నవ్వొక బాధట!

మొన్నామధ్య మాటల్లో స్నేహితుడొకరి నోటినుండి – “నవ్వొక బాధ” అన్న వాక్యం వెలువడింది. నవ్వు బాధ కావడమేమిటి? బాధైతే అది నవ్వు అవడమేమిటి? – కొద్ది రోజులుగా ఇది నన్ను తొలచివేస్తూనే ఉంది. దాన్నే ఆలోచిస్తూ ఈ టపాలో కొంత వరకూ జవాబులు చెప్పుకుంటున్నాను నాకు నేనే 🙂

నవ్వడం ఒక బాధ – లోపల ఏడుస్తున్నప్పుడు. బైటకి ఏడ్వలేనప్పుడు. కాస్త సరదాగా చెప్తా పోనీ – ఈ వెధవ భవబంధాలున్నాయి చూశారూ, మా చెడ్డ మంచివి, మా మంచి చెడ్డవి. మంచితనంతోనే ఏడ్పిస్తాయి ఒక్కోసారి. అంతర్ముఖమై ఆలోచిస్తూ ఉంటే భవబంధాలకి కన్సర్న్.  వాళ్ళు కంగారు పడతారని మనకు కంగారు.  మనం అహింసావాదులం అనుకోండి, వాళ్ళకోసమని మనం నవ్వుతాం. అఫ్కోర్సు, చీ! చిన్నపిల్లల్లా ఏడవడమేమిటి అనుకుని కూడా నవ్వొచ్చు. అంటే, అది పైకి ఏడ్చుకోడానికి మొహమాటపడి, ఇంకోళ్ళు మన ఏడుపు చూసి ఏడుస్తారేమోనని మనమే ఊహించేసుకుని నవ్వే నవ్వు అనమాట. అది బాధనుకుంటే బాధే మరి.

నవ్వడం ఒక బాధే. నిజంగా ఓ బాధే – మీకు ఏ దవడ నొప్పో ఉన్నప్పుడు. మీరు 24 గంటలూ నవ్వే రకమైతే దీన్ని మించిన బాధ మరోటి ఉండదు. ఏడుపొస్తే ఏడవలేకపోవడం కన్నా నవ్వొస్తే నవ్వలేకపోవడం ఇంకా పెద్ద టార్చర్. మిగితా అందరూ ఫ్రీగా నవ్వుతూ ఉన్నప్పుడైతే మరీనూ. అప్పుడైతే మొదట నవ్వొస్తుంది. తరువాత నవ్వలేమన్న అసహాయత నుండి చిరాకు పుడుతుంది. మెల్లగా కోపం వస్తుంది. ఎందుక్కోపం పెంచుకుంటున్నామని బాధేస్తుంది. చివరికి పోనీలే, వాళ్ళన్నా నవ్వుకుంటున్నారన్న నిట్టూర్పు మిగుల్తుందన్నమాట. మిమ్మల్నెవరో ఇలాగే నోటికొచ్చింది వాగి విసిగిస్తూ ఉంటే మొహమాటానికి “ఇహిహి” అంటారే, అప్పుడు కూడా నవ్వొక బాధే!

మరొకప్పుడు ఎవరో సీరియస్ మొహం పెడితే మనకది నవ్వు తెప్పించొచ్చు. ఖర్మకాలి ఎవరో మనల్ని తిడుతూ ఉన్నా మనకు నవ్వు రావొచ్చు. ఎక్స్ యొక్క అభిమాని పక్కనే కూర్చున్నప్పుడు ఎక్స్ ని అవుట్ చేసిన బౌలర్ని తలుచుకుని నవ్వుతూ చప్పట్లు కొట్టాలి అనిపించవచ్చు.  ఎదుటివాళ్ళకి కాకమ్మ కథ చెబుతున్నప్పుడు వాళ్ళ మొహంలో కనబడే అమాయకమైన నమ్మకాన్ని చూస్తే నవ్వు రావొచ్చు. సినిమాలో చావు సీన్లలో వచ్చే సంగీతం మీరు క్లాసు మొదటి బెంచీలో కూర్చుని ఉన్నప్పుడు, లెక్చరర్ మీ వైపు చూస్తున్నప్పుడు వెనకెవరో ప్లే చేస్తే మీకు నవ్వు రావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో అంతా నవ్వు ఒక బాధే! అప్పుడు నవ్వలేకపోవడం ఇంకా పెద్ద బాధ.

సరే, “నా తరం కాదు భవసారమీదటం” అని నిర్ణయించుకున్నాక, రేప్పొద్దున్న హిమాలయాలకి వెళ్ళిపోదామని అంతా సిద్ధం చేసేసుకున్నాక, ఫైనల్ గా ఓ సారి ఓ ఫ్రస్ట్రేటెడ్ కేక పెట్టాలనిపిస్తుంది. పెడతారు. “ఏహే! ఆపు” అని ఎవరో విసుక్కోడం వినిపిస్తుంది. “వినేవారు లేక, విసుక్కుంది నా కేక” అని అర్థమౌతుంది మీకప్పుడు. అప్పుడు, ఒకళ్ళు మనకంటే చిరాగ్గా ఉన్నారనుకుని నవ్వాలనిపిస్తుంది. కానీ, ఆ ఒకరు మనలోని వారే కనుక నవ్వలేము. అబ్బ! నవ్వొక బాధ!

ఇంకోరోజు ఓ మూల కూర్చుని భోరున ఏడవాలి అనిపించినప్పుడు మీ కళ్ళలో వాటర్ ప్రాబ్లెం మొదలౌతుంది. బాధంతా కంటి దాకా వచ్చి ఇరుక్కుపోయి, తప్పించుకోవాలని అటూ ఇటూ పారి, మీ నరనరాల్లోకి పాకుతుంది. న్యూరాన్లన్నీ తడిసిపోతాయి. వానా వానా వల్లప్పా అని డాన్సులు మొదలుపెడతాయి. మీకు దిక్కుతోచదు. అవి కన్నీళ్ళన్నీ తాగేసి తందనాలాడుతూ ఉంటాయి.  మొదటగా మీకు తాగుడు అలవాటు ఉండదు. రెండవ విషయం – ఏడుపుకి కూడా దిక్కులేదు ఈ జీవితానికి అన్న చిరాకు. దిక్కుతోచక ఏడుపంతా నవ్వులోనే చూపిస్తూ నవ్వుతారు. అది రెండు రకాలుగా ఉండొచ్చు. నిర్జీవమైన నవ్వొకటి, పిచ్చెక్కినట్లు ఉండే అతి నవ్వు మరొకటి. ఎలా నవ్వినా బాధ కొద్దీ నవ్వినప్పుడు నవ్వొక బాధే కదా!

ఇంతకీ ఈ మాట అన్న స్నేహితుడిని అతని మనసు వేయి రకాలుగా తిడుతూ ఉండి ఉంటుంది. “ఎందుకన్నావ్? ఇప్పుడు చూడు – నువ్వే కాక ఎందరు బలౌతున్నారో ఈ సంధి ప్రేలాపనకి?” అని. అప్పుడు అతని పెదాలపై మెరిసే నవ్వు – ఏడవలేక నవ్వే నవ్వు. నవ్వొక బాధ అని ప్రాక్టికల్ గా అనుభవింపజేసే నవ్వు. “నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా!” అని గుర్తు చేసే నవ్వు.

(అసలింకా చాలా రాయొచ్చు కానీ – నవ్వు బాధ ఎందుకు అన్న టాపిక్ మీద… ఇక్కడ ఆపేస్తా. మరీ పెద్దదైపోతోంది. నవ్వు బాధిస్తోందన్న సందేహం మళ్ళి కలిగినప్పుడు మరిన్ని కేస్ స్టడీలతో ముందుకొస్తా) 🙂

Advertisements
Published in: on October 21, 2008 at 1:28 pm  Comments (17)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/10/21/navvoka-baadha/trackback/

RSS feed for comments on this post.

17 CommentsLeave a comment

 1. ఈ టపా చదువుతూ విపరీతంగా నవ్వు వచ్చినప్పుడు……. చుట్టుపక్కల వాళ్లు నన్ను చూసి ఏమనుకుంటారో అని కష్టం గా నవ్వు ఆపుకున్నాను….ఈ పరిస్థితుల్లో కుడా నవ్వు ఒక బాదే !

 2. “నవ్వొక బాధ”
  నవ్వ (నవ) ఒక బాధే కదండీ?

 3. :):(

 4. Hmmm…..

 5. Sowmya,

  I read some where that smileys are sign posts saying “laugh here” I think controlling the usage of smileys would give more emphasis to a topic.

  This was a nice post as all the others.

 6. సౌమ్య గారు మీ పోస్టులకు మీరే సాటి! 🙂

 7. Good One 🙂

 8. Good post Sowmya.

  Trinath, Smileys don’t say “Laugh here”, they say “I am smiling now”.

 9. నవ్వొక బాధ అని వినప్పుడే అసలేమి మాటలు రాలేదు …. ఇంక ఈ పోస్ట్ చూశాక … అసలు మాటలు కరువయ్యాయి ….U Rock :-P…

 10. @Sugatri: :)) gud one!
  @Santosh, Sridhar, Venu Srikanth, Phani and Swathi: Thanks a lot.
  @Trinath: Well, I don’t know why it was said so where you read, but, as Phani said, I wanted to say – “I am laughing as I write this line.” [:)] Thanks for the comments.

 11. hi Sowmya,

  i have seen many of your posts so making a small request. there is a book by name “Ganapati” written by Sri Chilakamarti Lakshmi Narasimham garu. can you write a review on that one? the book is available in Visalandhra publishers, Abids Hyderabad. its somewhat old telugu language but i guess u can read it.

  -Karthik

 12. చాలా బాగుంది. “నవ్వొక బాధట” మీద మీరొక టపా రాస్తే సుగాత్రిగారొక టపాకాయ పేల్చారు. 🙂 (ఇచ్చట నవ్వాలన్నమాట)

  సంధి ప్రేలాపన – అన్నారు ఈ టపా చివరిలో, అది సరైన వాడకమేనా అని నా సందేహం. అసలు సంధిప్రేలాపన అంటే ఏమిటండీ?

  రెండో పేరాలో భవబంధాల గురించి రాస్తూ – వాళ్ళు కంగారు పడతారని మనకు కంగారు – అన్నారు కదా, అది చదవగానే తెన్నేటి సూరి “చంఘిజ్‌ఖాన్” నవలలో నన్ను ఎంతో ఆకట్టుకొన్న మాటొకటి గుర్తొచ్చింది. చాలా ప్రాణులకు వుండే ఈ బలహీనత గురించి ఆ నవలలో ఒక సందర్భానికి అనుగుణంగా సూరి చెప్పే మాటలను అక్కడ చదివితేనే మజా. మీరు చదివే వుంటారనుకుంటాను. వుండకపోతే వెంటనే చదవండి.

 13. chaalaa baundi post 🙂

 14. chaala chettaga undi post…!!!
  Topic baagaane select cheskunnaaru gaani … daanni cont cheyadamlo maatram fail ayyaaru… i knw that meeku chaala fans unnaarani… but i bet .. comments lo create chesinanta baaledu mee post… try to improve it.

  Regards,
  anil

 15. I too agree with Anil. Okkosari edo okati raseddamana tondaralo puttina topic la vundi.

 16. @Anil and Krish:
  Thanks. Well, opinions differ… అంతకు మించి నేనేం వ్యాఖ్యానించను. 😉

 17. @రానారె : సంధి ప్రేలాపన – Exact meaning…. నాకు తెలీదు కానీ, delirious గా వాగడాన్ని అంటారనుకుంటాను. సంధి సమయంలో ప్రేలాపన ని సంధి ప్రేలాపన అంటారని కాబోలు ఆ పదం పుట్టుక. ఈ సందర్భంలో ఈ పదం నేను మొదటిసారి ఎక్కడ విన్నానో చెప్పాలనిపిస్తోంది. మాల్గుడీ డేస్ తెలుగు అనువాదం సీరియల్ లో 🙂 పదమైతే valid పదమే. Wiktionary లో కూడా ఉంది.
  @Meenakshi: Thanks.
  @Karthik: Will try that. Thanks.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: