దీపం – తిలక్ కవిత

తిలక్ “అమృతం కురిసిన రాత్రి” సంకలనంలో “దీపం” కవిత చదువుతూ ఉన్నా రాత్రి. అందులో కొన్ని లైన్లు:
“చీకట్లో చీకటి కనబడదు
దీపం పాపం వంటి చీకటిని చూపెడుతుంది.
దీపాల మధ్య చీకటి దివ్యంగా మెరిసిపోతోంది.”
….. ఇలా సాగాక, ఒక చోట
“ప్రాణంలోంచి పాపం, పాపం లోంచి ప్రాణం పుట్టాయి
పాపాన్ని చూసి పాపం అని జాలిపడడం పుణ్యం అని చెప్పాయి
సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపుతుంది
దేవాలయంలోని దీపం దేవుని బంధిఖానాని తెలుపుతుంది
ఇంటిముందు పెట్టిన దీపం ఇంటిలోపలి గుట్టుని దాచుతుంది”
– ఇక్కడే నాకు సందేహం… ఇంటిముందు పెట్టిన దీపం ఇంటిలోపలి గుట్టుని దాచడం ఏమిటి?  ఈ వాక్యం అర్థం కాలేదు నాకు. చదివిన వారికి అర్థమైతే వ్యాఖ్య రాయగలరు.

Advertisements
Published in: on August 11, 2008 at 10:38 pm  Comments (17)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/08/11/deepam-kavith/trackback/

RSS feed for comments on this post.

17 CommentsLeave a comment

 1. I’m waiting!! I wanna know it as well.

 2. When you see a lamp (light), your eyes can’t pick up what is behind that light. So a lamp placed in the front can effectively hide the ‘dark secrets’ that lie behind it. I think this is what Tilak implies in that line. I haven’t read any of Tilak’s works to be able to make an intelligent guess, so I am just making a wild guess about what he has placed behind that ఇంటిముందు పెట్టిన దీపం. 🙂

  I am not very comfortable writing in Telugu though it is my mother tongue. My apologies.

 3. ఇంటిముందు దీపం ఉంటే ఇళ్ళు చాలా కళకళలాడుతుంది అని అనుకుంటారు కదా చూసేవాళ్ళు. అందుకే లోపల ఎన్ని ఆపసోపాలు పడుతున్నా వారి అగచాట్లు బయటనుండి చూసేవాళ్ళకి కనిపించవని అనుకుంటా…

  చీకటిని వర్ణించడంలో తిలక్ చేయి అందెవేసినది. నల్లజర్ల రోడ్డులో అడివిలో చీకటిని వర్ణించినతీరు చదివుతోంటే నిజంగా ఆ అడవిలోనే ఉన్నట్టూగా ఉంటుంది…

 4. సౌమ్య గారూ..

  ఇక్కడ తిలక్, ఇంటిలో చీకటి ఉంది అన్న విషయాన్ని ఇంటిలో గుట్టు గా వర్ణించారని నా అభిప్రాయం.
  మీరు గమనించారా, పగటి పూట ఇంటి బయటకు వెళ్ళి లోపలికి చూడండి..[లోపల వెలుగు లేకుండా] సరిగా కనిపించదు..
  సాయంత్రం వేళ ఇంటి ముందు దీపం వెలిగిస్తే, ముఖ్యంగా విద్యుత్ దీపం, ఇంటి ముందు ప్రదేశాన్ని స్పష్ఠం గా చూపెట్టినా లోపలి విషయాలు కనిపించనీయదు.

  ఈ అనాలజీ ని మనిషికి మనసుకు పోల్చుకుంటే.. మనిషి బయటకి చుపెట్టే మంచితనం అతనిలోని లోపాలను కనిపించనీయదు అని అన్నట్టు నాకర్థమయ్యింది.

 5. ఇంటి ముందు వెలుగు పంచుతోంది అనుకుంటున్న దీపం, ఆ వెలుగు చాటున (దృష్టిని మరలుస్తూ) ఇంటి లోపలి గుట్టు (కష్టాలు, బాధలు, అవమానాలు వగైరా) దాస్తోంది.

  ఇదీ నాకు అర్ధమయిన విషయం.

 6. రెండు అనిపిస్తున్నాయి నాకు.
  1. ఇంట్లో ఏదో ఒక సమస్య ఉండి పరిస్థితి బాగోలేక పోయినా ఇంటి ముందు దీపం వెలుగుతోందిలే, అంతా భానే ఉంది అని చూసే వాళ్ళు అనుకోవచ్చు. అలా గుట్టుని దాస్తుంది.
  2. భౌతికంగా .. ఇంట్లో ఒక మాదిరి వెలుతురు ఉంటే, ఇంటి ద్వారం ముందు బాగా వెలుతురునిచ్చే దీపం ఉంటే, బయటినించి చూసే వారికి ఈ దీపం వెలుతురు మిరుమిట్లు గొలిపి లోపల ఏముందో కనబడదు. అలా కూడా లోపల ఉన్నది బయటి దృష్టికి దాచబడుతుంది.

 7. కొత్తపాళీ గారి విశ్లేషణ కరక్టనిపిస్తుంది.

 8. కవితల్లో సింబాలిక్ గా తీసుకోవడం అవసరం… గుడి చుట్టూ గోడ దేవుడి బంధిఖానాని తెలుపుతుంది.. అంటే ‘అర్థం’ వుంది గాని, దీపం బంధిఖానాని ఎలా తెలుపగలదు ?

  పాదం పాదం గా కాకుండా పూర్తి కవితను చూస్తే బాగుంటుంది. దాని పైన కూడా తిలక్ కవితలన్నీ social documentaries లా వుంటాయి. అందరూ ఉన్నా ఒప్పుకోవడానికి సంకోచించే నిజాల్ని ఎత్తు చూపడం చాలా జరుగుతుంది. (నేను నా కపలాదారు కవితలో ఇలాంటిదే ప్రయత్నించానన్నది తిలక్ చదివిన వారు తేలికగానే పసిగట్టగలరు).

  ఆ వాక్యం యొక్క అర్థం కన్నా అది మీ బుఱ్ఱ మీద వదిలేసిన ముద్ర ముఖ్యం.

  అన్నట్టు మీరు కూడా కవితలు వ్రాస్తారు కాదా.. వెల్ కొన్నిరోజుల క్రితం తిలక్ ఎప్పుడూ చదువలేదని చెప్పారని నేను పైన “నాకు తెలియదు” అనడం మానేసి అదిగో ఆ సోది కొట్టాను. అదన్నమట విషయం 🙂

 9. అయినా, ఇంటిముందు దీపం ఉందీ అంటే ఇంటిలోపల చీకటి ఉన్నట్టే కదా. ఇంక ఏంకనిపిస్తుందీ? ఏమీ కనపడకపోవటమే దాయటమంటే. వెరీ సింపుల్.

 10. నాకు ఈకవితలో అర్థంకాని వాక్యం, దీపాలమధ్య చీకటి దివ్యంగా మెరిసిపోతోంది అన్నది. ఇంటిముందు దీపం ఇంటిలోని చీకటిని దాచుతుంది అంటే నేను కూడా diversion అనే అనుకుంటున్నాను.

 11. @Sankar, Mohana, వికటకవి, Srikanth and కొత్తపాళి :
  Thanks a lot. ఇప్పుడు నాకు అర్థమైనట్లే ఉంది మీ వ్యాఖ్యలు చూసాక.
  @Anonymous:
  Thats an interesting interpretation 🙂
  @Malathi garu:
  దీపాల మధ్య చీకటి మెరిసిపోవడం – చీకట్లో చీకటి కనబడదు అన్న వాక్యం context లో చదివితే అర్థమౌతుందనుకుంటున్నాను…
  @రాకేశ్వర్:
  తిలక్ కవిత్వం మాత్రమే చదవలేదన్నది మీతో. 🙂 Yes, I too feel now that his poems are like social documentaries… from the handful that I read from “Amrutam kurisina ratri”. Ofcourse, I might prove myself wrong as I read more of his poems too.. 😉

 12. ప్రతి మనిషిలోనూ మంచి, చెడూ వేరే వేరేగా ఉండవు. అవకాశాన్ని బట్టి చెడూ, అవసరాన్ని బట్టి మంచీ బయటకు వస్తూంటాయి అంటాడు ముళ్ళపూడి. ఇందులో ఎందుకో దీపాన్ని మంచితో, చెడుని చీకటితో అన్వయిస్తే బాగుణ్ణని అనిపించింది. అందరికీ తెలిసిన ఉపమానమే అనుకోండి. అయినా ఈ అన్వయంతో ఒకసారి మళ్ళా కవితను చూడండి. తిలక్ ఊహాచిత్రం మనముందు ఆవిష్కృతం అవుతుంది అనుకుంటాను.

 13. కృష్ణమోహన్ గారూ, వహ్వా!!

 14. @Krishnamohan garu:
  Good one! 🙂 Thanks.

 15. DEEPAM subhani ki gurtu. deepanni intimundu veliginchadam valla aa illu sontosham to kala-kala laadutunndani, chuusevaallu anukontaaru.intlo enni bhadalu vunna bayataki kanabade chirunavvune kada lokam chusedi..
  ani naa abhiprayam.

 16. hey saw your blog in eenadu paper,your blog is awesome and i waz trying to find out your comment box ,i also run a blog http://www.blog2vishnu.tk

 17. http://aavakaaya.com/aavakaaya.com/forums/Topic216-17-1.aspx


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: