మువ్వల సవ్వడి

డీడీ-సప్తగిరి ఛానెల్లో ఎన్నాళ్ళుగానో గుర్తులేదు కానీ, చాలా రోజుల్నుంచే “మువ్వల సవ్వడి” అన్న ప్రోగ్రాము వస్తోంది. “పాడుతా తీయగా”, “సరిగమపా” వంటి ప్రోగ్రాముల వంటిడే. తేడా ఏమిటీ అంటే, ఇది శాస్త్రీయ నృత్యం లో… సంగీతం లో కాదు. ప్రతి వారం ఇందులో కూడా నలుగురు నాట్యకారులు వస్తారు. మూడు-నాలుగు రౌండ్లు ఉంటాయి. ఇలాంటి కంటెస్టుల పద్ధతిలోనే సాగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా దీని గురించి బ్లాగడం ఎందుకూ అంటే, రెండు కారణాలు:

1. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ నుండీ దాదాపుగా ఫాలో ఔతూనే ఉన్నాను. మొదట్లోనే నాకు నమ్మకం ఉండేది కాదు ఈ ప్రోగ్రాం ఎక్కువ రోజులు కొనసాగుతుందని. కానీ, నా ఆంచనా తప్పైంది. ఇప్పుడు అప్పటికంటే ఆకర్షణీయంగా తయారైంది.

2. అసలు పాటలు పాడే ప్రోగ్రాములు ఒకరకం. డాన్స్ బేబీ డాన్స్ వంటివి మరో రకం. కానీ, శాస్త్రీయ నృత్యం లో ప్రోగ్రామంటే…అది వేటికీ చెందని కొత్త రకం. అసలు మొదటగా మనుష్యులు ఎక్కడ్నుంచి దొరుకుతారో అంతంత మంది అని కూడా ఓ అనుమానం ఉండేది నాకు…అదీ తీరిపోయింది. గుంపులు గుంపులు గా కొత్త నలుగురూ (ఒక్కోసారి ఎనిమిది మంది కూడానూ.) వస్తూనే ఉంటే.

కార్యక్రమాన్ని నిర్వహించేది సినీనటి ప్రభ. ఒక్కో ఎపిసోడ్ కూర్పుకీ ఎంత హోంవర్కు జరుగుతూ ఉందో ఈ ఎపిసోడ్లని కాస్త గమనిస్తూ వచ్చిన ఎవరికన్నా అర్థమౌతుంది. నా మటుకు నేను గత రెండు మూడు వారాలుగా తప్పితే ఈ ప్రోగ్రాం ని ఆసక్తితో చూసిందే చాలా తక్కువ – చూడాల్సి వచ్చి ప్రతి వారమూ చూడ్డమే కానీ (ఒకే టీవీ ఉంటే… ఒకే ఛానెల్ అందరూ చూదాలి కదా… 😉 ) పైగా, పాటల ప్రోగ్రాములు చూడడానికి మనకి శాస్త్రీయ పరిజ్ఞానం లేకున్నా పర్లేదు కానీ, ఇలాంటి నృత్య ప్రదర్శనలు ఏం అర్థమౌతాయని చూసేది? ఒకరు బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకోరు కూడా బాగా చేస్తున్నారనిపిస్తుంది. కానీ…ఈ రెండు “బాగా” లకి ఉన్న తేడా అర్థం కాదు. డంబ్ ఆడియన్స్ గా చూడాల్సిందే. అదే అంత నచ్చక పెద్ద శ్రద్ధగా చూడలేదు ఇన్నాళ్ళు.

ఓ పది పదిహేనురోజుల క్రితం ఓ ఆదివారం ఈ ప్రోగ్రాం మొదలౌతున్నప్పుడు ప్రభగారు “రిలేటివ్స్ స్పెషల్” లో భాగంగా అంటూ మొదలుపెట్టారు. “ఇదేమిటో!” అనుకుంటూ చూస్తే తెలిసింది. ఆ రోజుటి ఎపిసోడ్ తండ్రీ కూటుళ్ళ స్పెషల్ అట. ఇదేదో బాగుందే అనుకుని చూస్తూ ఉంటే, వచ్చిన వారిలో ఒకరు తప్ప మిగితా వారు వేసిన నృత్యాల్లో తండ్రి ఆడ పాత్ర ధరించాడు! ఇదంతా ఒక వీక్లీ ప్రోగ్రాం గా చూడడానికి చాలా కొత్తగా అనిపించింది. గత వారం ఎపిసోడ్ లో తల్లీ కూతుళ్ళ స్పెషల్ అట. ఇవి కాక ప్రతిసారీ నాట్యానికి సంబంధించి, ప్రముక నర్తక నర్తకీమణుల గురించీ – ఏదో ఓ సమాచారం ఇస్తూనే ఉంటారు. ఇలా ఏదో ఒకటి చేస్తూ, ప్రోగ్రాం ని ఆకర్షణీయంగా తయారు చేయడం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. 🙂

ఇలా పొగిడేస్తున్నానని అందులో నాకు నచ్చనివి లేవని కాదు. ప్రతిదానిలోనూ పిడకలవేట ఉండనే ఉంది కదా నాకు. ఉదాహరణకి క్విజ్ లాగా ప్రశ్నలేసే రౌండులో, సైగల్తో వాక్యం చెప్పే రౌండ్ లో – ఇప్పటి దాకా ఏ ఒక్క టీం కూడా తప్పు చెప్పడం చూడలేదు నేను చూసిన ఎపిసోడ్లలో. ఎంతైనా అది కాస్త అనుమానాస్పదంగా ఉంది. ముందే ప్రశ్నాపత్రం లీకైందా అన్న అనుమానం వచ్చేస్తోంది. అయితే, ఈ ప్రోగ్రాంలో ఉన్న పాజిటివ్స్ ఎక్కువ నా అభిప్రాయంలో. కనుక, ఒకసారన్నా చూసి తీరాల్సిన ప్రోగ్రాం ఇది. ఇలాంటి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్న దూరదర్శన్ వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.

Update : Timings – Sunday 8:30 PM-9:30 PM

Published in: on September 24, 2008 at 5:10 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/09/24/muvvala-savvadi/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. True! DD has to be congratulated on such ventures. Nice programme and a nice a write up. 🙂

 2. nenu prati vaaram choostanu muvvala savvadi ni. aata lanti asabhya nrutyalu, artha nagna veshalu kakunda ento chakkaga chala ahlada karam ga untundi program. Prabha ento hundaga mata lo nu, aaharyam lo kooda ranjimpa chestaru. chakkati program overall ga

 3. మంచి కార్యక్రమం గురించి చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీలో డ్యాన్స్ డిపార్టుమెంట్ మా పక్కనే ఉండటం వలన, ఇంత మంది డాన్సర్లు ఎక్కడి నుంచీ వస్తారా అనే సందేహం నాకైతే ఎప్పుడూ లేదుగానీ, కార్యక్రమం ఇన్నాళ్ళూ నడవడమే ఆశ్చర్యంగా ఉంది…అదీ ఇంత బాగా!

  ప్రభగారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. TRP నిలుపుతున్న ప్రేక్షకులూ అభినందనీయులే!

 4. sowmya garu, time ni bloga ledu meru.

 5. chaala bagundi mee parichaya geetika

  naaku teliyadu intha varaku. samayam kuda chebite bagundedi. manchi karyakramam vivarinche tondaralo adi marichi natlunnaru

 6. @Rajasekhar and Kiran:
  Thanks. Timings updated in the post.

 7. బాగుంది సౌమ్య గారు మంచి ప్రోగ్రాం ని తప్పక ప్రోత్సహించాలి. బాగా పరిచయం చేసారు. ఇక సైగ లతో చెప్పే వాక్యం విషయానికి వస్తే నాట్యాని కి సైగల ద్వారా భంగిమల ద్వారా అంటే మాట్లాడకుండా భావాన్ని ప్రకటించ గలగడం అవసరం కదండీ సో ఆ ప్రోగ్రాం లో పాల్గొనడానికి వస్తున్న వాళ్ళంతా అందులో నిష్ణాతులై ఉంటారు అందుకే అలా అందరూ సరిగా చెప్ప గలుగుతుండి ఉంటారు అందులో అనుమానించాల్సింది ఏమీ లేదేమో.

 8. అవునండి చాలా మంచి ప్రొగ్రాం, నేనూ క్రమం తప్పకుండా చుస్తున్నా మొదటినుండి………డిడి వారికి ఈ విషయంలో ధన్యవాధములు, మీకు నూ ఒక మంచి ప్రొగ్రాం గురించి ప్రస్తావించినందుకు.

 9. dd saptagiri lo oka manchi programe


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: