నాలుగోరోజు + నా భావాలు…

నాలుగోరోజు…నిన్న నలుగురొస్తే…ఈరోజు ఏడుగురు. రోజు రోజుకీ సంఖ్య పెరగడం కాస్త ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి… ఈరోజు ఎందుకో గానీ… గత సంవత్సర కాలం లో ఈ పిల్లల తో గడపడం లో ముఖ్యమైన “గమనింపులు” ఏమన్నా ఉన్నాయా? అని ఆలోచించాను… బాగా striking గా కనబడ్డది ఏమిటంటే –

1. మునుపటి కంటే పిల్లలు బాగా తెలుగు చదువుతున్నారు

2. రెలేటివ్ గా లెక్కలు కూడా వేగంగానే చెబుతున్నారు

3. మునుపంత అల్లరి అల్లరి గా అనిపించడం లేదు

4. మునుపటి కంటే ఇప్పుడు దగ్గరైనట్లు అనిపిస్తోంది వారు నాకు

5. అప్పట్లా కొట్టుకోడం లేదు

– ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయంటే చెప్పలేను. వాళ్ళే మారారో…. వాళ్ళకి నేనే అలవాటు పడిపోయానో… లేక వాళ్ళు మారకపోయినా, ఇంకా ఫాం లోకి రాక అలా అల్లరి చేయకుండా ఉంటున్నారో… లేక నాబోటి వాళ్ళను చూసి జాలి పడ్డారో… నాకే సహనం,ఆప్టిమిజం పెరిగాయో….. నాకు మాత్రం ప్రస్తుతానికి అర్థం కావడం లేదు…. ఏదో ఒకటి వాళ్ళు మునుపటికంటే చురుగ్గా ఉన్నారు…. అది చాలు నాకు…. దానికి ఆషాకిరణ్ కారణం కాకపోయినా పర్వాలేదు. 🙂 అయి ఉంటే మాత్రం అది మేము సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం 🙂

ఒకానొకప్పుడు పోయినేడు ఈ టైం కి ఈ పిల్లల్నే చూసి పిల్ల రాక్షసుల్లా ఉన్నారు బాబోఇ అని నీరసించిన ఓ సాయంత్రం గుర్తు వచ్చి ఈ క్షణం లో కాస్త ఆశ్చర్యం – “ఈ పిల్లలేనా వాళ్ళు!” అని…. కాస్త చిర్నవ్వు…”ఆ నేనేనా నేను” అని….. “నిలువద్దము నిను ఎపుడైనా…నువు ఎవ్వరు అని అడిగేనా? ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా….” అని పాడుకోవాలనుంది 🙂

Published in: on September 20, 2007 at 3:04 pm  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/20/day-4/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. చాలా బావుంది, సౌమ్యా.
    అవును, క్లాసులో ఎవరు ఎప్పుడు ఎలాప్రవర్తిస్తారో చెప్పడం కష్టం. మామూలుగా మొదట్లో కొంతకాలం ఉభయ పక్షాలు అంచనా వేసుకుంటారేమో -you can call it probation period :). Way to go.

    malathi

  2. Good Job.

  3. అయ్యో పిల్లలు అల్లరి చెయ్యడం లేదా.!! నేనొచ్చి వాళ్ళకి అల్లరి నేర్పుతా 🙂

    – కృష్ణ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: