మళ్ళీ మూడు కథలు!

గత టపా రాసి వారమైనా కాకుండానే మళ్ళీ అలాంటి టపా తోనే రావడం వెనుక కారణాళేం లేవు. అంతా నా రాత 🙂 ఆ టపా, ఈ టపా-రెండూ నా రాతే… రెంటినీ నా చేత రాయించిందీ నా రాతే 🙂“తెలుగు కథకి జేజే” అన్న సంకలనం చదవడం మొదలుపెట్టాను. మొదటి నాలుగైదు కథలూ… పెద్ద పేర్లవి అయినా కూడా నాకు నచ్చలేదు. సుమారు ఎనభై కథలున్న పుస్తకంలో మొదటి ఐదూ అలాగయ్యేసరికి కాస్త దిగులు పడ్డా, ఆరో కథ నన్ను ఆ దిగులు నుండి బైట పడేసింది. మళ్ళీ మూణ్ణాలుగు కథలు….లోపలికి తోసాయి… ఈ దాగుడుమూతల్లో ఉండగా చదివిన రెండు కథల గురించి ఈ టపా…. మూడో కథ…. మళ్ళీ వీటిలో ఒకటి చదువుతూ ఉంటే గుర్తొచ్చిన అలాంటి మరో కథ.

మొదటి కథ – బమ్మిడి జగదీశ్వరరావు కథ “ఆవు-పులి”. మనం చిన్నప్పట్నుంచీ వింటున్న కథాంశాన్నే తీసుకుని వేరే దృక్పథంలో రాయబడిన కథ. కథ మటుకు కథ పర్వాలేదు. కాస్త హడావుడిగా ముగిసినట్లు అనిపించినా కూడా, ప్రస్తుతం నా ఉద్దేశ్యం దాని శైలిని చర్చించడం కాదు కదా… ఈ కథ చదువుతూ ఉంటే కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే ఇదే థీం ఇంకో కథలో చదివి ఉండటమే. “ఎ మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టన్స్” (A matter of no importance) అన్న బీనాదేవి కథల సంకలనం లో కూడా ఓ ఆవూ-పులి కథ ఉంది. దాని టైటిల్ ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ, అది కూడా ఇలానే ఆ కథ తీసుకుని కాస్త వ్యంగ్యం,బోలెడు హాస్యం జోడించి రాసినది. అప్పట్లో ఆ కథ చదివి బోలెడు నవ్వుకున్నాము ఇంటిల్లిపాదీ. “తెలుగు కథకి జేజే” తో సమస్యేమిటంటే, ఈ కథలు ఏ సంవత్సరంలో..ఏ పత్రికలో అచ్చయ్యాయి…వంటి వివరాల్లేవు. కనుక, రెంటిలో ఏది ముందు రాసారో తెలుసుకోడం కష్టం నాకు. ఎటొచ్చీ, బీనా దేవి గారి కథ ఆకట్టుకున్నంతగా జగదీశ్వర రావు గారి కథ నన్ను ఆకట్టుకోలేదనుకోండి…అది వేరే విషయం. కానీ, నాకింకా ఆశ్చర్యంగానే ఉంది…. ఒకే విషయం మీద ఇద్దరూ కథ ఎలా రాసారా అని….

మూడో కథ – ఆ సంకలనం లోని “ఇల్లలకగానే” అన్న పి.సత్యవతి గారి కథ. పేరు మర్చిపోయిన ఈగ కథ ఉంటుందే…. ఆ కథ ని ఆధారం చేసుకుని రాసిన కథ. ఓ ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరు మర్చిపోతుంది ఇందులో. ఇక అందర్నీ అడుగుతూ ఉంటుంది…. “అమ్మ గారు” “అమ్మ” “ఏమోయ్” “పెద్దమ్మాయ్” “మిసెస్ మూర్తి” అందరూ ఇలా గుర్తు పెట్టుకుంటారే గానీ తన అసలు పేరు ఎవరికీ గుర్తు ఉండదు. పేరు కనుక్కుందామని పుట్టింటికొస్తుంది. అక్కడ నానా తంటాలూ పడి, పాత సర్టిఫికెట్ల కోసం కూడా వెదుకుతుంది… చివర్లో ఓ స్నేహితురాలు తనని పిలవడంతో తన పేరు తెలుసుకుంటుందన్నమాట. కథ పరంగా ఇది కూడా చాలా త్వరగా ఐపోయినట్లు అనిపించింది కానీ, చదవడానికి బానే ఉంది.

– ఒకే రోజులో, ఒకే సంకలనం లో ఉన్న రెండు ఇలాంటి కథలు…అంటే… పాత కథల ఆధారంగా రాసిన కథలు…చదవడం నాకు కాస్త వింతగా ఉంది. అందుకే ఈ టపా :)పేరు మర్చిపోయిన ఈగ కథ… ఆవు-పులి కథ…. వినని వాళ్ళెవరైనా ఉంటారా చిన్నతనం లో? కనీసం తెలుగు వారిలో??  ఇంతకీ ఆ రెండు కథల్నీ కనిపెట్టిందెవరో!

Advertisements
Published in: on June 7, 2008 at 4:07 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/06/07/three-stories-again/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. Sowmya garu, good one. Were you referring to Binadevi’s story as a second one ? I know ‘aavu-puli’ and ‘illalukutoo peru marchipoyina eega’ stories. 😀

 2. రెండు ఆవు-పులి కథలూ, ఒక ఇల్లలకగానే పేరుమర్చిన ఈగ కథగా మీ చదువు సాగుతోందన్నమాట.మంచిది. నాకు మాత్రం ‘పేరు మర్చిన ఇల్లాలికథ’ కాన్సెప్ట్ చాలా నచ్చింది. పెళ్ళి తరువాత సొంత వ్యక్తిత్వాన్ని మరిచిపోయే ఇల్లాలి identity ప్రయాణం నిజంగా మంచి ఆలోచన.ఒక మంచి సెటైరికల్ షార్ట్ ఫిల్మ్ తీసెయ్యొచ్చు.

  కాకపోతే మీమీద నాక్కాస్త కినుక. నా బ్లాగులొ ఈ మధ్య నేను మనసు పెట్టి రాస్తున్న ‘నా కాలేజీ కథ’ లో మీ ఒక్క కామెంటూ లేకపోవడమే అందుకు కారణం.ఆ లోటును భర్తీ చెయ్యగలరని ఆశ.

 3. చాలా బాగా రాసారు. మీ నుంచి ఇలాంటివి మరిన్ని ఆశిస్తున్నాం.

 4. బావుంది… మీ దగ్గరున్నటువంటి లైబ్రరీ ఏదో మా ఇంటి దగ్గర కూడా ఉంటే బాగుండు 🙂

 5. ఈగ కథ తెలియదు కాని, ఆవు-పులి కథ మాత్రం అనంతామాత్యుడు వ్రాసిన ‘భోజరాజీయం’ అనే కావ్యం లోనిది. దొరికితే చదవండి. చాలా బాగుంటుంది.

 6. @Sujatha, Mahesh,Karthik and Praveen:
  Thanks 🙂
  @ChandraMohan
  Thanks to you too, for the info. Will see if I can get “bhoja rajeeyam” and, will surely read if I can understand the language 🙂

 7. ఆవుపులి కధ భోజరాజీయంలో ఉన్నా దానిని అనంతామాత్యుడు తీసుకున్నది స్కాందపురాణం నుండి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: