Joke of the day :)

ఈరోజు ఈనాడు పేపర్ చూస్తూ ఉంటే, ప్రత్యేక వ్యాసం – కురసాల కన్నబాబు గారి “పగలూ రాత్రే” కనబడ్డది. అక్కడ కనిపించింది, ఓ జోకు…చదవగానే, ఆ భయంకరమైన లాజిక్ కి నవ్వొచ్చి, ఇక్కడ అందరితో పంచుకుంటున్నా…

” తగినంత కరెంటు అందుబాటులో ఉన్నకాలంలోనూ ఎందుకు కోత విధిస్తున్నారని ప్రశ్నిస్తే- ప్రభుత్వం నుంచి విచిత్రమైన సమాధానం వస్తోంది. కరెంటుంది కదా అని నిరంతరాయంగా సరఫరా చేస్తే ప్రజలకు అలవాటైపోతుందని, లేనప్పుడు ఇవ్వకపోతే వ్యతిరేకత వస్తుంది కనుక ముందుజాగ్రత్తతోనే కోత విధిస్తున్నామని ప్రభుత్వం సమర్ధించుకొంటోంది.”

– ఇదీ ఆ స్టేట్మెంట్…

Advertisements
Published in: on March 19, 2008 at 4:28 am  Comments (11)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/03/19/joke-of-the-day/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. యదార్ధ జీవిత వ్యదార్ధ “సత్యం”.

 2. హహ్హహ్హ… పెద్ద బకరాగాళ్ళలా తయారయ్యారు గదా మన పాలకులు.

 3. :))

 4. ఆ వార్త ఈనాడులో వచ్చినందుకు మాత్రం నాకు కడుపు పగిలిపోయింది

 5. రాఘవ .. వాళ్ళెందుకు బకరాలు .. ప్రజలే బకరాలు!

 6. క్షమించండి…ఇందులొ కొంత నిజం ఉందనే అనిపిస్తుంది. భవిష్యత్తులొ సప్లై లేనప్పుడు 24X7 కి అలవాటుపడ్డ ప్రజలు అర్థం చేసుకుంటారా? కొరతలేనప్పుదు అవసరానికి సరిపడా సరఫరా చేయటం మంచిదేకాని, నిరంతరాయంగా సప్లై చేసి ప్రజల అంచనాలు పెంచటం సరైన విషయం కాదు.

 7. రేపెప్పుడో అన్నం దొరకదని ఓ పూట అన్నం మానేస్తావా ఏమిటి? ఓ సంవత్సరం కరువు వస్తుందని తిండి గింజలు వెయ్యడం మానేస్తావా ఏమిటి?

  మంత్రిగారు ఆడలేక మద్దెల ఓడు అంటున్నారు!

 8. ఓ పూట అన్నం మానెయ్యటం వేరు…పంచభక్ష్య పరమాన్నాల జోలికి పోకుండా కడుపు నింపుకోవటం వేరు. తాత్కాలికంగా లభ్యత ఉంది కదా అని నిరంతరాయంగా సప్లై చెయ్యటం అనేది అవసరానికి మించినది అని అంటాను. నిజానికి గౄహావసరాలకు ఎప్పుడూ 24X7 అవసరం లేదు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం అరువు తెచ్చుకున్నవి.రాష్తృవ్యాపంగా ఉన్న వేలాది పల్లెల్లో ఎవరికైనా 24X7 విద్యుత్సరఫరా నిజంగా అవసరం అని చెప్పగలరా? కావలసింది నాణ్యమైన సరఫరా.అంతగా మిగులు ఉంటే ఇప్పటికీ చీకట్లొ మగ్గుతున్న పల్లెలకు మళ్ళించవచ్చు.

 9. 🙂

  నాతో అంటే అన్నారు కానీ, టీ వీ సీరియల్లు చూసేటోళ్ళతో అనకండి, 24 గంటలు కరంటు అవసరం లేదని. అన్నట్టూ కరంటు పొయినప్పుడు తిట్టుకోని పల్లెటూరివాడిని నేనింతవరకూ చూడలేదు, మీరు చూస్తే చెప్పండి!

  ఇహ చీకట్లో మగ్గేవాటి గురించి, అలా మగ్గ కూడదనే కదా ఈ బాధ!

  అసలు అందరికీ చదువు అవసరం లేదు, ఏదో సమాజంలో ఓ 5% మందికి మాత్రమే చాలు మిగిలిన వాళ్ళు ఎలాగూ రెక్కాడి బతగ్గలరు, ఈ 5% మంది మాత్రం చ్దదువు కున్నోళ్ళు చేయాల్సిన పనులు చేసి ఉద్ధరించగలరు అంటే ఎలా ఉంటుంది?

  అందరికీ చదువు కూడా అరువు తెచ్చుకున్న కాన్సెప్టే , మనదంతా తాతల తండ్రుల వృత్తి విధ్యలు కదా! అక్కడే ఉన్నామా?

 10. 24 గంటలూ టి.వి.సిరియల్స్ చూసేవాళ్ళకోసం మనం 24X7 సప్ప్లై ఇవ్వాలంటారా? 🙂

  పల్లెటూరిలో పుట్టి పెరిగినవాడిగా చెప్తున్నాను…రోజుకి 12 గంటలు కరెంటు ఉంటే చాలు అనుకునే పల్లెలు కోకొల్లలు. 24 గంటలూ టి.వి ముందు అతుక్కుపోయే బద్దకిష్టులు తప్పించి నిజంగా ఎవరూ 24X7 కోరుకోవటం లేదు. మరి కరెంటు పోయినప్పుడు ఎందుకుతిట్టుకుంటున్నారు అంటే అది వేళాపాళా లేని అనాలోచిత పవర్ కట్స్ వల్ల. కేవలం మిస్-మేనేజ్మెంట్ అది.

  ఇక అరువు తెచ్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ చెడ్డవి అని నేనటం లేదు. ఏ విషయం అయినా మన పరిస్థితులకి అన్వయించుకోవాలి అంటాను. ఇప్పటి సమాజం లో చదువు అవసరమో కాదో మీకు తెలుసు 🙂

  ఇంతకీ మన ఈ సంవాదాలతో సౌమ్యగారికి ఇబ్బంది కలిగిస్తున్నామేమో. మనం ఈ విషయాన్ని ఆఫ్-లైన్ చేస్తే బావుంటుందేమో కదా.

 11. కరెంట్ ఉన్నప్పుడు ఇవ్వాలి గాని రేపెప్పుడో కరెంట్ కోతకి తట్టుకోలేరు కాబట్టి ఇప్పుడే కోత అన్న వ్యాఖ్య మూర్ఖత్వానికి పరాకాష్ట..! అసలు కరెంట్ ఉన్నప్పుడు ఇస్తారు, అంతే గాని ఎక్కువగ ఉన్నదాన్ని దాచుకునే సౌకర్యం లేదు కదా..? మరెలా అన్నారు రేపెప్పుడో కోత వొస్తే అలవాటు చేసుకోవడానికి ఇప్పుడే కోత విదుస్తున్నామని..? అంటే వారెంత మూర్ఖులో అని అర్థమవుతుంది..రేపెప్పుడో కోత వొస్తే అప్పుడు అలవాటు పడటానికి ఇప్పటినుండే కోత అన్నది..నవ్వొచ్చే మాటే..ఇప్పుడూ పుష్కలంగా కరెంట్ ఉన్నప్పుడు ఇస్తారే గాని.దాచుకొని సౌకర్యం లేదు కదా..? అలా దాచుకోవడానికి మనకు సౌకర్యముందా..? లేదు కదా..? మరెందుకు రేపెప్పుడో కోతకు ఇప్పుడే అలవాటు అన్నది..? అంటే ఇప్పుడు కూడ కరెంట్ లేదనే కదా అర్థం..? వార్ని ఆ మాత్రం జ్ఞానం లేకుండా వాదించుకుంటూన్నారా..?…కమల్.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: