వేట అనబడు ఈరోజుటి ఫీల్డ్ ట్రిప్ కథలు

                ఈ కార్యక్రమానికి ఈరోజే నేను ఫీల్డ్ ట్రిప్ అని నామకరణం చేసుకున్నాను.  ఏ కార్యక్రమం? అంటే – ఆషాకిరణ్ పనులపై చుట్టూపక్కల ఉన్న స్లం ఏరియాలకు వెళ్ళి వచ్చే కార్యక్రమం. అసలు స్కూలు వరకు అయితే నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలే మా కాలేజీ క్యాంపస్ కి వచ్చేవారు. ఈ మధ్య మెడికల్ క్యాంపుల campaigning లో నేనూ వేలు పెట్టడం మొదలెట్టడం తో…. నా ఫీల్డ్ ట్రిప్పులు మొదలయ్యాయి. వెళ్ళినదాన్ని ఊరుకోక వాళ్ళ యోగ క్షేమాలు తెలుసుకోడం లో ఆసక్తి చూపడం తో మళ్ళీ నాకే వెళ్ళాలి అనిపించడం మొదలైంది. ఈరోజు వెళ్ళిన ట్రిప్పు ఉద్దేశ్యం వేరు, ఐతే. కొంతమంది ఆషాకిరణ్ స్నేహితులెవరో బాగా చదగలిగే కెపాసిటీ ఉన్న పిల్లల్ని వారికి వీలున్నంత వరకూ చదివించడానికి మూందుకు వచ్చారట. అలాంటి వారిని కనిపెట్టడానికి వేట ఈరోజు main purpose. 🙂

దానిలో భాగంగా రకరకాల తల్లిదండ్రుల్ని కలిసాను. ప్రధానంగా మూడు రకాలు – పిల్లలు చదవాలి అన్న తాపత్రేయం లో  రాత్రి పగలు కష్టపడే వాళ్ళు, పిల్లలు చదువుకుంటాం అన్నా కూడా సంపాదన పరమైన ఇబ్బందుల వల్ల చదివించలేని వారు. పిల్లల సంపాదన కోసం వాళ్ళ చదువు మాంపించిన వారు. మరి పిల్లల్లో కూడా కొన్ని రకాలు – బాగా చదువుకుంటూ ఉన్న పిల్లలు, బాగాచదువుతూ ఏవో కారణాల వల్ల మానేసిన పిల్లలు, బాగా చదివినా కూడా సంపాదనలో పడి చదవడం మీద ఆసక్తి చూపని పిల్లలు, పెద్దగా చదివే సామర్థ్యం,ఆసక్తి లేకుండా – పేరుకి చదువుకుంటున్నాం అని చెప్పే పిల్లలు – ఇలా అన్నమాట. ఒక్క రోజులో ఎలా చెప్పావు? అనొచ్చు మీరు… ఇందులో చాలా భాగం ఈ ఒక్క రోజు observation కాదు. వెళ్ళిన ప్రతిసారి చూస్తున్నవే. Universal గా దాదాపు “నువ్వు పెద్దయ్యాక ఎమౌతావ్?” అని అడిగిన స్కూలు వయసు పిల్లలందరూ…అదీ ఈ వాతావరణం లో నుంచి వచ్చినవారు – “డాక్టర్ ఔతాను” అనే అంటారు. ఉండబట్టలేక, ఈరోజు అలా అన్న మీనా అనే అమ్మాయిని అడిగాను… ఎందుకు అందరు డాక్టర్ అంటారు అని…. మీనా అంటే మా కాలేజీ ఎదురుగుండా ఉన్న టీకోట్టు వాళ్ళ అమ్మాయి. నాకు కాస్త సన్నిహితంగా తెలుసు, మా స్కూలు లో నాకు ఫేవరెట్ స్టూడెంట్ కావడం మూలాన 🙂  .. ఆమె జవాబు – “డాక్టర్ కి ఉన్నంత గౌరవం ఇంకోకరికి ఉండదు కదా అక్కా.” (ఆ మధ్య వరకు టీచర్ అనేది… మా స్కూలు ఇంకా తెరవకపోవడం తో అక్కా అనడం మొదలెట్టింది.. 🙂 )

మీనా వాళ్ళ అమ్మ గురించి, ఇంకా ఈరోజు ట్రిప్పు లో మొదట కలిసిన సావిత్రమ్మ కుటుంబం గురించీ –  ప్రత్యేకంగా మరో పోస్టు రాయాల్సిందే.  అవి రెండూ కాస్త రెండు రకాల కేసులు. మిగితావి ఒక తరహా కేసులు.  ఈరోజు నాకు అర్థమైంది ఏమిటి అంటే అన్ని సంధర్భాల్లోనూ -“Teach them to catch fish” అన్న సలహా పనిచెయ్యదు అని. పేర్లు చెప్పకుండా ఓ కేసు చెబుతాను. ఓ అమ్మ, ఓ నాన్న. వాళ్ళకి నల్గురు పిల్లలు..వాళ్ళలో మొదటి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్ళైపోయింది.  రెండో పిల్ల తెలివైనది. పది పాసయ్యింది. తనకి చదువుకోవాలని ఉంది. తల్లిదండ్రులకి ఉందో లేదో అన్నది నాక్కాస్త అనుమానంగా ఉంది. They can’t afford her studies అన్నది ఒక స్పష్టమైన కారణం.  మరేవన్నా ఉంటే ఉండొచ్చు. ఇక, ఆ తండ్రి కి చెడు అలవాట్లు ఏమన్నా ఉన్నాయేమో తెలీదు కానీ, మనిషి కాస్త పెద్దతనే. చివరి ఇద్దరు పిల్లలు తప్ప అంతా పనికి పోతే, అలా జీవించగలుగుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లకి Teach them to catch fish paradigm లో ఏమి చేయాలి? చదువు చెప్పించాలి అసలైతే ఏ పారాడైం లో అన్నా. మళ్ళీ మన నుంచి కమిట్మెంట్ లేనిదే పిల్లని తల్లిదండ్రులు చదివించరు. మనమెందుకు కమిటవ్వాలి? వాళ్ళకి లేని ఆసక్తి మనకెందుకు? అన్నది ఒక వాదం.  మొత్తం మనం చేయకుండా వాళ్ళకి సపోర్టు గా నిలబడ్డం … అన్నది ఈ కేసు లో ఎలానో నాకు అర్థం కావడం లేదు. ఎలాగో మొత్తం మనం కమిట్ కాలేము… ఆమె చదువు ఆమే చదూకోవాలి..ఆమె పరీక్ష ఆమే రాయాలి…మనం పోయి కూర్చోలేం కదా..

సారంశం ఏమిటి అంటే – ఇప్పుడీ విషయం లో  వాళ్ళకి చేపలు పట్టడం నేర్పడం అంటే…ఏ చేపలో, ఏ జాతివి పట్టాలో… కాస్త తెలిస్తే చెప్పండి… అవి ఆచరనలో సాధ్యమైతే మీ పేరు చెప్పుకుని ఆ పని చేస్తాము ఇక్కడ మేము 🙂  ఏదన్నా స్పెషల్ గాలం ఉంటే దాన్ని ఎలా దొరకబుచ్చుకోవాలో కూడా చెప్పండి.

Advertisements
Published in: on August 22, 2007 at 6:30 pm  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/08/22/field-trip/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. మీ అనుభవాలు నాకు చాలా ఆసక్తికరంగా వుంటాయి. ఫీల్డు మీది అనుభవాలు తెలుసుకోవచ్చు మీనుంచి.

  క్లిష్టమైన సమస్యే! తన తండ్రి మీనుంచి ఏ రకమైన కమిట్మెంటు ఆశిస్తున్నాడు? తన కూతురుని గ్యారంటీగా డాక్టరుని చేయగలమని మాటిమ్మంటున్నాడా? లేక ఈ రోజు చదివిస్తామని రేపు చేతులెత్తేస్తామని భయపడుతున్నాడా?

  ఇక్కడ మనం చేయగలిగింది వున్న పరిస్థితులను (limitations) వివరించడమే అనిపిస్తుంది. Teach them to catch fish అనేది ఆ ఆసక్తి వున్న వాళ్ళకే వర్తిస్తుంది గానీ లేని వాళ్ళకు కాదు గదా? గుర్రాన్ని తొట్టి దగ్గరకు తీసుకెళ్ళగలమంతే కదా మనం. ఆమె చదువుకుంటే బాగుపడుతుందనే జ్ఞానం ఆయనకుండాలి, ఆ కూతురికి వుండాలి. వాళ్ళకు ఆ తపన లేకుండా ఓ సేవా సంస్థ ఇంతకంటే ఏం చేయగలదబ్బా!

  మీతో పాటు నేనూ ఈ సమస్యకు పరిష్కారం ఎవరు ఎలా చూపిస్తారో చూస్తాను.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. “ఆ అమ్మాయికి చదువు అంటే ఆసక్తి ఉంది” అన్నారు. ఎటువంటి చదువంటే? పది పాసైన తరవాత కనీసం ఐదేళ్ళు, చెయ్యగలిగితే ఏడేళ్ళు పెద్ద చదువులు చదివితేనూ, వాటిల్లో రాణిస్తేనూ ఆమెకి తెల్ల కాలరు పని దొరికేది. పార్ట్ టైం పని చేసి కొంత సంపాదించుకుంటూ ప్రైవేటుగా చదువుకోవటం ఒక పద్ధతి. ఓపెన్ యూనివర్సిటీలతో, స్టడీ సెంటర్లతో ఇది బాగా అందుబాటులోకి వచీంది. చదువంటే బడికెళ్ళో కాలేజీకెళ్ళో చదివేదే కాదు, చాలా రకాలు ఉన్నాయి – అని వాళ్ళకి ఉన్న అవకాశాల్ని వివరించడం మొదటి పని.
  నిజంగా ప్రతిభ కలిగి బడిచదువుతో రాణించగల పిల్లైతే – ఇలాంటి వారిని సపోర్ట్ చెయ్యడానికి ట్రస్టులూ, వ్యక్తిగత దాతలూ ఉంటారు – అలాంటి వారి సహాయం పొందితే మంచిది.

 3. మంచి ప్రయత్నం. ఎదురుగా కాలేజీ, ఆకాలేజీలో చదువుతున్న పైతరగతి అమ్మాయి తనతో మాటాడడమే ఆఅమ్మాయికి ఒక ఎడ్యుకేషను. తనలో తనకి నమ్మకం కలగడానికి అది మంచి సపోర్టు. సాధారణంగా ఇలాటిసేవలకి–అప్పూ, ఆస్తీ– మీకంప్యూటరుప్రోగ్రాములలోలా స్పష్టం కావు. రెండోది నువ్వు సిలబస్సులు తయారుచేస్తే కుదరదు. (నేను ఒకఫ్రండుకోసం చేయబోయానులే, పనిచెయ్యలేదు.)
  ఆఅమ్మాయికి నువ్వంటే నమ్మకం కనక, నీచిన్ననాటికథలు (నిజమే కానక్కర్లేదు) చెప్పి, రాసిచ్చి, చదవమంటే, తనకి ఇంటరెస్టు పుట్టొచ్చు. లాంగ్ రేంజి ఫలితాలగురించి ఇప్పుడే తపన పడకు.
  ఇవాళ నాకు ఓపాతస్నేహితురాలు ఇండియానించే రాసింది. 10 ఏళ్లక్రితం వాళ్లింట్లో పనికి పెట్టుకున్న పిల్లనిగురించి. ఇంట్లోనే ఆ పిల్లకి కుట్టుపని నేర్పించింది. ఇప్పుడు తనే పెళ్లి చేస్తోంది. అంటే ఒకజీవితాన్ని చక్కదిద్దినట్టేకదా.
  మరోకథ.
  అమెరికాలో పుట్టిపెరిగిన ఒక తెలుగుకుర్రాడు నాదగ్గర తెలుగు చదవడానికి వచ్చాడు. మెడిసిన్ చదువుతున్నాడు. నీకు తెలుగు ఎందుకు అన్నాను. నేను ఇండియా వెళ్లి పల్లెల్లో పని చెయ్యాలనుకుంటున్నాను. అన్నాడు. అంచేత అతని సిలబస్ అంతా చదువులేని పెషంట్సుతో మాటాడే మాటలే.
  చివరిమాటగా, నీ బ్లాగు ఇంగ్లీషులో కూడా రాస్తే, ఈబ్లాగు చదవలేనివాళ్లకి కూడా అందుతుంది.
  అన్నిటికంటె ముఖ్యంగా, నువ్వూ, నీలాటి యువతీయువకులూ ఇటువంటి పనికి పూనుకోడం నాకు చాలా సంతోషంగా వుంది. పది సంఘాలు చెయ్యలేనిపని ఒకమనిషి చెయ్యగలడని నానమ్మకం.

  మాలతి

 4. @kottapali garu:
  “ఆ అమ్మాయికి చదువు అంటే ఆసక్తి ఉంది” అన్నారు. ఎటువంటి చదువంటే?
  – ఆ అమ్మాయి పది పాసయ్యింది. డాక్టరు కావాలనుంది అన్నది. అంటే చదివిస్తే పై చదువులు చదువుతుంది అనే కదా…
  “చాలా రకాలు ఉన్నాయి – అని వాళ్ళకి ఉన్న అవకాశాల్ని వివరించడం మొదటి పని.”
  – వివరించడం తో మన పని అయిపోదు కదా… ఇక బాధ్యత మనం తీసుకున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి కదా.
  “నిజంగా ప్రతిభ కలిగి బడిచదువుతో రాణించగల పిల్లైతే – ఇలాంటి వారిని సపోర్ట్ చెయ్యడానికి ట్రస్టులూ, వ్యక్తిగత దాతలూ ఉంటారు – అలాంటి వారి సహాయం పొందితే మంచిది.”
  – ఇప్పుడు చేసేది అదే. వ్యక్తిగత దాతలకు ఏ పిల్లలు ఎలిజిిబులో చెప్పడానికే ఈ తాపత్రేయం… కొందరు దాతలు సిద్ధంగా ఉన్నారు. మనిషి ని వెదికిస్తే.

 5. @m garu:
  ధన్యవాదాలు. బ్లాగు ఇంగ్లీషులో… రాయొచ్చు…ఏదో తెలుగు లోనే రాద్దాం లే అని మొదలుపెట్టాను… అందుకని తెలుగే రాస్తున్నా. ఇదే ఆషాకిరణ్ సంగతులు ఇంగ్లీషు లో బ్లాగే వారు కూడా ఉన్నారు నాకు తెలిసి….

  మీ సలహాలకు ధన్యవాదాలు… పని చేసాయో లేదో మీకు త్వరలోనే చెబుతాను 🙂

 6. బాబూ యం

  ఉన్న నలుగురైదుగురు తెలుగు బ్లాగర్లను కూడా నువ్వు ఇలా ఇంగిలీషులోకి మార్చ ప్రయత్నించడం భావ్యమా?

  అయినా వర్త్ ఉంటే ఏ భాషలో వ్రాసినా ప్రపంచం మొత్తం పాకే కుగ్రామపు రోజులు ఇవి

 7. సరేనండీ చావాకిరణ్ గారూ,
  నా పొరపాటే!

 8. సౌమ్యా,
  ఆంగ్లంలో ఉన్న ఆ బ్లాగుల పేర్లు చెప్పొచ్చు కదా.

  ఇక్కడ దాతలు sponsor చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మాయి చదువుకోవడానికి ఇష్ట పడుతోంది. కాని చదువు అనుకున్నంత వరకూ కొన సాగించడానికి పరిస్థుతులు సహకరిస్తాయా అన్నది అనుమానం. కదా? నాకు సరిగ్గానే అర్థం అయ్యిందా?

  డబ్బు సగం సమస్యే అని అర్థం అవుతోంది. ఎవరైనా ఒకరు ఆ అమ్మాయికి moral support గా ఉండాలి అనే అవసరం కనపడుతోంది. డాక్టరు కావడం అనే ఆశయం నిజంగా తెలిసే అంటోందా, లేక అది ఒకటే బాగా తెలిసి అంటోందా అన్నది నీ ప్రశ్న అనిపించింది కూడా. అవునా?

  ఇక్కడ నాకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఇవి ఎంత వరకూ ఆచరణ యోగ్యమో నీకే తెలియాలి.

  నువ్వు కానీ, నీ లాంటి వారు కాని medical camp లకు మల్లే employment and education కౌన్సెలింగ్ కూడా చేస్తూ ఉంటే బాగుంటుందేమో. వారి కోరికలు ఇలా ఉన్నాయి అనుకునే కంటే ఎలాంటి అవకాశాలు ఉండొచ్చు తెలియపరుస్తే బాగుంటుందేమో. పది వరకూ చదువుకున్నాక కాస్త ఉపాధి మార్గాలు తెలుసుకోవడామూ, open university కోర్సుల గురించి తెలియడామూ, engineering, medicine కాకుండా ఇంకే ఉన్నత చదువులు ఉపయోగ కరమైన చదువులు ఉంటాయో తెలుసుకుని తెలియ చేస్తూ ఉండడము ఒక ఉపాయమేమో?
  ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలు, వాటికి సంబంధించిన వివరాలు, material వీరికి పరిచయం చేసినా, లేక గ్రంథాలయంలో చూసుకోవడమో నేర్పించ వచ్చు కదా.

  వీరికనే కాదు ఎవరికైనా “విద్య” అంటే పది, ఇంటరు, eamcet మాత్రమే కాదు అని నా ఉద్దేశం. ఒక goal ఏర్పరుచుకోవడం, జీవితంలో ఏం కావాలో నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నం చెయ్య గల శక్తిని ఇవ్వడం అని నా ఉద్దేశం. అది చేపే అవునో మరి గాలమే అవునో. మీలాంటి వారు కాస్త తరచూ ఇలా తెలిసిన వారితో సమయం గడపడం, ప్రయోజనాత్మకంగా మాట్లాడడం కూడా, మాలతి గారన్నట్టు ఎడ్యుకేషనే.

  భారం పూర్తిగా మీద వేసుకోవడం చెయ్య గలిగే పని అనుకోను, ఏ ఒక్కరో ఒకరి బాధ్యత పూర్తిగా తీసుకుంటే తప్ప. కానీ మార్గ దర్శకత్వం చెయ్యడం, మంచి మాటలు చెపుతూ ఉండడం, వెంటనే ప్రయోజనం కనిపించినా కనిపించిక పోయినా, చెయ్య దగ్గ పని అని నాకనిపిస్తుంది.

  All the best.

 9. Sowmya,

  Prepare a list of slums around your college and see who are all interested to help.

  There is another group of people that I know who show interest to work in slums and most importantly educate them.

  It is also important to introduce people who have same area of interest.

 10. Hey Sowmya,

  Al articles are very interesting,.,.

  Keep Going..
  All the best.

  Rgds
  Ravi


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: