త్యాగయ్య ఆనంద భైరవి – రుద్రవీణ బిలహరి

ఆ టైటిల్ చూసి నేనేదో రాసేస్తున్నా అని ఊహించకండి. నాకేం సంబంధం లేదు మీ అంచనాలతో. నేను పొద్దున్నే లేచి ఏమీ తోచక – “త్యాగరాజు భక్త సుధార్ణవము-నామజప రూపక కృతులు” అన్న మరువూరు కోదండరామిరెడ్డి గారి సంకలనాన్ని తెరిచాను. పుస్తకం మొదటి కొన్ని పేజీలూ త్యాగయ్య చరిత్ర ఉంటేనూ… కాసేపు చదివాను. అక్కడ చదివిన ఓ ఆసక్తి కరమైన సంఘటననూ, ఆ సంఘటన నాకు గుర్తు తెచ్చిన ఓ సినిమా సీనునూ ఇక్కడ పంచుకోడం ఈ టపా ఉద్దేశ్యం…అంతే…మరింకేం ఖాదు. టైటిల్ చూసి కొందరు విషయమేమిటో కూడ కనిపెట్టేసి ఉండొచ్చు. 🙂

ఇంతకీ… 203 రాగాలు పాడారట త్యాగయ్య…అందులో ఆనంద భైరవి మాత్రం లేదట. ఎందుకో? అంటే… ఇదీ కథ… త్రిభువనం స్వామినాథ అయ్యరు అని కుంభకోణం లో పెద్ద విద్వాంసుడు ఉండేవాడట. ఆనందభైరవి రాగం ఆలపించడం లో ఆయన్ని మించిన వాడు లేడు అని పేరు పొందాడట. ఓసారి అతని జట్టు తిరువయ్యూరు వచ్చిందట. త్యాగయ్య అతని ప్రఖ్యాతి విని అతని ప్రదర్శన కి వచ్చాడట. అప్పుడు అతను ఆనందభైరవిలో “మధురానగరిలో…” అన్న పాట పాడగా విని పరవశుడై అందరిముందూ స్వామినాథయ్యర్ భుజం తట్టి కౌగిలించుకున్నాడట. ఇది చూసి సంతోషించాల్సిన విషయమే అయినా, అప్పుడు అతను త్యాగయ్య ని – ఇకపై ఆనందభైరవి పాడవద్దనీ, తన పేరు నిలుపమనీ అర్థించాడట!!! ఈ కారణంగా త్యాగయ్య ఎప్పుడూ ఆనందభైరవి లో పాడలేదట!

ఇదంతా చదువుతూ ఉంటే నాకు రుద్రవీణ సినిమాలో ఓ సీను గుర్తొచ్చింది…. రమేష్ అరవింద్ కి, జెమినీ గణేశన్ కూతురికి పెళ్ళి జరుగుతున్నప్పుడు పాత కోపాన్ని దృష్టిలో పెట్టుకుని అరవింద్ “బిలహరి” గణపతి శాస్త్రి గా ప్రసిద్ధి చెందిన గణపతి శాస్త్రి పాత్ర వేసిన గణేశన్ ని – ఆ బిలహరి రాగాన్ని కట్నంగా ఇవ్వమని అడుగుతాడు. అంటే, ఇంకెప్పుడూ, ఎక్కడా ఆయన ఆ రాగం పాడరాదన్నమాట. తర్వాత చిరంజీవొచ్చి “నీతోనే ఆగేనా ..” అంటూ పాడి ఆయన గౌరవం నిలబెడతాడు అనుకోండి… అది వేరే విషయం.

పై రెండూ చూసాక ఒక సందేహం వచ్చింది. ఈ సినిమా సంఘటన ఆ నిజ జీవితపు సంఘటన నుండి స్పూర్తి పొందిందా అని…  అంటే…అదేమీ పెద్ద విషయం కాదు కానీ…. త్యాగయ్యకి అలా జరిగింది అన్న విషయం మాత్రం కొత్తగా ఉంది నాకు వినడానికి.

Advertisements
Published in: on February 26, 2008 at 4:57 am  Comments (18)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/02/26/ananda-bhairavi-bilahari/trackback/

RSS feed for comments on this post.

18 CommentsLeave a comment

 1. wow…this is really great to see a telugu blog for the first time. great work. and good writing too.

  all the best for a great future

 2. త్యాగయ్యని కూచిపుడి భాగవతార్లు అడిగారని విన్నానే!

 3. wow!
  telugu is nothing but AMRUTHAM
  really we are tasting thru this site
  we r ever grtful to u

  WISH U GOOD LUCK

 4. thank you.

 5. bavundandi information..
  intaki ee maata bayata pettindi evaru.. ? janala ? variddarlone okara ?

 6. @Gopal:
  అది ఎవరు చెప్పారో తెలియదు మరి. ఆ పుస్తకం రచయిత కూడా దానికి ఇదీ అని ఆధారమేమీ రాయలేదు. బహుశా జనాల నోళ్ళలో నాని ఈ కాలానికి చేరిందేమో….

 7. “అందులో ఆనంద భైరవి మాత్రం లేదట..”
  ఎందుకు లేవూ? ఎక్కువ లేవు కాని, మూడు కృతులున్నాయి:
  1. నీకే తెలియకపోతే, 2. రామ రామ నీవారము, 3. క్షీరసాగర విహారా
  మీరు చెప్పిన కథలాటిదే నాగయ్యగారి త్యాగయ్య సినిమాలో ఉంది.
  ఆనందభైరవిలో శ్యామాశాస్త్రి కృతులు చాలా గొప్పగా ఉంటాయి.

  కొన్ని రాగాల గురించి ఇలాంటి చిత్రమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వరాళి రాగాన్ని గురుముఖతా నేర్చుకోకూడదనే ఓ సంప్రదాయం ఉంది. ఎవరైనా గురువు ఆ రాగం శిష్యులకి నేర్పుతే, గురువుగారి కంఠం పోతుందట. గురువుగారు పాడుకుంటుంటే, ఆయన వీపువైపున కూర్చొని, వింటూ నేర్చుకొంటారు(ట).

  ఎవరో ఓసారి శ్యామాశాస్త్రిగారిని “మీరు కాంభోజిలో కృతులేవీ రచించలేదెందుకు” అనడిగితే, దానికాయన కాంభోజిలో ఎవరికైనా సరే కొత్తగా చెప్పేటందుకు క్షేత్రజ్నులవారు ఏం మిగిల్చారు అన్నారట.

 8. జీవితం నుండి కళ, కళనుండి జీవితము పరస్పరం ప్రేరణ చెందుతాయనటానికి, ఈ సంఘటనలు, సొదోహరణాలుగా నిలుస్తాయి.

 9. ఆ మూడూ కూడా త్యాగయ్య గారు కూచిపూడి వారిని కలవడానికి ముందు పాడినవంట!

 10. ఈ వరాన్ని కూచిపూడి భాగవతులు త్యాగరాజస్వామిని కోరినట్టుగా జనశ్రుతి. అదే దృశ్యాన్ని త్యాగయ్య పేరిట తీసిన రెండు సినిమాల్లోనూ చూపించారు. ఆనంద భైరవి చాలా పాతరాగాల్లో ఒకటి, బహు జనరంజకమైన రాగం. అలాంటి రాగంలో త్యాగరాజస్వామి మూడు కృతులు మాత్రమే రచించారంటే ఇటువంటి కథ యేదో జరిగి ఉండవచ్చుననే అనిపిస్తుంది.

 11. నాగరాజుగారూ, నాకు తెల్సిన మరో త్యాగరాజకృతి కూడ వుందండి అనందభైరవిలో — “నీ బలమా నామ బలమా నిజముగ తెల్పవే ఓ రామ” అన్న పల్లవితో.

 12. […] జీవిత సంగ్రహం – కొన్ని కథలు మొన్నటి టపా లో చెప్పిన – “త్యాగరాజు భక్తి […]

 13. రాఘవ:
  అవునా? ఎప్పుడూ వినలేదే. మీ దగ్గర సాహిత్యం ఉంటే మీ బ్లాగులో పెట్టండి. పాట కూడ ఉంటే, దాని లింకు కూడా That would be a real treat.
  నెనర్లు,
  నాగరాజు.

 14. @Nagaraju garu:
  here are the lyrics:

  పల్లవి:
  నీ బలమా నామ బలమా నిజముగ బల్కవే ఓ రామ
  అనుపల్లవి:
  ష్రీ భుజ మా తల్లి బలమా షీలాత్ముతౌ సౌ-భక్త బలమా
  చరణం
  గిరిరాజ జామాతాది అజ సుర రాజ కాంచన రాజ భయహర
  రాజ రావణ రాజ భీకర త్యాగరాజనుత ధామ భీమ

  Source: http://www.forumhub.com/indcmusic/5880.20.31.18.html

 15. ఆనందభైరవి గురించి పెద్దలు అంత చెప్పారు. దాని అసలు పేరు ఆంధ్రభైరవి (చూ: సాంబమూర్తి) అని ఎవ్వరూ సెలవివ్వలేదే!?

  భవదీయుడు,
  శ్రీనివాస్

 16. @శ్రీనివాస్ గారు:
  ఔనా…. కొత్త విషయం!
  మరి…అది ఎందుకు ఆనంద భైరవి అయింది? మీకు తెలిస్తే ఇక్కడో వ్యాఖ్య వదలండి…

 17. Hey….the post is very nice and informative. The correlation is interesting… they way you remembered that scene in rudraveena as you read about Tyagayya.

  That song in rudraveena “neeto ne aagena sangitam” is really good (as all the songs in the movie)

 18. చాలా ఆసక్తికరమైన విషయాలు చెపారు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: