మరో AtRandom టపా :)

శుబోధయం…. మళ్ళీ బోలెడు విషయాలతో … మీ ముందుకు. 🙂
నేను కర్నాటక సంగీతం తెలీని వాళ్ళు కూడా ఆ పాటలు విని ఆనందించొచ్చు అన్న విషయం తెలుసుకున్నప్పటి నుంచీ కాస్త మానవ భాషలో ఉన్న శాస్త్రీయ సంగీతం పాటలను అన్వేషిస్తూ ఉన్నాను. ఆ మధ్య భానుమతి గారి “నగుమోము..” విన్నాక ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉండి వారం ఔతున్నా బయట పడడం లేదు. అసలు పడాలి…పడి “చందమామ” సినిమావో, “హ్యాపీ డేస్” సినిమావో … కొత్తవి వినక ఎప్పుడో “వివాహ బంధం” అట… అందులోని నగుమోములు ఎవరివైతే మనకెందుకు? అనుకుంటూ నే ఉన్నా. కానీ, ఆ పాట ను వదల్లేక పోతున్నా. 😦 ఆ పిచ్చి లోనే ఇంకో అయిదు నగుమోము వర్షన్లు విన్నాను. రెండు యేసుదాస్ వి, రెండు బాలమురళీ కృష్ణ, ఒకటి ఉన్ని కృష్ణన్. ఇంకోటి డౌన్లోడ్ చేసా కానీ ఇంకా వినలేదు. మొత్తానికి ఏ మాత్రం శాస్త్రీయ సంగీత పరిచయం లేకున్నా కూడా కొన్ని వినొచ్చు అని తేలింది నాకు. నగుమోము భాష కూడా కాస్త నాకు కష్టంగా నే ఉండింది. “మరి స్వర జ్ఞానమూ లేక, పదాలూ అర్థం కాక…ఏం విన్నావ్ తల్లీ?” అనకండి. నాకు తెలీదు. అదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాక అలాంటివి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు 🙂 ఇంతకీ ఈ ప్రయత్నాల్లో ఓ మంచి సైటు కనబడ్డది. ఏదో అమెరికన్ వర్సిటీ లోని ఇండియన్ ప్రొఫెసర్ సైటు. నాకు అర్థమౌతుందో లేదో తెలీదు కానీ, శాస్త్రీయ సంగీతం తెలిసిన వాళ్ళకి మాత్రం చాలాఉపయోగపడుతుంది. నేను నగుమోము పై టీకా తాత్పర్య సహిత వ్యాఖ్యానం (హీహీ) ఇక్కడే దొరకబుచ్చుకున్నా. ఇంతకీ ఆ సైట్ ఇది.

యూయెస్ ఓపెన్ గురించి .. ఈ సారి ఒక్క మ్యాచ్ కూడా చూడలేదు. దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నాదల్ ఓడిన విషయం నాకు రెండ్రోజుల తర్వాత తెలిసింది. అదీ నా బాధ. అది కూడా డేవిడ్ ఫెర్రెర్ అనే – “గ్రాండ్ స్లాం లలో ఒక్క సారి కూడా అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని” మామూలు మానవుడి చేతిలో ఓడిపోయినా కూడా! నాదల్ మీద నాకేం పెద్ద ఇష్టం లేదు కానీ, నాకు అతనంటే ఎంట చిరాకైనా కూడా అతను మంచి ఆటగాడు అన్న విషయం ఒప్పుకోక తప్పదు. మరిప్పుడు నాకో కొత్త మిమాంస. మా ఫెదరర్ ని సపోర్ట్ చేసుకోనా? ఈ కొత్త వాళ్ళని – ఫెర్రర్ నో, 20 ఏళ్ళ సంచనం జకోవిక్ నో, లేక లేక ఇన్నాళ్ళకు ఈ లెవెల్ కి చేరుకున్న డవ్దెంకో నో – గెలవాలనుకోనా? అంటే – నేను అనుకుంటే అక్కడ జరిగిపోయే అద్భుతాలు ఏమీ లేవు అనుకోండి… అయినా, ఇప్పుడు బరిలో మిగిలిన నల్గురి లో నాకు ఎవర్ని సపోర్ట్ చేయాలో కంఫూజన్ 😦

నేను చెత్త సినిమాలు బోలెడు చూసాను కానీ… ఇంత చెత్త సినిమా చూసినట్లు లేను. ఎప్పుడూ ఇలా పక్కన కంపెనీ ఉండగా ఓ సినిమా – అది ఎంత చెత్తగా ఉన్నా కూడ … మధ్యలో ఆపేసిన గుర్తు లేదు. కానీ, నిన్న అది జరిగింది…. ఆ కళాఖండం… RGV ki aag. తల వాచి బొప్పి కట్టింది. మెదడు వాపు వ్యాధి కూడా వచ్చిందో ఏమో… ఆ సినిమా అయ్యాక ఎలా ఐపోయింది అంటే…పది లంఖణాలు చేసినట్లు మెట్లెక్కాను నేను నా హాస్టల్ గదికి వెళ్ళడానికి. కాస్త ఉంటే వేస్లీన్ ని తలకి పట్టించడం కూడా జరిగేదే. ఏదో కాస్త స్పృహ కలిగి ఆపేసాను.. అది అమ్రుతాంజన్ కాదు అని అర్థమై. మోహన్‌లాల్ ని, ఏబీ నీ – ఎందుకలా దండగ చేసుకున్నారో! అసలా సినిమా తీస్తున్న టైం లో ఆ నటీనటులందరూ ఏమీ పిచ్చి పట్టకుండా బయట ఎలా పడ్డారో! అంతా విష్ణు మాయ! నేను మాత్రం దాన్ని …. “నేను ఆగ్ చూట్టం ఎమిటో… అది నాలో ఇంత ఆగ్ రగల్చడం ఏమిటో…. ఆ తర్వాత పిచ్చి పిచ్చి గా అనిపించడం ఏమిటో… అంతా పిచ్చి కల” అనుకుని మర్చిపొతా ఈ టపా రాసేసాక… కిష్కిందాకాండ లో ఎల్బీ శ్రీరాం లాగా 🙂

car.jpg

పొద్దున్న ఈనాడు లో నేదురుమల్లి దంపతుల పై నక్సల్స్ ప్లాన్ చేసిన దాడి గురించి చూసాను. ఆ కార్ ఫోటో చూసి షాక్ తిన్నాను. చూడండి ఎలా అయిపోయిందో! వీళ్ళిద్దరూ బయట పడ్డారు క్షేమంగా. కానీ, అనుచరులు చనిపోయారు పాపం! నక్సల్స్ కన్నా RGV నే నయం. ఏదో కొన్నాళ్ళాగాకైనా కోలుకోవచ్చు ఆ దెబ్బకి! 😦

Advertisements
Published in: on September 8, 2007 at 3:53 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/08/atrandom-sep7/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. RGV ki aag ని పొగుడుతూ ఒక్క మంచి review కూడా ఎక్కడా కనిపించలేదు. ప్రతీ ఒక్కరూ దనిని పరమ దరిద్రంగా ఉందని తిట్టే వాళ్ళే. నేను చూసేసి పొగుడుతూ ఒక టపా రాస్తాను 🙂

 2. అమ్మో RGV ki aag చూసేసారా ? ఇంకా ధైర్యం చాలట్లేదు.
  ప్రదీపూ నీ అయిడియా బాగుంది. 🙂

 3. can u please provide me the link for “nagumomu….”
  i am eagerly waiting

 4. నగుమోములో అర్ధం కాకపోవటానికేముంది?

 5. @కొత్తపాళీ గారు:
  అర్థం కాకపోవడం ఎందుకు అంటే … ఆ భాష ఇప్పటి వాడుక భాష కాదు కనుకా,ఇప్పటి వాడుక భాష తప్ప నాకు మరో తెలుగు రాదు గనుకా 🙂 “నగరాజ ధర” “ఒగిబోధ” “ఖగరాజు”, vaga jUpaku tALanu nannElukOra tyAgarAjanuta nI …. ఇవన్నీ నాకు అర్థం కాని పదాలే. ఆ శివ్ కుమార్ గారి సైటు లో అర్థం చూసాక అర్థమైంది.
  @Lalitha Sravanthi:
  Yeah.. I will get back to you about this soon.
  @Pradeep:
  ఇంతమంది హితవు పలికినా కూడా మీరు ఆ సినిమా చూద్దాం అనే ఫిక్సైతే ఇక మీ గురించి మేమందరం ప్రార్థనలు చేస్తాం. ఆ సినిమా చూసి మీకేమీ కాకూడదు అని! 🙂

 6. సౌమ్యగారూ నమస్తే..
  మీ బ్లాగ్ ఈరోజే మొదటిసారి చూశాను.. నగుమోము పాట గూర్చిన మీ ఫీలింగ్స్ ఎంతో ముచ్చటగొల్పాయి..మీరెన్ని చెప్పినా ఆ భానుమతి ఖంగుమంటుంది చూశారూ.. (అదే.. విన్నారూ)అందువల్లనే అన్ని ఫీలింగ్సైనా, వెతుకులాటలైనా..వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: