కొత్తపదం :బ్లాగుపడ్డం మరియు నా సంధి ప్రేలాపన

నేను బాగుపడే లక్షణాలు నాకేమాత్రం కనబడ్డం లేదు కానీ బ్లాగుపడే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇలా అస్తమానం బ్లాగులు రాస్తూ ఉండటం తో. బ్లాగుపడ్డం అంటే – అలాంటివన్నీ అడక్కూడదు. నేను కూడా అదేదో సినిమా లో లా పదం బాగుందని వాడేశా. 🙂 సరే… అయిన్దానికీ కాన్దానికి బ్లాగు రాయాలనిపించడం… రెండ్రోజులు రాయకుంటే ఏదోలా ఉంటే మీరు కూడా బ్లాగుపడ్డట్టే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ పదం అర్థం.

వినుడు వినుడు రేడియో చానెళ్ళ పాటలు వినుడీ మనసారా … అనుకున్నా నిన్న రోజంతా. నా బాల ముసలి ల్యాప్టాప్ (అంటే కొని కొన్నాళ్ళే అయినా కూడా అప్పుడే జీవితపు చరమాంకానికి చేరుకున్న వాళ్ళలా పని చేస్తోందని ఆ పేరు పెట్టాను) కి ఓ రోగం ఉంది. మనం హెడ్‍ఫోన్ పెట్టినా ప్రయోజనం ఉండదు. సౌండ్ బైటకు వస్తూనే ఉంటుంది. అందువల్ల ల్యాబ్ లో పాటలు వినాలనిపిస్తే ఆఫీస్ అవర్లలో వినలేక కృంగికృశిస్తూ ఉంటే అప్పుడు నా సెల్  ఇయర్ ఫోన్లు కనబడ్డాయి నాకు నిన్న. ఎప్పుడో సంవత్సరన్నర క్రితం ఆఫీసులో పని చేస్తున్నప్పుడు ఉపయోగించా వాటిని. మళ్ళీ ఇదే మొదటి సారి. నిన్నట్నుంచి హాయిగా ఉంది ప్రాణానికి. బోరు కొట్టినప్పుడల్లా పాటలు వింటున్నా ల్యాబ్ లో కూడా 🙂 కొత్త కొత్త పాటలు చాలా ఉన్నాయి…బాగున్నాయి. కొన్ని అవి వచ్చినప్పుడు వినలేదు…ఇప్పుడు వింటున్నా. రేడియో రెవల్యూషన్ వర్థిల్లాలి. రేడియో రాక్స్. రేడియో నా పాలిటి ఆపధ్బాంధవి! (పోనీ ఆపద్భాంధవుడు అంటాను లెండి).

నిన్న రెండు రెళ్ళు ఆరు సినిమా చూసాను. నవ్వుతూనే ఉన్నాం నేను, నా స్నేహితురాలు ఆఖరుదాకా. జంధ్యాల కూడా రాక్స్. అలాంటి డైలాగులు ఎలా రాస్తారో అసలు! పైగా ఆ కామెడీ ట్రాక్ ఒకటి. తలుచుకుంటే కూడా నవ్వొస్తోంది.  “ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి” – అట, హ్యాపీ డేస్ సినిమా లో ఓ పాట – నేను కూడా అలాంటి కల ఒకటి కంటా….చెరిపేయలేకపోతే అది నిజం అవాలి కదా.. నాకు జంధ్యాల, రేలంగి, సూర్యకాంతం, సుత్తి వీరభద్రరావు, రమణారెడ్డి – వీళ్ళంతా మళ్ళీ కావాలి అని. ఆ కల నిజమైతే ఎంత బాగుండు?

ఈరోజు నా టేబుల్ పై నాలుగు పుస్తకాలు ఉన్నాయి. వీటిలో ఏది పూర్తి చేస్తానో… ఏవి సగం చదివి తిరిగిచ్చేస్తానో, ఏవి అసలు చదవనో – అర్థం కావట్లేదు ఇంకా. అవి –
– ఇప్పటికే రెండు మూడు సార్లు చదివినా కూడా మళ్ళీ నిన్ననే తెచ్చుకున్న సత్యజిత్ రే కథలు
– writerly life అన్న మరో రాకింగ్ వ్యక్తి అయిన ఆర్.కే.నారాయణ్ వ్యాస సంకలనం (అన్నట్లు, నారాయణ్ వ్యాసాలు కూడా భలే ఉంటాయి. రే కథల్లాగే ఎన్ని సార్లైనా చదవాలి అనిపిస్తుంది.)
– సత్యజిత్ రే కి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చిన Apu Trilogy సినిమాలకు మూల కథ రాసిన బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన making a mango whistle. ఇది పథేర్ పాంచాలి కి పిల్లల కోసం వచ్చిన సంక్షిప్త రూపం అట. (అయినా, అసలు నవల, దాని రెండో భాగం చదివాక ఈ పిల్లల వర్షన్ చదవడం ఏమిటో! అయినా కూడా మరేం చేయను… అవి రెండూ అంత బాగున్నాయి. అసలే నాకు ఆ తరం బెంగాలి రచయితల రచనలపై మోజు… అందువల్ల మళ్ళీ చదవబోతున్నా…హీహీ)
-Logic:A very short introduction – గ్రాహం ప్రీస్ట్. ఇది కాస్త సీరియస్ టైప్ పుస్తకం. లాజిక్ గురించి ఓ చిన్న పరిచయం ఇస్తున్నారు ఈ పుస్తకం ద్వారా. సగం దాకా చదివాను. అర్థమౌతోంది. నాకే అర్థమైంది అంటే ఇక అది చాలా సింపుల్ గా రాసినట్లు లెక్క. కాబట్టి ఓ వేళ ఈ పుస్తకం తారసపడితే, మనకర్థం కాదేమో అనుకోకండి.

ఇంక ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది మీకు నేనేం తోచక ఈ టపా రాసాను అని 🙂 అన్నట్లు నాకు నా బ్లాగు లో ఓ కొత్త శీర్షిక పెట్టాలని ఆలోచన వచ్చింది(ఉన్నవే చదవలేక చస్తున్నాం..కొత్తవి కూడానా? అంటారా?…అయినా పెట్టేస్తా…) ఓ వారం లోపు దాన్ని మొదలెడతా… దేని గురించి అంటారా… ఇక్కడున్న ఏ శీర్షికలోనూ ఇమడని విషయాల గురించి… హీహీ… ఓ బ్లాగు చూడు జనులారా… నా ప్రేలాపన పర్యవసానంగా నా మీద దండెత్తకుడి. అహింసా పరమోధర్మహ. (అనుచు నేను పబ్లిష్ బటన్ కొట్టితిని… ఇక్కడ్నుంచి ఈ పోస్టు కీ నాకూ ఏ సంబంధం లేదు)

Published in: on September 11, 2007 at 10:45 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/11/sandhi-prelapana/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

 1. “బ్లాగుపడ్డం” — భ్లాగుంది.
  “నా బాల ముసలి ల్యాప్టాప్” — ఇది కూడా బాగుంది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. పుస్తకాలు చదివి వాటి మీద అభిప్రాయాలు రాసేంత వరకూ ఏమీ అనమ్. ఇక ఆ కొత్త శీర్షిక కోసం చూస్తామ్.

 3. రేడియో ఆకాశవాణి స్త్రీ కాబట్టి, ఆపద్బాంధవి – అని ధైర్యంగా అనవచ్చు 🙂
  “…దండెత్తకుడి” అన్న చివరి మాట నాతో ఒక టపా రాయించింది. థాంక్యూ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: