కెవ్వుకెవ్వుమనే సీను ఒకటి, ఇతరత్రా కబుర్లు

నేను గురువారం మధ్యాహ్నం “రేపు పండగ” అన్న కారణం తో ఇంటికి వచ్చేశాను. లాంగ్ వీకెండ్ అన్న ఆనందంలో. సరే, వచ్చాక యధావిధిగా నేనొక్కదాన్నే సాయంత్రం దాకా. మ్యాచ్ వస్తోంది కదా అని టీవీ ఆన్ చేసాను. అవీ ఇవీ చానెళ్ళు మారుస్తూ జీ-తెలుగు దగ్గర ఆగాను. ఒక మహా గొప్ప సృజనాత్మకత గల సీనుకి సాక్షీభూతమై నిలిచాను. చెబుతాను వినండి. భానుప్రియ, కృష్ణ ల ముద్దుల కొడుకు మహేశ్ బాబు (ఈ సినిమా లో మరీ చిన్నగా ఉన్నాడు…బాలనటుడిగా నటించిన తక్కిన సినిమాల కంటే కూడానూ.) విలన్లు మహేశ్ ని చంపాలని ప్లాన్ వేస్తారు (ఎందుకు? అవన్నీ నాకు తెలీదు). మహేశ్ వాళ్ళ ఇంటి ఆరుబయట మంచం పై పడుకుని ఉంటాడు.. వెలుతురు ఉండగానే. ఇంతలో విలన్ ఒకడు మేడపైకి ఎక్కి ఓ తాడు బైటకి తీస్తాడు. నెమ్మదిగా ఆ తాడుని మహేశ్ వైపుకి జారవిడుస్తాడు. మహేశ్ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య పెదాల మధ్య ఏర్పడ్డ గ్యాప్ లోకి ఈ తాడు ని వదుల్తాడు. మహేశ్ నిద్ర కొనసాగుతూ ఉంటుంది. తరువాత, ఓ సీసా తీస్తాడు విలన్. అది విషం సీసా. ఇక అందులోంచి కొన్ని చుక్కల విషాన్ని ఆ తాడు పైకి జారవిడుస్తాడు. ఆ విషపు బొట్లు అలా తాడు పై జారుతూ జారుతూ చివర్న మహేశ్ పెదాల మధ్య ఏర్పడ్డ గ్యాప్ ద్వారా అతనిలో ప్రవేశించి అతన్ని చంపేస్తాయి…అదీ ప్లాన్. తర్వాత అది ఆఖరు సెకన్లో ఫెయిలవడం వరకూ చూడగలిగాను. తర్వాత కెవ్వు కెవ్వు అని అరుస్తూ చానెల్ మార్చేసాను…ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో ఏమో అని! మన వాళ్ళది సృజనాత్మకతో లేక మళ్ళీ ఎక్కడ్నుంచో కాపీ నో అర్థం కాలేదు. (అంటే, ఈ మధ్య ఇలాగే ఏదో బాగా క్రియేటివిటీ చూపారే అనగానే అందరూ అదో హాలీవుడ్ సినిమా కాపీ అనేసారు! అందుకని నాకు అనుమానం మళ్ళీ!) సినిమా పేరు “శంఖారావం” అట..ఇంతకీ.

ఇతరత్రా కబుర్లు… నేను “ఓం ఠాగూరాయ నమహ” అనుకుంటున్నా ప్రస్తుతం. అంటే చిరంజీవి కాదండోయ్… విశ్వకవీంద్రులవారు. ఆయన కవిత్వం చదివి అర్థంచేసుకునేంత పరిపక్వత నాకు లేదేమో అని నేను అవి చదవలేదు. మామూలు కథలు, వ్యాసాలూ గట్రా చదువుతూ ఉన్నా వీలు చిక్కినపుడు. నిద్రపోయే ముందు అప్పుడోటీ ఇప్పుడోటీ చెకోవ్(చెహోవ్ అని రాస్తారు మరి కొందరు…ఏమనాలో తెలీదు…Anton Chekov) కథలు చదువుతున్నా…చాలా మటుకు ఇదివరలో చదివినవే. చదువుతున్నంత సేపు – “Read Chekov. He teaches us, us.” అని ఎవరో అన్న మాటలే పదే పదే గుర్తు వచ్చాయి నాకు.

ఇండియా రెండో మ్యాచ్ ఓడిపోడం నాకు షాక్ ని ఇచ్చింది. ఓడిపోయే అవకాశం కూడా ఉంది అనుకోలేదు నేను. 😦 కుంబ్లే ని ఎట్టకేలకి ఓ సీరీస్ కి కెప్టెన్ గా చూడగలుగుతున్నాను 🙂 తెండూల్కర్ మళ్ళీ నెర్వస్ నైన్టీస్! 😦 ద్రవిడ్ ని వన్డే టీమ్ లో ఆడించకపోవడం మాత్రం నాకు నచ్చలేదు 😦 … మూడో మ్యాచ్ గెలిచాం…సంతోషం… 🙂  (మూడు 😦 లు, రెండు 🙂  .. కనుక, 😦 బరువే ఎక్కువ)

“ఐ, రోబో” సినిమా చూసాక నాకు టెక్నాలజీ గురించి తాత్విక చింతన పెరిగిపోయిందేమో అని అనుమానంగా ఉంది! ఇది కాక విశాల్ భరద్వాజ్ “ది బ్లూ అమ్బ్రెల్లా” చూసాను. రస్కిన్ బాండ్ నవల ఆధారంగా తీసారు. పంకజ్ కపూర్ నటన అధ్భుతం. ఈ సినిమా గురించిన చక్కని రీవ్యూ ఇక్కడ. అసలు సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయిన హిందీ సినిమా “జానీ గద్దార్”. సినిమా ఆద్యంతమూ చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా చివరి సీన్…. ట్రూ థ్రిల్లర్ మూవీ. సినిమా ప్రారంభం లోనే దీన్ని విజయ్ ఆనంద్ మరియు జేమ్స్ హాడ్లీ చేస్ లకు అంకితమిస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. 2007 లోనే విడుదలైనా కూడా ఈ సినిమా గురించి ఎందుకు ఎవరూ మాట్లాడుకోలేదో మరి….అర్థం కాలేదు… “జానీ గద్దార్” సినిమా ఇటీవలి హిందీ సినిమాల్లోకెల్లా చూడదగ్గ సినిమా.

మిక్కీ జె.మేయర్ నోట్‍బుక్ సినిమా పాటలు విన్నా…. బాగనే ఉన్నాయి అనిపించాయి. ఇటీవల కొత్త పాటలు వినడం కూడా తగ్గిపోయింది ఓ నెలరోజులుగా…బ్లాగడం ఆగినట్లు…మళ్ళీ దీని లాగే అవీ మొదలు 🙂

“విష్ణుశర్మ…” గురించిన నా వ్యాసానికి చాలా కామెంట్లు వచ్చాయి. ఈ నా బడుగు బ్లాగులో (బడుగు జీవితం లాగా అనమాట) ఏ టపా కీ అన్ని కామెంట్లు వచ్చిన దాఖలాలు లేవు నాకు తెలిసీ. ధన్యవాదాలు అందరికీనూ.

(ఈ పోస్టు లో ఈ బ్లాగు లో ఉన్న కేటగిరీలని అన్నింటినీ కవర్ చేసేసినట్లు ఉన్నా! :))

Advertisements
Published in: on November 12, 2007 at 9:05 am  Comments (12)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/11/12/at-random-nov12/trackback/

RSS feed for comments on this post.

12 CommentsLeave a comment

 1. మీరు ఆ మాత్రపు creativity కే ఆశ్చర్య పోతే ఎలా??
  పేరు చెప్పటం ఎందుకు కానీ…
  కనీ వినీ అధ్బుతాలు చాలానే జరుగుతున్నాయి …
  ఇది చూడండీ….

 2. @Aswin
  కెవ్వు కెవ్వు…. మతిచెలించి పోయే కెవ్వు

 3. తాడు తొ విషపు చుక్కలను విదవటం ఒక James Bond సినిమా లొ చూసాను…
  Jhonny gaddar నెను కూడా చూసాను….నాకు నచ్చింది

 4. ఆ విషం, తాడు, అలా బొట్లు – ఇదంతా ఒక జేమ్స్ బాండ్ సినిమాలో షాన్ కాన్నరీని చంపడానికి ఉపయోగిస్తారు. ఇందులో బాండ్ జాపనీస్ లా తయారవుతాడు. ప్రస్తుతానికి పేరు గురుతుకురావడం లేదు. ఇది ఒరిజినల్ గా ఒక నింజా టెక్నీక్. ఐ,రోబో – ఇసాక్ అసిమొవ్ రోబో కధల ఆధారంగా తీసారు అనుకొనేరు – లాస్ ఆఫ్ రోబోటిక్స్ ని, రోబో సైకాలజిస్ట్ సూసన్ కాల్విన్, ఇంకా ఆల్-ఫ్రెడ్ లాన్నింగ్ పేర్లని మాత్రం వాడుకొన్నారు. ఆసిమొవ్ – scriptని OK చేసారనుకొండి.

 5. బడుగా అంటే?

 6. ఈ మాత్రం దానికే మీరంత హాశ్చర్యపడిపొతే ఎలా?. నందమూరి అందగాడు బాలక్రిష్ణ సినీమాలు చూసిన అనుభవం మీకులేదంకుంటా. వీలుచేసుకొని చూడండి, ఆ అభూతకల్పనలకి వైరాగ్యంతో పాటు, విరక్తి కూడా కలుగుంది.

  …వల్లూరి.

 7. ఇదివరకు సినిమాల్లో హీరో కుటుంబాన్ని తాళ్ళతో కట్టి వేళ్ళడతీయడం, కింద మంటలు, మరిగే నీళ్ళు, తాళ్ళు బలహీనమవుతుండటం ఇలా ఏవేవో లాజిక్కులు… హీరో అవన్నీ ఛేధిస్తాడానుకోండి. ఇప్పుడు టాటా సుమోల్లో కత్తులు గుండ్రంగా తిప్పుతూ, తెల్ల దుస్తుల్లో విలన్లు – ఇలా ఒక్కో కాలం లో ఒక్కోలా సినిమాలకి బలవుతూ వస్తున్నాం మనం.

 8. ఏయ్, ఎవరక్కడ. బాలయ్య ను ఏమన్నా అన్నారా ఖబడ్దార్. కెవ్వు కెవ్వు…

 9. బాలయ్యని ఎంత మాటంటారు ?
  సత్తిరెడ్డి తొక్కిచ్చేయ్…

 10. బాలయ్యని ఎంత మాటంటారు ?
  సత్తిరెడ్డి తొక్కిచ్చేయ్…

 11. మనోరమ సిక్స్ ఫీట్ అండర్ కూడా బాగుంది వీలైతే చూడండి.

 12. Iam very much impressed with your views published in your blog.All the entries are intresting and infact informative. My heartiest wishes for your work .. Keep posting your new entries


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: