కృష్ణపక్షాన్వేషణ

మొన్నోరోజు ఓ పుస్తకం కోసం వెదుకుతూ ఉంటే ఎంతకీ కనబడలేదు. ఆ కొద్ది నిముషాల్లో, ఆ తరువాత ఆ పుస్తకం దొరక్కపోతే పోయిందిలే అనుకున్నాక కలిగిన భావాలను కాగితం పై పెట్టే ప్రయత్నం ఈ టపా.

అబ్బ! ఎంతకీ “కృష్ణపక్షం” మాత్రం కనబడదు.
ఏం? ఇప్పుడు ఈ శ్రీపాదలూ, విశ్వనాథలూ, ఆరుద్రలూ కనబడకపోతే ఏం?
అసలు మనిషి ఎలాగో కనబడడు – ఆయన రాతలైనా కనబడొద్దూ?
ఇక్కడిదేమిటి? – భమిడిపాటి కామేశ్వరరావు. పక్కనే మునిమాణిక్యంవారు.
నాకెందుకు ఇప్పుడిదంతా? నాకు పిచ్చెక్కుతూ ఉంటే చోద్యంచూసి నవ్వుతున్నారులాగుంది!
ముళ్ళపూడి కనబడి ఆపేశాడు మధ్యన- పేజీ తిప్పబోయి తమాయించుకున్నా. నాకు కావాల్సింది దేవులపల్లి వారు.
బాపు…బాబు…బాలి..యర్రంశెట్టిశాయి…పుచ్చా పూర్ణానందం – ఇప్పుడెందుకు నాకు బొమ్మలూ జోకులూనూ?
నాకు కృష్ణపక్షం కావాలి!
“కృష్ణలీలా తరంగ…” – ఓ! కృష్ణలీలాతరంగిణిలోనే కదూ “ఆలోకయే…” ఉన్నది!
అయినా మనకెందుకు? అరే! కృష్ణలీలలు పుస్తకంపై బాపూ బొమ్మెంత బాగుంది!
కృష్ణ! కృష్ణ! వరుసగా కృష్ణుని బొమ్మలు…. మరి కృష్ణశాస్త్రి బొమ్మో?

[ఇలా వెదికి వెదికి వేసారిపోయాక]

పోన్లే, పేర్లలో అన్నా సామ్యం ఉంది. “కృష్ణలీలాతరంగిణి” తిరగేస్తా –
ఇంతకీ అది ఏదీ? ఇన్ని పుస్తకాల్లో ఎక్కడ చూసానో!
ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యమా? విశ్వంభరా? ఉపనిషత్తులా? భాగవతమా?
అబ్బ! ఎందుకివన్నీ ఇప్పుడు? “…తరంగిణి” ఏది?
కృష్ణలీలలు – మళ్ళీ!
ఆముక్తమాల్యదా, పిలకా గణపతి శాస్త్రీ, రాహుల్ సాంకృత్యాయన్, చలం శశిరేఖ
– కాలాతీతంగా ఏవేవో కనిపిస్తున్నాయి! కావాల్సింది మాత్రం …….
ఓహ్! దొరికింది! “శ్రీ కృష్ణలీలా తరంగ సంగ్రహం” – ఇదేమిటి! సంగ్రహమా!
ఏమిటిది! ఇది చూసేకదూ ఇందాక తరంగిణి అనుకున్నది! ఓ గాడ్!
కృష్ణపక్షమూ దొరక్క పోయె! తరంగిణీ చేతికందకపోయె!
కృష్ణ ఒక్కటీ మిగిలింది – లైటు పోయింది కద!
నిరాశ తో ఓ పక్క ఊసురోమంటే – పుస్తకాల దుమ్ముకి తుమ్ములొకటి!! 😦

(దీన్ని రాయడంలో నా ఏకైక ఉద్దేశ్యం ఆ క్షణంలో నాకు కలిగిన చిరాకును దేనిమీదైనా చూపించుకోడానికి. రాసిన కారణం ఆ క్షణంలో నాకు కాగితం, కలం ఎదురుగ్గా కనబడ్డమే. అన్నట్లు, ఇక్కడ రాసిన రచయితల అభిమానులు నేనేదో వాళ్ళని తిట్టేస్తున్నా అని అపార్థం చేసుకోకండి. నేను ఒకటి వెదుకుతున్నప్పుడు అది తప్ప అన్నీ కనిపిస్తే చిరాకేసింది. అంతే. ఇక్కడ చెప్పిన అన్ని పేర్లపై చదివినా చదవకున్నా నాకు గౌరవం ఉంది.)

Advertisements
Published in: on November 1, 2008 at 8:46 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/11/01/krishnapakshanveshana/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. 🙂 Now, I know your collection!

 2. can i have ur email id mam please………….?

 3. ఏకైక ఉద్దేశ్యం ఆ క్షణంలో నాకు కలిగిన చిరాకును దేనిమీదైనా చూపించుకోడానికి. రాసిన కారణం ఆ క్షణంలో నాకు కాగితం, కలం ఎదురుగ్గా కనబడ్డమే — భాగుంది. నారూలు ఏమిటంటే, నాకేదైనా కావలిస్తే, మరోదానికోసం వెతకడం మొదలుపెడతాను. దాదాపు 50% of the time, కావలసింది దొరుకుతుంది.

 4. ఇటువంటి కావలసిన పుస్తకం కోసం వెదుక్కుని విసుగుచెందే అనుభవం నాకూ చాలా సార్లు కలిగినా ఇలా బ్లాగితే బావుంటుందని,బ్లాగొచ్చుననిమాత్రం ఎప్పుడూ అనిపించలేదు.మార్గం చూపించినందుకు సంతోషంగా వుంది.ఎప్పుడైనా బ్లాగొచ్చు.మీ నంపద అత్యంత భాగ్యవంతంగా ఉంది.

 5. సౌమ్యా, నిరాశేలా…………………కృష్ణపక్షము నా దగ్గరుంది.

  ఆకులో ఆకునై పూవులో పూవునై
  కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
  ఈ యడవీ దాగిపోనా ఎట్లైనా నిచటనే యాగిపోనా ?

  నవ్విపోదురుగాక నాకేటి సిగ్గూ……………..

  వింతగా దోచు నాదు జీవితము నాకే !
  జిలుగు వెన్నెలలతో చిమ్మ చీకటులతో !

  సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు ?
  చంద్రికల నేల వెదజల్లు చందమామ ?

  పేయసీ, ప్రేయసీ ! ప్రియుడనే ప్రేయసీ
  వేయికన్నుల దాల్చి వెదుకుచున్ననే !

 6. chaalaa nacchindi naaku mee anvEshaNa taalUku asahanam..

 7. కృష్ణశాస్త్రిగారి వ్యాసాలు త్వరలో ప్రచురిస్తామని విశాలాంధ్రావాళ్ళు నాకు 2005 నుంచి చెప్తున్నారు. ఈమధ్య అడగలేదు, మీకేమైనా కనిపించాయా (ఈ వెతకడంలో)

 8. ఒకప్పుడు గర్వపడేవాణ్ణి ఇలాంటివి చూసి నాకు పుస్తకాల విషయంలో క్రమశిక్షణ ఎక్కువ అని. ఎందుకంటే అన్నీ అందంగా పేర్లు బయటకి కనపడేలా(కవర్ పేజీకీ, బ్యాక్ కవర్ కీ మధ్యన సన్నటి గ్యాప్ లో పుస్తకం పేరు రాస్తారే.. అది బయటకి కనపడేలా పెట్టేవాణ్ణి) పెట్టుకుని అవసరానికి దొరకబుచ్చుకుని ఆనందించేరోజుల్లో. ఐతే అవి వందలాది పుస్తకాలైపోయి వామనావతారం చాలిస్తూ త్రైవిక్రమ రూపం ఎత్తుతూంటే “నేను అడుగుపెట్టేందుకు అడుగు చోటు చూపమ”ని కొత్త పుస్తకాలు అడుగుతోంటే అడుగులు తడబడి ఇంట్లోవారిని మరో నాల్గడుగుల చోటు అడిగేందుకు దారిలేక అలా పేరుకుపోయిన పుస్తకాలు నా గర్వం సర్వం పాతాళానికి తొక్కేశాయి. ఇప్పుడు నా స్థితీ ఇదే గతి.

 9. LOL. I don’t have such problem. I have lost most of the books I bought. And don’t have my hands on dad’s library.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: