రెండో భార్య కి ఆస్తిహక్కు గురించిన వార్త

   ఈరోజు హిందూ పత్రిక లో రెండో భార్య కి భర్త ఆస్తి మీద హక్కు ఉండదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కనిపించింది. అది చదివాక కలిగిన ఆలోచనలే ఇప్పుడీ టపా రూపం లో బయటపెడుతున్నా 🙂 అసలు టపా ఇక్కడ చదవొచ్చు.

ఇంతకీ సారాంశం ఏమిటీ అంటే – ఆస్తిపై రెండో భార్య అయిన వ్యక్తికి ఎటువంటి హక్కూ ఉండదనీ, కానీ, ఆమె సంతానానికి మాత్రం కలుగుతుంది అని. మళ్ళీ అలా అని రెండో పెళ్ళి చెల్లుతుంది అని కాదు.

” Children born of second marriage are entitled to a share in the property of their father though the second marriage itself is void, the Supreme Court has held.”

పిల్లలు లీగలంట…. పిల్లల తల్లి మాత్రం లీగల్ కాదంట. అంటే… ఆ తల్లి పరంగా చూస్తే ఆమె దిక్కులేనిదే…ఒక వేళ పిల్లలు వదిలేస్తే. పైగా ఆ వార్త తాలూకా కేసు ప్రకారం మొదటి భార్య తానే భర్త కి దూరంగా వెళ్ళిపోయింది. తరువాతే భర్త రెండో పెళ్ళి చేసుకుని నలుగురు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు అతను చనిపోగానే మొదటి భార్య కూడా ఆస్తి కోసం వస్తే ఇన్నేళ్ళూ కలిసి జీవించిన రెండో భార్యకి ఆస్తిహక్కు లేదంట… ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన మొదటి భార్య కి మాత్రం ఉందట! అంటే… రెండో భార్య కి ఆస్తి హక్కు కల్పించడం  అన్నది ఈ కేసు ఒక్కదాన్ని చూసి నిర్ణయించే విషయం కాకపోయినా కూడా, ఈ తరహా ప్రత్యేక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నది నాకు తోస్తుంది. అయినా, పిల్లలకి హక్కున్నప్పుడు వాళ్ళ తల్లికి ఎందుకూడదు? అన్నది ఇక్కడ ప్రశ్న.  ఇంకో ప్రశ్న ఏమిటి అంటే… మొదటి భార్య ఈ కేసులోలా తానుగా బయటకు వెళ్ళిపోయినా కూడా ఆమెకి ఆస్తి హక్కు వస్తుందా? రెండో భార్య కి మాత్రం ఎందుకు రాదు? అన్నది.

నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది ఆ తీర్పు గురించి చదివాక. సుప్రీం కోర్టు అంతటి ధర్మాసనం అలా ఎలా తీర్పిచ్చింది? , అందులోనూ ఈ కేసు విషయంలో అని.  భర్తే మొదటి భార్య ని వదిలేసి రెండో మనిషి ని పెళ్ళి చేసుకుంటే అప్పుడు రెండో భార్య లీగల్ కాదు అనడం ఒక వాదన (అదన్నా కూడా మళ్ళీ పిల్లలకిచ్చి తల్లికివ్వకపోవడం అన్యాయమే అని తోస్తుంది.) మరి ఈ పేపర్ వార్త ప్రకారం కనీసం అది కూడా కాదు కేసు.  ఏమిటో ఈ తీర్పులు! సరిగా రాసిన వ్యాసం ఇంకోటి కావాలేమో..సరైన ఐడియా రావడానికి. అయినప్పటికీ, సుప్రీం కోర్టు తీర్పు నాకు నచ్చలేదు 😦

Advertisements
Published in: on January 28, 2008 at 8:05 pm  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/01/28/hindu-news-on-second-wife-property/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. Rajyamgam prakaram anthe..
  adi correct cheyyalsina saasanam

 2. ఆధిక జనాభా కలిగిన దేశాల్లో యిటువంటి చట్టాలు సర్వసాధారణం. ఆధిక జనాభాని నియంత్రించడానికీ, రెండో పెళ్ళిళ్ళని అరికట్టడానికీ చేసే ప్రయత్నాలివి. ఒక స్త్ర్రీ, మరో పురుషుడి ఆస్తిని చూసి రెండవ వివాహానికి సంసిద్ధం కాకూడదనేది దాని అర్థం. ఇప్పుడు జరిగే రెండో పెళ్ళిళ్లు ఎక్కువ ఈ ఆశకి లోబడే జరుగుతున్నాయి. మీరన్నట్టు ప్రత్యేక పరిస్థితులలో నిజంగా తోడిచ్చిన రెండవ భార్యకి తప్పకుండా అన్యాయం జరిగితీరుతుంది. అటువంటప్పుడు విడాకులు పొందిన పురుషుడినే పెళ్ళాడడం తప్పనిసరి. పిల్లలు లీగల్, భార్య యిల్లీగల్ అన్నారు. మరి అభం శుభం తెలీక పుట్టిన పిల్లల్ని కోర్టు శిక్షించలేదు గదా. రెండవ భార్యయితే తెలిసే ఉద్దేశ్యపూర్వకంగా చేసుకుంది కనుక ఆమెని కోర్టు తప్పు పడ్తున్నట్టుగా మనం భావించాలేమో.

 3. స్వార్జిత ఆస్తి మీద తప్ప ఇంకే ఆస్తి మీదా ఎవరికీ ఏ విధమైన ఆటోమేటిక్ హక్కూ లేకుండా చేస్తేనే ఈ ఆస్తి గొడవలు సద్దుమణుగుతాయి. అందుకని అన్నిరకాల Transfer of propety acts రద్దుచెయ్యాలి. ఆస్తికి ఎవరు స్వంతదారో అతను/ ఆమె తన ఇష్టానుసారంగా చేసిన బదలాయింపునకే చట్టబద్ధత ఉండాలి.

  రకరకాల బాంధవ్యాల్ని అడ్డం పెట్టుకుని ఇతరుల ఆస్తి కొట్టెయ్యాలని చూసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు సమాజంలో. బాంధవ్యాన్నీ ఆస్తినీ వేఱువేఱుగా చూడ్డం మనుషులు నేర్చుకోవాలి.

 4. When it comes to the children of second wife, the judgement is apt.

  A woman is being cheated by all means and sometimes it is as a result of her own decisions. I cannot reply this post in a comment. In fact there is a serious need to write a blog on women and their problems and last but not the least, the degeneration of women.

 5. ఆడ వాళ్ళ లోనూ, మగ వాళ్ళాలోనూ అన్ని రకాల వారూ ఉంటారు.
  సమాజమూ, ప్రజాస్వామ్యంలో పాలకులూ ప్రజలే కదా.
  అంటే మనమే కదా. “మన” అభిప్రాయాలు చదివి నాకిలా అనాలనిపిస్తోంది.
  విజయకుమార్ గారు చెప్పినట్టు ఆస్తి కోసం పెళ్ళైన వాడిని చేసుకోకుండా ఉండడం కోసం
  చట్టం అలా ఉంటే, మరి ఆస్తి ఆశ చూపో లేక మొదటి భార్య గురించి అబద్ధాలు చెప్పో
  అవస్రంలో ఉన్నా ఆమెని advantage తీసుకునో పెళ్ళి చేసుకోకూదదు అనే విధంగా
  మగ వాళాని హెచ్చరించే చట్టాల గురించి తెలుపగలరు.
  మగ వాడు మోసం చెయ్య గలడు. మోసం వల్ల జరిగినా, తెలిసి జరిగినా
  ఆమె రెండో భార్య అయితే ఆమెకే నష్టం కాబట్టి ఆమే జాగ్రత్తగా ఉండాలి.
  ఇందులో కొత్తేముంది? ఆడవాళ్ళని చూసి attract అవుతాడు కాబట్టి ఆడవాళ్ళు ముసుగులేసుకోవాలి అన్న దానికీ దీనికీ తేడా ఏంటి?

  At the same time, చట్టాలూ, చదువులూ కూడా ఒకింత భద్రతనే ఇస్తాయి. ప్రతి దానికీ చట్టం చెయ్యలేము. ప్రతి సారీ దోషులను సరిగా గుర్తించలేము. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఉండి అవకాశం, అవగాహనా లేని వారికి సరైన దారి చూప గలిగితే కొంత మటుకు ప్రయోజనం ఉంటుంది.

 6. మా నాన్న కు కూడా చిన్న భార్య వుంది. మా అమ్మ మీద కక్ష్య తో మా తాత ఆమెను తీసుకొచ్చారు. మా అమ్మకు సవతికి ఆస్తి ఇవ్వడానికి మనస్సు ఎలా వస్తుంది. anjaneyuludamera8@gmail.com blogger:- anjaneyuludamera.blogspot.com

 7. ఇది కొంచెం సున్నితమైన అంశం. వివాహచట్టాలూ, వారసత్వచట్టాలూ మతంతో ముడిపడి ఉంటాయి. నాకు తెలిసి హిందూవివాహచట్టం ప్రకారం వివాహితుడైన వ్యక్తి భార్యయొక్క లిఖితపూర్వకమైన అనుమతి లేకుండా మరొక వివాహం చేసుకోవాటానికి అనర్హుడు. అలా అతిక్రమించి చేసుకున్న వివాహానికి చట్టబధ్ధత ఉండదు. కాబట్టి చెల్లని వివాహం ద్వారా భార్యస్థానంలోకి మరొక స్త్రీ రావటం కూడా చెల్లదు. కనుక ఆమెకు అలా చట్టవ్యతిరేకవివాహం ద్వారా భర్త అయిన వ్యక్తి ఆస్తిలో వారసత్వపు హక్కు ఉండదు. ఒకవేళ ఈ రెండవ వివాహంద్వారా బిడ్దలు కలిగితే ఆ భర్తకు ఔరసులుగా వారికి మాత్రం వారసత్వపు హక్కు ఉంటుంది సహజన్యాయం ప్రకారం.

  మొదటి భార్య అనుమతిని నిర్భంధం చేయటం ద్వారా ఆమెకు గల హక్కుని పరిరక్షించటమే హిందూ వివాహచట్టం ఉద్దేశం. తన అనుమతి లేకుండా భర్త మరొక వివాహం చేసుకుంటే ఆమెకు చట్ట ప్రకారం చర్య తీసుకొనే అవకాశం ఉంది.

  భార్యను వదలిపెట్టీన వ్యక్తులమని కొందరు పెళ్ళికి తయారు. అటు వంటి చట్టబద్ద్హమైన స్థితి యేమీ‌ లేదు. భార్యను వదిలేయటం కుదరదు. అది నేరం. భార్యకు వివాహహక్కులకోసం దావా వేసే అవకాశం ఉంది. అలాంటి వాడిని అమ్మాయిలు పెళ్ళి చేసుకోరాదు.

  ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి. భార్యనుండి విడాకులు తీసుకున్న వ్యక్తులు మరలా వివాహం చేసుకోవటంలో తప్పు లేదు, చట్ట విరుధ్ధం కాదు . అయితే, విడాకులు అనేది ఒక లిటిగేషన్ వ్యవహారం అని గట్టిగా గుర్తించాలి. ఒక కోర్టు మంజూరు చేసిన విడాకుల డిక్రీని భార్య పై కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని మర్చిపో కూడదు. ఈ‌మధ్యనే అటువంటు ఒక కేసులో క్రింది కోర్టు మంజూరు చేసిన విడాకులను హైకోర్టు రద్దు చేయటం జరిగిందని పత్రికలలో‌ వార్త వచ్చింది. అందు చేత విడాకులు తీసుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవటంలో కొంత రిస్కు ఉన్నదని గ్రహించాలి స్త్రీలు.

  మనదేశంలో హెచ్చుశాతం మంది ఆడపిల్లలు తల్లిదండ్రులు చూపిన వ్యక్తిని చేసుకుని తీరాల్సిన పరిస్థితి. ఆర్థిక సామాజిక కారణాలవల్ల అనేక మంది అమ్మాయిలు విధురులనూ విడాకులు తీసుకున్న వాళ్ళనూ‌ పెళ్ళాడటం జరుగుతున్నదు. దాదాపుగా వారెవరూ ఆస్తిమీద కన్ను వేసి నేటి TV ధారావాకిలల్లోని అమ్మాయిల్లాగా పెళ్ళికి తయారవుతున్నది అవాస్తవం.

  వివరగా ఒక మాట. చట్టాలు వివాహానికి, వివాహం ద్వారా కలిగిన హక్కులకూ‌ రక్షణ కల్పించటానికి ఉన్నాయి. వాటిని తెలిసి ఉండటం చాలా చాలా అవసరం. చాల మందికి, ముఖ్యంగా అమ్మాయిలకు ఇటువంటి హక్కుల గురించి అవగాహన యేమీ ఉండటం లేదు. ఇది శోచనీయం.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: