కథాసరిత్సాగరం

“కథాసరిత్సాగరం” – బహుశా ఓరోజు సాహిత్యం గుంపు లో నవీన్ గారు దీని గురించి అసలు దీన్ని చదివి ఉండేదాన్ని కాదేమో. అలా మిస్సయి ఉంటే గొప్ప చారిత్రక విలువ ఉన్న పుస్తకం చదవలేకపోయేదాన్ని. అవును, ఇది పదకొండవ శతాబ్దం నాటిదట. సోమదేవుడు అన్న ఆయన దీన్ని అప్పటి కాశ్మీర్ రాజైన అనంతదేవుడి భార్య సూర్యవతి కోసం సేకరించాడట. సేకరించాడు అని ఎందుకు అంటున్నా అంటే – ఇవి ఒకరు రాసినవి కాదు. వీటి పుట్టుకకు దైవిక శక్తులకు సంబంధం ఉందని అంటారు. ఇవి శివుడు పార్వతికి చెప్పిన కథలని అంటారు. పార్వతి శివుణ్ణి ఎప్పుడూ ఎవరూ వినని కొత్త కథలు చెప్పమని అడిగితే, శివుడు “విద్యాధరులనే” ఓ జాతి గందర్వుల లోని నరవాహనదత్తుడి జీవితం గురించి చెప్పాడు. అప్పుడవి చాటుగా విన్న పుష్పదంతుడనే వాడు వెళ్ళి తన భార్య జయకు చెప్పాడట. ఆమె వచ్చి తిరిగి ఆ కథలు పార్వతికే చెప్పిందట. దానితో – పార్వతి కి శివుడు తనకి పాత కథలు చెప్పాడని కోపం వచ్చి శివుణ్ణి నిలదీస్తే శివుడు తన దివ్యదృష్టి ద్వారా విషయం తెలుసుకున్నాడు. పార్వతి పుష్పదంతుణ్ణి పిలిపించింది. అతన్నీ, అతన్ని కాపాడే ప్రయత్నం చేసిన మాల్యవానుడినీ మానవులుగా పుట్టమని శపించింది. వాళ్ళు బతిమాలుకుంటే – ఈ కథల్ని భూమ్మీద జనాల నోళ్ళలో నానేలా చేస్తే మీ శాపవిమూచనం అవుతుంది అని చెప్పింది. ఆ తరువాత పుష్పదంతుడు వరరుచి గానూ, మాల్యవానుడు గుణాఢ్యుడి గానూ పుట్టి ఈ బృహత్కథ గా పేరొందిన ఈ కథలను జనాల నోళ్ళలో నానేలా చేసారని ప్రతీతి. ప్రస్తుతం నాకు దొరికిన పుస్తకం – “Retold from 10 of the 18 books of the original kathasaritsagara” అట. అనువాదం – Arshia Sattar. ముందుమాట Wendy Doniger.

బోలెడు కథలు, బోలెడు పాత్రలు….కొన్ని పాత్రలు మొదలు నుండీ చివరిదాకా మధ్యమధ్యలో కనిపించి వెళుతూ ఉంటాయి. కొన్ని పాత్రలు కొన్ని కథలకే పరిమితం…. కథ, కథ లోపల మరో కథ, దానిలో ఇంకో కథ…ఇలా వెళ్ళి మళ్ళీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ మొదట చదివిన కథ దగ్గరికి వచ్చేస్తాం. ఎక్కడా ఓ పాయింటు మిస్సయినట్లు కానీ, ఓ లంకె తెగినట్లు కానీ అనిపించదు.  ఎక్కడా పట్టు సడలినట్లు అనిపించదు. ఓ ప్రవాహం లా సాగిపోతూ ఉంటుంది. అదీ ఆగదు, మనకూ ఆపాలనిపించదు. కథాసరిత్సాగరం అంటే – ocean of stories అని అర్థం. ఈ పుస్తకం దాని పేరుకు తగ్గట్టే ఉంది. గొప్ప story teller శివుడు. లేని తరహా పాత్రలు లేవు. లేని తరహా మనస్తత్వాలు లేవు. వేల పాత్రలు వచ్చి వెళ్ళి ఉంటాయి. అయినా, ఎక్కడా రచయిత మదిలో ఏ విధమైన గందరగోళం ఉన్నట్లు తోచదు. అసలీ పుస్తకం ఓ అధ్భుతం – ఇదీ దాదాపు సగం పుస్తకం వరకూ చదివేటప్పటికి నా అభిప్రాయం. కానీ, సగం పుస్తకం దాటాక, ఒక్కో పేజీ చదివే కొద్దీ నాకు ముందు కలిగిన ఆ అద్భుతం అన్న భావన క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీనికి కారణాలంటే ఉన్నాయి.. ముఖ్యంగా రెండు – మొదటిదేమో … క్రమక్రమంగా పట్టు తగ్గుతూ రావడం – దీని కారణం – కథల మధ్య ముందంతా నన్ను పుస్తకానికి అతుక్కుపోయేలా చేసేలా చేసిన నేర్పరితనం తో కూడిన లింక్స్ లేకపోవడం. ఏదో ఓ చోట సంబంధం లేకుండా ఓ కథ చెప్తాడు ఏ బీ కి. అది అవగానే నీకో కథ చెప్తా విను అని ఇంకోటి చెప్పడం మొదలుపెడతాడు. అలానే ఉంటుంది పుస్తకమంతా ఇంక!

రెండో కారణం … ఇది కాస్త వివాదాస్పదమవొచ్చు. ఈ కథల్లో ఆడవాళ్ళపై విసిరిన విసుర్లు. ఇక్కడో మనవి. నేను ఫెమినిస్టు ని కాను. నాకు ఏ ఇజమూ ఓ పట్టాన నచ్చదు. సో, నేనిక్కడ రాయబోతున్న కొన్ని వాక్యాల్ని బట్టి నన్ను ఫెమినిస్టనో, ఇంకే ఇస్టనో అనుకుంటే అది మీ సమస్య. నాది కాదు. 🙂 చాలా చోట్ల ఆడవాళ్ళ ని నమ్మరాదు. వాళ్ళు చాలా unfaithful. వాళ్ళ బుద్ధి మంచిది కాదు. వాళ్ళు అది, వాళ్ళు ఇది… ఇలానే ఉంటుంది … ప్రతి కథలోనూ ఈ హైపోతెసిస్ ని నిరూపించడానికి ఆడపాత్రలు ఉంటాయి. వాళ్ళ గురించి చెప్పి – అందుకనే ఆడవాళ్ళు రిలయబుల్ కాదు అని తేలుస్తారు అన్నమాట. విచిత్రం ఏమిటి అంటే – అవే పనులు ఆ కథల్లో మగ పాత్రలు ఓ పక్క చేస్తూనే ఉంటాయి. కానీ, వాటిని గ్లోరిఫై చేస్తూ ఉంటారు. అదే విడ్డూరం. ఒక striking example ఆ పుస్తకం నుంచే. నరవాహనదత్తుడి adventures సంకలనమే ఈ పుస్తకం. ఇందులో ఏవో కారణాల వల్ల రెండో పెళ్ళి చేసుకున్న ఆడ పాత్రల్ని తెగతిడతాడు కథ చెప్పే అతను (అంటే, మొత్తం పుస్తకం లో కథలు చెప్పే పాత్రలు సుమారు గా ఉన్నవి). అక్కడ నరవాహనదత్తుడేమో పుస్తకం లోని ఒక్కో భాగానికి ఒక్కో పెళ్ళి చేసుకుంటూ ఉంటాడు! 🙂 ఒక స్త్రీ కోసం (సూర్యవతి అన్న కాష్మీర్ రాజు  భార్య) సేకరించిన కథలు స్త్రీ బుద్ధి ని – ఏవో కొన్ని కేసులు, అవి కూడా ఒకే తరహావి…తీసుకుని జనరలైజ్ చేసేసి ఎలా రూపొందించారో …దాన్ని ఆవిడ చదివి ఎలా అంగీకరించిందో – నాకైతే అర్థం కావడం లేదు. లేకుంటే ఆ కాలం లో అలాంటి విషయాలు పట్టించుకునేవారు కాదేమో!

గొప్ప విషయం ఏమిటీ అంటే ఎప్పుడో ఎన్నో శతాబ్దాల క్రితం రాసినప్పటికీ కూడా ఇది ఇప్పుడు అందుబాటులో ఉండటం. అప్పటి జనం ఆలోచనలు ఎలా ఉండేవి అన్నది కూడా ఈ పుస్తకం చదువుతున్నప్పుడు తెలుస్తుంది. ఫాంటసీ కథల్లాగా కూడా అనిపించవచ్చు కొన్ని చోట్ల. ఏది ఏమైనా ఈ పుస్తకం కున్న చారిత్రక విలువ కన్నా దీన్ని ఓ సారి చదవొచ్చు.
కొనుగోలు డీటైల్స్:
ఆంగ్లానువాదం : Arshia Sattar
Foreword: Wendy Doniger
Penguin Classics – Penguin
First Published: 1994
Cost: 200/-

Advertisements
Published in: on September 17, 2007 at 1:37 pm  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/17/kathasaritsagara/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. మీరు ఇంత చక్కగా తెలుగులో బ్లాగు వ్రాస్తున్నందుకు మీకు “మంచి బ్లాగరి” అని బిరుదు ఇవ్వాలి అని నే ప్రపోజ్ చేస్తున్నాను. నాకు ఇంకో పది మంది సపోర్ట్ చేస్తే బిరుదు ఖాయం చేసుకోవచ్చు.
  నాయనలారా/ అమ్మలారా, మీ మీ అవును/కాదు వోటు వెయ్యగలరనీ విన్నపము.

  • Blogiswari is more right form I suppose.

 2. @kiran:
  ధన్యవాదాలు..:)

 3. ఇక్కడో చిన్న విషయం. చాలా పుస్తకాలాంగ్లానువాదాల్లొ ఇలా ఆడువారిని గూర్చి తెగనాడడం ఉంది. అలా అని వాటి originalsలొ అది లేదు అని అనను. కాని, అనువాదంలో ఉన్నంతగా లేదు. మరొక్క విషయమేమిటంటే – నేను నా చిన్నప్పుడు కాశీ మజిలీ కధలు చదివాను, క్రితంసారి hyd వచ్చినప్పుడు విశాలంధ్ర లొ చూసాను, నా దగ్గరా పుస్తకాలు లేవు – అందుకని మొత్తం set కొనుక్కున్నా – మొదటి volumeకే నాకు మొహం మొత్తింది – అంత చెత్తగా ఉందా భాష, editing, వ్రాసిన శైలి. దానికి తోడు, కధలన్ని వాళ్ళిష్ఠమొచ్చినట్టు వ్రాసేసారు. అపూర్వ సహస్రశిరఛ్ఛేద చింతామణిని కొంచం మార్చి వ్రాస్తే కధ మారిపొదా? అనువాదంలొ ఇంకా ఛంఢాలంగా ఉంటుంది.

 4. చావా కిరణ్ ప్రతిపాదనకు నా వోటు: అవును

 5. చావా కిరణ్ ప్రతిపాదనకు నా వోటు: అవును


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: