ఈరోజు మళ్ళీ ఆ మూడో ప్రాజెక్టు మీద రెండో ఫీల్డ్ ట్రిప్. అర్థం కాలేదా? ఆషాకిరణ్ వి రెండు ప్రాజెక్టులు గా చూస్తాను నేను. (ఇది నాకు సంబంధించిన AK Activities మాత్రమే. మిగితా విషయాలున్నా నేను పట్టించుకోను) – స్కూల్, మెడికల్ క్యాంప్ లు. మూడోది మొన్న వెళ్ళిన ఫీల్డ్ ట్రిప్ కథ. కొందరు వ్యక్తులు పిల్లల చదువు కి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు అని చెప్పిన ట్రిప్ కి ఇది రెండో భాగం. ఇందులో ఓ చిన్న సందేహం ఉదయించింది నాలో. అది ఇక్కడ –
ఒక argument ఏమిటి అంటే – పనిలోకి వచ్చిన పిల్లల్ని మనం మళ్ళీ ఫుల్ టైం చదువులోకి దింపుతున్నప్పుడు ఆ చదువుకయ్యే డబ్బేకాక వాళ్ళ పని ద్వారా వచ్చే డబ్బు ను పోగొట్టుకుంటున్నారు కనుక అది కూడా మనమే ఇవ్వాలి అన్నది. నేనో పట్టాన దీన్ని ఒప్పుకోలేకపోతున్నా. అన్నీ మనమే ఇస్తే ఇక వాళ్ళు చేసేదేముంది అన్నది నా వాదన. వాదన కాదు లెండి…ఆలోచన. నేనేమీ మాట్లాడలేదు ఈ విషయం పై చర్చ జరుగుతున్నంత సేపు. ఊరికే వింటూ ఉన్నా. వాళ్ళకి మనం సాయం చేయాలి కానీ, ప్రతీదీ మనమే చేయడం అంత సబబు కాదేమో అనుకుంటున్నా. అంటే, వాళ్ళు చదువు మానేయడం లో మొదటి కారణం ఆ డబ్బే కానీ, మనం చదువుకే కాక జీవితావసరాలకు కూడా ఇవ్వాలా? అన్నది ప్రశ్న. మీరు ఏమంటారు? ఓ పక్క చదివిస్తున్నాం కదా, వాళ్ళ జీతం కూడా మనమే ఇచ్చుకోవడం అవసరమా? ఒక వేళ ఇచ్చామే అనుకోండి – అలా ఎంతమందికని ఇవ్వగలం? అసలది నాకైతే పర్సనల్ గా అంత మంచి ఆలోచనగా అనిపించడం లేదు. వాళ్ళ బాగు కోసం ఆలోచించినా కూడా వికటించే లా ఉంది ఈ ఆలోచన. మీ అభిప్రాయం ఏమిటి?
చదువుకోవాల్సిన సమయంలో చదువుకి కేటాయించిన సమయాన్ని opportunity cost గా చూడడం బాధారకం. ఐతే చదువు చెప్పించడమే కాక అదనంగా డబ్బు ఇవ్వడమనే ఆలోచన నాకు సబబుగా అనిపించడంలేదు. ఎందుకటారా, ఇప్పుడు ఆ విధ్యార్ధులు వెచ్చించే సమయంవల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో మరుగైన ఉద్యోగావకాశాలొచ్చే అవకాశం ఉంది కాబట్టి..
ఆర్ధికపరమైన సమస్యల వల్లే వారు చదువుకు దూరమవుతున్నారన్నప్పుడు, వారికి “కొంత” (stipend) రూపేణా ఆర్ధిక సహాయం అందజేయ్యడంలో తప్పు లేదు.ఇది “merits of the case” మీద అధారపడి ఉంటుంది.
ఆ ‘merits’ ని కూడా ఆ పిల్లల ఆర్ధిక వాతావరణం బట్టి నిర్ణయించాలి.
నెను కూడా ఉపాధి పధకం కి నా మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే సాధారణంగా ఆర్ధికంగా వెనుకబడినవారుని చదువు వైపు మళ్ళించాలంటే వారికి తాయిలం లాంటిది ఒకటి అందజేయ్యడంలో తప్పు లేదు అనిపిస్తుంది….మేరేంటారూ…….
వారు అలా అడిగారంటే చదువు యొక్క ప్రాముఖ్యత ఇంకా గుర్తించలేదనే అనిపిస్తుంది నాకు. లేకపోతే కష్టమో నష్టమో తప్పకుండా ఒప్పుకునే వారు.
బాగా ఇష్టమున్న వారిని ప్రోత్సాహిస్తేనే మీరు చేసే పనికి సార్థకం ఏర్పడుతుంది అని నా ఉద్దేశం.
ఒక సారి ఒక పిల్లాడిని పని మాని స్కూల్ కెళ్ళమన్నారు చంద్రబాబునాయుడు అందుకు వచ్చిన సమాధానం విని ఆయన ఖంగు తినవల్సివచ్చింది. ఆ పిల్లాడు అన్నదేమిటంటే
“అదేంటి సారూ చదుకున్నోళ్ళకి ఉద్యోగాలు లేవంటున్నారు కదా. మరి నేను చదివి యేం చెయ్యాలి?”
సరే. ఇక అషాకిరణ్ లో పని మానేసి చదివే పిల్లలకి కాంపన్సేషన్ ఇవ్వడంలో తప్పు లేదు. చాలా సందర్భాల్లో డబ్బులు తల్లితండ్రులకే పట్టుకెళ్ళి ఇస్తారు వాళ్ళు. ఇవ్వగల్గితే ఎంతో కొంత స్చాలర్షిప్ లా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఒక హోటల్లో పనిచేస్తున్న అబ్బాయిని ట్యుటోరియల్ సెంటర్లో జాయిన్ చేసా. కొన్ని రోజులకి వాడు తిరిగి హోటల్లో పనికి వెళ్ళిపోయాడు. అప్పుడు నా తప్పేమిటంటే అతడి ఆదాయ మార్గాన్ని ఆపు చేసేయడం. స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలకి వారి ఆగిపోయిన సంపాదనకి ప్రత్యామ్నాయంగా కొంతైనా డబ్బు ఇవ్వడం మంచిదే.
– కృష్ణ
I think we should give money on constraints basis. We have to look from their family’s point of view also. Otherwise they will come back to the same old work.
Any investment would not be complete if that doesn’t take care of a problem in its entirety.