Happy Teachers Day!

ఒకరోజు ఆలస్యంగా అయినా కూడా నేను కొందరు చిన్ని గురువులకి టీచర్స్ డే శుభాకాంక్షలు వెబ్ముఖంగా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ బ్లాగు ని చూస్తూ వచ్చిన వారెవరైనా వాళ్ళెవరో వెంటనే కనుక్కుంటారు అనుకుంటా. అదేమా ఆషాకిరణ్ పిల్లలు. సాధారణంగా పిల్లలు టీచర్లకు విషస్ చెబుతారు. మరిక్కడ టీచరే పిల్లలకి ఎందుకు చెబుతోంది అంటేనేను వాళ్ళకి పాఠాలు చెప్పడానికే వెళ్ళినా కూడా అక్కడినుండి గత సంవత్సర కాలం లో నేను నేర్చుకున్న పాఠాలు ఎన్నో! అందుకే నేనే వాళ్ళకి వెబ్ముఖంగా విష్ చేస్తున్నా 🙂 నేను ప్రస్తుతం ఇంట్లో ఉన్నా కనుక వాళ్ళకి పర్సనల్ గా చెప్పలేను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సెమెస్టర్ స్కూల్ నడవడం లేదు కనుక వాళ్ళని కలవనూ లేను. సో, మళ్ళీ ఈ హృదయభాను పోస్టు 🙂

నిజానికి, సరైన దృష్టి తో చూడాలే కానీ, ఎక్కడి నుంచి నేర్చుకోలేము? ఎవరి నుంచి నేర్చుకోలేము? సత్యమే శివం లో కమల్ హాసన్ ప్రతి మనిషి లో నూ దేవుడు ఉన్నాడు అన్నట్లు…. ప్రతి వస్తువు లోనూ టీచర్ ఉన్నాడు/ఉంది. ఈ విషయం నేనే కాక ఇంకెవరన్నా నాకు చెప్పుంటే మునుపైతే – “ఏదో చెప్తునారు.. మనటైప్ కాదు ఈ కహానీలు…” అనుకుని వదిలేసేదాన్ని కానీ, అందులోని నిజం ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నేను. టీచర్ అంటే స్కూల్లోనో, కాలేజీలోనో పాఠాలు చెప్పే వారు మాత్రమే కాదు. ఇంట్లో అమ్మ,నాన్న లు మొదలుకుని, మనల్ని ప్రభావితం చేసిన గొప్ప వాళ్ళు మొదలుకుని, ఈ క్షణం లో పరిచయమైన వ్యక్తి కూడా మనకు టీచర్ కిందే లెక్క. ఇక చెట్లు, చేమలు, జంతువులు, పక్షులుఒకటనేముంది, అన్నీ ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంటాయిఈ సంధర్భం లోనే నా ఆటోగ్రాఫ్ సినిమాలోని – “మౌనంగా నే ఎదగమని…” పాట గుర్తువస్తోంది.

సరే, సోదాపి విషయం చెప్పాలి కదూ! ఏం నేర్చుకున్నాను ఆ పిల్లల దగ్గర్నుంచి? – అతి ముఖ్యమైనదిసహనం. వాళ్ళ దగ్గర్నుంచి నేర్చుకున్నది కాదు లెండివాళ్ళ వల్ల నేర్చుకున్నది. తరువాత, వాళ్ళ నుండి నేర్చుకున్నదిపడి లేవడంవాళ్ళ లొ పడి లేవడం అంటే ఆటల్లో కింద పడ్డా కూడా దులుపుకుని లేచి ఆట కొనసాగించుకోడందెబ్బ గురించి ఆలోచిస్తూ ఉండకుండా. మరో విషయంచిన్న చిన్న ఆనందాలను పుర్తిగా అనుభవించగలగడం. వాళ్ళ వల్లే నాకు తెలిసిందిటీచింగ్ అన్న కళ ఎలా ఉంటే వినేవాళ్ళకు చక్కగా ఉంటుందో అని. వాళ్ళ వల్ల కూడా నాకు తెలిసిందిఏ బంధుత్వమూ, ఏ స్నేహమూ లేని బంధాలు కూడా అభిమానం, ఆప్యాయతలను పంచగలవు అని. నేనెక్కడ కనబడ్డా వాళ్ళు, వాళ్ళెక్కడ కనపడ్డా నేనుఅభిమానంగా పలకరించుకోడం చూస్తూ ఉంటే. అన్నింటి కంటే ముఖ్యమైన్దిఈ పిల్లలతో, వాళ్ళ కుటుంబాలతో గడిపిన సమయమ్ చెప్పిన బ్రతుకు పాఠాలుఇంకెక్కడా దొరకని పాఠాలు అవి. మరిన్ని చెప్పిన వారిని టీచర్స్ డే నాడు ఓ సారి తలుచుకోవద్దూ? ఇదంతా పిల్లలకి ఎలాగో చెప్పను కనుక, ఎవరికో ఒకరికి చెప్ఫాలి కనుక, వెబ్ముఖంగామా ఆశాకిరణ్ పిల్లలకి టీచర్స్ డే శుభాకాంక్షలుఫ్రం one of their teachers 🙂

Advertisements
Published in: on September 6, 2007 at 4:50 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/09/06/happy-teachers-day/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. me teachers day angle bagundi!
  annattu meeru blog petti 1yr
  gadichindi. congrats.
  http://www.kesland.blogspot.com

 2. మీకు,మీ ఆశా కిరణ్ టీచర్లందరికీ శుభాకాంక్షలు.

 3. Nice one.

 4. @kesland garu
  ఓహ్! అవును, ఇంకా 365 రోజులు అవ్వలేదు కానీ, సంవత్సరం పూర్తికావొస్తోంది ఈ బ్లాగు మొదలుపెట్టి. ధన్యవాదాలు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: