తప్పక చూడవలసిన నాలుగు మంచి సినిమాలు

ఓహో! ఎనిమిది రోజులు అయిపోయింది నేను కొత్త టపా రాయక 🙂 ఇటీవలి కాలం లో ఇంత గ్యాప్ వచ్చినట్లు లేదు ఈ బ్లాగు కి.

గత నెలా రెణ్ణెల్ల లో కొన్ని పనికిమాలినవి, కొన్ని మంచి నుంచి చాలా మంచి సినిమాలు చూడటం జరిగింది. ఆ మధ్య ప్రవీణ్ గారు అన్నట్లు… ప్రతి సినిమా గురించీ బ్లాగేంత ఓపిక లేదుకనుక, ఆ సినిమాల్ని పరిచయం చేస్తూ ఓ నాలుగు వాక్యాలు చెబుతున్నా అంతే.

Bicycle Thieves: ఇటాలియన్ సినిమా. సత్యజిత్ రే కి సినిమాలు తీయాలి అన్న కోరికను కలిగించిన సినిమా ఇదేనని అప్పుడెప్పుడో వికీ లో చదివిననాటి నుండి దీన్ని చూడాలి అనిపిస్తూ ఉండింది. ఈ సినిమా చూస్తూ ఉంటే ఆ మధ్య “కథా? కథనమా?” అంటూ వార్త లో వచ్చిన వ్యాసం గుర్తు వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో కథ అన్నదానికంటే కథనమే కథను నడిపించింది ఏమో అనిపిస్తుంది నాకు. కథ ఏమిటంటే – ఒకతనికి కొత్త ఉద్యోగం లో సైకిల్ ఉండటం తప్పనిసరి. అలాంటిది కష్టపడి కొనుక్కున్న సైకిల్ కాస్తా మొదటిరోజే దొంగలు దొంగిలిస్తారు. మిగిలిన సినిమా అంతా ఆ సైకిల్ కోసం అతను, అతని కొడుకూ చేసే ప్రయత్నాలు, వాళ్ళ అనుభవాలు… ఇవే. నేనిలా చెప్పానంటే .. ఏముంది ఈ కథలో? అనొచ్చు విన్నవారు ఎవరైనా. నిజమే… ఏముంది? కానీ, సినిమా చూస్తున్నంత సేపూ నేను ఇంకేమీ పట్టించుకోలేదు. వాస్తవికత ఉట్ట్టిపడుతూ ఉండటం దీని మరో ప్రత్యేకత. సినిమాలో నిరుపేద హీరో, నిజజీవితం లో కూడా ఫ్యాక్టరీ వర్కరే నట. ఈ సినిమా చాలా మంచి సినిమా 🙂

Strangers on a train:
నాకు ఆ మధ్య చూసిన To catch a thief, Rear Window ల ప్రభావం తో హిచ్‍కాక్ సినిమా అంటే చాలు..చూసేద్దాం అనిపిస్తుంది 🙂 అలాగే దీన్ని కూడా చూసాను.ఇదొక 1951 హాలీవుడ్ సినిమా.  దీని కథ కూడా కాస్త రొటీన్ కి భిన్నం. ట్రెయిన్ లో కలిసిన ఇద్దరి మధ్య సంభాషణ తో మొదలౌతుంది కథ. బ్రూనో తన తోటి ప్రయాణికుడు, టెన్నిస్ ఆటగాడు అయిన గయ్ హేన్స్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుందాం అంటాడు. అతనికి అడ్డుగా ఉన్న అతని తండ్రిని గయ్, గయ్ కీ, అతని ప్రియురాలికి అడ్డుగా ఉన్న గయ్ భార్యను బ్రూనో చంపాలి అన్నది ఆ ఒప్పందం సారాంశం. గయ్ ఈ మాటల్ని పెద్దగా పట్టించుకోడు… తరువాత అతని భార్య ని నిజంగానే బ్రూనో చంపేసి అతనికి చెప్పేదాకా. అక్కడి నుండి బ్రూనో గయ్ ని వెంటాడుతూ ఉంటాడు…. మా నాన్న ని ఎప్పుడు చంపుతావు అని. కథ ఇలా సాగి చివరికి గయ్ నిర్దోషిత్వం బయట పడ్డం తో ముగుస్తుంది. అయితే, సినిమా లో బాగా మనల్ని ఆకర్షించేవి రెండు. హిచ్‍కాక్ మార్కు స్క్రీన్‍ప్లే, బ్రూనో నటన. అతని నవ్వు లో నే ఎంత క్రూరత్వం చూపాడంటే, అతని బాడీ లాంగ్వేజ్ లోనే ఎంత విలనీ చూపాడంటే – అతని కోసం ఆ సినిమా మరోసారి చూడవచ్చు.  క్లైమాక్స్ సీన్ ఒక్కటి కాస్త నిరాశ కలిగించవచ్చు కానీ, మిగితా అంతా చాలా బాగుంది ఈ  సినిమా.

Vertigo:
నాకు సంబంధించి ఇది గత రెండు, మూడేళ్ళుగా  ఎదురుచూసిన సినిమా. ఓ సారెప్పుడో మా తమ్ముడు ఈ సినిమా చూసి నాకు కథ చెప్పేసాడు. అయినప్పటికీ కూడా నాకు ఈ సినిమా చూడాలి అన్న కోరిక తగ్గలేదు. ఇది మరో విలక్షణమైన కథ. హీరో కి పైన్నుంచి కిందకి చూస్తే కళ్ళు తిరిగే జబ్బు ఉంటుంది. అదే వర్టిగో. ఈ జబ్బు వల్లే సినిమా మొదట్లో హీరో తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా ఇస్తాడు. హీరో ని అతని స్నేహితుడు తన భార్య పై నిఘా కు నియమిస్తాడు వర్తమానం లో. క్రమంగా మన హీరోగారికి ఆవిడపై  ప్రేమ ఏర్పడుతుంది.  ఆవిడ ఓ సంధర్బం లో ఓ భవనం పైన్నుంచి దూకేస్తుంది. తన వర్టిగో వల్ల హీరో ఆమెను కాపాడలేకపోతాడు. తరువాత కొన్ణాళ్ళకు ఆమె జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ సమయం లో ఆమె లాంటి మరో మనిషి తారసపడుతుంది హీరోకి. ఇక ఆమె వెంటపడ్డం మొదలుపెడతాడు. మిగిలిన కథ నా నోటితో నేను చెప్పేసి “ఎందుకు చెప్పేసావ్?” అని అనిపించుకోను. కావాలంటే ఇక్కడ చూడండి. లేకుంటే…ఉత్తమ మార్గం – ఆ సినిమా చూడండి. 🙂

The seven Samurai:
అకిరా కురొసావా జాపనీస్ సినిమా. ప్రపంచం లోని కొన్ని ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా దీనికి పేరు. యాభైలలో తీసిన బ్లాక్ అండ్ వైట్ సినిమా. నా అభిమాన నటుడు Toshiro Mifune కూడా ఉన్నాడు 🙂  ఇది ఓ బీద పల్లె కథ. ఆ పల్లె వారు బందిపోట్ల బారి నుండి కాపాడుకోడనికి సమురాయ్ ల సాయం తీసుకోవాలని నిశ్చయించుకుంటారు. సమురాయ్ ల వేట, వాళ్ళకి తిండిపెట్తడం కోసం వీళ్ళ కష్టాలు, వీళ్ళు ఆ దోపిడీ దొంగల్ని ఎదుర్కున్న తీరు, మధ్యలో ఓ లవ్‌స్టోరీ… ఇదీ కథ. ఎటొచ్చీ, What stands out is the screenplay. కురొసావా సినిమాలు పరిచయమయ్యాక ఇప్పటి దాక నచ్చని సినిమా అంటూ ఏదీ తారసపళ్ళేదు ఆయనది. సో, Needless to say, even this was a watchable movie. మరో పాయింట్… తొషీరో మిఫునె నటన. ఇతనో అధ్భుతమైన నటుడు…. ఏ రోలైనా అలవోకగా నటించేస్తాడు…అదే…జీవించేస్తాడు. ఇతనిలా ఇంకోళ్ళు చేయలేరు అంటే బహుశా అతిసయోక్తి కాదేమో…

నిజానికైతే ప్రతి సినిమా గురించీ ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు…. ఎటొచ్చీ ఇక్కడ నాకు ప్రస్తుతం 3 సమస్యలు..
1. సమయాభావం.
2. ఏదో మందుల్లేని రోగంతో దాదాపు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న నా Internet  connection.

3.  ఆల్రెడీ చనిపోయి, ప్రస్తుతం ఆత్మ రూపం లో నాకు సేవలందిస్తున్నా నా RAM.

అందువల్ల, ఈ సారికి ఇలా సరిపెట్టేసుకోండి. 🙂

Advertisements
Published in: on August 29, 2007 at 1:00 pm  Comments (20)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/08/29/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%95-%e0%b0%9a%e0%b1%82%e0%b0%a1%e0%b0%b5%e0%b0%b2%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%ae%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

20 CommentsLeave a comment

 1. Bicycle Thieves, Strangers on a train తప్ప మిగతావన్నీ చూసేసాను. మీరు చెప్పినట్లే మిగతావన్నీ చూడటానికి ప్రయత్నిస్తాను. హిచ్‍కాక్ సినిమాలలో సుస్పెన్సు తెలిసిపోయినా తరువాత చూసినా కూడా చాలాబాగుంటాయి. rear windowని నేను ఇప్పటికి 3 సార్లు చూసాను అయినా కూడా, మళ్లీ చూస్తే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది.

 2. సినిమాల సమీక్షలు బావున్నాయి. అంతకంటే మీ ఇంటర్నెట్టు కనెక్షను, RAM ల గురించి మీరు చేసిన వర్ణనలు చాలా బావున్నాయి. సమీక్షను వెనక్కునెట్టాయి.

 3. హహహ చివర బాగుంది

 4. చిత్రమేమింటే నేనింత వరకూ ఒక్క హిచ్కాక్ సినిమా కూడా చూడలేదు. సరే మీ సినిమా, ప్రదీప్ గారి సినిమాలతో మొదలెడతా.
  అన్నట్టు ఈ రేర్ విండో కథ ఈ మధ్య నేను చూసిన డిస్టర్బియా కథలానే ఉందే ?

 5. atleast adozen movies were made basing on seven samurai.was it not?

 6. Yeah… many movies were based on seven samurai itseems.
  I read about it in wikipedia entry. Surprised to read that even Sholay borrowed its basic premise from seven samurai. Ofcourse, I did not see Sholay so far (YEAH,ITS A FACT)..so, no comments.

 7. Bicycle Thieves – based on what I read here, the theme is similar to Gogol’s short story ‘Overcoat’.
  Would like to see this!

 8. @Siri:
  “The film is based on the novel of the same name by Luigi Bartolini and was adapted for the screen by Cesare Zavattini.”
  -says the wiki entry of the movie Bicycle thieves. Meanwhile, I have checked out wiki page on Overcoat. Yeah! the similarity begins and ends only at one point: “robbery”. But, I don’t think they are similar themes. They are appearing so, because both of them deal with similar kind of incidents in life. The fact that Overcoat was written almost a century before Bicycle Thieves might be some significance in this respect. There might be Chances that there is some kind of influence of overcoat on the author of Bicycle thieves, but, we dont hav any concrete proof for the same.

 9. @ Hitchcock :

  ayana cinema la lo unna speciality adi ….. Rear Window ni specific gaa teesukunte …. adi Audince POV lo undadam to … choosina pratee saaree maro kotta point / tale / twist kanipistaayi cinema lo ….. suspense cinema lu okasaari maatrame intresting gaa untaayi ane rule ki amendment Hitchcock films….by the way chinna trivia …. meeku telise undocchu …. Rear Window, Psycho inspiration tho … Hitchcock Killer’s POV(point of view) lo Kaleidoscope peru tho oka cinema paln chesaaru … kaane project floors meediki time lo producers venekki taggaarataa …. adi Audience pshycic heavy effect padutundi ani aa project aapesaru … great films NEVER made lo ee project kooda okati.

  @ Akira Kurasowa , Toshiro Mifune :

  toshiro gurinchi intaku munupu mee meeru raasina Sanjuro (Yojimbo sequel) post lo kooda chinna discussion jariginattu gurtu … …… and Long Shots use chesukovadam lo Kurasowa enta maven oo ee cinema (TSS) chooste telustundi !! by the way IKIRU choosaara ??

 10. The seven Samurai బ్రహ్మాండమయిన సినిమా. మిగతావి నా లిస్టుకు చేరాయి. Vertigoను యూట్యూబులో ఇక్కడ చూడవచ్చు. థాంక్స్.

 11. OFF THE TOPIC TRIVIA :

  satyajit ray ante gurtocchinidi … LOKSABHA channel telisi untundi anukunta meeku …. anudulo weekends manchi movies vestaru …. lyk .. Satyajit ray , Benegal , Ritwik ghatak or Guru dutts , do chk it out on weekends , you may stumble in to few good movies to your fortune, till now I could catch Appu Trilogy and Manthan

  here’s the link for their Daily Schedule hope it helps :

  http://164.100.24.208/ls/lstv/dailyschedule.aspx

 12. Battleship Potemkin, Cranes are flying, Z, Liberation లాంటి సినిమాల గురించి కూడా పరిచయంచేస్తే బాగుంటుంది.

 13. @Krishh: Thanks a lot for the info. I remember the channel’s name. But, never watched it. Should see if i can get it here.
  @Netijen: Thanks for the names. i don’t know anything about them. Will try to see them.

 14. My comment was based on your writeup plus the short story ‘Overcoat'(I read this several times). Looks like(again based on your write up), the similarity is not limited to ONLY robbery! As you said, Overcoat had a strong influence on the BT guy(here influence means – not like English films influence on telugu film writers/directors 🙂 )
  After I watch the film BT, then only I can come to a conclusion!

 15. చాల బాగ వ్రాసారు. మీరు తప్పకుండా గ్రేట్ ఎస్కేప్ సినిమా చూడండి. స్టీవ్ మాక్వీన్, జేంస్ కోబర్న్, చార్లెస్ బ్రాన్సన్ ల అద్బుత నటన మీకు తప్పకుండా నచ్ఛుతుంది. ఇది నిజంగా జరిగిన కధని అవే ప్రదేశాలలో చిత్రీకరించారు. హీరొలు తప్ప మిగిలిన వారు నిజంగా ఆ ఆపరేషన్ లో పాలు పంచుకున్నవారే మీకు తప్పక నచ్ఛుతుంది.

 16. ఒకసారి Hitchcock మీద ఒక డాక్యుమెంటరీ చూసాను. ఆయనే స్వయంగా తన సినిమాలు ఎలా షూట్ చేసింది చెప్పే డాక్యుమెంటరీ (టి.ఎన్.టి. ఛానెల్ లో). ఆయన చెబుతున్నప్పుడు చేతుల్లో, ముఖంలో యాక్షన్ని బట్టి సీన్ ఎలా ఉందని అనుకుంటామో తర్వాత సినిమా క్లిప్పింగ్ చూస్తే ఏమత్రం తీడాలేకుండా ఉంటాది.

  ఆయన తీసిన సినిమాల్లో North by North West, Dail M for Murder కుడా మంచి ధ్రిల్లర్ అని చెప్పొచ్చు.

 17. casstes ekada dorukuthunayo cheppagalaru

 18. “Strangers in Train” telugulo visakha express movie. 🙂

 19. meeru chudavalisina cinemalu inka chala unnayi anukuntunna, machuku konni: schindlers list,shawshank redempion etc., kani schindlers list nijamga great movie meeru chusi undakapothe matram tappaka chudavalasina movie.it was directed by spielberg.meeru youtube chudavachu

 20. the good,thebad and the ungly movie chudandi its a cowboy movie. meeru telugulo mosagallaku mosagadu’ chuse untaru ade englishlo indulo hero acting adbutam


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: