నడక – మొదటి భాగం

చాలారోజులక్రితం రాసుకుని ఇప్పటిదాకా పోస్టు చేయని టపా. మళ్ళీ మళ్ళీ రాయాబోయే విషయాలకి ఈ టపా పనికొస్తుందని, ఎట్టకేలకి ఇప్పుడు దీనికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నా … 🙂

నడక ఓ వ్యసనమైపోయింది నాకీమధ్య. ఎండలున్నా,వానలున్నా సంబంధం లేకుండా నడవాలనిపిస్తోంది. (అంటే, అయినప్పటికీ కూడా నా తాలూకా మనుషులకి నా గురించి ఉన్న శ్రద్ధ దృష్ట్యా, వాళ్ళ బెంగల గురించిన నా బెంగల దృష్ట్యా మరీ తెగించడంలేదు లెండి.). నాతో కంపెనీ ఉన్నా సరే, లేకున్నా సరే – అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉండాలనిపిస్తోంది. ఎవరన్నా ఉంటే – “అలా నడుస్తూ మాట్లాడుకుందాం రావోయ్!” అని పట్టుకెళ్ళాలనిపిస్తోంది “చూపులు కలసిన శుభవేళ” లో సుత్తి వీరభద్రరావు లాగా. ఎవరూ లేకుంటే ఇయర్ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ నడుస్తూ వెళ్ళిపోవాలనిపిస్తోంది. గుంపుగా బయటకెళ్ళాలంటే, దూరం తక్కువైతే – “సోదర సోదరీమణులారా! పాదయాత్రగా వెళదాం రండి” అంటూ అరిచి మరీ చెప్పాలనిపిస్తోంది. ఒక్కోరోజు చిరాకేసినప్పుడో, దిగులేసినప్పుడో కూడా ఆఖరికి…అలా నడుస్తూనే ఆలోచనల్లో తప్పిపోదాం అనిపిస్తోంది! నడక గురించి ఆలోచించగా చించగా – నడకల్లో కూడా కొన్ని రకాలుంటయి అనిపిస్తోంది నాకు… పోనీ, నా నడకల్లో అనుకుందాం. వాటి పైనే ఈ టపా.

1. ఒక్కదాన్నే, ఉత్సాహంగా: సాధారణంగా ఉదయాన్నే నడిచే నడకలు ఈ కోవలోకి వస్తాయి. మొదట్లో నాకు సరైన కంపెనీ దొరక్క, చివరకి ఒక్కదాన్నే వెళ్ళిపోవడం మొదలుపెట్టాను. నడక నుండీ పరుగుదాకా రకరకాల స్టేజీల్లో ముప్పావు గంట నుండి గంటదాకా సాగుతుంది ఇది-నాకున్న సమయాన్ని బట్టి పెరిగినా పెరుగుతుంది. రేడియోలో వచ్చే పాటల్ని బట్టి నడక వేగం గానీ, నాలో ఉత్సాహంగానీ – ఎక్కుతూ,తగ్గుతూ ఉంటాయి. చెమట్లు కక్కుతున్నా కూడా అదో ఆనందం ఈ నడకలో. చుట్టు పక్కల రిలేటివ్ గా ఉండే నిశ్శబ్దం కారణమేమో ఆ ఆనందానికి. మధ్య మధ్యన ఆకాశాన్ని చూస్తూ ఆశ్చర్యపోవచ్చు… మధ్య మధ్య ఖాళీరోడ్డునీ, రోడ్డుకిరువైపులా ఉన్న భవనాలనీ, చెట్లనీ చూస్తూ అబ్బురపడొచ్చు. నేను…నా ప్రపంచం…. ప్రకృతి…రేడియో….అంతే….. ఇంకేమీ ఉండదు లోకంలో ఆ గంట సేపూ. 🙂 సమయానికి తలొంచాల్సి వచ్చీ, సూర్యుడి ముందు ఓడిపోయీ గానీ…లేకుంటేనా… ఇది ఆగని పయనంలా సాగేదేమో. దీని సమయం పెంచడం కోసమన్జెప్పి మామూలుకంటే ముందుగా లేవడం మొదలుపెట్టానంటే ఇక అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో నా పిచ్చి. తరువాత్తరువాత ఓ కంపెనీ దొరికాక మరింత రెచ్చిపోయి అప్పుడప్పుడూ “వాక్ టు రిమెంబర్” శీర్షికన రెండు మూడు గంటల నడకథాన్ (అదే…వాకథాన్) లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు.

2.ఒక్కదాన్నే, ఆలోచనల్లో: ఇది పొద్దున్నుంచి సాయంత్రం లోపు ఎప్పుడన్నా చేసే అవకాశం ఉన్న వాకింగ్. ఆలోచనల్లోంచి ఈది నడవాలి కనుక…మెల్లగా సాగుతుంది. ఈ నడకలో ఆలోచనల వెంట నడిచే ఓ లయ ఉంటుంది. ఆలోచనాస్రవంతి ఎక్కడ ఆగితే అక్కడ్నుంచి నడక నత్తనడక ఔతుంది. ఒక్కో అడుగూ భారంగా పడుతూ ఉంటుంది. ఏదన్నా అరుగు దొరికితే కూర్చుండిపోయి, గాల్లోకో…ఆకాశంలోకో…నేలనో చూస్తూ ఉండిపోయే అవకాశాలు ఎక్కువ. ఇది ఆగడం అన్నది మన ఆలోచనాస్రవంతికి అడ్డుపుల్లలు తగలడం మీదా, పరిష్కారం దొరకడం మీదా (ఏది ముందు జరిగితే అది) ఆధారపడి ఉంటుంది. ఈ వాకింగ్ లో ప్రకృతినో..రోడ్లో పోయే వాళ్ళనో ఆసక్తిగా గమనించే అవకాశం తక్కువే. మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటే, వాటిలో చిక్కుకుపోయి ఉంటాము కదా…. అవన్నీ చేయలేము. థోరో అన్న “walk like a camel” అన్న పోలిక ఇక్కడ బానే వరిస్తుంది అనిపిస్తుంది నాకు.

3. ఇద్దరు ముగ్గురు – సరదాగా:  ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళడం మరో రకం నడక. ఈ నడకలో సమయమే తెలీదు. కంపెనీ దొరికాక ఒకప్పుడు బాగా దూరాలు అనిపించినవి కూడా సునాయాసంగా నడిచేయగలగడమే దానికి సాక్ష్యం. కబుర్లలో పడితే, ఎంత దూరం నడిచినా, దూరమూ తెలీదు…అలసటా తెలీదు. అలాగని వందల కి.మీ. లు నడిచేస్తామని కాదు లెండి. ఏదో…కాళ్ళు సహకరించేంత దాకా. అయితే, దీనికి రోడ్డు సహకారం చాలా అవసరం. ట్రాఫిక్ తక్కువగా ఉండాలి…మన పకపకల్ని వినగానే ఇటెం లని చూసినట్లు మనల్ని ఎవరూ చూడకూడదంటే జన సంచారం కూడా కాస్త తక్కువగా ఉంటే బెటర్ 🙂

4. ఇద్దరు ముగ్గురు – పని మీద:
పని మీద వెళితే….గబగబా నడుస్తూ పోతామా…..అంత ఎంజాయ్ చేయలేము. మాట్లాడుకున్నా అది చాలా వరకు ఆ పని తాలూకా విషయాలే ఉంటాయి. 🙂 దీని గురించి అందుకే ఇంకేమీ రాయను. నా మటుకు నాకు ఇది తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చేదే తప్ప ఇష్టపడి వెళ్ళేది కాదు.

5. గుంపు:
గుంపు గుంపు గా వాకింగ్ క్లబ్బు లాగా నడిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నా. ట్రెక్ ఐనా… హైక్ అయినా…. ఏదైనా… నాకు అనుభవం లేదు గుంపుగా నడవడం లో. కానీ, అది ఆ ప్రాంతాన్ని బట్టి ప్రకృతిని బట్టీ ఎలాగైనా ఉండొచ్చని మాత్రం చెప్పగలను. కొన్ని ఫొటోలు చూస్తూ ఉంటే…”అరే! నేను కూడా వెళ్ళుండాల్సింది అనిపిస్తూ ఉంటుంది”… కొన్ని తలుచుకుంటే… “ఇంకా నయం! వెళ్ళాను కాను!” అనిపిస్తుంది. 🙂

-ఇలా వాకింగుల్లోనే సమయం గడిపేస్తే పన్జేసేదెప్పుడు? అనకండి. 🙂 రోజూ అన్నీ చేయనక్కరలేదు కదా. మొదటిదైతే వీలైనంత వరకూ రోజూ చేస్తాకానీ…మిగితావి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి మరి. అయినా, మనశ్శాంతి కోసం రకరకాల పనులు చేస్తూ ఉంటారు మనుష్యులు…నేను నడుస్తా :). నిజం…. పొద్దున్నే అలా ఓ గంట ఆగకుండా నడిచొస్తే…ఎక్కడ్లేని ఉత్సాహమూ వస్తుంది నాకు. దిగాలుగా ఉన్నప్పుడు కూడా ఉత్సాహం వస్తోందని గమనించాను ఈ మధ్యే. నడకా జిందాబాద్!

ఇదండీ ఇప్పటికి నా నడకోపాఖ్యానం. ఈ సందర్భంలోనే H.D.Thoreau రాసిన “వాకింగ్” వ్యాసం చదవగలరు. వాకింగ్ కి ఇంత సీనుందా? అని నన్ను నేను ప్రశ్నించుకునేలా చేసిన వ్యాసం అది. నాకు చాలా ఇష్టం. ఇక్కడ చదవండి. నేను చదివింది ఇక్కడ కాదు కానీ, ఆ లంకె ప్రస్తుతానికి దొరకట్లేదు 😦

Advertisements
Published in: on August 30, 2008 at 9:16 am  Comments (16)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/08/30/walking/trackback/

RSS feed for comments on this post.

16 CommentsLeave a comment

 1. ఒక్కదాన్నే, ఆలోచనల్లో – That’s the most for me. Rest according to the company.

  Nice post! gyarah number bus (walking) rocks!! :-))

 2. sowmya: “సమయానికి తలొంచాల్సి వచ్చీ, సూర్యుడి ముందు ఓడిపోయీ గానీ…లేకుంటేనా… ఇది ఆగని పయనంలా సాగేదేమో.”

  too good:)…

 3. have you read Dr.M.Adinarayana’s Bhramanakanksha?inTelugu??

 4. మీతో పనుండి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అయితే. లేకపోతే నరేష్‌లాగా బలయిపోతారు జనాలు.

  ఒకప్పుడెప్పుడో నడకంటే ఇలాగే అనిపించేది నాకు. ఇప్పుడంతా కూర్చుని ఆలోచనల్లో నడవడమే 🙂

 5. @Purnima: gyarah number truly rox 🙂 Thanks for the comment.
  @Vamsi: Thanks.
  @Rajendra: లేదండీ. వివరాలు తెలుపగలరా ఈ పుస్తకం గురించి?
  @Praveen: :)) అదే, ఒక్కోసారి నాక్కూడా జాలేస్తూ ఉంటుంది ఎవర్నన్నా “నడుస్తూ మాట్లాడుకుందాం” అని అడగాలంటే. 😉

 6. సింపుల్గా బాగుంది.

 7. Good Article.
  You can download the book “Bhramana kaamksha” from http://www.vikasadhatri.org

 8. manishi jeevithame nadaka kadha
  uyyala nunchi smasanam dhaaka vunde nadake jeevitham
  puriti mancham nunchi pudakala chithi dhaaka vunde nadake jeevitham
  emantav 😛

 9. HI Sowmya, thats really nice to see your blog on walking…..Chaala baga rasavu…nee daggariki ee sari vachinappudu prepare ayi vastha…..:)

  keep posting…

 10. @Kolluri garu:
  Thanks for the link. Began reading the introduction 🙂

 11. సౌమ్య గారు,scholargypsy@rediffmail.com ఈ చిరునామాలో ఆయన్ను మీరు సంప్రదించవచ్చు,వికాసధాత్రిలో చదువుతున్నానన్నారు.అక్కడ ఆయనవి ఇతరపుస్తకాలూ ఉన్నాయి.చూడండి.అలాగే ఇటీవల మహాయాత్రికులు అన్న మరో పుస్తకం కూడా ప్రకటించారు.వివిధపత్రికల్లో సమీక్షలూ వచ్చాయి.

 12. ప్రశాంతంగా నడిచేదానికి అవకాశం హైదరబాదులో తక్కువే. పొగలు చిమ్ముకుంటూ, బడబడ మంటూ వెయికిల్సు లేకపోతే కుక్కలు వెంటపడతావుంటే. ఏమైనా పచ్చటి చెట్లు చూసుకుంటూ నడుస్తావుంటే భలే ఆనందంగా ఉంటుంది.

 13. బాగుందండి! నాకు కూడా నడక అంటే బాగా ఇష్టం. ఎటూ వ్యాఖ్యలు వ్రాసిన మిత్రులు కూడా నడక అంటే ఇష్టం అన్నారు కనుక మనం అందరం ఒక group గా ఏర్పడి ఈ సారి elections లొ ఏదో ఒక Party చేసే పాదయాత్ర మన walking services groupకి Outsource చేయమందాం. ఏమంటారు…నడవటానికి ఎవరెవరి కారణాలు వాళ్ళవి.. నా మట్టుకు నాకు నడవటం లో ఒక ఆనందం ఉంది.. ఎందుకంటే బికె లొ వెళ్ళే ప్రతి సారి చుట్టూ కార్లు జీపులు చూసి మనం ఎప్పుడు కొంటామొ అని ఆలోచనలన్నీ పై పైకి వెల్తుంటాయి.. అదే నడిచెప్పుడు ద్రుష్టి ఆలోచన రెండు నెలపైనే ఉంటాయి (down to earth) ముఖ్యంగా నేను ఇంటికి తిరిగి వచ్చే దారిలో నడిచొస్తే అమ్మ భుజం మీద నుంచి జారిపొతూ కేరింతలతో పలకరించే పిల్లలు – మల్లెపూల దగ్గరనుంచి ములక్కాడల వరకు అమ్మె platform గాళ్ళతో బేరమాడే తల్లులు, గాలిలొ అడుగులు వెస్తు కనుసైగలతొ జగతిని శాశిస్తు నడిచే julietlu, colour కోడిపిల్లల్లా రంగు రంగుల చొక్కాలు బుడిగీల్లో romeolu…. ఇలా చెప్పడం కుదరదు కానీ, ఒక సారి అందరు రండి … అలా నడుచుకుంటూ వెళ్తు మాట్లాడుకుందాం. Nice post Sowmya gaaru…

 14. సౌమ్య గారు! బాగున్నాయి మీ నడకలు – సరదాగా! మీ శైలి కూడా బాగుంది, ప్రత్యేకంగా.

 15. Dear Sowmyagaaru, Namaskaaram.
  Your write-up “nadaka” 1st. part is very good. I am a member in Telugu Saahityam Group.You may see my kavitalu under the Title ” raadhamaadhav kavitalu ” – telugu gadya kavita.
  I wish to open a blog for myself in “wordpress.com”. I tried, but I couldnot succeed. I am not expert at computers. Can you guide me to open the blog.
  I had worked in Sericulture Dept. as A.G.M. and took voluntary retirement. I am stationed in Secunderabad. My Cell No.9989928027 ‘ landline: 27794351. e-mail already given above. Thank you.

  PS:- I am giving, shortly, the full meaning of the Annamayya Keertana : neyyamulallo, for which you had asked once in the recent past.

 16. Dear Sowmyagaaru, w.r. to my mail dated 14-9-2008, I had already posted my post on the full meaning of the Annayyamayya keertana ” neyyamulallo” on 15-9-2008. I think it has to pass through the Moderators before it is published. Secondly,I requested you to help me in opening the Telugu Blog. However, later, I could succeeded in opening the same, and now, I have given blog website.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: