జ్ఞాపకానికి సలాం

Found this in my notes. Was written in July. Thought I would post this in the blog.  Enter the dragon 😉
***********************************************************************
ఒక్కోసారి సందేహం కలుగుతూ ఉంటుంది – మనం జీవితమని చెప్పుకుంటూ గడిపేది ఒకే జీవితమా? లేక కొన్ని జీవితాలని నేర్పుగా కలిపేసిన దారాలవల్ల ఒకటిగా అనిపిస్తున్న జీవితాల సమూహమా? అని. ఈ దారాలే జ్ఞాపకాలేమో. వీటి అల్లికల్లో నడుస్తున్నప్పుడు వాటి స్పర్శకు మనలో కలిగే ప్రకంపనల్నే మనం – “Journey down the memory lane” అంటామేమో! అప్పుడెప్పుడో ఓరోజు జ్ఞాపకాన్ని గురించి తలుచుకుని అబ్బురపడ్డ విషయం గుర్తొచ్చింది ఇప్పుడే. వెంటనే జ్ఞాపకానికి సలాం చేస్తూ ఇదంతా రాయకుండా ఉండలేకపోతున్నా.

ప్రపంచంలోకి వచ్చింది మొదలు మెదడు కార్ఖానాలో జ్ఞాపకాల ఉత్పత్తి మొదలు. కాలంతో మరుగున పడేవి కొన్నీ, అన్నింటినీ మరుగున పడేసి మీద పడి వేధించేవి కొన్నీ, అన్నింటినీ మరపించి మనసులో నిండిపోయేవి కొన్నీ – మనిషి జీవితం (జీవితాలలో) ఎన్ని జ్ఞాపకాలో. ఈ చిన్ని గుండెను, మెదడునూ తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు – ఇంతటి వెల్లువను లోపలుంచుకుని పైకి మామూలుగా ఎలా కనిపిస్తాయా? అని. స్థితప్రజ్ఞత కాబోలు! మనిషికి లేకపోయినా మనిషి అవయవాలకి! తలుచుకుంటే నవ్వొస్తోంది నాకు.

జ్ఞాపకం మహా చెడ్డది. తీపిలో చేదులా, కారంలో తీపిలా – ఇలా అసందర్భంగా వచ్చి మీదపడి, వేధించి, విసిగించి -వర్తమానాన్ని నరకం చేస్తుంది. మరపురాని కొత్త జ్ఞాపకాలని సృష్టించుకోనివ్వకపోగా తలుచుకున్నప్పుడల్లా చేదుగుళికల్లా తగులుతుంది. కానీ, మనుషుల్లో లాగానే జ్ఞాపకాల్లో కూడా జీవితంలో వెలుగును నింపేవీ, పెదాలపై చిర్నవ్వులు విరబూయించేవీ ఉంటాయి. జ్ఞాపకం చాలా మంచిది కూడానూ. “వలపూ వగపూ నవ్వూ ఏడుపూ కలబోతేరా జీవితము” అని ఓ కవి అన్నట్లు.. జ్ఞాపకం కూడా అంతే. అంటే, జ్ఞాపకం కూడా జీవితం వంటిదేనా? జీవితాల్ని కలిపేదీ జీవితాలే? నా ఆలోచన నాకే వింతగా ఉంది.

జరిగిపోయిన జీవితంలోని సంతోషాల్నీ, మరిచిపోలేని అనుభూతుల్నీ మళ్ళీ మళ్ళీ ఓ పక్క అనుభవిస్తూ, మరో పక్క కొత్త జ్ఞాపకాలను సృష్టించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండటమే జీవితానికి నేనిచ్చుకునే అర్థం అనిపిస్తోంది నాకు. జ్ఞాపకం కూడా జీవితం వంటిదే అయినప్పుడు జీవితంలో ప్రతిబింబించే మంచీ-చెడూ, తీపీ-చేదూ, బాధా-సంతోషం జ్ఞాపకాల్లోనూ ఉండొద్దూ? చేదు జ్ఞాపకాల్నీ, నాలోని చెడును గుర్తు చేసే జ్ఞాపకాల్నీ దగ్గరివారితో పెరిగిన దూరం వల్ల కలిగే బాధని గుర్తుచేసే జ్ఞాపకాల్నీ వదిలి నేనెలా ఉండగలను? జ్ఞాపకమన్నాక ఏదైనా జ్ఞాపకమే!

ఎవరినో చూస్తే ఎవరో స్ఫురణకు రావడం, ఏదో సంఘటన చూడగానే ఇంకేదో గుర్తు రావడం ,ఈ తతంగమంతా మరో కొత్త జ్ఞాపకంగా ఉద్భవించడం – ఈ తతంగమంతా తలుచుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. సృష్టికర్త మనస్సన్న ఒక్క భాగంలోనే ఇంత complexity చూపించాడే! అని. జ్ఞాపకం ఆద్యంతాలు తెలుసుకోడానికి మనిషి మనసుని శాస్త్రీయంగా చదవాలనుంది. ఒక విషయం జ్ఞాపకంగా మారే క్రమమంతా తెలుసుకోడానికి మెదడు పనితీరు తెలుసుకోవాలనుంది. ఒక స్పర్శ ఒక పాత జ్ఞాపకాన్ని మేల్కొల్పగలదు. ఒక మాటని విన్న చెవి, ఒక వాసన పీల్చిన ముక్కు, ఒక ప్రదేశాన్ని చూసిన కన్ను, ఒక వస్తువు తాకిన చేయి, ఒక చోట మోపిన పాదం, ఒక సందర్భంలో అన్న మాట-శరీరంలోని ఏ భాగం జ్ఞాపకాల వెల్లువకు తెరలేపకుండా ఉండగలదు? శరీరానికీ, జ్ఞాపకానికీ ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి Human biology తెలుసుకోవాలనిపిస్తోంది. జ్ఞాపకాల మూలం తెలుసుకోవలన్న ఆశ శాస్త్ర విజ్ఞానాన్ని గురించిన ఆసక్తిని కలిగించడం వింత కాక మరేమిటి?

అసలు జ్ఞాపకమన్నదేమిటి? అదో అనుభూతి అనుకుందామా? మరి అదే జీవితమన్న భావన కలిగిందాయె! అనుభూతే జీవితమా మరి? లేక – ప్రతి క్షణం ఓ జీవితమైతే, ఒక జీవిత కాలపు అనుభూతిని మరో జీవితకాలంలో సాక్షాత్కరింపజేసే ఏజెంట్ జ్ఞాపకమా? జ్ఞాపకమంటే ఏమిటో అర్థం కాకుండానే, జ్ఞాపకం ఆద్యంతాల గురించి కాస్తయినా అవగాహన లేకుండానే వాటి వెల్లువలో పడి కొట్టుకుపోతూ, వాటిని వెర్రిగా ప్రేమిస్తున్నానే… ప్రేమ గుడ్డిదని ఎందుకంటారో ఇప్పుడే అర్థమైంది!!

************************************************************

PS: బ్లాగుని weapon of mass destruction గా ఉపయోగించడం ఎలా? అన్న సందేహం ఎవరికన్నా వచ్చుంటే… did u get any hints for an answer after reading this post? 😉

Advertisements
Published in: on September 12, 2008 at 12:35 pm  Comments (16)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/09/12/memory-salaam/trackback/

RSS feed for comments on this post.

16 CommentsLeave a comment

 1. 🙂 Trying to make it simple.

  జ్ఞాపకం నీరు లాంటిది. ప్రవహిస్తూ ఉంటేనే జీవితం. అలా కాదు అని బందించామ అది విషంతో సమానం. నది లో ఎంత కాలుష్యం ఉన్నా కొత్త నీరు వస్తుంది కాబట్టి, ఇంకా ఆరొగ్యమే. అదే ఒక సీసాలో నీరూ పోసి పెడితే నాలుగు రోజుల తర్వాత హానికారం అయిపోతుంది. జ్ఞాపకాలు కూదా కదులుతూనే ఉండాలి, మారుతూనే ఉండాలి. ఒకే దగ్గర ఆగామా?.. అంతా ఫట్!

  Feeling that the weapon of mass destruction is better? It’s all human not to see in good in bad, unless something worse happens! 😉 Wat say?

  Good post! Let’s my imaginations run wild 😉

 2. “life is a collective memory” అంతే ! జ్ఞాపకాలే లేకపోతే జీవితానికి అర్థమే లేదు. మర్చిపోలేని జ్ఞాపకాలు జీవితనాణ్యతకు చిహ్నాలు. అందుకే, అవి మనదగ్గరెన్నున్నాయన్నది చాలా ముఖ్యం.

 3. పూర్ణిమగారు, మీ వివరణ అద్భుతం.

 4. excellent thoughts.
  beautifully presented
  thankyou

  bolloju baba

 5. అనానిమకుడు: 🙂

 6. :)బాగుంది తాత్త్విక చింతన. పూర్ణిమ చెప్పినట్టు జ్ఞాపకాలు మారుతూంటాయి. అయితే తను అన్నట్టు ఆ మార్పు స్వయంకృతం అంటున్నారు తను. మన ప్రసక్తిలేకుండానే, కాలక్రమంలో ఇతర అనుభవాలమూలంగా మారిపోతుంటాయని నేను అనుకుంటాను. బుచ్చిబాబు గారి చివరకు మిగిలేదిలో ఆయన సందేశం అదే.
  బాగా రాసేవు. నీతెలుగువాడుక కూడా మెరుగుపడినట్టుంది :p

 7. చాల బాగా, తాత్త్వికంగా రాశారు.. బాగుంది!

 8. తాత్వికచింతన, భావుకత బాగున్నది

 9. జ్ఞాపకమనగానేమి? అది మానిసి యొక్క చిత్తవ్యాపారము. వ్యాపారమనిన లాభదాయకమనియేనా! లాభముగల్గించని వ్యాపారములును కలవు. జ్ఞాపకములునట్టివే. కొన్ని లాభదాయకములు, కొన్ని గావు. కానివానిని విడిచిపెట్టిన మంచిది. అట్లు విడిచిపెట్టు శక్తి మానవునిచేతియందు గలదా? కలదు, లేదు… యిది యొక చమత్కారము! — విశ్వనాధ వారి స్టైలు 🙂 . విశ్వనాధ వారి రచనలు చదివాకే మీకు ఇలాంటి విచికిత్సలు తలెత్తినట్లున్నాయి. తత్వవిచారము డోసు మించిన వికటించగలదు 😉

  Good thoughts anyway!

 10. సూక్ష్మం గా చెప్పాలి అంటే, జ్ఞాపకాలు అనేవి మన plane of thinking మీద ఆధారపడి వుంటాయి. జ్ఞాపకము అంటే… మన perception వల్ల మనం ఎక్కువ intensity లో ఒక సంఘటన లేదా వస్తువు గురుంచిన అనుభూతి చెందడం. ఈ అనుభూతి చెందడం అనేది జ్ఞాపకం గా మారాక, మరోసారి అలాంటి సంఘటనే ఎదురైతే, మరలా మనం ఆ జ్ఞాపకం లో మాత్రమే లీనం అవుతాం కాని, కొత్త జ్ఞాపకం రాదు. అంటే, మన జ్ఞాపకాలు, మనయొక్క వివిధ మానసిక స్థాయిల గురుంచి తెలిపే సోదాహరణ సమాచారం అన్నమాట. భావుకత ఎక్కువ అయ్యినప్పుడు జ్ఞాపకాల వెల్లువ ఎక్కువ అవుతుంది. తాత్వికత ఎక్కువైతే, జ్ఞాపకాల కన్నా, నేర్చుకున్న బోధల విచికిత్స తోనే కాలం గడిచిపోతుంది. అదే లక్ష్య సాధన మీద మనసు నిలకడ గా వుంచ గలిగితే, మన జ్ఞాపకాల database మనకు ఒక గ్రంధాలయం లాగ సహాయపడుతుంది. అమ్మాయీ మొత్తానికి మేధోమధనం చెయ్యనియ్యకుండా వదిలిపెట్టవు గా. 🙂 Another good post from your pen.

 11. చిన్న సవరణ. ఒకేలాంటి సంఘటన మనకి కొన్ని సంవత్సరాల తర్వాత ఎదురైతే, మన perception ఒకేలా వుంటే కొత్త జ్ఞాపకం రాదు. లేదంటే, database లోకి కొత్త entry వచ్చినట్టే.

 12. మీరు వ్రాసింది చదువుతున్నంత సేపు తెరలు తెరలుగా ఎన్ని జ్ఞాపకాల దొంతెరలు మనసును కప్పేసాయొ! నాకు అనిపిస్తుంది, ఏకాంతం అనే పదానికి అర్థం లేదు, జ్ఞాపకాలు రెప్పపాటు కాలమైనా ఒంటరిగా వదిలితె కదా. ధ్యానం లొ కుర్చున్నా, జనారణ్యం లో నడుస్తున్నా, వేసవి సెలవల్లో పోగు చేసుకున్న గోళీల్లా జ్ఞాపకాలు దొసిలి నింపెస్తాయి… జ్ఞాపకాలకు దండాలు రాసినోళ్ళకు లంగిడీలు…

  సౌమ్యగారు మంచి పుస్తకం వ్రాసి ప్రచురించె సమయం ఆసన్నమైందేమొ…

 13. Thanks everyone for your comments! 🙂

 14. ‘gnapakam’ chinna padam la kanipinchina adi enno nigudamaina vishayala kalabotha..kondaru vyakthulu lekunna vari gnapakalo bratakatam kuda anandamenemo..gnapakale lekunte bavalu levu..
  rasina shaili bavundi..sanjeev dev type lo free form lo rasav gada 🙂

 15. Nice post Sowmya…
  Manchi memories bagane untayi nemaruvesukovatani…
  Chedda memomries bagalekapoyina kooda nemaruvesukuntamu 😉
  Orrike annara yemiti mana peddalu “Memory is a way of holding onto the things you love, the things you are, the things you never want to lose. ”
  Cheers,
  prasanna rayaprolu

 16. […] బాధ రాతల్లోనైనా చెప్పుకోగలనన్న ఆశా, “జ్ఞాపకానికి సలాం” కొట్టినప్పుడు కలిగిన ఊరటా ఈ టపాకి […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: