారు కావొచ్చేమో!ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. కానీ , వేలల్లో అవకాశాలున్నప్పటికీ , ఏడెళ్ళ కూతురున్న ఓ స్త్రీని వివాహం చేసుకోవటం ద్వారా అతను ఆదర్శ పురుషుడయ్యాడు. ఈ విషయం లో అతణ్ణి ఎంతమంది అనుసరిస్తారన్నది ఊహించలేనిదేమీ కాదు. నాకు తెలిసి, ఇలాంటి మహనీయులు అరుదుగా అగుపడే నక్షత్రాల్లాంటి వారు. వారికి సమకాలికులవటం, నిజంగా మన అదృష్టం.

 2. కుంబ్లేకి రావలసినంత గుర్తింపు రాలేదనటం పూర్తి నిజం కాదండీ. అతనికి మంచి గుర్తింపే ఉంది. కాకపోతే జట్టుకి నాయకత్వం ఇచ్చే విషయంలో మాత్రం కుసింత అన్యాయమే జరిగిందతనికి. గంగూలీని తప్పించిన వెంటనే ద్రవిడ్‌కి బదులు కుంబ్లేకి అవకాశం ఇస్తే బాగుండేది.

  మీరన్న టైటన్ కప్ ఫైనల్ పోటీ నిజంగా చిరస్మరణీయమైనది. శ్రీనాధ్, కుంబ్లే చివరి ఓవర్ దాకా ఆడి గెలిపించిన ఆ మ్యాచ్ బెంగుళూరులోనే జరిగింది. వాళ్లిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఆట ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షుకుల్లో ఉన్నారు. చివరిదాకా నరాలు తెగే ఉత్ఖంఠతో జరిగిన ఆట అది.

  ‘అర్రే, అప్పుడే వెళ్లిపోయాడా’ అనుకునేలా ఈ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించి కుంబ్లే సరైన పనే చేశాడు.

 3. బాగా రాసారు. నాకు ఇలానే అనిపించిన మరొక్క ఆటగాడు కపిల్ దేవ్.

 4. అరవీర భయంకర X
  = అరివీర భయంకర

 5. మనదేశమీడియా కొంతమంది క్రికెటర్లకిచ్చినంత గుర్తింపు కుంబ్లేకివ్వలేదేమోననిపిస్తుంది.అయినా ఆయన మహోన్నత క్రికెటర్.

 6. ఇండియాకు మాచ్ విన్నర్ అంటే కుంబ్లే
  బాట్స్మెన కు ఎక్కువ్ విలువ నిచ్చే మన టీమ్ లో బౌలింగ్ కు ఓ కొత్త అర్ధం చెప్పాడు

 7. MEERU KUMBLE GURINCHI CHALA BAGA RASARU
  AAYANA CHALA GOPPA CRICKETER
  ATANU LENI LOTU MANAKU TELISE ROJU DAGGARALO UNDI….

 8. YES… HE IS A COMPLETE MAN.

 9. Yes,He is great champion bowler,who has bowled 35-40 overs within a single day of test matches.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: