మా స్కూల్ లో ఓ చిచ్చర పిడుగు

ఈ చిచ్చర పిడుగు అన్న పదం ఇక్కడ వాడొచ్చో లేదో నాకు తెలీదు కానీ….. ఇక్కడ మొన్న సోమవారం నాడు వచ్చిన ఓ పిల్లని గురించి చెప్పడానికి ఇంతకంటే నాకు మంచి పదం కనబళ్ళేదు…

ఆ పిల్ల ఎల్కేజీ చదువుతోందట. వయసు ఏడేళ్ళట…ఏడేళ్ళకి ఎల్కేజీ ఏమిటి అనకండి…. అదంతే. పిల్ల బాగా తెలివితేటలు గలది…చురుగ్గా ఉంది. మూడు భాషల్లోనూ అక్షరాలు రాయడం వచ్చు. ఏడేళ్ళప్పటికి నాకైతే హిందీ రాదు మరి. మూడో తరగతి నుండి ఉండేది మాకు హిందీ…ఆ పిల్లకి అప్పుడే ఎలా వచ్చేసిందో ఏమో గానీ. ఎక్కాలొచ్చట…కొంతవరకూ. తెలుగైతే గుణింతాలు కూడా వచ్చు. ఏదడిగినా చురుగ్గా చేసేస్తోంది…వేగంగా కూడానూ. సరే, ఆ పిల్లని ఎంగేజ్ చేయాలని, మా స్కూల్ కి సంబంధించిన ఆషా మేడం కి తెలుగు అక్షరాలు నేర్పమని అన్నాం నేను, ఆషా గారూనూ. (ఆమె కి తెలుగు తెలియదు). ఆ పిల్లల సైకాలజీ ప్రకారం చూస్తే వాళ్ళు సిగ్గుపడి చెప్పననాలి. కానీ, ఈ పిల్ల దొరికిందే చాన్స్ అని చెప్తా అన్నది.

కాసేపు నేను వేరే పిల్లల గొడవ లో పడి వీళ్ళని చూడలేదు. తరువాత చూస్తే – “ఇది తప్పు రాసావు. ఇలా రాయకూడదు…ఇలా రాయాలి…” అనుకుంటూ ఏదేదో చెబుతూ ఉంది ఈ పిల్ల ఆషా గారికి :)) నిజం చెప్పొద్దూ…భలే నవ్వు వచ్చింది. పైగా, ఆవిడ అక్షరాలు రాస్తే, కరెక్షన్ కూడానూ! ఓ పక్క నవ్వొస్తోంది.. ఓ పక్క ఆ పిల్లని చూస్తూ ఉంటే ముచ్చటేస్తోంది. ఆ స్కూలుకొచ్చిన పిల్లల్లో నేను – కాస్త చురుగ్గా, ఆత్మవిశ్వాసం తో నిండి ఉండి, మరీ అల్లరిగా కాక బుద్ధిగా ఉండే పిల్లల్ని ఇద్దరినే చూసాను. ఒకరు మీనా, ఇది వరలో రెండు మూడు సార్లు ఈ బ్లాగులోనే రాసాను తన గురించి. రెండో పిల్ల ఈ అమ్మాయి శిరీష. అందులో మీనా అందరికంటే పెద్ద పిల్ల, ఈమె దాదాపు అందరికంటే చిన్న పిల్లానూ.

ఏమైనా కూడా ఈ పిల్ల ఇలాగే ఉంటే మంచి స్థానానికి వస్తుంది జీవితం లో అని అనిపిస్తోంది.

Advertisements
Published in: on September 26, 2007 at 1:27 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/26/chichchara-pidugu/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. ఈ కాలం పిల్లలందరూ చిచ్చర పిడుగులే అండి బాబూ!!

  ఈ అందరిలో టాప్ చిచ్చర పిడుగన్నమాట శిరీష! ఏమంటారూ?

  ఆల్ హ్యపీస్..

 2. శిరీష – ఈ పేరు ఉన్నవాళ్ళందరూ తెలివైనవాళ్ళు. నేను చూసినంతమేరకు 🙂
  ఆ పాప గురుంచి చదువుతుంటే ముచ్చటేస్తోంది. ప్లీజ్.. ఆ పాప తన చదువు మొత్తం అదే టెంపో మెయింటెయిన్ చేసేలా వ్యక్తిగత శ్రద్ద తీస్కోండి. చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళు కెరీర్ లో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

  – కృష్ణ

 3. Naa koothure maro example, aame ki 2 yrs 4 months, ennenno cheptundi.. anni telugu/english rhymes, manm edi ante ade antestundi..
  its really surprising to know that those kids are so conf and intelligents

 4. Such active kids inspire us in turn. Good. Spending time with children is such a wonderful experience. We can learn so many things from them.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: