“ఆంధ్ర దేశం” వెనుక కథ

నేను ఇప్పుడే విశ్వనాథవారి పన్నెండు సంపుటాల “పురాణ వైర గ్రంథమాల” లోని మొదటి పుస్తకం “భగవంతుడి మీద పగ” చదవడం మొదలుపెట్టాను. ఇందులో Andhra కి ఆంధ్ర దేశం అన్న పేరు రావడం వెనుక ఒక కథ చెప్పారు…అది ఆసక్తి కరంగా అనిపించి ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

ఇదివరలో శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని ని పెళ్ళి చేసుకున్న యయాతి ఉండేవాడు కదా… అతనికి ఐదుగురు కుమారులట. వారిలో అనువు అనేవాడొకడు. ఆ వంశంలో బలి అని ఒక రాజు ఉన్నాడట. అతను భారతదేశం యొక్క తూర్పు ప్రాంతాన్ని పాలించేవాడు. దానికి ప్రాచ్యకదేశమని పేరు. (అప్పటి భారత దేశమంటే… దానిలో ఏవేవి ఉండేవో మరి…అది రాయలేదు అక్కడ) అతనికి ఆరుగురు కొడుకులట – అంగరాజు, వంగరాజు, కళింగరాజు, సుంహరాజు, పుండ్రరాజు మరియు ఆంధ్రరాజు! ఆ బలి తన ఆరుగురు కొడుకులకీ తన రాజ్యం విభజించాక, కృష్ణా గోదావరీ నదుల మధ్య ఉన్న భాగం ఆంధ్ర రాజుకి వచ్చింది. అప్పట్నుంచి ఈ ప్రాంతాన్ని ఆంధ్ర దేశమంటున్నారట.

– ఈ పరంగా కథ బానే ఉంది కానీ, దక్షిణాన్ని తూర్పు అని అన్నారంటే, అప్పుడు దేశం ఎలా ఉండేదో అని నాకు మహా కుతూహలంగా ఉంది. లేకుంటే, దక్షిణాన ఉన్న తూర్పు దిక్కా? అసలు బలి రాజు రాజ్యం సరిహద్దులేమిటో! ఈ విషయాన్ని దేని ఆధారంగా చెప్పారో అక్కడ రాయలేదు కనుక, సొంత సెర్చి చేసుకుని రిసర్చుకోవాలని మాత్రం అర్థమైంది 😦

Advertisements
Published in: on October 6, 2008 at 1:40 pm  Comments (11)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/10/06/ap-stor/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. congratulations on the eenaadu recognition.
  good show

 2. పురాణవైర గ్రంధమాల ను మరీ చారిత్రిక దృష్టితో చదవకూడదు. అవి విశ్వనాథవారు కాలక్షేపంగా వ్రాసినవి. “విశ్వనాథ వారు పురాణవైర గ్రంథమాల వ్రాసిన తరువాత తెలుగులో హాస్య గ్రంధాలు లేని లోటు తీరిపోయింది” అని వ్యాఖ్యానించారు ఎవరో (నార్ల వెంకటేశ్వర రావు గారో, చలసాని గారో గుర్తులేదు).

 3. అదన్నమాట ఆంధ్ర పేరు వెనక కథ. మరి ఆంధ్ర రాజు అన్నపేరు యయాతికి ఎలా తోచింది? దానికి ముందు కథ ఏమిటో. నారెండో సందేహం, తెలుగు హలంతాలభష కాదు కదా. ఆంధ్రదేశం అనకుండా ఆంధ్రప్రదేశ్ అంటున్నారెందుచేత. నాకీ సందేహాలు ఎప్పటినుండో వున్నాయి. ఎలాగా మొదలెట్టావు కదా నువ్వో మరోకరో చెప్తారని ఇక్కడ పెడుతున్నాను.

 4. @Chandra Mohan:
  అదేమిటండీ అలా అనేసారు? విశ్వనాథ వారి “పురాణ వైర గ్రంథమాల” గురించి అంతకుముందోసారి ఇలా హాస్యం లా ఫీలైనందుకే ఓ పేజీ కామెంటు రాసారెవరో. ఇంతకీ, మరి, ఆయన చరిత్ర ని సవరించే ఉద్దేశ్యంతో రాయలేదంటారు? అసలు ఆయన ఈ గ్రంథాలు ఎందుకు రాసినట్లు మరి? ఈ పుస్తకాల్లోని కథలకి చారిత్రక ఆధారాలున్నవి కదా. కథ ఫిక్షన్ అయి ఉండొచ్చు కానీ, మూలం చరిత్రే కదా?

 5. Thanks to eenadu.bcoz to recognize this site.

 6. thanks

 7. పురాణాలు చరిత్ర కాదు. చరిత్రనుండి అయినా సరే, ఏదో ఒక పాయింట్ ను తీసుకొని దానిమీద కల్పన జోడించి వ్రాస్తే అది చారిత్రిక రచన కాలేదు. రాహుల్ సాంకృత్యాయన్ వంటి గొప్ప చరిత్రకారుడు కూడా అక్కడక్కడా అభూత కల్పనలు (జనరంజకంగా ఉండడం కోసం) జోడించినట్లు విమర్శకులంటారు. ఆయన వ్రాసిన ‘సింహ సేనాపతి ‘ అనే పుస్తకంలో ఆ కథ ఆయనకు భూమిని తవ్వుతుండగా దొరికిన ఇటుకలపై వ్రాసిఉందని, ఆ ఇటుకలు పాట్నా మ్యూజియంలో భద్రంగా ఉన్నాయని వ్రాశారు. దీన్ని నమ్మక చలసాని ప్రసాదరావుగారు ఆయనకు ఉత్తరం వ్రాస్తే “నిజమే, ఇటుకలు దొరకడం అబద్ధమే, కథ మాత్రం నిజం” అని జవాబు వ్రాశారట.

  నిజానికి విశ్వనాథ వారు ఈ పుస్తకాలెందుకు వ్రాసారో అని నాకూ అనిపిస్తుంది. ఎవరైనా వారి పరిచయం ఉన్నవారు చెప్పాల్సిందే.

 8. అన్నట్లు ఆ వర్ణన భారతదేశం తూర్పు భాగానికి సరిపోతుంది. అంగ రాజ్యమంటే నేటి అస్సాం, వంగ రాజ్యం (వెస్ట్)బెంగాల్, కళింగ నేటి ఒరిస్సా, ఇక ఆంధ్ర ప్రదేశ్ — ఇవన్నీ కూడా భారతదేశపు తూర్పు తీర రాష్ట్రాలే.

 9. Mee opikaki mechhu kovaali …
  who cares how name comes ….
  what is your motive behind reading old books ..
  are you planning to take us back to the past?
  Are you one of those people crying on we lost culture?

  What can we learn from this?

 10. @Anil:
  Looks like I somehow missed your comment.
  whts my motive: I am just keen to read older Telugu literature.
  are you planning to take us to the past?: Why should I? I am not in to the business of leading people somewhere.
  Are you one of those people crying on lost culture?: NO. I basically have other things to think about, other than losing culture or gaining it.
  What can we learn from this? : if “this” is the book, A LOT.

 11. Sowmya garu namasthe,

  I have just seen about your blog in computer era. Thanks to computer era and Ms. Tadepalli Lalitha Subrmhanyam who introduced your blog.
  I wish to congratulate you for showing so much interest in reading books. I am surprised that the youth of this generation are reading books. How you are getting time while still pursuing your studies. That old telugu leterature is not at all read by present generation. Thank you for showing interest and writing about them.

  I appreciate your efforts and I wish you continue the same in future.

  The first subject I have seen is Andhra Desham Venuka Katha which is interesting and the views expressed by other readers also interesting.

  Thanks a lot.

  P.Narasimha Murhty,
  pothireddy.nm@gmail.com


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: