Ill-manners??

             మనుష్యులు ఇంత కేర్‌లెస్ గా ఉంటారు అన్నది మాత్రం నాకు అసలు అర్థం కాలేదు. ఈరోజు నేను బండి నడుపుతూ రోడ్డు పై వెళుతున్నాను. వెనక మా అమ్మ కూర్చుని ఉంది. రోడ్డేమో చిన్నది. అవతలవైపు నుంచి ఓ కారు వస్తోంది…నా బండి పక్కగా వెళ్ళింది ఆ కారు. అసలే రోడ్డు పై స్ట్రీట్ లైటు కూడా లేదు. కారు వాడేమో సగం తాగిన కాలుతున్న చిగెరెట్టు కిటికీ లోంచి విసిరేసాడు!!! కాస్తుంటే అది నా బండి మీద పడాల్సింది… ఏదో నా టైం బాగుండి పక్కన పడ్డది. ఎవర్నని అనగలం? ఆ చిన్న రోడ్డు లో మనం ఆపి గొడవ మొదలెడితే వేరే రకం గొడవ మొదలౌతుంది అక్కడ… ట్రాఫిక్ జాం గొడవ! మనసులో తిట్టుకుని ముందుకు కదిలాము. 😦

     ఇంత కేర్‌లెస్ గా ఎందుకు ప్రవర్తిస్తారో మనుషులు. పొగ తాగడం మంచి అలవాటా? కాదా? అన్న విషయం పక్కన పెడితే … బహిరంగ ప్రదేశాల్లో ఈ ప్రవర్తన ఎంత వరకు సమర్థనీయం? బస్సుల్లో తాగిన పీకలు అక్కడే పడేయడం.. లేదా…కిటికీల్లోంచి కిందకు ఉమ్మడం … తాగి బస్సెక్కి పక్క వాళ్ళ మీదకి తూలడం … ఇవి అన్నీ తలుచుకుంటేనే ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి..? “అసలు అవతలివైపు నేనుంటే?” అని ఆలోచించరా ఈ పనులు చేసేవాళ్ళు??

Published in: on July 21, 2007 at 5:38 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/07/21/ill-manners/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. అందుకేగా బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగకూడదని రూలు పెట్టారు.అయినా సభ్యత అన్నది అవతలి వ్యక్తుల వ్యక్తిత్వం మీద వుంటుంది.సిగరెట్ అలాగే విసిరేస్తే[ఒక్కోసారి ఇళ్ళు తగలబడొచ్చు కూడా.మా వూరిలో నేనే ప్రత్యక్ష సాక్షిని ] ఏమవుతుందో అన్న ఆలోచన వుండేవాడయితే అసలు కాలిస్తే ఏమవుతుంది అని కూడా ఆలోచించగలడేమో?

 2. సభ్యత, సంస్కారాలు పక్కనపెట్టండి. ఇది పూర్తిగా నిర్లక్ష్యం తొ కుడుకున్నది. మీరు తెలిపిన సంఘటనలో, మీ స్కూటర్ వెళ్ళిన తర్వాత సిగిరెట్ పీక విసిరివేయటమన్నది సభ్యత; అసలు రోడ్డు మీద సిగిరెట్ తాగకుడదన్నది సంస్కారము. కాని ఆ పొగరుబోతెవ్వరో, ఎవడికేమైతే నాకేంటి అనే నిర్లక్ష్యంతో చేసినపని అది. పబ్లిక్ ఏరియలలో, సిగిరెట్ పీకలు విసిరివేయటం, కిళ్ళి నమిలి ఉమ్మి వేయటం సాధారణమైంది. ఈ విధమైన నిర్లక్ష వైఖరి నడిమంత్రపుసిరి నగరవాసులలో కొట్టచ్చినట్లు కనిపిస్తున్నది. అదేమంటే, అనవసరమైన రాద్దంతం. జనే దొ! పబ్లిక్ క మాల్ అనే ఉచిత సలహ ఒకటి.

  …వల్లూరి

 3. అవును

 4. No smoking in public places is a rule on paper
  The saddest thing is that the conductors and the bus drivers smoke in the bus,which has a warning painted in bold letter”no smoking”

  Unless the govt and educational institutions issue severe punishments,we cant ban smoking(at least in public places)

 5. Indeed, there is a rule on ban of smocking in public places. came very recently (five years back ? )


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: