బ్లాగ్ ప్రయాణంలో నేను – Sowmya

Time for retrospection and a small journey through the blogging lane.

కారణాలు రెండు:

1. చెప్పను :p (త్వరలో concerned authorities బహిరంగ ప్రకటన ఇస్తారు.)

2. ఇది ఈ బ్లాగుకి 200వ టపా 🙂

– నా బ్లాగు చరిత్ర మీదా, నా చరిత్ర మీదా చెప్పుకోడానికి ఏముంటుంది గానీ, అయినా చెప్తా బ్లాగు చరిత్ర. వినుడి వినుడి ఈ బ్లాగు గాథా వినుడీ మనసారా…. చదువుడి కనులారా…. (అలానే పిలవాలి. అప్పుడే ఆ సినిమాలో లవకుశుల చుట్టూ జనం వచ్చేసినట్లు ఈ పోస్ట్ కూడా చదువుతారన్నమాట)

hmm… విషయానికొస్తే, July 2006 లో పుట్టిందన్నమాట ఈ బ్లాగు. 15న రిజిస్టర్ చేసా అనుకుంటా. మొదటి 10-12 టపాలూ 16నే పోస్ట్ చేసేసా 🙂 అప్పటికి బ్లాగ్స్పాట్ లో వేరే బ్లాగు ఉండేది. అందులోంచి అంతా తెచ్చి ఇక్కడ పడేశా. బేసికల్లీ, మొత్తం అన్నీ పుస్తకాల పైనే. ఇలా రాస్కోడం లోని ముఖ్య ఉద్దేశ్యం ఆ పుస్తకం గురించి కొన్నేళ్ళ తర్వాత ఏదన్నా గుర్తు రాకుంటే, ఇక్కడ బ్యాక్అప్ ఉంటుంది కదా అని. సరే, అలా మొదలుపెట్టాక, తెలుగులో రాయొచ్చు కదా అనిపించింది. అదిగో, అప్పట్నుంచి అప్పటిదాకా రాస్తూ ఉన్న తెలుగుపీపుల్ కి ద్రోహం చేసేసి సొంత కుంపటి పెట్టుకున్నా. ఈ మాతృ సంస్థ ద్రోహానికి నన్ను క్షమించేది ఎవరో వెదుక్కోలేక నన్ను నేనే క్షమించేసుకున్నా.
అలా సెప్టెంబర్ 2006 దాకా నా మానాన నేను రహస్య జీవితం బతికినట్లు ఉన్నా. అప్పుడు రావు గారు నా బ్లాగును గురించి సమీక్షించి దానికి తెలుగు గుంపుల్లో ఉనికిని ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రచురించారు. అక్కడ్నుంచి నాకు కొత్త పరిచయాలు మొదలయ్యాయి 🙂 ఓహో…తెలుగు బ్లాగులు చాలా ఉన్నాయనమాట … అనుకున్నాక కొత్త బంగారులోకంలోకి అడుగుపెట్టాను. and I have enjoyed every moment that I spent here. నేను నిర్లిప్తంగా ఆర్.కె.లక్ష్మణ్ సామాన్యుడి లాగా నే మొదలుపెట్టాను తొలి అడుగు – ఇతర బ్లాగర్ల గురించి తెలుసుకోడం లో. ఇప్పటికీ చాలా వరకు అంతే కానీ, ఇక్కడ దొరికిన స్నేహాలు, పెంచుకున్న అనుబంధాలు నా జీవితంలో ఇంత ప్రాముఖ్యాన్ని పొందుతాయని మాత్రం ఊహించలేదు. ఇంతకంటే ఒక్క ముక్క ఎక్కువ చెప్పినా నాలో మళ్ళీ “అనుబంధానికి మాట కట్టేస్తావా” అని అంతరాత్మ గోల మొదలుపెడుతుంది కనుక…. చెప్పను. ఇదీ ఈ బ్లాగు చరిత్ర, ఈ బ్లాగు ప్రయాణం లో నా చరిత్రానూ.

కోపమొచ్చినా, ఆనందం అర్ణవమైనా, ఏదో వెంటనే ఎవరికన్నా చెప్పాలనిపించి – ఎవరు వింటారు లే? అనిపించినా – బ్లాగు నన్ను ఆదుకుంది. అఫ్కోర్స్, ఆ వినబోయి మిస్సయిన వాళ్ళని నాకంటే ఎక్కువ ఆదుకుంది అనుకోండి. అది వేరే విషయం. ఒక విధంగా బ్లాగు రాయడమే శ్రేయస్కరం. మనం చెప్పాలనుకున్న క్షణంలో వినేవారికి ఆసక్తి ఉండకపోవచ్చు. వాళ్ళకి రాసిచ్చేసి, తీరిగ్గా చదూకోండి అనొచ్చు. ఆ తర్వాత రాసాక నేను ఏ అండమానో పారిపోయి వాళ్ళకి అది చదివి కోపమొచ్చినా కూడా, వాళ్ళ తిట్లని తప్పించుకోవచ్చు. అదనమాట ఈ బ్లాగుతో నా అనుభవమూ… అనుబంధమూనూ.

Advertisements
Published in: on October 16, 2008 at 10:14 am  Comments (26)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/10/16/287/trackback/

RSS feed for comments on this post.

26 CommentsLeave a comment

 1. తెలుగు బ్లాగుకు వన్నె,విలువ తెచ్చిన వాటిలో సౌమ్య పుస్తక సమీక్షల బ్లాగు ఒకటి అని నిస్సందేహంగా చెప్తాను.200 టపా మజిలీ సందర్భంగా, హార్దిక అభినందనలు.

  -cbrao
  Columbus,Ohio.

 2. 200వ టపా మైలురాయి చేరిన సౌమ్యగారికి అభినందనలు. నిస్సందేహంగా తెలుగు బ్లాగు చరిత్రలో మీ బ్లాగో కలికి తురాయి. మీ పుస్తక సమీక్షలు, సినిమా సమీక్షలు వేటికవే సాటిలేనివి. మీ జైత్రయాత్ర 2000 టపాలు మించి కొనసాగాలని కోరుకుంటూ…
  -రవి

 3. నువ్వొకటి రాయాడం మర్చిపోయావ్.. ఈ బ్లాగు పురాణం చదివినా వారికీ బొలేదంత ఇంఫో తెలుస్తుందని చెప్పటం. 🙂 This is truly a treasure of information about everything and anything.

  Your blog has helped me in a lot many ways, than I could mention here. Fab job done so far! Keep rocking!

  Best Regards,
  Purnima

 4. congratulations soumya for 200th post. and good memories..

 5. మీ 200వ టపాకి అభినందనలు.

 6. మీ ప్రయాణం(గతుకులు లేని రోడ్డు మీద) మువ్వలు కట్టిన ఎద్దులబండిలో ప్రయాణంలాగా హాయిగా ఆహ్లాదంగా ఉంది సౌమ్య గారూ! ఇలాగే మరిన్ని ఏళ్ళు హాయిగా ప్రయాణిస్తూ, మంచి టపాల్తో మమ్మల్ని పలకరిస్తూ ఉండండి!

  200 టపాలే! అద్భుతం! అభినందనలు ….!

 7. రెండువందల టపాలైన సందర్భంలో నా శుభాకాంక్షలు.నవతరంగంలో మీ కామెంటు చూసి నేను మీ బ్లాగులోకి వచ్చా, అలాగే బ్లాగులోకంలోకి కూడా. అంటే, పరొక్షంగా మీరే నా బ్లాగుప్రాసన చేయించినవారన్నమాట! నాకు వచ్చే ప్రశంశలూ,విమర్శలలో మీకూ కొంత భాగం చెల్లుతుంది.

 8. @రావు గారు, రవి గారు, జ్యోతి గారు, సిరిసిరిమువ్వ గారు, సుజాత గారు
  – Thanks a lot for your wishes.
  @Purnima & Mahesh : 🙂

 9. నేను చాలా పుస్తకాలు చదువుతాను అనే అపోహలో ఉండేదాన్ని ఈ బ్లాగు చూడకముందు!
  ఒక పుస్తకం గురించి ఎంతవరకు చెప్పాలో, దాన్ని చదవడానికి ఆసక్తి కలిగించడంలో మీరు దిట్ట!
  Congrats for 200th post and eenadu lo బ్లాగు గురించి వచ్చింది కదా(అప్పుడు చెప్పలేదు).. లేట్ గా అయినా లేటెస్టె గా అందుకోండి అభినందనలు.. 🙂

 10. అభినందనలు

 11. chala bavundi sowmya!

 12. కంగ్రాట్స్ సౌమ్య గారు 200 వ పోస్ట్ కి రెండో కారణం ఏమై ఉంటుంది చెప్మా అని ఆలోచిస్తున్నాను. మీ ప్రయాణం మరిన్ని మైలు రాళ్ళు చేరుకోవాలని మనఃపూర్తిగా కోరుకొంటూ..

 13. అభినందనలు సౌమ్యా! నాకు నీ సమీక్షలు చదవడం చాలా ఇష్టం 🙂

 14. ‘ఆలకించినా ఆలపించినా ఆనంద మొలికించే గాథ’ 🙂

 15. కు మీరు ఆశాకిరణ్ గురించి రాసే విషయాలంటే ఇష్టం.ఆ తరువాత మీరు తమిళ్ వారయుండి తెలుగు ఇంత బాగా రాస్తున్నారని తెలిసి మీమీద గౌరవం తెగ పెరీపోయింది.నా బ్లాగులో మీ కామెంటు ఎప్పుడొస్తుందా అని ఇప్పటికీ ఎదురుచూస్తుంటాను.ఎప్పటికైనా మీకు కామెంటు పెట్టాలనిపించే కవిత తప్పక రాస్తాను.చూస్తూ వుండండి.:)
  డబుల్ సెంచరీకి అభినందనలు.

 16. Thanks to Medha, Pedarayudu, Adarsh,Ramani, Nishigandha and Ranare.
  @Radhika: అయ్యో! నేను ఏ బ్లాగునూ అంత తరుచుగా చూడనండీ. అందుకే ఎక్కడా నా కామెంట్లు ఎక్కువగా కనబడవు. మీరు అపార్థం చేసుకోకండి 🙂

 17. 200 టపాల మైలు రాయి చేరుకున్నందుకు అభినందనలు సౌమ్య గారు.

 18. 200 టపాలు, హూరే..:))

 19. హూరే…..3 comments 🙂 🙂
  thanks sowmya 🙂

 20. congrats on ur 200 th post. we wish all success in your blogging. please visit my blog http://www.ragamrrao.blogspot.com and comment thankx

 21. కంగ్రాట్స్! రాస్తున్నందుకు నెనర్లు. బహిరంగ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాను…. 🙂

 22. చెప్పను చెప్పను అంటూనే చిన్నదో చాలా విషయాలు చెప్పింది చిన్నదో చిన్నదీ psmlakshmi

 23. Congrats, please keep writing on.

 24. gud..time ledu lekapothe annee chadive vadni…time chuusukoni chaduvuthaanu..

 25. blog industry lo 200 posts experince amma ,industry lo mudella nunchi vunna ani cheputaranna mata ika nunchi .

 26. Hi Sowmya, congrats. Great going..

  avunu, naakoka doubt..how could we write in Telugu posts in wordpress where as I couldn’t do even after I set the language as Telugu?

  please clarify…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: