మూడు సినిమాల పాటలు

            గత నాలుగైదు రోజుల్లో మూడు కొత్త సినిమా ఆల్బం లు వినడం జరిగింది. రెండు ఆల్బం లో ఏమో రెండు రకాల షాకులు ఇచ్చాయి. ఒకటి pleasant shock, ఇంకోటి… hmm…. 😦 dissappointing. మూడోది… నాకేమీ expectations లేకుండా మామూలుగా ఓ పాట విని మొత్తం పాటలు వింటున్నది. కాబట్టి no pain, no gain టైప్ 🙂

మొదటిది “చందమామ” – కే.ఎం. రాధాకృష్ణన్ అనగానే … ఇంక నేను ఊహల్లో తేలి ఇంకో ఆలోచన లేకుండా కాపీ చేసేసుకున్నా ఎవరో షేర్ లో పెడితే. వినడం మొదలుపెట్టాక నాక్కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు…. ఏమిటి… రాధాకృష్ణనేనా ఈ పాటలకు స్వరకల్పన చేసింది? అని. ఒక్క పాట తప్ప మరేదీ రెండో సారి వినబుద్ధి కాలేదు 😦 ఆ ఒక్క పాట కూడా తరువాతి ఆల్బం విన్నాక వినాలనిపించడం మానేసింది! ఆ మధ్య ఎప్పుడో ఓ సారి ఈ బ్లాగులోనే ఓ టపా రాసాను ఇక్కడ.  అప్పుడు అక్కడ రాసిన మాటలు  గుర్తు వచ్చాయి – “..ఇప్పుడీ పాటలు మూడో సినిమా కాబట్టే నచ్చాయేమో అని నా అనుమానం….” అని.  మొత్తానికి దీని తో నా అనుభవం అదీ.

రెండవది శేఖర్ కమ్ముల సినిమా – Happy Days. బాగున్నాయి దాదాపు పాటలన్నీనూ. ఈ సినిమా సంగీత దర్శకుడు కూడా రాధాకృష్ణన్ అయి ఉంటాడు అనుకున్నా. కానీ, దీని సంగీత దర్శకుడు ఓ పాతికేళ్ళ హైదరాబాది కుర్రాడు Mickey J Meyer అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇతను ఇదివరలో 10th class, Note Book సినిమాల కు పనిచేసాడట. అవి నేను పాటలెప్పుడూ వినలేదు కనుక నాకు పేరు వినడం ఇదే మొదలు. దాదాపు శనివారం మొత్తం ఈ పాటలే వింటూ ఉన్నాను నేను.  పాటలు వనమాలి, వేటూరి రాసారు. లిరిక్స్ కూడా బానే అనిపించాయి. Its a pleasant album. మనసుకు హాయిగా ఉంటుంది… వింటూ అలా పనులు చేసుకోవచ్చు మనం 🙂 ఇప్పుడిక ఈ సినిమా కోసం waiting నేను.  మిక్కీ అనబడు త్వరలో గొప్ప సంగీత దర్శకుడు గా పేరొందబోయే అబ్బాయి ఇంటర్వ్యూ ఇక్కడ. ఈ సినిమా ఆడియో రీవ్యూ idle brain లోనే ఇక్కడ.

మూడవది “హలో ప్రేమిస్తారా?” పూరి జగన్నాథ్ తమ్ముడు హీరో గా నటిస్తున్న సినిమా.  చక్రి సంగీత దర్శకుడు.  ఈ సినిమా పాటలు … ఇవి కూడా “వినబుల్” గానే ఉన్నాయి. మూడు పాటలు అయితే మూడో సారి  వింటున్నా ఇప్పుడు…ఇది రాస్తూ.  “ఎప్పుడూ లేని… “, “లైఫ్ అంటే ట్రావెల్…” మరియు “నిన్నా మొన్నా..”  – మిగితావి లైట్ అన్నమాట.  మొత్తానికి ఈ సినిమా పాటలు కూడా బానే ఉన్నాయనే చెప్పొచ్చు. అయినా, చందమామ కలిగించిన నిరాశ కు మించి మిగితావి పెద్దగా కలిగించవు అనుకుంటా ప్రస్తుతం!

Advertisements
Published in: on September 10, 2007 at 6:48 am  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/10/3-movies-music/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. నేను కూడా రాధాకృష్ణ సంగీతం అనగానే ఆశగా చందమామ పాటలు విన్నాను. నేను కూడా కొంచెం నిరాశపడ్డాను కానీ..వినగా వినగా.. ముక్కుపై ముద్దుపెట్టు ముక్కెరైపోయేట్టు అనే పాత బావుందనిపించింది. హ్యాపి డేస్ లో అరెరే పాట మాత్రం చాలా బావుంది. సినిమాకి సంగీతం ఈ విధంగా కావాలని అడిగే దర్శకుడిని బట్టి కూడా సంగీతం ట్యూన్ అవుతుందేమో. శేఖర్ కమ్ముల చిత్రాలలో ఆహ్లాదమైన క్లాసికల్ మ్యూజిక్ ఎక్కువగా వినిపిస్తుంది.

  2. ‘టెన్త్ క్లాస్‌’- పాటలు భలే ఉన్నాయే అనుకున్నాను. సంగీత దర్శకుడెవరో కొత్తవాడు. పేరు చూసి మరచిపోయాను. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పాటల్లో కాస్త తాజాగా వినిపించే పాటలు మళ్లీ అతనివేనని మీ ద్వారా తెలుసుకున్నాను.

  3. నాకు చందమామ పాటలు కూడా బోలెడు నచ్చేసాయి.ఘల్లు ఘల్లు ఘల్లు మంటు ఏరువాక సాగుతుంటే.రేగు ముల్లోలే,పట్టు చీరల్లొ చందమామ…ఇలా అన్నీ…ఇప్పటికి ఎన్ని సాలు విన్నానో లెక్కేలేదు.ఇక హ్యాపీ డేస్ గురించి చెప్పక్కర్లద్దు.మీలా చెప్పాలంటే “రాక్స్”.హలో ప్రేమిస్తారా వినలేదు. మీరు చెప్పారు కదా.. వినాలి.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: