త్యాగయ్య జీవిత సంగ్రహం – కొన్ని కథలు

మొన్నటి టపా లో చెప్పిన – “త్యాగరాజు భక్తి సుధార్ణవము” పుస్తకము లోనే ఇది ఒక భాగం. చదువుతూ ఉంటే, ఏ సందర్భాల్లో త్యాగయ్య కొన్ని కీర్తనల్ని రాసాడో చెప్తూ వచ్చారు రచయిత ఆ వ్యాసం లో. ఆ సంఘటనల గురించీ అందరితోనూ పంచుకోవాలనిపించి… ఈ టపా…

1.” అన్న తమ్ముని రాజాశ్రయం పొందమన్నాడు; తమ్ముడు నిరాకరించాడు. ఇక ఇంటిలోని పోరు ఇంతింతగాకపోతుందా? ‘నా పూర్వజు బాధ తీర్వలేవా?’ అని ఒక కృతి లో ఆరాటపడినాడు.” (రచయిత వాక్యాన్ని యధాతథంగా పెడుతున్నాను)

2. తంజావూరు రాజు త్యాగయ్యని తన ఆస్థానం లో పాడమని ఆహ్వానించినప్పుడు పుట్టిన పాట – “నిధిచాల సుఖమో రాముని సన్నిధి చాల సుఖమో.

3. త్యాగయ్య మీద అసూయ కొద్దీ అతను పూజించే శ్రీరాముడి విగ్రహాన్ని అతని అన్న దొంగిలించి కావేరి ఇసుకలో పూడ్చిపెట్టాడట. అప్పుడు త్యాగయ్య ఆ విగ్రహం లేకపోవడం తెలుసుకున్నాక బాధలో పుట్టిన పాట – “ఎందు దాగినాడో ఈడకురానెన్నడు దయవచ్చునో ఓ మనసా…

4. తరువాత, విగ్రహము కనబడిందని త్యాగయ్యకి తెలిసి, ఆనందంలో వెలువడ్డ పాట – “కనుగొంటిని శ్రీరాముని నేడు…”

5. ఆ విగ్రహాన్ని తిరిగి ఊరేగింపుగా ఇంటికి తెస్తూ పాడిన పాట – “రారా మా ఇంటి దాకా రఘువీరా సుకుమారా, మ్రొక్కేరా..”

6. ఒకానొక సందర్భం లో బిలహరి రాగం లో “నా జీవనాధార, నా నోము ఫలమా, రాజీవలోచన రాజరాజ శిరోమణీ…” అని ఆలపించి పుత్తూరు లో ఓ గృహస్థుకు మళ్ళీ ప్రాణం పోసాడని ఓ కథ ఉంది. బిలహరి రాగం మృతసంజీవని రాగమట.

7. గోపీనాథ భట్టాచార్య అన్న వారాణాసి కి చెందిన హిందుస్తానీ విద్వాంసుడు త్యాగయ్య సంగీతానికి మురిసిపోయి దక్షిణానికి వచ్చి త్యాగయ్యని కలిసి, అంజలి ఘటించాడు. ఆ మితృనికి కృతజ్ఞత తెలుపుతూ “దాశరథీ, నీ ఋణము తీర్ప నా తరమా, పరమపావననామ. ఆశదీర దూరదేశములకు ప్రకాశింపజేసిన రసిక శిరోమణి..” అన్న కృతిని పాడాడట.

8. మరో సందర్భం లో ఓసారి శిష్యసమేతంగా వెళుతున్నప్పుడు దొంగలు దాడి చేస్తేనూ – “ముందువెనుక ఇరుపక్కల తోడై మురఖరహర రారా” అని పాడగానే విల్లంబులు ధరించిన ఇద్దరు యువకులొచ్చి దొంగల్ని తరిమి కోట్టారట. (చిన్నప్పుడు ఇలాంటి కథే తులసీదాసు గురించి చదివాను.)

– అదన్నమాట ఇప్పటిదాకా నాకు ఆ పుస్తకం లో కనబడ్డ విషయాల సారాంశం.

Advertisements
Published in: on February 28, 2008 at 4:18 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/02/28/stories-tyagayya/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. బావుంది. ఇటువంటి ఆర్ద్రత గల కీర్తనల్ని సందర్భానికి అన్వయించుకుని వింటే హృద్యం గా ఉంటాయి.
  రామదాసు “శ్రీరామ నీనామమెంతో రుచిరా” అనే కీర్తన ఇదివరకు చల మములుగ అనిపించేది నాకు. రామదాసు సినిమాలో ఆ కీర్తన వచ్చే సన్నివేశానికి అన్వయించుకుంటే చాలా భక్తి, ఆర్ద్రత కనపడతాయి.

 2. బాగున్నాయి వివరాలు. నిధి చాలా సుఖమా అని అనుకుంటాను. సుఖమో కాదు.
  అలాగే నను పాలింప నడచివచ్చితివో వెనక కూడా చక్కని కథ వుంది తెలుసా ..
  నాకు సరిగ్గా తెలీదు కాని సీతారాములవిగ్రహాలను నదిలో విసరివేయగా ఆవిగ్రహాలు తేలుతూ తిరిగివచ్చాయని కథనం. నీకు పూర్తిగా దొరికితే చెప్పు.

 3. @tethulika:
  1. ఆ పుస్తకం లో మరి… “సుఖమో..” అనే ఉంది..
  2. నను పాలింప… : ఇప్పుడే చూసాను దాని గురించిన కథ… మరిన్ని కథలు కలిపి త్వరలో బ్లాగుతాను 🙂
  3. విగ్రహాలు నదిలో విసిరేస్తే… కావేరి నది లోని ఓ నీటిపాయ వాటిని బయటపెట్టిందనీ..ప్రజలు దాన్ని చూసి త్యాగయ్యకు చెప్పారనీ ఉంది ఈ పుస్తకంలోని కథలో అయితే.

 4. సాధారణంగా, ఇవన్నీ మౌఖికసాహిత్యం కనక, పాఠాంతరాలూ, నిక్షిప్తాలూ వుంటాయి. నువ్వో నేనో కరెక్టు అని కాక, ఓహో ఇలా కూడా వుందన్నమాట అనుకోడమే.
  నిధి చాలా సుఖమోనేమో. ఆపాట సుఖమా అని మహరాజపురం సంతానం అనుకుంటాను పాడిన టేపు నాదగ్గరుంది.
  నీనెక్స్టు బ్లాగుకోసం నిరీక్షిస్తూ ..
  :))

 5. చాల బావుంది. చక్కటి పరిశోధన. కొనసాగించండి. అలాగే రామదాసు మీద కూడా రాస్తే సంతోషిస్తాను.

 6. I was browsing through some of the telugu web sites today, and came across this fabulous blog.

  Infact it gave me a pleasant surprise that a student of this generation can write better than most of the telugu writers I know.

  Last 4 hours I read almost all your posts in both the blogs..Excellent!!! I would say… and it motivates me to start my own telugu blog.

  Keep up the good work with your inspiring blogs.

  I wish I could write this comment in Telugu, but not up to the speed with my telugu editor yet, which I need to do a little practise.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: