మ్యూజింగ్స్ – చలం

ఈ మధ్య కొద్దిరోజులుగా చలం “మ్యూజింగ్స్” చదువుతూ ఉన్నాను. ఇది ఏకధాటిగా చదివేసే తరహా పుస్తకం కాదని నేను సీరియస్గా నమ్మడం చేత నెల దాటినా పూర్తికాలేదు ఇంకా. ఇంకా ఎక్కువకూడానేమో…గుర్తులేదు. ఒక్కోచోట చదివిన లైన్లనే మళ్ళీమళ్ళీ చదువుతూ ఆగిపోయిన సంధర్భాలున్నాయి. ఒక్కోచోట పేజీ మొత్తాన్నీ చదవకుండా వదిలేసిన సందర్భాలున్నాయి. చలం అంటే ఎవరో నాకు తెలుసుకానీ, చలం అంటే ఏమిటో తెలీదు. రెండేళ్ళ క్రితం “మైదానం” చదివే ప్రయత్నం చేసి సగం చదివి, భరించలేక చేతులెత్తేసాక మళ్ళీ చలాన్ని చదవాలన్న కోరిక కలగలేదు. కానీ, ఏ ముహుర్తానో ఈ పుస్తకాన్ని మొదలుపెట్టాను.లేకుంటే, ఆయనలోని ఈ కోణాన్ని తెలుసుకోలేకపోయి ఉండేదాన్నేమో జీవితాంతమూ. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ 1937-1955 మధ్య కాలంలో రాసినవి. “వీణ” అన్న పత్రికలో మొదలయ్యాయని పుస్తకంలో రాసుంది. డెబ్భై ఏళ్ళ తరువాత ఇంకా ఆ పుస్తకాన్ని చదువుతున్నామంటే, ఇక పుస్తకం గురించి నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పనక్కరలేదనుకుంటాను.

ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఈ విషయం మీద అని వ్యాసాలు రాయలేదు కానీ, ఎన్నో విషయాలని స్పృశించారు. ప్రధానంగా ప్రకృతి ఆరాధన, సౌందర్య పిపాస కనిపించినా కూడా, సమాజం మీద వ్యంగ్యాస్త్రాలకీ, తాను అన్వయించిన స్త్రీ స్వేచ్ఛ పై చలం అభిప్ర్రాయాలకీ తగినంత స్థానం ఉంది. నిజానికి అదొక తరహా రచనా విధానమేమో – అక్కడ మొదలుపెట్టి ఇక్కడ తేలడం. శైలి చాలా చోట్ల నాకు చైతన్య స్రవంతి లాగా అనిపించింది. అందుకేనేమో, ఆ ప్రవాహంలో పడి నేను కూడా చాలా సేపు ఈదాను చలం తో పాటు. వ్యక్తిగతంగా నాకు అలా “చైతన్య స్రవంతి” తరహాలో సాగిపోయే రాతలంటే చాలా ఇష్టం. దానికీ, జీవితానికీ మధ్య నాకు ఉన్నట్లు కనిపించే సారూప్యమే కారణమేమో. అందువల్లే కాబోలు, కొన్ని భాగాల్లో చలం మాయలో పడి, చదివిన లైన్లే మళ్ళీ మళ్ళే చదివినది!

ఈయన శైలిలో ఉన్న మాయని మైదానంలో కొంతవరకూ తెలుసుకోగలిగినా కూడా, అక్కడి కథావస్తువు వల్ల సరిగా అర్థంచేసుకోలేకపోయాను. ఈ వ్యాసాల్లో ఆ మాయ చాలావరకూ అర్థమైంది. ఆయన -శైలిని మెచ్చుకుంటే ఏం లాభం, నేను రాసినది ఒప్పుకోనిదే అంటే అనుకోనీ, నేను శైలినే మెచ్చుకుంటున్నాను. రాసినది – to some extent I agree perfectly. కానీ, ఆయన రాసిన విషయాల్లో కొన్నింటిపై నా అభిప్రాయాలూ ఆయనవీ కలవ్వు. అలాగని పుస్తకాన్ని చదవడం ఆపేస్తా అని కాదు. 🙂 ముఖ్యంగా ప్రతి టాపిక్ లోకీ స్త్రీ ని లాగడం నాకు మహా చిరాకు పుట్టిస్తుంది. కానీ, అది వదిలేస్తే, ఆ ప్రకృతి వర్ణనలూ, అక్కడక్కడా చెప్పే ఫిలాసఫీ, సమాజంపై వ్యాఖ్యలూ, ఆ రాసే శైలీ – ఎన్ని సార్లు తలుచుకున్నా తనివితీరదు. ఏ ఒక్క వ్యాసం తరువాతైనా నేను కనీసం ఓ పది నిముషాలన్నా దాన్ని తలుచుకోకుండా ఉన్నానా అంటే, లేదనే చెప్పాలి. అంత నచ్చాయి చాలా వ్యాసాలు నాకు. ఇప్పుడిది రాస్తూ ఉంటే కూడా, కొన్ని చోట్ల చలం మాటలు గుర్తు వస్తూ నాలో ఆ “వావ్!” అనుభూతిని పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వ్యాసం.

ఈ వ్యాసాలు చదువుతూ, నచ్చిన వాక్యాలు రాసుకుందామని రాయడం మొదలుపెట్టి, అదే ఓ పుస్తకం అయ్యేలా ఉందనీ, దాదాపు ప్రతి నాల్గో వాక్యమో, ఐదో వాక్యమో రాయాల్సి వస్తోందనీ అర్థమయ్యాక రాయడం మానేశాను. ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు తీసి తీరిగ్గా ఏదో ఓ వ్యాసం ఓపెన్ చేసి చదూకోడమే దీనికి పరిష్కారం అని అప్పుడే అర్థమైంది నాకు 😉 ప్రస్తుతం అదే చేస్తున్నాను. పుస్తకం ఇలా ఒకటికి రెండు మూడు సార్లు చదివినవే చదువుతూ ఎప్పటికి పూర్తిగా చదివేస్తానో చెప్పలేను కానీ, ఎప్పటికీ చలాన్ని మరిచిపోలేనని మాత్రం చెప్పగలను. అలాగని ఇప్పుడు ఆయన నవల్లు చదవడం మొదలుపెట్టాలన్న ఆలోచన నాకు లేదు. “మైదానం” ప్రభావం ఇంకా మాయమవలేదు పూర్తిగా. ప్రకృతి ఆరాధన కలిగించే అనుభూతి ఎలాగైతే మాటలకందనిదో, అలాగే ప్రకృతిపై, మనిషిపై, ప్రపంచంపై చలం మ్యూజింగ్స్ ఇచ్చే అనుభూతికూడానూ. భాష కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉండింది నాకు చదవడానికి. కానీ, మొత్తానికైతే పుస్తకం నాకు నచ్చింది.

Advertisements
Published in: on August 27, 2008 at 9:14 am  Comments (24)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/08/27/chalam-musing/trackback/

RSS feed for comments on this post.

24 CommentsLeave a comment

 1. నిజమే! చలం మ్యూజింగ్స్ గురించి బాగా చెప్పారు.

  నాకు ఇలాగే బుచ్చిబాబు “చివరికి మిగిలేది” నవలకి జరిగింది. మొదటగా లైబ్రరీ నుండీ అద్దెకుతెచ్చుకుని చదివాను. అప్పుడు నాకు నచ్చిన వాక్యాల్ని రాసుకోవడం కోసం ప్రయత్నించి, మొత్తం నవలని రాసే పరిస్థితిరావడంతో ఎంచక్కా కొనేసుకున్నాను. ఇప్పటికీ నెలకొకసారైనా కొన్ని పేజీలు చదవందే వెలితిగా అనిపిస్తుంది.

 2. Wow..it’s a strange coincidence.
  నేనూ ఇవ్వాళే ప్రొద్దున మళ్ళీ మొదలుపెట్టా. నేను ప్రతి వారమూ రెండు సార్లు ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంటూంది. టైమ్ కిల్ చేయాలిగా..అందుకే ఇవ్వాళ ఇది పట్టుకొచ్చుకున్నా. కొన్నేళ్ళ క్రితమెప్పుడో చదివా.

  మీరన్నది నిజం. ఫిలాసఫీ, సంఘం పైన అభిప్రాయాలూ, అవన్నీ నాకూ ఇష్టం. అయితే కొన్నిట్లో ఆయన చాలా తప్పు అనిపిస్తుంది. ఎంతైనా డెబ్బై ఏళ్ళ తరవాత ఉన్న ప్యారడైమ్‌స్ కదా. పుస్తకం ఎక్కడైనా మొదలెట్టి చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు.

  ఇవ్వాళ చదవలేదు కానీ, ఆయన గాంధీ గారి గురించీ రాసిందిష్టం. ఒకచోట కమ్యూనిజం మీద ఆయన పడ్డ అనుమానం అబ్బురమనిపిస్తుంది నాకు. అంత చిన్న అనుమానం సోవియట్ యూనియన్ కి ఎందుకు రాలేదా అనిపిస్తూంది నాకైతే. పూర్తిగా మళ్ళీ చదివింతర్వాత ఏమైనా రాయాలనిపిస్తె, రాస్తా.

 3. చలాన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం, అందుకే మైదానం విమర్శకుల ప్రశంసలని మాత్రమే అందుకొంది. చలం ఏది చెప్పాల్సి వచ్చినా స్త్రీ ని మధ్యలోకి లాగడం నచ్చలేదన్నారు, కానీ ప్రపంచం మొత్తం స్త్రీ చుట్టే తిరుగుతుంది అని బలంగా నమ్మిన వారు ఆయన, అందుకేమో అలా స్త్రీని మధ్యలోకి లాగి విషయాన్ని చెబుతారు. దాదాపు చలం అన్ని కథలలో స్త్రీలే నాయకులు.

 4. @ప్రతాప్: చలంని అర్థం చేసుకోకూడదు. అనుభవించాలి అంతే!
  నిజమే, ఈ ప్రపంచం మొత్తం స్త్రీల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా మగాడి ప్రపంచం.తన సాహిత్యంలో స్త్రీల అంత ప్రముఖంగావుండటంలో అస్సలు ఆశ్చర్యం లేదు.

 5. సౌమ్యా,
  మీరు రాసింది చదువుతుంటే నన్ను నేను identify చేసుకున్నట్లనిపించింది. ఎందుకంటే ‘మైదానం ‘ నేనూ మొత్తం భరించలేక, ప్రేమలోని ద్వంద్వ ధోరణిని అంత open గా అంగీకరించలేక మధ్యలోనే చేతులెత్తేశాను. (తర్వాత మొత్తం చదివినా ‘ప్రేమలో మార్పు అనే విషయాన్ని త్వరాగా జీర్ణించుకోలేకపోయాను)మీరు మధ్యలో వదిలేసింది ఈ కారణం చేత కాకపోతే ఓకే!

  అయినా చలం అంటే ఏమిటో తెలుసుకోవాలనే కోరిక చావక ఆయన రాసిన కథలన్నీ దాదాపుగా చదివాను.శేషమ్మ, మణి,ఇంకో కథ పేరు గుర్తు లేదు గానీ అందులో రాజి అనే పని మనిషి పాత్ర ఉంటుంది. బ్రాహ్మణీకం, వివాహం వంటి నవలలు కూడా అనేక సార్లు మళ్ళీ మళ్ళీ చదివాక చలం అంటే ప్రేమ పుట్టుకొచ్చేసింది.

  కానీ ఎక్కడో ఒక చిన్న ముల్లు గుచ్చుతూ ఉంటుంది.
  “మామూలు స్త్రీలు భర్తల ప్రాపకం కోసం పాకులాడుతుంటే చలం పుస్తకాల్లో ప్రియుల ప్రేమ కోసం పాకులాడతారు! ఇహ చలం స్త్రీలను ఉద్ధరించిందేముంది. ఎక్కడైనా స్త్రీలు ఎవరో ఒకళ్ల ప్రేమకోసమో, ప్రాపకం కోసమో పాకులాడక తప్పదు” అని కాలేజీ రోజుల్లో ఎవరో వాదిస్తే, (జీవితాదర్శం వంటి నవలల నేపథ్యంలో) సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయానొకసారి! అప్పట్లో చలం విషయంలో నేనే పెద్ద confusionలో ఉన్నాను.

  మ్యూజింగ్స్ లోనే అనుకుంటాను (లేకపోతే ఎందులోనో గుర్తులేదు)బస్సులో కూచుని అనుకుంటాను చలం ఒకమ్మాయితో చూపులతోనే ఆటాడుతూ….సెక్స్ ని మించిన ఆనందాన్ని పొందినట్లు రాస్తాడు, ఇలాంటివి భరించడం నాక్కొంచెం కష్టమే!

  మొత్తానికి చలాన్ని అనుభవించాలే గానీ అర్థం చేసుకోకూడదు !ఇదేదో బాగానే ఉంది .

 6. మొత్తానికి చలాన్ని అనుభవించాలే గానీ అర్థం చేసుకోకూడదు.
  మొదటి సారి నేను మైదానం చదివా, అబ్బా ఎమిటి ఇలా ఉంది అనుకున్నా, నేను సరిగా అర్ధం చేసుకోనుండనులే అని ఓ నెల తరువాత మళ్ళీ చదివా నాకు పిచ్చెక్కిపోయింది,

  మ్యూసింగ్స్ కొని చదవాలనుకుంటూన్నా …. మరి.

  మొత్తానికి చలాన్ని అనుభవించాలే గానీ అర్థం చేసుకోకూడదు. కాదు అయిన అనుభవించినదానిని( అయినా రాసుకున్న దానికి ) మనం చదావాలంతే … హ హ

 7. చలం పై మంచి విశ్లేషణ చేసారు.
  చలం పై నా అభిప్రాయాలను ఇక్కడ చదవండి.

  http://athmakatha.wordpress.com/2008/06/29/%E0%B0%9A%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%92%E0%B0%95-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81-%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%95/

  బొల్లోజు బాబా

 8. సౌమ్య గారూ – మ్యూజింగ్స్ రెండు బాగాలు. తరువాత ‘ప్రేమలేఖలు’ చదవండి. చాలా గొప్ప రచన. నేనూ ప్రయత్నించాను … కొన్ని వ్యాక్యాలను underline చేద్దామని.. ఊహు .. కుదర్లా… పుస్తకమంతా underline చేయాల్సి వచ్చేటట్టుంది. ఈ రోజు వరకు ఆయన శైలిని, రచనలను dominate చేసేవారు పుట్టలేదు. మగ వాడికి ఎంత స్వేఛ్చ ఉంటుందో (తప్పు చేసే విషయంలో నయన సరే), ఆ స్వేఛ్చ ఆడవారికి కూడా ఉండాలని ఆయన వాదన. మగాడికి ఒక రూల్ ఆడవారికి ఒక రూల్ ఉండకూడదు, అందారూ సమానమే అనేది ఆయన భావన. ఇక మైదానం నవల అంటారా – అర్థం చేసుకొనే వారికి అర్థం చేసుకోన్నంత. బిడ్డల శిక్షణ, స్త్రీ అనే రచనలు కూడా చాల గొప్పవి.

 9. కృష్ణా రావు గారు,
  మీరు బిడ్డల శిక్షణ గురించి రాశారు గాబట్టి అందులోని ఒక చిన్న వాక్యం గురించి రాయాలనిపించింది. గర్భవతులుగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఒక పేజీలో రాశారు చలం. అందులో ఒకటి..
  “కడుపుతో ఉన్నప్పుడు ఎవరన్నా పక్కన వాళ్ళు కానుపులూ, ఆ కష్టాలూ వాటి గురించి మాట్లాడుతుంటే వినకూడదు. ధైర్యం ఉంటే వాళ్ల నెత్తిన పెద్ద బండరాయి విసిరి వెయ్యాలి” ఇది సూపర్ గా నచ్చింది నాకు.

 10. నెను కూడా మైదానం చదివి అలాగే అనుకున్నాను.మొదట సగం లో ఆపేసాను.తరువాత అందరూ అంత గొప్పగా చెపుతున్నారంటే ఏదో వుండేవుంటుందని కష్టపడి మొత్తం చదివాను.ఏమో నాకు ఏమీ అనిపించలేదు.ఇదే మాటని మన కళారా స్వాతి గారితో చెప్పాను.అందరూ మెచ్చుకునే ఆ పుస్తకం చదివాకా నాకెందుకు రససిద్ది కలగలేదు అని.అదేమిటో చలం అంటే ఆ పుస్తకమే గుర్తొస్తుంది.ఇంకా ఎవొ చదివాను గానీ చలం నాకు పెద్దగా నచ్చలేదు.ప్రతీ విషయంలో ఆడవాళ్ళని లాగడం—ఇది చాలా కరక్టు.
  ఎందుకో ఆడవాళ్ల బాగు గురించో,వాళ్ల బాధ గురించో రాస్తున్నట్టుగా కాక తనలాంటి వాళ్లకి అనుకూలంగా తనరాతలతో మార్చడానికి ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది.ఎవరన్నా నా పరిధిని పెంచి, అభిప్రాయాలు మారిస్తే బాగుంటుంది.

 11. చాలా రోజుల తర్వాత ఇక్కడొ కామెంటు రాస్తున్నా.అందుకు గుర్తుగా ఈ పళ్ళికిలింపు:)చలం తెలుగుసాహితీవేత్తలలో ఒకసంచలనం,ఎవరికీ పూర్తిగా అర్ధం కాకపోవడం అందుకొక ముఖ్యకారణం.ఆయన జీవితంలో వివిధదశలున్నాయి.ఆయా దశల్లోని చలం మీద చాలానే మంచి వివరణాత్మకమైన రచనలూ,వ్యాసాలూ వచ్చాయి.కొ.కు.ఆరుద్ర ఇలా చలాన్ని బాగా ఎరిగినవారు రాసినవీ చాలా ఉన్నాయి.చలం స్మశానసాహిత్యం అని రాసినవారూ ఉన్నారు.ముఖ్యంగా గతదశాబ్దం,పదిహేనేళ్ళుగా దళిత,బహుజన సాహితీవిమర్శ వెలుగులో చలం మీద కొత్తకాంతులు ప్రసరింపజేసిన వారూ ఉన్నారు.చలం భావాలూ,పలవరించిన విలువలు అన్నవి అలా ఉంచి ఆయన శైలి,చెప్పాలనుకున్న అంశాన్ని అంతకవితాత్మకమైన వచనంలో చెప్పటం అనితరసాధ్యం.కానీ…మ్యూజింగ్స్ మీద నాకంత సదభిప్రాయం లేదు.అందరిలా కాక నేను రకరకాల కారణాలతో,వివిధ అస్వాదనల్ కోసం అన్వేషిస్తూ చదవటం అయ్యుండొచ్చు.

 12. నేను ఫ్రెండ్ కోసం మైదానం కొనడానికి వెళ్ళి అదే చేత్తో “ప్రేమలేఖలు” కొన్నాను. మర్నాడు పుస్తకం ఇచ్చేయాలి కాబట్టి అర్జెంటుగా మొదలెట్టా. మైదానం కథలోని అంశం ఎంత ఇబ్బంది కలిగిస్తున్నా ఆపకుండా చదివేశాను. పుస్తకం అయ్యిపోయాక “అసలు ఏంటిది?”, “ఎందుకు రాసినట్టు?” అన్న ప్రశ్నలు అప్రయత్నంగా వచ్చాయి. అటు వెంటనే “అసలు నేనెందుకు చదివాను?” అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక ఊరుకుండిపోయాను. ప్రేమలేఖలు మహా అయితే మూడో వంతు చదివుంటాను, ఇప్పుడా పుస్తకం ఎక్కడుందో కూడా తెలీదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఆయన రాసేవి ఏవైనా అవి నాకు ఎంత ఇబ్బంది కలిగించేవైనా నిర్మొహమాటంగా రాయటం చాలా నచ్చింది. He was honest with himself, అందుకే చాలా వాటికి క్షమించేయచ్చు చలాన్ని అనిపిస్తుంది నాక్కూడా!! 🙂

  పై రెండూ చదివాక మాత్రం “అసలేంటీ మనిషి?” అన్న ప్రశ్న నిలవనివ్వకపోయే సరికి, నెట్ లో వెతుకుతుంటే చలం ఆత్మకథ ఇంగ్లీషులో దొరికింది. ఆయనింకా పూర్తిగా సీరియస్ రచనలు చేయనంత వరకూ చదివా ఆ పుస్తకాన్ని. ఎప్పుడూ స్త్రీల చూట్టూ తిరగడానికి ఆయన ఆలోచనా సరళికి పుట్టి పెరిగిన పరిసరాలు, అప్పటి పరిస్థితులు తోడ్పడ్డాయని అర్ధమవుతూ ఉండింది. తర్వతా చదవలేదు. ఇక పై చలం పుస్తకం ఏదైనా చదవటం అంటూ జరిగితే అది ఒక్కటే అనుకున్నా! నా టపాలకి కొంత మంది సీరియస్ గా సజెస్ట్ చేశారు మ్యూసింగ్స్ చదవమని. నేను చదవనంటే చదవా అని భీష్మించుకుని కూర్చున్నా కానీ నీ ఈ టపా చదివాక “ట్రై కర్కె ధేఖే” అని అనిపిస్తుంది. 😉 చూడాలి అది కుదురుతుందో లేదో!

  @మహేశ్: చాలా మంది రచయితల కన్నా చలాన్ని అర్ధం చేసుకోవడమే తేలికేమో. ఎవరేమనుకుంటారో అని అనుకోకుండా, అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పగలిగే మనిషే త్వ్రరగా అర్ధమవ్వచ్చు అని నా అభిప్రాయం.

 13. ఇంకో విన్నపం. యండమూరి ‘తప్పు చేద్దాం రండి'(on Change Management)ని కూడా మీరు పరిచయం చేస్తే చూడాలని వుంది.

 14. Iam Amazed!!

 15. iam amazed..!

 16. Sorry for Late response.
  @Mahesh: 🙂 కొన్ని అంతే. ఎప్పుడు తెరిచినా చదూకోవచ్చు కాసేపు. నేను అలా చాలానే చదువుతూ ఉంటాను. “పరమేశ్వర శాస్త్రి వీలునామా”, భానుమతి గారి “నాలోనేను”,”అత్తగారి కథలు”, సుధా మూర్తి “అమ్మమ్మ చదువు” – ఈ మధ్య అలా తరుచుగా చదివినవి.
  @Independent & Sujatha:we are sailing on the same boat, then. 🙂
  @Pratap: స్త్రీలని లాగడం అంటే, నేనన్నది వేరే ఉద్దేశ్యం లో. బహుశా క్లియర్ గా రాసుండాల్సింది ఏమో..నాదే తప్పు. స్త్రీ గురించి మాట్లాడ్డానికి ఎన్నో ఉండగా, ఇప్పటి వరకూ నేను చదివినంతలో చలం డిస్కస్ చేసేది ఒకే విషయం. అదీ నా బాధ.
  @Ashwin: “కాదు అయిన అనుభవించినదానిని( అయినా రాసుకున్న దానికి ) మనం చదావాలంతే ” – :)) గూద్ ఒనె!
  @Bolloju Baba,Krishna Rao & Rajendra garu: Thanks for the information
  @Sarath: Will try to read and then blog.
  @Radhika:I too agree with your comment..

 17. @పూర్ణిమ: చలంని అర్థం చేసుకోవాలంటే కొంత అనుభవంతోపాటూ మరికొంత విశాలభావాలు కావాలి. మనకు తెలిసిన/నేర్పబడిన విలువల ధృక్కోణంలోంచీ చూస్తే అభ్యంతరాలేతప్ప అర్థాలు గోచరించవు. అలా కాకుండా లోలోపల తరచి చూసుకుంటూ అనుభవించగలిగితే చలం బాధలు మనలో గోచరిస్తాయి. అందుకే అర్థం చేసుకోవడంకన్నా అనుభవించడం మిన్న అన్నాను. చలం అర్థం కారని కాదు.

 18. Friends,
  Manishi jeevitam lo chala phases vuntai. Konni years back manam serious ga teesukunna leda alochichina matter ippudu chala teligga anipistundi. Ala anipinchaka pote jeevitaniki arthame ledani ekkado chadivanu.
  Chalam meeku eppudu tagilado naku teliyadu. Kani naku matram na teenage lo, peekala lotu premalo munigipoinapudu parichayam. Na one side love lo… Ame jnapakalatho …pranaya virahanni prema kavitvam tho seda teerchukovalanna nenu oka roju anukokunda chadivina pustakam ” Prema Lekhalu “. Na badhanatnanta chalaniki cheppukuntunnatlu anipinchedi. Antavaraku aspastamain enno vishayalaki parishkaram dorikindanipinchedi.
  Okarini devatala aradhichadam anedi vari pravartana lo kadu mana hrudayam nunchi veluvadda goppa lakshaname Prema ani nenu telusukunna roju… I never forget that day in my life.
  He is ultimate. Chalamandi preminchi vundavachu kani premani ayanala avishkarichina varu evvaroo vundaremo.

 19. అందరికీ వందనాలు …

  దయచేసి ఇంటర్ నెట్ లో చలం సాహిత్యం దొరికితే నాకు చెప్పండి … నేను కూడా చదివి అర్థం చేసుకుంటాను .. అదే మీరన్నట్లు అనుభవిస్తాను … 🙂

  వందనాలు,
  చంద్రం.

 20. Hi Sowmya,

  Paluvuri rachanalaku ni vyakhyalu bagunnai.Naku sahityamlo onamalu kuda telivu.Kani ni vyakhya,visleshana chaduvutu unte bagundi anipinchindi.Every month i’ll be waiting 4 the new “Nava Tarangam”.

  Oka Chinna vishayam.Naku arthaminanthalo.Tilak gari “Deepam” lo chiari vakyam “Inti mundu pettina deepam inti guttuni dachutundi” ki inti mundu deepam pedite mari intlo cheekatiga untundi anemo.Naku ee vishayam ila artham aindi.edo rayalanipinchindi.ante..

  Bye…….

 21. This post is unique in all i read about Chelam.
  మ్యూజింగ్స్ చదవలేదు గానీ…’ప్రేమ లేఖలు’ చదివాను.
  నచ్చిన పేజీలన్నీ fold చేస్తూవెళ్తే… సగానికి పైగా fold చేసేను నేను. చదివిన తరువాత 10 నిమిషాలు ఈ ప్రపంచంలోకి రావటం కష్టమే… 🙂
  మీ Blog మొత్తంగానే unique గా వుంటుంది. Good Job.
  Thank U

 22. sujatha garu meeru cheppindi correct. chalanii artham chesukokudadu,anubhavinchali anthe. he is great and he is one and only

 23. Ikkadunnavaru evaru ‘pacchi nijalanu’ enduku accept cheyyalekapothunnaru.
  Oka magavadiga cheptunna. Stree manam anukunnatlu gane enduku undali.
  Oka road side pan shop daggara okadu cigarette thagithe emi thappuledu. Konthamandi adi oka image ani kuda feel avtharu.
  Mari ade place oka stree unte??? Prostitute la chustaru. Idi nyayama??
  Nneu chaala mandi ni chusanu. Thanu love chesina ammai chala pure ga undali. Vaadu matram enthamandi vere ammailatho aina chatting lu cheyyochu.
  Oka ammai sexy ga unte thanatho sex kavali (kaani pelli akkarledu).
  Oka ammai paddhathi ga unte thanatho prema kavali, pelli kavali.
  Oka ammai andam lekapothe, aina thanatho avasaram unte, aa ammai ni ‘CHELLI’ antadu.
  Idi mana samajam. Idi mana sampradayam.
  Deenini enno yella krithame thoolanadina chalam entha goppa manishi. Aa time lone athani Bharatiya (andulonu Telugu) manastatvam vision 2050 ni chusindi.
  Chalam oka Addham. Adi samajam lo nijaani chupinchindi. Oka 100yrs tarvatha aina manavallu chalam ‘NIJAM’ raasadu ani ante, athani swaasa ki athanu mana gadda pai jeevinchina jeevithaniki Dhanyatha.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: