విశ్వనాథ సౌమ్యము

“చంద్రగుప్తుని స్వప్నము” అన్న ఈ నవలారాజము విశ్వనాథ వారి పురాణవైర గ్రంథమాల అనెడి ఆరు గ్రంథరాజములలో ఐదవది. ఓ! సారీ….విశ్వనాథ వారి పుస్తకాల వరుస రీడింగ్ మొదలుపెట్టి, నేను కూడా ఆ భాష లోకి వెళ్ళిపోతున్నా!! 🙂 ఇంతకీ ఈ పుస్తకం చాణక్యుడు నందుల వంశాన్ని ఎలా నాశనం చేసాడు? అన్న కథాంశంతో రాసినది. రచనాకాలం 1960 అట. విశ్వనాథ ఆశువుగా చెబుతూ ఉంటే జువ్వాడి గౌతమరావు గారు రాసారట. ఇది, “నందోరాజాభవిష్యతి” అన్న నవలా రెండూ కలిపి పన్నెండు రోజుల్లో చెప్పారట!!!!! టోపీలు తీసేయండి అందరూనూ!

నిజానికి ఈ నవల ఒక సెటైర్ అని చెప్పవచ్చు. పాశ్చాత్య చరిత్రకారులమీద సెటైర్. అలెగ్జాండరు చంద్రగుప్త మౌర్యుని కాలం లో భారతదేశం పైకి దండెత్తాడని వారు రాసారు. కానీ, అది అభూతకల్పన అని, అలెగ్జాండర్ వచ్చింది క్రీ.పూ.327 ప్రాంతంలో అయితే, మౌర్య చంద్రగుప్తుడు మగధను పాలించింది క్రీ.పూ.1534 నుండి 1500 వరకూ అని విశ్వనాథ గారి వాదన. పాశ్చాత్యులు -“ఒకనికొకపేరుండగా, ఆ పేరునుబట్టి వారెరిగియున్న ఈ పేరుగల వాడింకొకడుండగా, వారిద్దరొకటే యనుట” వంటి “అపభ్రంశములు” చేస్తారు కనుక వారిపై ఇది వ్యంగ్యాస్త్రం. పరిచయ వాక్యాల్లోని ఆఖరు పేరా చూస్తే మీకు విశ్వనాథ వారి సెటైర్ లెవెల్ అర్థమౌతుంది.

“ఒక కాలమునందు ధృడముగా విశ్వసింపబడుతున్న విషయము, పడబోవుచున్న విషయము – నిరాలంబమైన కాలములో వెనుకగా తట్టి, చంద్రగుప్తునకట్టి స్వప్నము వచ్చెను. కాలము నిత్యమైనది.ప్రవాహము వంటిదని అర్థము. సముద్రము పోటు పొడిచినచో అది కొన్ని మైళ్ళదూరము ఉప్పునీరగును కదా! ఆ రీతిగా చంద్రగుప్తునికి స్వప్నము వచ్చెను!”

ఇక కథ విషయానికొస్తే, నాకు ఆ పేరెందుకు పెట్టారో అర్థం కాలేదు. సుమారు 180 పేజీలున్న ఈ పుస్తకం లో, చివరి పేజీలో మాత్రం వస్తుంది “స్వప్నం” చంద్రగుప్తునికి. కథంతా చాణక్యుడు ఏ రకమైన ఎత్తులతో ఇతన్ని రాజుని చేశాడు అన్నదానిపై కానీ, చంద్రగుప్తుని స్వప్నం పై కాదు. ఆ పేరుకి నవల అవదు ఇది. రెండు పేజీల కథ లో తేల్చేయొచ్చు. ఇది చరిత్ర కావడంతో, ఇక్కడ మనం సృష్తించుకునే కథ తక్కువ, కథనం ఎక్కువ. ఆ కథనం పరంగా ఇది బాగుంది. ఆపకుండా చదివిస్తుంది. అయినప్పటికీ, పేరుకీ, నవలకీ పొంతనలేదనే అనిపిస్తుంది నాకు.

దీని ముందు “దూతమేఘము” అన్న మరో నవల చదవడం జరిగింది. అదైతే పుర్తి ఫాంటసీ కథ ఇక. నేపాలీరాజవంశ కథల్లో ఒకటి అని రాసిఉంది దానిపై. అది కూడా విశ్వనాథ వారు ఆశువుగా చెబుతూ ఉంటే ఎవరో రాసారు. దూతమేఘము కూడా టైటిల్ ఎందుకు అది పెట్టారో అర్థం కాలేదు. చివరి పేజీలో తప్ప దూతమేఘము అంటే ఏమిటో మనకు అర్థం కాదు. ఇందులో కథనం నాకు మరీ అంత బలంగ అనిపించలేదు. ఆ కథే వింత వింతగా ఉంటే ఇక కథనం గురించి ఎక్కడ పట్టించుకోను గాని…. ఈ రెండు బట్టి ఒకటి అనుమానం – ఈయనకి కథకి చివర్లో తప్ప మిగితాచోట్ల సంబంధం లేని పేర్లు పెట్టడం ఇష్టం లాగుంది 🙂 “విష్ణు శర్మ..”, “దూతమేఘం” చూసాక-ఫాంటసీ కథలంటే కూడా ఈయనకి ఇష్టమేమో అనిపిస్తోంది.

మీకు చరిత్ర ఆసక్తి ఉంటే “చంద్రగుప్తుని స్వప్నము” అనబడు “చాణక్య చంద్రగుప్తుల కథ” నచ్చుతుంది. పేరు విషయంలో ఆశ్చర్యం కలగొచ్చు. ఫాంటసీ కథల్లో ఇష్టం ఉండి, భాష భరించగలిగితే “దూతమేఘము” నచ్చుతుంది. ఇంతకీ దూతమేఘము అన్న పేరుని ఒకమ్మాయి కి ఆ నవల్లో కాళిదాసు పెడతాడు. దానికి అతనిచ్చే వివరణ హైలైట్ అసలు. నేను పడీపడీ నవ్వుకున్నాను.

గమనింపుడు: ఈ యొక్క బ్లాగు లో చెప్పబడిన ఆ యొక్క అభిప్రాయములు నా సొంతము. ఒకటి నాకు నచ్చినచో పొగిడెదను, లేనిచో తెగిడెదను. నచ్చీనచ్చక ఉండినచో అట్లే రాసెదను. నచ్చకున్నచో నచ్చిందని రాయవలసిన ఆగత్యము లేదు. నాపై వ్యర్థమైన తిట్టు వ్యాఖ్యలరూపములో నాకు పంపిననూ నేను అంగీకరించజాలను. సాధారణ మానవ భాషయందు చెప్పిన అర్థముజేసుకోజాలని వారి కోసం మా గురువు విశ్వనాథ వారే స్వప్నమందు దర్శనమిచ్చి ఈ వ్యాఖ్య రాయమని సెలవిచ్చినారు. ఇప్పటికి సెలవు. ఈ టపాను “విశ్వనాథ సౌమ్యము” గా నామకరణము చేయమని కూడా ఓ సలాహా ఇవ్వబడినది మదీయ గురువర్యుల కంఠం నుండి. “విశ్వనాథ సౌమ్య” మనగా విశ్వనాథుని ప్రభావములో సౌమ్య కి కలిగిన జ్ఞానోదయమని భావము. మీకట్లు అనిపించకున్ననూ అట్లే అనుకొనవలయును. అది మా యొక్క శాసనము.

Advertisements
Published in: on January 14, 2008 at 2:09 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/01/14/viswanatha-sowmyamu/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. దాన్నే కాస్త తిరగా బోర్లా వేసి “సౌమ్య విశ్వనాథము” అని ఉండాల్సింది 🙂

 2. 🙂

  for last para!

 3. @ko.pa:
  మధ్యన నాకు తెలీకుండా ఈ విశ్వనాథం కేరెక్టరెవరండీ?? 😉

 4. వి.స.నా గారు ఎప్పుడూ సొంతంగా రాయలేదు. ఆయనకెప్పుడూ ఒక వ్రాయసకాడు ప్రక్కనుండేవాడు. ఆశుసంప్రదాయం మనకు మొన్నమొన్నటి వరకు కూడా బలంగా వుండేదనటానికి ఆయన ఒక మంచి ఉదాహరణ.

  — శ్రీనివాస్

 5. పురాణ వైరగ్రంథ మాల గురుంచి మనం మాట్లాడే టప్పుడు ఆ నవలలు వ్రాయటానికి గల కారణాలను పరిశీలించకుండా మీ అభిప్రాయాలను వ్యక్త పరచటం అంత సబబు కాదని నా అభిప్రాయం.

  “పురాణ వైరం” అంటే ఎమిటో వివరించి ఆ తరువాత ఆ నవలుకు పెట్టిన పేరు సబబో కాదో నిర్ణయించటం బాగుంటుంది.

  చరిత్ర ఏ ప్రమాణాలపై ఆధార పడి వ్రాయటం జరుగుతుందో ఆ ప్రమాణాలను ఉపయోగించినందుకు కారణాలను చరిత్రకారులు చెప్తారు. ఆ ప్రమాణాల ఎంపిక ఉచితానుచితాలను పరిశీలించిన మీదట ఎంత శాస్త్రీయంగా వుంది అనేదానిని బట్టి వ్రాయబడిన చరిత్ర ఎంత మేరకు గత చరిత్రను ప్రతిబింబిస్తుంది అనేది తేలుతుంది.

  భారత చరిత్ర పాశ్చాత్యుల చేతిలో పడి తప్పుల తడకగా మారింది అనీ, పాశ్చాత్య చరిత్రకారులు చేసిన పొరపాట్లను ఎత్తి చూపుతూ, అదే సమయంలో పురాణాల్లో చెప్పబడిన రాజవంశ చరిత్రను, నేపాళ రాజవంశ చరిత్రను, రాజతరంగిణిలో చెప్పిన కాశ్మీర రాజవంశ చరిత్రను పరిశీలించన మీదట శ్రీ కోటా వేంకటాచలం గారు తమ పరిశోధనా ఫలితాలను ప్రకటించగా వాటికి పాశ్చాత్య చరిత్ర వ్రాసేవిధానం పై నమ్మకం తో మన చరిత్రకారులు ఇవ్వవలసిన స్థానం ఇవ్వకపోగా వీటిలోవున్న అంశాలను గూర్చి చర్చించటానికి కూడా ముందుకు రాలేదు. ఈ పుస్తకాలలో ప్రకటించిన అంశాలను ప్రజల ముందుకు తీసుకురావలసిన అవసరాన్ని గమనించి విశ్వనాథ వారు ఈ నవలా రచన ప్రారంభం చేశారు.

  పురాణాలన్నీ పుక్కిటి పురాణాలనీ వాటిలో చారిత్రకత లేదనే వాదం ప్రబలమై, పురాణాల ప్రామాణికత పై నమ్మకం లేకపోవటమే “పురాణ వైరం”.

  కోటా వేంకటాచలం గారి వాదన ప్రకారం మనకు నేర్పే చరిత్రలో గుప్త చంద్రగుప్తుని ఒక 800 సంవత్సరాలు వెనకకు తీసుకువెళ్ళి మౌర్య చంద్రగుప్తుని స్థానంలో వుంచి చరిత్రను తిరగ వ్రాస్తే వచ్చే చరిత్ర పురాణాలలో చెప్పబడిన రాజవంశ చరిత్రలతో సమానంగా అతికినట్టు సరిపోతుంది అని.

  ఈ అంశాన్ని ప్రస్తావించటం కొరకే నవల చివరిలో ఆ స్వప్న సందర్భాన్ని సృష్టించటం వెనుక వున్న లక్ష్యం.

  పురాణ వైర గ్రంథ మాల లోని మొదటి రెండు నవలలను క్షుణ్ణంగా పరిశీలించాలనే కోరికతో చదవటం మూలాన మన గ్రంథాలయానికి తిరిగి చేర్చలేదు. కానీ ఇప్పుడు చేర్చవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తోంది.

  పురాణ వైర గ్రంథమాలలోని ప్రతీ నవలను విడిగా చదివినా నష్టంలేదు. కానీ, ఆ చదవటం ఒక మంచి కథ, కథనం వున్న నవల చదివాను అనే భావనను దాటకూడదు. ఆ నవలపై కామెంట్లు మీరు ముందూ వెనుకలు పరిశీలించక చేయటం మంచిది కాదు. మీరు “భగవంతుని మీద పగ” అనే పేరుతో మొదలయ్యే మొదటి నవలను చదివి నేను అన్నది సరి అయ్యిందో కాదో తేల్చుకోగలరు.

  మీ చివరి పారా చదివాక కుడా ఇంత పెద్ద కామెంటు వ్రాయటానికి గల కారణం ఒక్కటే. విశ్వనాథ వారి భావం గ్రహించేందుకు చేయవలసిన కృషి మీరు చెయ్యాలి అనే ఆకాంక్ష మాత్రమే.

 6. *paina raasina commentlo:
  “puraaNavaira graMthamaala gurunchi” ni
  “puraaNavaira graMthamaala gurinchi” ga chadavagalaru.

 7. @Pranav:
  ఆ నవలని నేను చూసిన దృక్కోణం వేరు. మీరు చూస్తున్నది వేరు. ఒక నవలకి పేరు పెడితే దానికి ఆ పేరు పెట్టడం వెనుక కాస్తంతైనా జస్టిఫికేషన్ ఉండాలి. ఆ విషయమ్ తప్ప “చంద్రగుప్తుని స్వప్నం” తో నాకు ఎటువంటి సమస్యా లేదు. “దూతమేఘం” అంటారా…
  “కానీ, ఆ చదవటం ఒక మంచి కథ, కథనం వున్న నవల చదివాను అనే భావనను దాటకూడదు.”
  -అది మంచి కథో, కథనమో, రెండూనో ఉన్నప్పటి సంగతి. దూతమేఘం నాకు అలా అనిపించలేదు మరి.

 8. ఇలాగే రాస్తూ వెళ్ళండి. మీకు లేడీ విశ్వనాధ అని బిరుది ఇచ్చేస్తాం 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: