రెండు వార్తలు

మొన్నాదివారం నాటి ఈనాడులో వచ్చిన వార్తల్లో రెండు వార్తలు చూసాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. మొదటి వార్త కాస్త నవ్వు తెప్పించింది. రెండవది కాస్త ఆలోచింపజేసింది. రెండు వార్తలూ పేజీలో చూడొచ్చు.

మొదటిది: “ద్విచక్ర వాహనం వెనుక సీటుపై చీరకట్టుతో ప్రయాణం వద్దు! ఒకవైపు కూర్చోవడం వల్లే ప్రమాదాలు: కేరళ హైకోర్టు”
ఇది కాస్త నవ్వు తెప్పించింది. అంటే, చీర కట్టుకుంటే ద్విచక్రవాహనాలు ఎక్కకూడదు అనమాట. అసలుకైతే, కేరళ హైకోర్టు అన్నది – ఒకవైపుకి కూర్చుని ప్రయాణం చేయకూడదని. దానికి అర్థం ఇదే కనుక ఈనాడు ఇదే హెడ్‍లైన్ చేసేసింది :)) కనీసం దక్షిణ భారద్దేశం లో చీర అన్నది చాలా కామన్ గా కనిపిస్తుంది. యువతులను, పిల్లలను పక్కన పెడితే, తక్కినవారందరూ చాలావరకూ చీరే వేసుకుంటు ఉంటారు. కార్లవాళ్ళని వదిలేస్తే, చాలా వరకు మధ్యతరగతి జీవులకు ద్విచక్ర వాహనాలే ఉంటాయి. భార్యా-భర్తా స్కూటర్ మీద వెళ్ళడం, ఒక్కోసారి పిల్లలతో వెళ్ళడం – ఇదంతా చిన్నప్పట్నుంచీ చూస్తున్న విషయమే. ఇలా కూర్చోడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి? మొత్తం యాక్సిడెంట్లలో అది ఎంత శాతం? జరిగినవి కూడా ఒక వైపుకి కూర్చోడం అన్న ఏకైక కారణం వల్ల జరిగాయా? అన్న వివరాలు కూడా తెలిపి ఉంటే, చూసి తెలుసుకుని తరించి ఉండేవాళ్ళం. నిజానికి ఒకవైపుకి కూర్చుంటే దూకేయడం ఈజీకదా… ఆ లెక్కన, వాళ్ళు బతికిపోవాలి కదా! 😉 లేదంటే, ఇదంతా విధి ఆడిస్తున్న వింత నాటకమేమో. ఆటోవారి బాగు కోసం కోర్టు తాపత్రేయమేమో. లేకుంటే, కారు డీలర్ల కోసమో! లేకుంటే, చీరని మరుగున తోయడానికేమో! ఆడవారిని బండి నడపడానికి ప్రోత్సహించడానికేమో. టూవీలర్ల సేల్స్ డబల్ చేయడానికేమో! లేదంటే, ఇవన్నీ కాకుండా ఆడవాళ్ళని రాతియుగంలోకి, వంటింట్లోకి మళ్ళీ తరిమేయడానికేమో!! లోగుట్టు కేరళ హైకోర్టుకే ఎరుక.

రెండవది: “కల్యాణ మండపం నిబంధనే అమ్మాయిని కాపాడింది!”
ఒక కల్యాణమండపంలో నిబంధన ఏమిటీ అంటే, అక్కడ పెళ్ళి చేసుకోబోయే వధూవరులు తప్పనిసరిగా హెచ్‍ఐవీ పరీక్షలు చేసుకోవాలని. దీని కారణంగా పీటల దాకా వచ్చిన ఓ పెళ్ళి నుండి ఓ అమ్మాయి బయటపడింది, వరుడికి హెచ్‍ఐవీ పాజిటివ్ అని తేలడంతో. ఈ వార్త చదివాక అన్ని కల్యాణ మండపాల్లోనూ ఇలాంటి నిబంధన ఉండాలా? అన్న ఆలోచన వచ్చింది. హెచ్‍ఐవీ ఉందన్న సంగతి ఆ వరుడికి తెలిసే పెళ్ళికి సిద్ధమయ్యాడో లేక తెలీక చేసాడో అన్నది అనుమానంగానే ఉంది కానీ, తెలిసి సిద్ధమైన కేసుల్లో ఇలాంటి స్కీము బాగా పనికొస్తుంది. కానీ, ఇంతదాకా వచ్చాక (ఈ పెళ్ళి ముహుర్తానికి కొన్ని గంటల ముందే ఫలితం తెలిసింది) పెళ్ళి చెడితే కలిగే ఎమోషనల్ స్ట్రెస్ కంటే ముందే ఈ టెస్టులేవో చేసుకోడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు కదా అనిపించింది. కానైతే కల్యాణ మండపం వారి ఆలోచన మాత్రం మెచ్చుకోదగ్గదిగా అనిపించింది.

Advertisements
Published in: on August 27, 2008 at 9:10 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/08/27/two-news-storie/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. రెండవది హ హ బావుంది

 2. మొదటిది కూడా అంత నవ్వుకోవలసినది కాదని నా అభిప్రాయం. స్కూటర్ పై ఒకవైపు కూర్చోవటం అనేది, కూర్చునేవారికేమోగాని, నడిపేవారికి ఖచ్చితంగా అసౌకర్యంగానే వుంటుంది. బ్యాలన్స్ కష్టం. సందుల్లో దూరేటప్పుడు మోకాళ్ళు కొట్టుకునే అవకాశం ఎక్కువ. ముందుకు ఒరిగితే దూకటం ఈజీనే, కానీ వెనకకు ఒరిగితే తప్పించుకునే చాన్స్ తక్కువ, తల పగిలే చాన్స్ ఎక్కువ. ఇన్ని రోజులు జనాలు నడపట్లేదా ఆంటే, మన వాళ్ళు సర్కస్ ఫీట్లు చెయ్యటానికి అలవాటుపడ్డారు కాబట్టి, నడిపేస్తున్నారు. ఒకవైపు కూర్చుంటే యాక్సిడెంట్లు జరుగుతాయని కాదు కానీ, వెనకవారు అటూ ఇటూ కాళ్ళు వేసి కూర్చున్నప్పుడు వచ్చే సౌకర్యము, కంట్రోలే వేరు. హెవీ ట్రాఫిక్‍లో తిరిగేటప్పుడు, ప్రయాణాలప్పుడు, చీర కంటే క్యాజువల్స్ బెస్ట్. ఈ మాత్రానికే చీర మరుగున పడిపోదులెండి, దాని గ్లామర్ దానికుంది.

  ఇక, పెళ్ళికి ముందు హెచ్ఐవీ పరిక్ష తప్పని సరి చేయాలని, ఆ తర్వాతే పెళ్ళిని రిజిస్టర్ చెయ్యాలని కోర్టు, ప్రభుత్వం చాలాసార్లు చెప్పాయి. కానీ ఎక్కడా పాటిస్తున్నట్టు లేదు. గుళ్ళో పెళ్ళిళ్ళు, ముల్లాల దగ్గర పెళ్ళిళ్ళు, అన్నీపోగా అసలు రిజిస్టర్ చేసుకునే వారే తక్కువ. వాళ్ళు కూడా ముందు పెళ్ళి చేసేసుకుని, తర్వాతెప్పుడో వెడ్డింగ్ కార్డు, పెళ్ళి వీడియో సాక్ష్యంగా చూపించి, నమోదు చేసుకుంటారు. రిజిస్టరేషన్ తప్పనిసరి చేస్తే తప్ప ఇలాంటి రూల్స్ పెద్దగా ఉపయోగపడవు.

 3. @Chaitanya:
  చీర మరుగున పడ్డం కాదు అక్కడ విషయం. ఎంత మంది చీరల్ని వదిల్ క్యాజువల్స్ కి వస్తారు అన్నది. వ్యాసంలో ముందే చెప్పాను…. నేను చెబుతున్నది మామూలు మధ్యతరగతి, నడి వయసు స్త్రీల గురించి. వీళ్ళలో ఇప్పుడు చీర మార్చి చూడీదార్ వేయండి అంటే ఎంత మంది సిద్ధపడతారు అంటారు? నేను పదేళ్ళ బట్టీ వెనుక ఒక పక్కే కూర్చునే మా అమ్మని తీసుకుని టూ-వీలర్ పై తిరుతున్నాను. ఇందులో ఎనిమిదేళ్ళు భాగ్యనగర వీథులూ, గల్లీల్లో. అంత భయంకరమైన ఇబ్బందేమీ ఉండదు ఒకవైపు కూర్చున్నా, రెండు వైపుల కూర్చున్నా కూడా. కాస్త తేడా ఉంటుంది కానీ, కొత్తగా నడిపేవారు సైతం అలవాటు పడిపోయేంత చిన్న తేడా అది. మోకాళ్ళు కొట్టుకునే అవకాశం రెండు వైపులకీ కూర్చున్నా కూడా ఉంటుంది. డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా ఉంటుంది. గోతుల్లో బండి వెళ్ళినప్పుడు కాస్త పైకి ఎగిరినప్పుడు..

 4. రెండో రూలు ఎక్కడైనా ఖచ్చితంగా అవసరం.

 5. నాకూ మొదటి వార్తలో పెద్ద సమస్యేమీ కనిపించలేదు.వాళ్ళు చీరకట్టుతో ప్రయాణం వద్దు అని జాగ్రత్త చెప్పినట్టు చెప్పారు తప్పించి రూలు..మీరు చెయ్యకూడదు.జైల్లో పెడతాము అనలేదు కదా.
  చీరకొంగు చుట్టుకుని కిందపడి గాయాలపాలయిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు.బహుసా అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్పి వుంటారు.[నేను మీరిచ్చిన లింక్ చదవలేదు.మీ బ్లాగులో మేటర్ ని బట్టి ఈ కామెంటు రాస్తున్నాను]

 6. i think you dint get the point that the esteemed court was trying to make. may be a case of sensational journalism, but what i get from the article is – please be aware that there are dangers when u travel that way. please take care and make sure u dont get your sarees in the moving tire.

  atleast thats i made out of it.
  thanks


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: