కృష్ణ శతకము

“కృష్ణశతకము” – టీకా తాత్పర్యసహితము అన్న బాలసరస్వతీ బుక్ డిపో వారి ప్రచురణ ని చిన్నప్పట్నుంచీ చూస్తూనే ఉన్నప్పటికీ ఎప్పుడూ చదవాలన్న కోర్కె కలుగలేదు. కారణం నాకు నా భాషా ప్రతిభపై ఉన్న భయం. ఎలాగో, టీకాతాత్పర్యమున్నా కూడా ఇవన్నీ నాకు అర్థం కావు అన్న ధీమా. కానీ, ఓ శుభముహుర్తాన చదవడం మొదలుపెట్టాక అర్థమైంది నా రెండో అనుమానం వట్టి అపోహ అని. దీనిలోని భాష చాలావరకు సరళంగా ఉంది. అర్థంకానిచోట ఎలాగో ప్రతిపదార్థం ఉంది. “కృష్ణశతకమునకు ఆంధ్రదేశములో మిక్కిలి వ్యాప్తియున్నమాట వాస్తవము” అన్న ముందుమాట వాక్యం చదివి నవ్వొచ్చింది. కానీ,
“నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!”
అన్న రెండో పద్యం చదివాక అర్థమైంది ఆ వాక్యం లోని నిజం. ఈ పద్యం మనలో చాలామందికే తెలిసుంటుందనే అనుకుంటున్నాను.

నన్ను ఈ పుస్తకం సగందాకా చాలా ఆకర్షించినా కూడా, ఇక ముందుకెళ్ళే కొద్దీ ఒకే మూసలో సాగినట్లు అనిపించింది. అఫ్కోర్సు, శతకం అంటే, అలా ఒక వస్తువు (ఇక్కడ దేవుడు) మీదనే అదే పనిగా రకరకాలుగా చెప్పి చెప్పి చెబుతూనే ఉంటారు అనుకోండి..అది వేరే విషయం. ప్రధానంగా నాకు ఇందులో మూడే రకాలైన పద్యాలు కనిపించాయి:
1. కృష్ణుణ్ణి సూటిగా పొగిడేవి – అతని గుణగణాలనూ, అతని లీలలనూ.
2. మొత్తం దశావతారాలూ, మిగిలిన దేవుళ్ళూ – అందరిలోనూ కృష్ణుడినే చూస్తూ రాసిన పద్యాలు
3. తనొక పాపిననీ, తనని క్షమించమనీ వేడుకునే పద్యాలు
-ఈ మూడో రకానివి చూస్తే అనుమానం..ఈయనది కూడా “పాండురంగమహత్యం” సినిమా తరహా కథ ఏమో అని. రాసినాయన నరసింహకవి.

నాకు ఈ శతకం చదవడం వల్ల అర్థమైన విషయాలు:
1. భాష చాలా సరళంగా ఉంది. అర్థం కాని చోట అర్థం కావడానికి టీకా తాత్పర్యాలు ఉండనే ఉన్నాయి
2. నా తెలుగు నేను అనుకున్నంత ఘోరం కాదు…కాస్త ఘోరమే.
3. ఇన్ని రకాలుగా వర్ణించవచ్చు కృష్ణుడిని.
4. భక్తిలో మునిగితే ఇక సమస్తం అదే కనిపిస్తుంది.

ఇక.. నాకు నచ్చిన కొన్ని లైన్లు, ఉదాహరణకి:

“జొక్కపు నీ గుణజాలము
వక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా!”

“….దేవకీ
పుత్రా! ననుఁగావు నీకుఁబుణ్యము కృష్ణా!” (64) – 🙂

“హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా!” (49)

“విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపదలఁచి విష్ణుఁడ వనగా
విశ్వముఁ జెరుపను హరుఁడవు….” (35)

“గరిఁగాచిన రీతి నన్నుఁ గావుము కృష్ణా!” (యాభై ఐదు)

-నిజానికి, నేను మొత్తం పద్యాల్ని పైన చెప్పిన మూడు రకాల్లోకి క్లాసిఫై కూడా చేసుకున్నాను…ఏదో ఓ రేంజిలో పేద్ద టపా రాద్దాం అనుకున్నా ఈ శతకం గురించి మొదట్లో తెగ నచ్చి…. కానీ, సమయం గడిచేకొద్దీ ఈ శతకం అప్పట్లో కలిగించిన ఉత్సాహం కలిగించలేకపోయింది నాలో.. ఏం చేస్తాం!

కృష్ణశతకం చదివే ఆసక్తి ఉంటే, వికీసోర్సు లో దొరుకుతుంది. టిఖా తాత్పర్యాలు కావాలంటే మాత్రం-మీ ప్రయత్నాలు మీరు చేసుకోవాల్సిందే …నాకు తెలీదు 🙂

Advertisements
Published in: on April 16, 2008 at 5:14 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/04/16/krishna-satakam/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. శ్రీకృష్ణశతకాన్ని నేను కూడా యిప్పటివరకూ పూర్తిగా చదువలేదు. నేను పూర్తిగా చదువకపోయినా కూడ భక్తిశతకాలలో నాకు నచ్చే మొదటి రెండూ దాశరథీశతకమూ శ్రీకాళహస్తీశ్వరశతకమూను. ఇప్పుడు మీరు (వ్రాసి)చెప్పినందుకైనా యీ మూడింటినీ త్వరలో చదవాలనిపిస్తోంది.

    నాక్కూడా “దేవకిపుత్రా ననుఁ గావు నీకుఁ బుణ్యము కృష్ణా” అన్న ప్రయోగం భలేగా నచ్చేసింది.

  2. “కృష్ణశతకమునకు ఆంధ్రదేశములో మిక్కిలి వ్యాప్తియున్నమాట వాస్తవము” – idi నిజమే. నా చిన్నప్పడు కూడా ఇంట్లోనో, వీధి బళ్ళోనో ప్రాథమిక విద్యలో ఇవన్నీ భాగంగా ఉండేవి. అంచేత అది అతిశయోక్తి కాదు. బాలభారతి వాళ్ళు మారుతున్న కాలంతో కొత్త ముద్రణలకి కొత్త ముందు మాట రాసుకోక పోవడమే .. ఇక్కడ ఏదన్నా పొరబాటు అంటూ ఉంటే.

    “2. నా తెలుగు నేను అనుకున్నంత ఘోరం కాదు…కాస్త ఘోరమే.” — 🙂

  3. […] ఇదివరలో వివరంగా బ్లాగు రాసాను. (లంకె ఇక్కడ). అప్పట్లో ఇది నాకెంత నచ్చిందంటే, […]

  4. మరికొన్ని శతకముల కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: