50 years of independence to Malaysia – IIIT’s malaysian community celebrates

అసలుకి వేరే టపా మొదలుపెట్టాను. కానీ, కొత్త అనుభవం కలగడం తో, అది ఆపి ఇది పోష్టుతున్నా.

రేపటితో మలేషియా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు పూర్తి అవుతాయట. ఈ మధ్యకాలం లో మా కాలేజీ కి కాస్మొపాలిటన్ సొబగులు ఎక్కువై, కొంచెం కొంచెం గా మలేషియన్ల సంఖ్య పెరుగుతోంది. దానితో, వారంతా కలిసి తమ స్వాతంత్ర్యాన్ని మాతో పంచుకుందాం అనుకున్నారు. ఈరోజో చిన్న ఫంక్షన్ ఉండింది. వాళ్ళ దేశం గురించీ, వాళ్ళ సంస్కృతి గురించీ, వాళ్ళ రాజకీయ పార్టీలు-వాటి నాయకుల గురించీ, వాళ్ళ సామాజిక, ఆర్థిక వ్యవస్త గురించీ వాళ్ళ రాచరికం గురించీ, వాళ్ళ దేశం లోని ప్రజల జీవనవిధానాల్లో వైవిధ్యం గురించీ ఇలా మొత్తానికి వాళ్ళ చరిత్ర కాస్త విపులంగా చెప్పారు. ఓ పాట పాడింది నా స్నేహితురాలు ఆయూ. కొన్ని మలయ్ పాటలు కూడా విన్నాం. మలయ్ సినిమా పరిశ్రమ పరిస్థితి గురించి తెలుసుకున్నాం… మలేషియన్ సినిమా అంత ఎక్కువగా లేదట అక్కడ. వాళ్ళు ఎక్కువగా ఇండోనేసియన్, జాపనీస్, కొరియన్ సినిమాలు చూస్తారట. తమిళ సినిమాలు కూడా సుమారుగా చూస్తారట. రజనీకాంత్ చాలా పాపులర్ అని ఈ స్పీచ్ ఇచ్చిన పిల్లవాడు…. Azli అనుకుంటా పేరు.. అతను అన్నాడు. అక్కడ చైనీయులు, భారతీయులు, మలేసియన్లు మరియు ఇతర మైనార్టీలు కూడా ఎంత సఖ్యంగా ఉంటారో అని అతను మురిసిపోయాడు. 🙂  ఈ మలేసియన్ గ్యాంగ్ అంతా సాంప్రదాయ మలయ్ దుస్తుల్లో ఉండటం ప్రధాన ఆకర్షణ.

సరే, ఇది అంతా అయ్యాక ఫుడ్ ప్రోగ్రాం. వాళ్ళే తయారు చేసారట. అవేవో నోరు తిరగని పేర్లు చెప్పారు…. కనుక నేనేమీ పేర్లు వల్లించలేను. అన్నం వంటిది ఒకటి ఉండింది. పచ్చడి వంటిది ఒకటి. స్వీట్ ఏదో ఒకటి. అన్నింటికీ పెద్ద పెద్ద పేర్లు ఉన్నవి. మొత్తానికి స్వీటు బానే ఉంది గానీ, ఆ పచ్చడి వంటకమేదో కానీ, గుంటూరు మిరపని కూడా మించేలా ఉంది. దెబ్బకి నేను పారిపోయి హాస్టల్ కి వచ్చేసి తీపి కోసం బిస్కట్లు తిండం మొదలుపెట్టాను. 🙂

మన భారద్దేశానికి 1997 లో స్వాతంత్ర్యం వచ్చి యాభై సంవత్సరాలు ఉన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. దేశభక్తి గట్రా పెద్ద అర్థాలు తెలీకున్నా కానీ, భగత్ సింగులు, పోరాటాలు బ్రిటీషు వాళ్ళ ఆగడాలు, పంద్రాగష్టు, Tryst with Destiny, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం – ఇవన్నీ హిస్టరీ లో చదూకుంటున్న ఊపు కనుక మహా వీర ఆవేశంగా పాల్గొన్నాను మా స్కూల్లో ఆ వేడుకల్లో. బహుశా ఇప్పటి మలేసియన్ స్కూలు పిల్లల స్థితి అలాగే ఉంటుందేమో. ఏమైనా, స్వాతంత్ర్యదినోత్సవం అన్నది ఒక దేశానికి అన్నింటి కంటే గొప్ప పండుగ. మలేసియన్ల కు ఈ టపా అంకితం. తెలుగొచ్చిన మలేసియన్లు ఎవరుంటారు కానీ –
This post is dedicated to the malaysian nation, its spirit and its people, celebrating their 50th year of independence. Malaysia – Truly asia 🙂  Good luck Malaysia! 🙂 Keep going!!!!

ఆసక్తి గలవారు మలేసియా వికీ పేజీ కి వెళ్ళొచ్చు. అక్కడ చాలా లంకెలు ఉన్నాయి ఆ దేశం గురించి.

Advertisements
Published in: on August 30, 2007 at 1:34 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/08/30/50-years-of-independence-to-malaysia-iiits-malaysian-community-celebrates/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. చాలా బాగుంది. మన కాలేజీకి మిగతా దేశాలవాళ్ళు కూడా వస్తే మనకే మంచిది 🙂 చాలా రాష్ట్రాలవాళ్ళం కాలేజీలో ఉంటాం కాబట్టి వివిధ రాష్ట్రాలవాళ్ళు ఆంధ్రా డే, తమిళనాడు డే, కేరళ డే, బెంగాల్ డే, పంజాబ్ డే.. ఇలా జరుపుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అప్పుడెప్పుడో డైరెక్టరుగారితో మాట్లాడినప్పుడు సూచించాను కాని ఆయనకి రుచించలేదు అప్పుడు !

  2. సింగపూరులో ఉన్నప్పుడు మలేషియా తిండి అలవాటయ్యింది. దక్షిణభారత వంటకాల తరువాత నాకు అత్యధికంగా నచ్చేవి మలేషియావే.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: