ఇది నాస్తికత్వమెలా ఔతుంది?

ఈ ప్రపంచికం లో మతాలకేం కొదువ? హిందూ మతం…క్రిష్టియన్ మతం, ఇస్లాం, బుద్ధిజం, సిక్కిజం, జైనిజం, Zorastrianism, బహాయ్ మతం, కంఫ్యూజియనిజం, Judaism, Shintoism…వగైరా వగైరా బోలెడు మతాలున్నాయి….  నా వరకు నేను అర్థం చేసుకున్న మతం – అదొక జీవన విధానం అన్న అర్థం లో. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళవి అన్నట్లు ఉన్నా ఇన్ని రోజులూ. ఈరోజు ఈ బ్లాగు రాస్తా అనుకోలేదు కానీ… ఇక ఉండబట్టలేక బహిరంగంగా గోడు వెళ్ళబోసుకుంటున్నా 🙂

ఏం చెప్పమంటారు? ఏమిటో… నాకీ మధ్య “మానవ సేవే మాధవ సేవ” అన్న మాటలు మునుపెన్నడూ లేనంత నిజం అనిపిస్తున్నాయి. “దేవుడెక్కడో లేడు… నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు… మనందరిలో ఉన్నాడు” అన్న భావన ఎక్కువైంది… ఈ ప్రభావం లో ఈ పూజలూ, పునస్కారాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది.  మామూలుగానే ఎప్పుడో మా నాన్న ఉన్నప్పుడు తప్ప నేనెప్పుడూ పెద్దగా రిలీజియస్ కాదు…నాకు గుర్తున్నంత వరకూ. చిన్నప్పుడు అయితే, ఆయన నేర్పేవాళ్ళు కనుక ఏదో ఆ శ్లోకాలు అవీ చదవడం వంటివి చేసేదాన్ని. కానీ, ఇటీవలి కాలం లో గుళ్ళకు వెళ్ళడం కూడా ఏదో ఓ ఔటింగ్ లాగా, కాస్త రిలాక్సేషన్ కోసం ఆ వెళదాం అన్న వాళ్ళతో వెళ్తున్నా కానీ… మరింకే కారణానికీ కాదు…. ఈ విషయం పైనే రెండు రోజులుగా నా స్నేహితురాలితో చర్చలు. నువ్వు నాస్తికురాలివి అంటుంది ఆమె. నేనెట్ల నాస్తికురాలినౌతాను? (అసలెవరైనా నాస్తికులు కాలేరని నా నమ్మకం. ఏదో ఓ దాన్ని వాళ్ళు విశ్వసిస్తారు కదా…ఆ సిద్ధాంతమే దైవం మరి!) అని నేనంటాను.  మా చర్చ ఇలా ఉంది… యధాతథంగా కాదు కానీ… ఈ విధంగా-

“నేను నాస్తికురాలిని అని ఎవరన్నారు?”

“మరి నువ్వు దేవుణ్ణి నమ్మవు కద?”

“అసలు నేను నమ్మను అని ఎవరన్నారు?”

“మరి పూజలు అవీ ఇష్టం లేదు అన్నావు కదా?”

“అయితే? దేవుణ్ణి నమ్మనా?”

“మొన్నోరోజు విగ్రహారాధన కూడా నచ్చట్లేదు అన్నావు కదా?”

“అవును, అయితే? నాస్తికురాలినా?”

“దేవుణ్ణి నమ్మకపోతే నాస్తికులనే అంటారు!”

“మొదటగా ఒక విషయం – నాకు పూజల మీద ఆసక్తి లేదు అని మాత్రమే అన్నాను. విగ్రహారాధన కూడా అంతే. నాస్తికత్వానికి, వాటికీ తేడా ఉంది.”

“సరే. ఇప్పుడేమిటంటావ్?”

” అంటే నువ్వు నమ్మే దేవుడికి నేను పూజ చేయకపోతే నేను నాస్తికురాలినా? ఈ లెక్కన నీకు క్రిశ్టియన్లు, ముస్లింలు వీళ్ళందరూ నాస్తికుల్లానే కనబడాలే?”

“అలా ఎలా అంటాను? వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ కున్నారు…”

“మరి నా దేవుళ్ళు నాకూ ఉన్నారు.”

“ఎవరు?”

“మీరే…”

“??”

“మానవత్వం ఏ కాస్త ఉన్న మనిషైనా దేవుడే. ఇంకో ప్రాణికి ఉపయోగపడే ఏ ప్రాణైనా దేవుడే. మనుష్యులకు ఉపయోగపడే వస్తువులు కూడా దేవుళ్ళే మరి (దేవుడు చేసిన దేవుళ్ళు అనాలేమో వీటిని…హీహీ)”

“అది వేరు…”

“అదే మరి. నాకు అది వేరు కాదు.”

“ఇంత మంది నమ్ముతున్నారు కదా….”

“నేను వాళ్ళనేమన్నా అన్నానా? నేను ఈ దేవుళ్ళను నమ్ముతా అంటున్నా. ఎవరి మతం వారిది..ఎవరి జీవితం వారిదీ”

– ఇక్కడ ఆగింది ఈరోజుకి.

నా మీద “సత్యమే శివం” ప్రభావం బాగా ఉంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు అనిపించింది ఈ చర్చ ను బట్టి. ఏమైనా, నేను ఒక దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం ప్రకారమే జీవిస్తున్నాను. ఆ నమ్మకం తోనే జీవిస్తాను, ఏదో జరిగి నన్ను బలంగా కదిలించి నా మతం తప్పు అని నిరూపిస్తే చెప్పలేం కానీ. నా మతం వల్ల నా తోటి వారికి జరిగేది మేలే. నా మతం ఆచారాలు(??) నేను పాటిస్తూనే ఉన్నాను. మరి అలాంటప్పుడు నేను నాస్తికురాలినెట్లవుతా? అది కూడా నాకెక్కడా ఏ మతం మీదా ద్వేషం లేనప్పుడు….నాకు దేవుడు ఉన్నాడు అన్న దృఢమైన  విశ్వాసం ఉన్నప్పుడు?

నాకు తెలిసిన సత్యమే నా శివం.  అప్పుడు నాస్తికత్వానికి తావేదీ?

Advertisements
Published in: on September 21, 2007 at 10:55 am  Comments (20)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/21/humanism-the-religion/trackback/

RSS feed for comments on this post.

20 CommentsLeave a comment

 1. మీ టపా చదవడం మొదలెట్టగానే సత్యమే శివం గుర్తుకొచ్చింది. మన ధార్మిక కథలలో మనకి కనిపించే ధర్మ సూక్ష్మాల్లో మీరు చెప్పిన సిధ్ధాంతమే గోచరిస్తుంది.

 2. మీ వాదన/గోడుతో నేను ఏకీభవిస్తున్నాను. ఎవరి విశ్వాసం వారి దైవం.

 3. మంచి ఆలోచనలు సౌమ్యా. నీ స్నేహితురాలితో సంభాషణ బాగా కేప్చర్ చేశావు. ఇలాంటి సంభాషణతో ఒక కథ రాయకూడదూ?

 4. వీవెన్‌మాటే నామాట. నా బ్లాగు ‘మనిషి’ ఉపశీర్షికలో నేను చెప్పదలచుకున్నది ఈ భావాన్నే. ఇలాంటి భావాన్నే చెప్పే వేమన పద్యం ఒకటి –

  తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును
  మన్ను నెరుగువాడు మిన్ను నెరుగు
  మిన్నుమన్నెరిగిన తన్నుతా నెరుగురా
  విశ్వదాభిరామ వినుర వేమ!

 5. ౧౦౦ మార్కులు !!

 6. మీలాంటివారిని అంటే మీకున్న నమ్మకాలు –
  “మరి నువ్వు దేవుణ్ణి నమ్మవు కద?”;
  “మొన్నోరోజు విగ్రహారాధన కూడా నచ్చట్లేదు అన్నావు కదా?”
  కొంతమంది మిమ్మల్ని కమ్మ్యూనిస్ట్ గా ముద్ర వేసే అవకాశం కూడా ఉంది, ఇప్పటిదాక వేయకపోతే!

 7. @netizen:
  అప్పుడది వాళ్ళ తెలియనితనం, వాళ్ళ సమస్య. నాది కాదు :))
  @రానారె: పద్యం బాగుంది.. 🙂
  @సత్యసాయి గారు,కొత్తపాళి గారూ, వీవెన్ గారూ, వైజాసత్యగారు : ధన్యవాదాలు….

 8. వాళ్ళ తెలియని తనం గురించి, మీరన్నది నిజమే!
  కాని సమస్య మీది కూడా!
  ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అపార్ధం చేసుకుంటున్నారు.
  అవతలి వారు మిమ్మల్ణి మీ అభిప్రాయాలని అపార్ధం చేసుకుంటే అది మీకు సమస్యకాదా!

 9. @netizen:
  em chestam cheppamdi? inkolla aalochanalni manam control cheyyalem kada! 🙂 Don’t worry…be Happy!

 10. మానవ సేవే మాధవ సేవ. ఇక భక్తి అంటారా అది దేవుడితో మనం చెసే బిజినెస్ ట్రాన్సక్షన్స్ 🙂 భగవద్గీత దేముని విషయంలో సందేహాల్ని తీరుస్తుంది. మన కర్మని (డ్యూటీ) చిత్తశుద్దితో నిర్వహిస్తే అది కూడా దైవారాధనలో భాగమే. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. ఇక స్తోత్రాలు, దేవాలయ దర్శనాలు, పూజలూ, భజనలూ ఇవి కూడా ఒక రకం ఆరాధనలే. ఎవరిష్టం వారిది. నిష్కామ కర్మ చేయడం, ఆపదలో ఉన్నవారికి సాయం అందించడం వంటివి ఆస్తికత్వంలో భాగాలే. ఇవి చేసేటప్పుడు దేవాలయాలకి వెళ్ళకపోయినా లోపమేం ఉండదు. కలియుగంలో కర్మయోగమే అన్నిటికన్నా మిన్న అని భగవద్గీత చెబుతోంది. మన ధర్మంలో విగ్రహారాధన, పూజావిధానాలు ఇవి అధ్యాత్మిక సోపానాల్లో భాగం. వీటికి అతీతమైన సోపానం కూడా మన ధర్మం బోధిస్తోంది. అది మానసిక , అధ్యాత్మిక ఔన్నత్యాలతో సాధించవల్సింది. దేవతలు, దేవతామూర్తుల కన్నా మరో మెట్టు పైన ఉంటుంది అది. వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు కేవలం పూజలు, విగ్రహారాధన మాత్రమే దైవారాధనలని అవి చేయనివారంతా నాస్తికులు అని చెప్పడం లేదు. దైవానికి (దైవత్వానికి) చేరువయ్యే క్రమంలో మానవ సేవ ఒక ఉత్కృష్టమైన మార్గం అని నా నమ్మకం.

  – కృష్ణ

 11. బహు బాగుంది!
  కాని నాస్తికత్వాన్ని ఇంకా నాస్తికుల్ని అంతరానివాళ్ళ(untouchables) లాగా భావిస్తున్నరేమో?

  అసలు దేవుడి అవసరం రోజువారి జీవితం లో ఎంత వరకు ఉంది?

  తీర్థం ఎలా పుచ్చుకోవాలి? బొట్టు ఏ వేలితో పెట్టాలి? హారతి కుడి నుండి ఎడమకు తిప్పాలా?లేక చేతి వొంగరము తలకిందులుగా పెట్టుకోవాలా?ఇవే కదా భక్తుల favorite past-times?
  ఇంటికి రొజూ వచ్చే డొక్కమాడిన పనిపిల్ల పడే బాధ వాళ్ళకు కనపడదు…కేవలం సుద్రులుగా కనపడతారు వాళ్ళు, పైగా పూర్వ జన్మ ప్రభావాలు కూడా నూ!
  Children of the Lesser God కదా మరి వాళ్ళు!

  నేను దేవుడున్నాడా లేదా అన్న ప్రశ్న కి జవాబు ఇవ్వలేను…కాని ముడుపులు చెల్లిస్తే వరాలిచ్చే దేవుడు మాత్రం ఉండకూడదనే కోరుకుంటున్నాను!(anthropomorphic God)

  “ఇది నాస్తికత్వమెలా ఔతుంది?” అన్న శీర్షిక లో “నాస్తికత్వం untouchability aa?” అన్న underlying intention సబబు కాదు!

 12. @Anirudh:
  Intentions అన్నవి చూసేవాళ్ళని బట్టి.
  నేను atheism is untouchable kind of ఉద్దేశ్యంతో రాయలేదు. నాకు నాస్తికత్వం లేదు అన్న విషయాన్ని చెబుతున్నా అంతే. మీరు హిందువనుకోండి..ఎవరన్నా “మీరు ముస్లిమా?” అని అడిగితే ఏం చెబుతారు? కాను అనేగా. ఇది నాకు నాస్తికత్వానికి సంబంధం లేదు అని చెప్పడానికి రాసిన టపా. అంతే కానీ..నాస్తికత్వం touchable లేక untouchable అని చర్చించడానికి కాదు.

 13. బాగానే ఉంది కానీ,అసలు నాస్తికుడు అననేమి?అటులనే హేతువాది,అగ్నేయవాది(ఆగ్నోస్టిక్)అంటే ఏమిటి?ఆమధ్య నోబెల్ గ్రహీత ఎస్.చంద్రశేఖర్ తన పరిచయం లో భారతీయడను,హిందూ నాస్తికుడను ఇలా ఉంటుంది..అదేంటో చెప్పగలరా?నాస్తికులం అని చెప్పుకోవటం కొంత కష్టం,అలా బతకగలటం మరీ కష్టం,నాస్తికులు అని చెప్పుకున్నా,దేవుడు,మతం,పూజలు,ఇలా దేనితో సంబంధం లేకుండా ఎంతప్రజా సేవచేసినా ప్రజానీకం తట్టుకోలేదు,నిజమైన సేవలో ఎవరు ఏమన్నా పట్ట్టించుకోవాల్సిన అవసరం లేదు.ఎవరో అన్నట్లు నాస్తికత్వం ఒక మతం గా పరిణమించింది అనేది ఇంకా తేలలేదు.ఒకవేళ అదీ ఒక మతమైనా ఎంతకాలం మనగలుతుందో.దేవుడి ప్రస్తావనే లేని మతాలు బోలెడు.సరదాగా వాదించుకునేందుకు పర్లేదు గానీ బ్లాగుల్లోకి వచ్చినప్పుడు ఇంకొంచెం స్పష్టంగా వెలిబుచ్చేలా ఉండాలని నా భావన.

 14. ఈ టపా,వ్యాఖ్యలు అన్నీ చూసాక నేనీ వ్యాఖ్య రాస్తున్నాను. అసలు నాస్తికులు అంటే రకరకాల అభిప్రాయలు ఉన్నాయి లోకంలో. నాస్తికులు అందరికి మల్లే ప్రకృతినీ, మనిషినీ, మనసునీ అన్నింటినీ విశ్వసిస్తారు. ఒక ప్రపంచానికి అధినాయకుడు, ప్రపంచాన్ని నియంత్రించే ఒక శక్తి (భగవంతుడు)అనే విషయం తప్ప. ఇకపోతే ఈ భగవంతుడనే శక్తికి రకరకాల మతాలు రకరకాల రూపాలూ, రకరకాల లక్షణాలూ అంటగట్టాయి. ఇది ఇంత వరకూ మనందరికీ తెలిసింది. తర్వాత, వ్యక్తి ప్రకృతి గురించీ, పదార్థ స్వరూప జ్ఞానం గురించీ, అత్మ పరిశీలన (Self Examination)ద్వారా, స్వస్వరూపజ్ఞానం ద్వారా ఆత్మజ్ఞానం పొంది, పరిమితమైన, భగవంతుడి నుండి వ్యక్తిని ‘నేను’ అనే పరిమితత్వంతో విడదీసే ఆలోచనని అంతమొందించడం ద్వారా వ్యక్తి తనలోనే భగవంతుడుని సాక్షాత్కరింపజేసుకోవచ్చుననీ పెద్దలంటారు. ఇది మన పూర్వీకులు సూచించిన భావాతీతధ్యానానికి దగ్గరగా వస్తున్నది. భావాలు అంటే ఆలోచనలని మనందరికీ తెలుసు. భావాతీతం అంటే భగవంతుడు అనే స్థితి భావాలకు, అంటే ఆలోచనలకు అందవనేది దీని తాత్పర్యం. కనుక, భగవంతుడునే పెద్ద విషయాన్ని ఎవరికి వారు స్వంయంగా తెలుసుకోవలసిందిగానూ, ఒకరు మరొకరికి భాష ధ్వారా గానీ, మరే విధమైనా ప్రక్రియ ద్వారా గానీ తెలియజేసేది కాదన్నట్టుగానూ భావించబడుతున్నది. కనుక, మానవులందరూ మన జీవితంలో తక్కువ ప్రాధాన్యతనిస్తున్న ఈ భగవంతుడనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని కూడా భావించబడుతున్నది. ఇంతకీ నేను ఏది దేవుడు కాదో చెప్పినట్టున్నా. . .ఇక దేవుడెవరో మీరే అన్వేషించండి. ఉంటాను.

 15. ౧) >> మానవత్వం ఏ కాస్త ఉన్న మనిషైనా దేవుడ
  ఇది చాలా పెద్ద తాప్పు. మానవత్వం ఉన్న వాడు మహనీయుడు కాగలడు కానీ దేవుడు కాలేడు.
  ౨) >> దేవుడెక్కడో లేడు… నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు… మనందరిలో ఉన్నాడు
  ఇది ఇంకా పెద్ద తప్పు. దేవుడు మనలో లేడు. ఇలా అంటే ఆ దేవుడుని అవమానించినట్టే. ప్రేమ, శాంతి, పవిత్రత, సు:ఖం, ఆనందం అనేవి మన సహజ గుణాలు. నిత్యం చేసే చెడు సంకల్పాలతో మన సహజ గుణాలకు దూరంగా పోతున్నాం అంతే.
  ౩) “దేవుళ్ళు” లేరు…ఉన్నది ఒక్క దేవుడే
  ౪) విగ్రహారాధన తప్పేం కాదు, ఆరాధిస్తున్నంత సేపు చెడు సంకల్పాలు చెయ్యకపోవడమే మనం చేసుకునే పుణ్యం.
  ౫)కర్మ యోగులుగా ఉంటూ సత్య చింతనే జీవితానికి కావలసినది. ఇతరులను సంతోష పెడుతూ మనమూ సంతోషంగా ఉండాలి.

 16. మొన్న ఆ బాబా ఏవరో దివ్యదర్శనం / విశ్వదర్శనం / విస్వరూపం / లాంటిదేదో చూపిస్తానని అన్నారు. వాతావారణం అనుకూలించలేదంట. వాయిదా వేసినట్టున్నారు.
  ఏవరో వారి భక్తుడిని అడిగితే, ఆ టీ.వీ లలో కనపడడం లేదు? అదే విశ్వదర్శనం”, అని అన్నాడు.
  తొడ మీద గిచ్చి, నెప్పి బాబు అంటే, మరి ఆ నొఫ్ఫి చూపించు – అని ఉదాహరణలు ఇచ్చి – దేవుడు కూడా అంతే కనపడడు అని అనేవారున్నారు.
  అలాగే “ఎవరో అన్నట్లు నాస్తికత్వం ఒక మతం గా పరిణమించింది అనేది ఇంకా తేలలేదు.ఒకవేళ అదీ ఒక మతమైనా ఎంతకాలం మనగలుతుందో”, అనే వారూ ఉంటారు!
  అదొక మతం!!!
  ఏదో brown or colored beverages తాగుతు, ఒక సాయంకాలం మొదలెట్టి తెల్లవాఝాముదాకా గడపడానికి ఇలాంటి విషయాలు బాగుంటాయి.
  మొత్తానికి ఈ టపాకి “హిట్” లు బాగానే వచ్చి ఉంటాయి:)

 17. క్లుప్తంగా నెటిజనిత గారి అభిప్రాయం ఇది తాగుబోతులకు సంబంధించిందీ అని ఏదో brown or colored beverages తాగుతు,బావుందండి మీ తీర్పు

 18. meelo ok manchi rachayitri unnaru. please raastu undandi.’Atreya’ laga takkuva matalato ekkuva bhavanni vyathikarincharu. good chaala bagundi.

 19. Just visited this blog accidentally Sowmya …. But when i read this post i felt really happy that people with same thoughts are existing ….. I am fed up with those (donga) baba poojas etc…. I have been in to this phase several months ago the same realisation which you got….
  I started believing to live life to the fullest and enjoy each and every moment…. after all life is a roller coaster isnt it ?

  Also read your other blog …. you are a too good writer … will be regular reader from now on 🙂

 20. It is not easy to understand God. Many many Sadhus after many lives of Tapasya also couldn’t understand. One has to experience God to feel HIM. Any person who does good things need not be a good person leave alone God.

  Only God can see god in other human beings. So Sowmya if you truly inculcate the feeling, then you are a god.

  Belief is god and what you believe is what you perceive and what you will experience. That is why people who do not believe in god gets related experience and similarly those who believe HIM.

  Spirituality according to Hinduism is in phases and different stages. Like we teach only some subjects in LKG and increase the topics as we move up the ladder. Nevertheless the subjects we learnt in lower classes are very essential.

  This is not a subject that can be fit in one post or in one comment.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: