మేఘావులు – cloud appreciation society

   మేఘాల గురించి ఓ సంఘం అంటే మొదట కాస్త విడ్డూరంగా అనిపించినా,  తరువాత కాస్త ఆసక్తి, మరునిముషం లోనే మరింత ఇష్టం కలిగిన మాట మాత్రం నిజం. ఈ సొసైటీ ఒకటుంది అని తెలీకమునుపే నేను సమయం చిక్కినప్పుడల్లా ఏక సభ్యత్వం గల నా స్కైవాచర్స్ సొసైటీ కార్యకలాపాలు సాగించేదాన్ని. అయితే, డొమైన్ స్పెషలిస్ట్ లేకపోవడం వల్ల అది ఏదో భావుకత్వం(????) అన్న దాన్ని తృప్తిపరుచుకోడానికి ఓ దారిలా తయారైందే తప్ప అంతకంటే ముందుకు సాగలేదు. మరి నాలో ఆ భావుకత్వం కూడా ఓ పాలు తక్కువేమో… లేక నేనే ఈ మధ్య బిజీ అయ్యానో గానీ…ఈ మద్యలో మా సొసైటీ(అదేలెండీ – నా సొసైటీ) కార్యకలాపాలు అసలు జరగనే లేదు…. ఇటీవలే ఈ Cloud Appreciation society గురించి తెలిసింది నాకు. దీని గురించే ఈ వ్యాసం…. ఇదే నా కొత్త శీర్షిక… పుస్తకాల గురించి కాక…సంగీతం…క్రీడలు వీటి గురించీ కాక ఓ వ్యాసం రాస్తే అది నా దుగ్ద కోసం తెలుసుకున్న, మీకు కూడా చెప్పాలి అనుకునే విషయాల గురించి ఔతుంది కనుక, ఇది gyaan కేటగిరీ వ్యాసం 🙂

వెండి మబ్బులన్నా, వాన మబ్బులన్నా, కారు మబ్బులన్నా, శ్రీలక్షి లా బస్సుమబ్బులనుకున్నా మీరేమనుకున్నా కూడా ఆ అనుకోబడిన విషయం – మబ్బు. మబ్బులు ఎన్ని రకాలన్నది పక్కన పెడితే, మబ్బులు ఎన్నిషేపుల్లో ఉంటాయి? అన్నది వివరించడానికి ఈ బ్లాగంత స్థలం చాలదు. మబ్బుల్లేని ఆకాశాన్ని ఊహించుకొని చూడండి… ఏది బాగుంది.. మబ్బుల్తోనా? లేకుండానా? మబ్బుల్లేకుండా బాగుంది అన్నారంటే ఇక ఈ వ్యాసం మీక్కాదు…. 🙂
మబ్బుల్లేకుండా కూడా బాగుంటుంది.. కానీ, మబ్బులున్నప్పుడున్నంత కాదు… అని ఈ సైటు వారి ఉవాచ. ప్రకృతి చెప్పే కవిత్వం ఈ మబ్బులని మన CAS వారి అభిప్రాయం. మరేమో తిలక్ అన్నట్లు కవిత్వం ఓ ట్రాన్స్పరెంట్ చీకటే అయితే, ఈ విషయానికి కూడా ఆ వాక్యాని అన్వయించొచ్చు… మబ్బులు కనిపిస్తూనే ఉంటాయి…. ప్రతి మబ్బు ఒక్కో షేప్ లో ఉంది అన్నమటుకు అర్థమౌతుంది… ఎందుకు ఆ షేప్ లో ఉంది అన్నది అర్థమవదు. కానీ, అలా నచ్చేస్తాయి కొన్ని… అచ్చు కొన్ని కవితల్లాగే 🙂 మేఘాలు కొన్ని మనకు తెలిసిన ఆకారాల్లో ఉంటాయి – వస్తువులు కావొచ్చు…ఒక్కోసారి ఫలానా మేఘం చూస్తే ఫలానా మనిషి గుర్తొచ్చినా ఆశ్చర్యం లేదు. నాకైతే ఓ సారి చీకటి పడుతుండగా చందమామ కథల్లో రాక్షసుడి వంటి ఆకారం మేఘం కనబడ్డది… చిన్నప్పుడు…హడిలి చచ్చాను అప్పుడు. 🙂 అయినా,  మేఘాల గురించి నేను చెప్పడం కాదు ఇప్పుడు ముఖ్యం… అక్కడ వాళ్ళు ఏమి చెప్తున్నారు అన్నది. అది ఇక్కడ చూడవచ్చు. మీకు రోజూ వాటిని చూసి చూసి వాటి అందాల్ని ఆస్వాదించే శక్తి నశించిపోయింది… మేము అది మీకు మళ్ళీ తెప్పిస్తాం అంటారు ఈ సొసైటీ వాళ్ళు 🙂

cloud atlas అని ఒకటుందని నాకు వీళ్ళు చెప్పేదాకా తెలీదు. వాళ్ళలో వాళ్ళు క్లౌడ్ కామ్రేడ్స్ అని ఓ సందర్భం లో పిలుచుకోవడం కాస్త నవ్వుతెప్పించింది. సొంతంగా మేఘాలను తయారు చేయడం, మేఘాలకు ప్రాణముందా లేదా అని చర్చించుకోవడం, మేఘాలను గమనించడం అన్నది ఎంత గొప్ప కళో అన్నది వివరించే ప్రయత్నం చేయడం, ఇంద్రధనుస్సుల గురించి ఓ మోస్తరు పరిశోధన చేయడం, మేఘాల ఆకారాలకి లాజిక్ ఆలోచించడం, ఎప్పుడెక్కడ కాస్త ప్రత్యేకమైన మేఘం కనబడ్డా కూడా వెంటనే దాన్ని ఫొటో తీసి సైటు లో పెట్టేసి, దాని గురించి ఓ చిన్న సైజు వ్యాసం రాయడం (ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఫొటోలు అద్భుతం), మేఘాల ద్వారా ప్రకృతి మనకు ఇస్తున్న సందేశాలను(?) అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం – ఇలాంటివి ఎన్నో చేస్తారు ఈ “మేఘావులు” (కొత్త పదం?) వీరి సైటు చూడ్డం నాకో అబ్సెషనైపోయింది గత ఇరవై నాలుగు గంటల్లో… మీకూ మేఘాలపై లేదా ఆకాశం పై ఆసక్తి ఉంటే ఈ సైటు తప్పక చూడండి… ఒక పుస్తకం – “Cloud Study – A Pictorial Guide” by F.H. Ludlam and R.S. Scorer. It was published by the MacMillan Company, New York, 1958. మీకు ఆసక్తి ముదిరిపోతే ఇది కొనుక్కోండి 🙂 ప్రకృతి ప్రియిలకు ఇక్కడ ఎన్నో సైటులు ఉన్నాయి…. చాలా సైన్సు చర్చలు కూడా ఉన్నాయి, ఆ తరహా ఆసక్తి ఉన్నవారికి.

Cloud architecture అనీ, సూర్యాస్తమయమప్పుడు మేఘాలనీ..ఇలా ఏవేవో విషయాల మీద అక్కడ చర్చలు జరిగాయి. సుమారు పదివేల మంది మెంబర్లు! మేఘాల్ని ఏదో అబ్బురంగా చూట్టం, కాస్త ముందుకెళ్ళీ పగళ్ళైతే వాటి ఆకారాలగురించి ఆలోచించడం, రాత్రైతే ఏ నక్షత్రం ఎక్కడ ఉందో sky gazing సాహిత్యం (నాకు బాగా తీరిక ఉన్న దశలో ఆ పుస్తకాలు చదివి రాత్రుళ్ళు ఆకాశం లో నక్షత్రాలు, రాశులు గుర్తు పట్టేదాన్ని లెండి) ప్రాక్టికల్స్ చేయడం … ఇంతే నా పరిధి. ఈరోజు ఈ సైటు చూస్తే ఏదో తెలీయని ఉత్సాహం…. ఇప్పటి పరిస్థితుల్లో మేఘాల వెంట పళ్ళేను కానీ… ఇక్కడే…భూలోకాన్నే మేఘలోకం గా మార్చుకుంటా… వాళ్ళు మేఘావులు..నేను మేఘాభిమానిని 🙂 అభిమానులకు మరి లోకమంతా ఆ అభిమానించే విషయమే కనబడుతుంది కదా!

నేడే చూడండి..తప్పక చూడండి…. ఇక్కడ

ఆ సైటు లోనే జాన్ రస్కిన్ రాసిన మాటల్ని ఇక్కడ మరోసారి తలుచుకుందాం… ఇవి చదివాకే నేను ఆ సైటు పై దాడి చేసింది –
“Sometimes gentle, sometimes capricious, sometimes awful, never the same for two moments together; almost human in its passions, almost spiritual in its tenderness, almost divine in its infinity, it is surely meant for the chief teacher of what is immortal in us, as it is the chief minister of chastisement or of blessing to what is mortal. And yet we never attend to it, we never make it a subject of thought…”

అదండీ సంగతి…. మీకూ ఆసక్తి ఉంటే ఇకనేం…దూకేయండి రంగం లోకి… ఇండియన్ స్కై అని మనం కూడా ఓ చర్చ మొదలెడదాం 😉

Advertisements
Published in: on September 18, 2007 at 3:34 pm  Comments (11)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/18/cloud-appreciation-society/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. @ALL THOSE WHO READ THIS POST:
  “cloudomania” is my own creation. Such a word does not exist in reality. Any resemblences to any real life word is only a coincidence… heehee! 🙂

 2. nenu GYAANINI kaadu gaa mari ikkada comment cheyyocchaa ?? ….

  ledu tappaka chestaanu endukante nenu koodaa ee STARGAZERS / SKYWATCHERS group lo member ne …Hyd lo unnappudu … inti pi moodo antastu pi ekkesi … alaa parundi poi gantalu gantalu (weather ni batti time change avutundi anukondi ) gadipesevadini … asalu aa anandamae veru …. iha pakkana evarina unte … aa mabbullo different characters … oohinchesukoni kadhalallese vallam …. ento …. Hyd vadilesi decades ayinattu anipistundi ….tokkalo america …. I MISS HYD SKY ….. (sky ekkadina okate kadaa ani adagoddu … HYD diff… akkadi Mabbulu diff. adante …) 😦

  any ways ilaa GYAANANNI penche postulu regualr raayavalsinadani manavi ….

 3. నాలో ఉన్న మేఘావి మళ్ళీ లేచి సాయంత్రం ఆకాశం వైపు చూసేలా చేసారు… థాంక్స్

 4. మేఘమా మేఘమా మెరవకే ఈ క్షణం
  మెరిసినా, కురిసినా, కరుగు నీ జీవితం

  వ్యాసం బాగుంది

 5. మేఘాల్ని చూసి అనందించదమేగాని ఇలా ఓ మేఘారాధకుల సంఘం వుందని ఇంతవరకూ తెలియదు. WEB Site లో ఛాయా చిత్రాలు బాగున్నాయి.

  మంచి టపా.

  -శేఖర్

 6. ఎమనాలి ?
  ఈ టపాని వ్రాసింది మీరు కాదు మీ ‘హృదయేందు’ 🙂
  చాలా సంతోషం వేసింది. నేను మేఘాలను చూడను కాని, మాది rainomania, ‘snow’lophilia. మంచు కుఱిస్తే చాలు అనుకునే వారము.

  @ కృష్
  ఏఁవైనా హైదరాబాదులో light pollution ఎక్కువే, ఇంచక్కా మా వూళ్ళోనైతే … అమెరికాలో పరిస్థితి ఇంకా దారుణఁవనుకో. ఎలా వుంది కొలరాడో? అన్నట్టు ఈ డిసెంబరులో స్కీయింగు కి వెళ్ళి ఫోటోలు అప్లోడు చెయ్యడం మరవొద్దు. 🙂

 7. సౌమ్య గారికి, 20,000 హిట్ల క్లబ్బులో జేరినందుకు కంగ్రాచులేషన్స్..!

 8. @Rakeshwar:
  thanks! మొన్నటి దాకా పందొమ్మిది వేలకు వచ్చింది అన్న విషయం గుర్తు ఉంది కానీ, మీరు కామెంటు రాసే దాకా చూసుకోలేదు ఇరవైవేల మార్కు దాటిందని. Thanks once again!
  @Krish raem:
  నాకు కూడా ఇలాంటి టపాలు మరిన్ని రాయాలనే ఉంది…చూద్దాం
  @Ravikiran garu, Nagaraja Garu & Sekhar garu: Thanks!

 9. మిగతావెలాగున్నా ఫోటోలు మాత్రం వావ్…

 10. another fad to kill time. వర్షం పడుతున్నప్పుడు తల పైకెత్తి మేఘాలు చూస్తే చాలా బాగుంటుంది. ఏ మేఘం నుంచి ఎన్ని చినుకులు పడ్డాయో లెక్క పెట్టడం చాలా సరదాగా ఉంటుంది.

 11. bagundandi mee blagu..chinna nati gnapakalu gurthukuvachayi!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: