కంగ్రాట్స్ కుంబ్లే!

“కాకతాళీయమో ఏమో ఈ టెస్ట్ సీరీస్ లో ఇప్పటివరకూ ఎవరూ చేయలేదని ఓవల్ టెస్టు కి ముందు జరిగిన తెస్టు సమావేశం లో గుర్తు చేసా. అంతే కాదు… ఎవరూ చేయక పోతే .. నేనే చేస్తా అని జోక్ కూడా చేసా. ఆ జోక్ నిజమౌతుందని అనుకోలేదు”- సెంచరీ సాధించాక కుంబ్లే అన్నమాటలివి అని ఈనాడు పేపర్ లో చూసా పొద్దున్నే.

kumble.png anilkumble14.jpgrichie_0515_anil.jpg1767.jpganil-kumble-434.jpgindia_anilkumble_l.jpg617.jpghkumblebig.jpg

కుంబ్లే గురించి ఈ బ్లాగు లో ఇది వరకే ఓ సారి ఇక్కడ రాసాను. అయినా నిన్నటి సెంచరీ విషయం తెలిసినప్పటి నుండీ మనసాగక మళ్ళీ రాస్తున్నా 🙂 నాకు పని ఎక్కువగా ఉండి నేనా ఇన్నింగ్స్ చూడలేదు కానీ … ఎట్టకేలకు కుంబ్లే లోని బ్యాట్స్మెన్ తన ప్రతాపం చూపాడు. ఇప్పుడు కాదు కానీ… కొన్నాళ్ళ క్రితం నాకు కుంబ్లే తన బ్యాటింగ్ ప్రతిభ ని సరిగా ఉపయోగించుకోలేదు అన్న చిన్న దిగులు లాంటిది ఉండేది. ఈ మధ్య కాలం లో కుంబ్లే బ్యాటింగ్ ను పట్టించుకోడం కూడా మానేసాను. నిన్నటి సెంచురీ ఎదురుచూస్తున్నా జరుగుతుందని ఆశించని విషయం. అందుకని నిన్న కలిగిన వావ్ ఫీలింగ్ ఇప్పటిదాకా తగ్గలేదు. 🙂 అప్పుడెప్పుడో కుంబ్లే దక్షినాఫ్రికా పై 88 పరుగులు చేసిన టెస్ట్ అప్పుడు కలిగింది ఒక వావ్ ఫీలింగ్. కానీ అది చాన్నాళ్ళ క్రితం. అదెప్పుడో 1996 లో. నేనప్పుడు స్కూలు విద్యార్థిని ని. మళ్ళీ ఇన్నాళ్ళకు కాలేజీ స్టూడెంట్ గా అదే తరహా వావ్ ఫీలింగ్ ని అనుభవిస్తున్నా . కుంబ్లే గురించి ఎంత చెప్పినా తక్కువే నిజానికి. ఇప్పుడేమి చెప్పినా మునుపు రాసిన టపా లొ చెప్పిందే చెప్పినట్లో లేకుంటే ప్రస్తుతం ప్రతి పేపర్ హెడ్‌లైన్ లోనూ ఉన్న విషయాలని నేనూ మళ్ళీ వక్కాణించినట్లు ఉంటుంది కనుక చెప్పను 🙂

“When Kumble reached his century he deprived India of one record. It would otherwise have been the highest test total without a player making three figures.” – అన్నది సీఎన్ఎన్ వ్యాసం. పోతే పోయింది ఓ రికార్డు. కుంబ్లే కి ఎప్పుడో రావాల్సిన సెంచురీ లేటు గా అన్నా లేటెస్టు గా వచ్చింది కదా మరి. 🙂


Published in: on August 11, 2007 at 4:28 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/08/11/congrats-kumble/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. kumble marrini సెంచరీlu cheyyalani koarukumtoo……

  2. ఇదే తడవుగా తెవికీలో కుంబ్లేపై మీరో వ్యాసం రాస్తే బాగుంటుందేమో!! తెవికీలో క్రికెట్ ఔత్సాహికులెవరూ లేక ఒక్క క్రికెట్ వ్యాసం కూడా లేదు (సి.కె.నాయుడు వ్యాసం తక్క)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: