మళ్ళీ బడికి!

మా ఆషాకిరణ్ స్కూల్ మళ్ళీ తెరుచుకుంది ఎట్టకేలకు బాలారిష్టాలన్నీ దాటుకుని. నిన్న మూడో రోజు. ఈ వానొకటి తగలడి వరుసగా – సున్నా,రెండు,నాలుగు మంది పిల్లలు ఈ మూడు రోజుల్లో. మళ్ళీ పిల్లల మధ్యకు… “మళ్ళీ బడికి” వెళ్ళడం ఆనందంగా ఉంది. ఈ టపా తో ఓ గేమ్ ని గురించి కొంచెం కారంగా, కొంచెం గారంగా చెప్పడం, మీనుంచి మీకు తెలిసిఉన్నచో పంచుకోవాల్సిన ఓ విషయం తెలుసుకోడం నా ముఖ్య ఉద్దేశ్యం.

నల్గురు పిల్లలు…ఇద్దరు జూనియర్ బ్యాచ్, మిగితా ఇద్దరు సీనియర్ బ్యాచ్. రెండు బ్యాచ్ లకీ రీడింగ్ సెషన్ ఈరోజు. కథలు. ఇదివరకటి కంటే వీళ్ళ Reading skills చాలానే అభివృద్ధి చెందాయి. మంచిదే. దీని ఆషాకిరణ్ కారణం అనేమీ చెప్పలేము. వాళ్ళు ఒక ఏడు పెద్దవారవడం కావొచ్చు, లేకుంటే వాళ్ళ సర్కారీ బళ్ళో నిజంగానే బాగా చెప్పారేమో ఈ మధ్య. ఏదైనా, నాకైతే ఆనందం కలిగింది వాళ్ళ performance కి. సరే, ఓ గంట అలా ఈ పుస్తక పఠనం అయ్యాక “అబాకస్” అని ఒక ఆట మొదలుపెట్టాం… నల్గురు పిల్లలు ఆట. మేము పక్కన చూడ్డం. ఇదేమో snakes & ladders తరహా ఆట. కాకుంటే ప్రతి డబ్బా లోనూ ఏదో లెక్కల సమస్యలు ఉంటాయి… నీ డైస్ పై ఉన్న సంఖ్యల మధ్య తేడాని రెండు తో గుణించి అన్ని గళ్ళు ముందుకు వెళ్ళు అనో, లేకుంటే.. నీ డైస్ పై ఉన్న సంఖ్య ల కూడిక పదైతే ఒక గడి ముందుకు, లేకుంటే మూడు గళ్ళు వెనక్కో..అలా ఏదో. ఒక విధంగా ఈ ఆట పిల్లలలు చాలా ఉపయోగకరం…mental math కోసం. అయితే, సమస్యల్లా ఏమిటీ అంటే – ఇది పూర్తి చేయాలంటే ఓ రోజు పడుతుంది కాబోలు. ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వెళ్ళడం ఖాయం. ఆటన్నాక మరీ ఇంత పెస్సిమిస్టిక్ గా ఉంటే ఎలా? ప్రతి చోటా – “else move backward…” అన్న కండీషన్ వర్తించే అవకాశాలే ఎక్కువ. మొదట్లో కాసేపు ఇది కాస్త విసుగు పుట్టించింది కానీ, కాసేపయ్యేసరికి మునిగిపోయారు పిల్లలు అందులో. మళ్ళీ రేపు కూడా ఆడదాం అని చెప్పి దుకాణం కట్టేయాల్సి వచ్చింది. 🙂

ఈ ఆట ఆడించే క్రమం లో ఓ పెద్ద సమస్య భాష. ఆ ఆట లో గళ్ళపై అంతా ఆంగ్లం లో రాసి ఉండటం వల్ల పిల్లలు అర్థం చేసుకోలేకపోయారు. మేము పక్కనే కూర్చుని వాళ్ళకి ప్రతిసారీ వివరించాల్సి వచ్చింది. ఎటొచ్చీ వాళ్ళకి దీని వల్ల కూడా కొత్త పదాలు తెలిసాయి…అది వేరే విషయం. కానీ, నాకు తెలియాల్సింది ఏమిటీ అంటే – ఇలాంటి ఆటలు తెలుగు లో రాసి దొరుకుతాయా? అంటే గళ్ళలో అంగ్లం కాక తెలుగు. ఎక్కడా దొరక్కపోతే మేమే తయారు చేస్తాం ఏమో..చెప్పలేను కానీ, ఎంతైనా ఆ కంపెనీల బోర్డుల లుక్ రాదు కదా మేము తయారు చేసిన బోర్డు కి? అందుకని, తెలుగు లో రాసి ఉండేవి దొరికే అవకాశాలుంటే చెప్పండి… కొనుక్కుని ఆషాకిరణ్ కి ఉపయోగిస్తాం. పిల్లలకే ఇంగ్లీషు నేర్పుకోవచ్చు గానీ, వాళ్ళకి తెలుగే కాస్త ఇప్పుడిప్పుడు సరిగ్గా చదవడం, రాయడం వస్తోంది… కనుక కొన్నాళ్ళాగుదాం అని.

మీకు ఈ తెలుగు లో ఇంగ్లీషు ఆటలు (హాహా) ఎక్కడన్నా దొరికే చోటు తెలిస్తే ఇక్కడో కామెంటు రాయండి…

Advertisements
Published in: on September 20, 2007 at 3:24 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/20/schoo-rebegins/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. మనమే తయారు చేద్దాం, అంతా బాగోలేకపొయినా తెలుగు తెలుగే కదా!

 2. దీన్ని తెలుగులో పరమపద సోపాన పటము అంటారు. సాంప్రదాయకమైన పటంలో, దేవలోకాలు, పాతాళ నాగలోకాలు అలాంటివి ఉంటాయి. ఇంకా దొరుకుతోందో లేదో తెలీదు.

 3. పాం పఠమా? ఎక్కడైనా దొరుకుతుంది, ట్రై చెయ్యండి!

 4. ఇక్కడ (అమెరికాలో) ఒక లెక్కల చీటీల ఆట చూశాను.
  ఒక్కొక్క పేక ముక్క మీదా నాలుగు అంకెలుంటాయి. ఆ నాలుగు అంకెల మధ్యనా +, -, క్ష్, / .. ఈ నాలుగు ప్రక్రియలు ఉపయోగించి సమాధానం 24 వచ్చేట్టు చెయ్యాలి. చాలా కష్టం.

 5. Sowmya,
  by “memu” if youmean the kids included, I say, go for it. It will be a fun and learning activity. Make it a project.

 6. @lalitha garu: Hmm.. yeah.. that would be an interesting idea…to involve them to do the job. Will keep u posted about its implementation. Thanks.

 7. పరమపద సోపన పటం (వైకుంటపాళీ) దొరుకుతోంది ఇప్పటికీ. అయితే ఇక్కడ “అబాకస్” లో కావల్సింది గళ్ళలో సమస్యలు తెలుగులో ఉండటం. దీన్ని మనమే తయారుచేసుకోవాలి. ప్రయాస పడైనా సరే. వేరే మార్గం లేదు.

  ఇక ఇలాంటి ఆటలు తెలుగులో కావాలంటే పాత పెద్ద బాలశిక్ష పుస్తకాల్లో దొరుకుతాయి.

  – కృష్ణ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: