మూడు కథల గురించి

“సత్యజిత్ రాయ్ ఎవరు?” అన్న పుస్తకం లైబ్రరీలో కనబడగానే రెండో సారి ఆలోచించకుండానే తీసేసుకున్నాను. ఈమాటలో నా కథ కి కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాఖ్య లో ఈ పుస్తకం గురించీ.. అదే పేరు గల కథ గురించీ ప్రస్తావన ఉండటంతో. ఇంతకీ, ఇది శ్రీపతి గారి కథల సంకలనం. ఇందులో మొదటి కథ పేరు “సత్యజిత్ రాయ్ ఎవరు?” అయితే, నా ప్రస్తుత టపా దానిపై కాదు. కనుక దాని గురించిన చర్చ తరువాత. ఈ పుస్తకం లో “నక్సలైట్ రాత్రులు” అని ఒక కథ ఉంది. ఆ కథ నాకు చిన్నప్పుడు చదివిన మరో 2 కథల్ని గుర్తుకు తెచ్చింది. నా టైటిల్ లోని మూడు కథలు ఈ మూడు కథలే.

“నక్సలైట్ రాత్రులు” కథ స్థూలంగా ఏమిటీ అంటే… లారీ డ్రైవర్ సింహాద్రి భార్య చావు బ్రతుకుల్లో ఉంటుంది. ఆరోజు చివరి రోజు అని సిమ్హాద్రికి తెలుసు. డాక్టర్లకి డబ్బుల్లేక….ఆమెని చూసే మనుషుల్లేకా…..పని మానే వీలు లేక…నిస్సహాయ స్థితి అతనిది. ఒక ఊరుకి లారీ తీసుకెళ్ళి అక్కడ లోడ్ తీసుకుని, రాత్రికల్లా తమ ఊరు చేరి…భార్యని చూసుకోవాలన్నది అతని ఆలోచన. కానీ, ఆ ఊరిలో నక్సల్స్ భయంతో… ఆ రోజు రాత్రికి పనవదు. పగలు దాకా ఉండిపోవాల్సి వస్తుంది. సింహాద్రి భార్య గురించిన బాధలో ఏడుస్తూ ఉండగా ఆ ఊరి పెద్దమనిషి కూతురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ, లారీలో బైట ఊరికి తీసుకెళ్ళమనీ అడుగుతాడు. అప్పటికే తననిక్కడికి పంపినందుకు యజమానిపైనా, భార్య రోగం కుదర్చలేని డాక్టర్లపైనా, పని జరగనివ్వని ఊరి ప్రజలపైనా, నక్సల్స్ పైనా… ఇలా అందరిపైనా సింహాద్రి కి కోపంగా ఉంటుంది. “ఏడవడమన్నా ఏడవనివ్వరా?” అంటూ వాళ్ళపై విరుచుకు పడతాడు.తెల్లారుతుంది. ఆ పిల్ల మరణిస్తుంది. ఊర్లో అందరూ సింహాద్రిని నానామాటలంటారు. అక్కడికి సింహాద్రే ఆ పిల్లని చంపేసినట్లు మాట్లాడతారు. సింహాద్రి భార్య పరిస్థితి గురించి క్లీనర్ చెప్పినా కూడా నమ్మరు. కాసేపటికి శాంతిస్తారు. సింహాద్రి అంతా ముగించుకుని ఇల్లు చేరేసరికి ఒంటరిగా ఉన్న భార్య శవం మిగిలి ఉంటుంది.

నేను హైస్కూల్లో ఉన్నప్పుడో కథ చదివా. అప్పట్లో ఆంధ్ర ప్రభ వారపత్రిక లో చెకోవ్ అనువాద కథలు వచ్చేవి. నాకు గుర్తున్నంతవరకూ ఇది అక్కడే చదివాను. కానీ, కథ పేరు గానీ, రచయిత పేరు గానీ నాకు గుర్తు లేవు. అందుకని ధీమాగా ఇది చెకోవ్ కథే అని చెప్పలేను. ఇంతకీ కథేమిటంటే.. ఒక కుటుంబం లో చిన్నపిల్లవాడైన కొడుక్కి ప్రాణాపాయం. డబ్బుల్లేవు. తండ్రికి ఉన్న ఒకే ఒక దారి ఎప్పట్నుంచో అప్పు ఉన్న ఓ కుటుంబం వారిని కలిసి డబ్బు వసూలు చేయడం. సరే, వాళ్ళింటికి వెళితే అక్కడ కూడా ఇలాంటిదే పరిస్థితి. వాళ్ళింట్లో ఎవరో చావు బ్రతుకుల మధ్య ఉంటారు. ఇతను వెళ్ళి డబ్బు అడిగితే చాలా తిడతారు..మనసు లేని మనిషీ….అదీ ఇదీ…అని. అంతా భరిస్తూ ఉండగా…ఇక్కడ సరిగా గుర్తు లేదు కానీ… ఆ ఇంటి మనిషి చనిపోతాడు అనుకుంటా. దానితో ఇతన్ని మనుషుల రక్తం పీల్చే పిశాచం అన్నంత హీనంగా చూస్తారు. ఇతను అంతా విని ఇల్లు చేరేసరికి కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
(కథ చదివి చాలా ఏళ్ళైనా కూడా ఈ కథ తాలూకా హాంగోవర్ వదల్లేదు నన్ను. పూర్తిగా గుర్తు లేదు కానీ..స్థూలంగా ఇదీ విషయం)

మూడోకథ…చెకోవ్ కథ, పేరు గుర్తు లేదు. కథలో ఓ డాక్టర్ భార్యకి ఆరోగ్యం బాగోదు. అతను భార్య గురించి వర్రీ ఔతూ ఉండగా ఒకతను తన భార్యకి సీరియస్ గా ఉందని, అర్జెంటుగా చూడమని వస్తాడు. చాలాసేపు తర్జన భర్జనల తరువాత డాక్టర్ బయలుదేరతాడు. దారిపొడుగుతా ఆ రెండో మనిషి భార్య గురించి బెంగ పడుతూనే ఉంటాడు. అతనిల్లు చేరాక తెలుస్తుంది… ఈ సాకుతో అతన్ని బయటకి పంపి అతని స్నేహితుడితో భార్య వెళ్ళిపోయిందని!

(పై మూడింటిలో చివరి రెండూ చదివి చాలా కాలమైంది. కనుక చిన్న చిన్న తప్పులుంటే ఉండవచ్చు.)

– ఈరోజు “నక్సలైట్ రాత్రులు” కథ చదువుతూ ఉంటే ఈ రెండూ గుర్తొచ్చాయి. మూడు కథలూ జీవితం లో ఉన్న Irony ని చాలా బాగా చూపినట్లు అనిపించింది. మూడింటిలోనూ ఎవరిదీ తప్పు అనలేము నా దృష్టిలో. విధి ని తప్ప. మూడు కథలూ చదివిన వారిని ఒక విధమైన ఆలోచనల్లోకి తీసుకెళతాయి. మూడు మనల్ని వెంటాడతాయనే అనిపిస్తోంది….రెండో కథ నేను ఒకే సారి చదివి…సుమారు పదేళ్ళైపోతున్నా వదలడం లేదు. మూడోది కూడా చివరిసారి చదివి చాలారోజులౌతోంది..అయినా వదల్లేదు నన్ను. ఇప్పుడీ కథ సంగతి ఇప్పుడే చెప్పలేకపోయినా, గతానుభవాల్ని బట్టి…ఇదీ నన్ను వదలదు. నేను వాక్యాల్లో పెట్టలేకపోతున్నా కానీ… ఈ మూడు కథలూ నాకు నేర్పిన పాఠాలు జీవితంలో మర్చిపోలేనివి. కథలెందుకు చదవాలంటే అందులో ఇదొక కారణమేమో….

Advertisements
Published in: on June 4, 2008 at 2:01 pm  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/06/04/moodu-kathala-gurinchi/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. Hi Sowmya..

    మంచి కథలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కథల సారాంశం తెలుసుకోగానే మనసు చివ్వుక్కుమంది. ఇక చదివితే ఎలా ఉంటుందో!! అన్ని అనుభవాలు “వాక్యాలలో” పెట్టే అంత సరళమైనవి కావు.. ఈ కథలు తప్పక చదవాలినిపిస్తోంది.

    Purnima

  2. చాలా బాగున్నాయి. కథల్ని కుదించినా, భావాన్ని కోల్పోకుండా అందించిన మీ శైలి ఇంకా బాగుంది.ఈ కథ లు జీవితం లోని irony తో పాటూ మానవ సంబంధాల్లోని ‘theory of relativity’ ని కూడా చూపినట్టనిపిస్తోంది.
    please visit: http://www.parnashaala.blogspot.com

  3. మీరు పరిచయం చేసిన ఓ పేరా చదవితేనే మనసు వాసిలేటింగ్ గా అనిపించింది. ఇక ఆ చెకోవ్ కథ ఎలా ఉంటుందో ఊహించగలను. మంచి కథలు పరిచయం చేసారు. ఇంకా ఇలాంటివి రాయండి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: